ట్రెక్కింగ్ అనుభవం
ప్రతీరోజు వేరే వేరే కార్యక్రమాలు ఉండేవి ,జగ్గివాసుదేవ్ గారే స్వయంగా నిర్వహిస్తూ వుండేవారు .ఎన్నో అద్భుతమైన విషయాలగురించి సామాన్యులకు కూడా అర్ధం అయ్యేలా ఎంతో ప్రాక్టికల్గా వివరించి చెప్తూ ఉండేవారు . ఎంతో క్రమశిక్షణ నేను అక్కడ చూసాను . ఈ లోగా నా కాలి సమస్య ఇంకా ఎక్కువ అయిపోయింది . అక్కడ కూడా వాతావరణం చాలా చల్లగా ఉండేది ,వర్షం పడుతూ ఉండేది . నేను చేతి రుమాలుతో మాటి మాటికి జలుబుతో కారుతున్న ముక్కు తుడుచుకుంటూ ఆసనాలు వేయటం కష్టం అయిపోయింది . నా లాంటి వాళ్ళే మరికొంత మంది మిత్రులు కూడా ఇదే అవస్థలో వుండటం నేను గమనించాను . అక్కడ రకరకాల వ్యక్తులతో కలవడం ,అభిప్రాయాలు పంచుకోవడం చాలా మంది విదేశీయులతో కూడా మాట్లాడటం జరిగింది . వర్కుషాపు లో లెబొనాన్ నించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . ముస్లిమ్స్ ,క్రిస్టియన్స్ కూడా ఉన్నారు . వాలంటీర్స్ లో లెబొనాన్ వాళ్ళు ఎక్కువమంది వున్నారు . యోగాసనాలు నేర్పే వారిలో ఒకతను భారతీయుడు వున్నాడు మరొకతను జర్మనీ దేశస్థుడు . నాకు శరీర ఉష్ణోగ్రత 103,104 వరకు వచ్చి ఐ ఇన్ఫెక్షన్ కూడా రావడం తో అక్కడే వున్న ఎలోపతి వైద్యుడు ఇచ్చిన మందులు వాడటం జరిగింది .ఇలా ఉండగా జగ్గివాసుదేవ్ గారు సాయంత్రం మీటింగ్ లో మనందరం వెలంగిరి పర్వతాల పైకి ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము ,అక్కడ మీరందరూ చాలా జాగ్రత్తగా ఎక్కాలి.