ఆఫ్రికా అద్భుత అనుభవాలు – ఆఫ్రికా పిలుపు
అక్టోబర్ 18,1991-
ఆ రోజు నా జీవితంలో మర్చి పోలేనట్టి రోజు. నేను ఆఫ్రికా నుంచి నాకు వచ్చిన ఆహ్వానాన్ని, అక్కడ వచ్చిన ఉద్యోగ అవకాశాన్నివినియోగించు కోవడానికి ప్రయాణం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని బేగంపేట ఎయిర్ పోర్టు చేరడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు చాలా మంది వచ్చారు . ఎయిర్ పోర్టు అంతా చాలా కోలాహలంగా గందరగోళంగా ఉంది . మొట్టమొదటి సారి విదేశీయానం కాబట్టి నాకు కొంచెం గుండె గాభరాగా ఉండాలి. పైకి మాత్రం గంభీరం గానే వున్నాను . కొన్ని విచిత్ర పరిస్థితుల మూలంగా నేను అనుకోకుండా అకస్మాత్తుగా ఈస్ట్ ఆఫ్రికా లోని కెన్యాకు వెళ్ళడం జరిగింది . నేను ఆ దేశంగురించి అంతా నెగెటివ్ గానే విన్నాను . చాలా మంది నన్ను రకరకాలుగా భయపెట్టారు కూడా . కానీ నేను కొన్ని తప్పనిసరి పరిస్థితులలో అక్కడికి వెళ్లడం జరిగింది .
నా సుదీర్ఘమైన అనుభవాల సంపుటిలో నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే మనిషికి అవకాశాలు ఒకటికి పైన వున్నప్పుడు ఆ మనిషి జీవితంలో పైకి రావడం కష్టమే . అంటే జీవితం