అతీంద్రియ శక్తులు
Chapter -7
విదేశస్థులకి మన భారతదేశమంటే చాలా కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా అతి పవిత్రమైన హిమాలయ పర్వతాలు, మహిమలు చేస్తుండే సిద్ధులు, సాధువులు వీళ్ళందరి పట్ల వాళ్లకి ఎంతో కుతూహలం ఉంటూ ఉండేది. అప్పుడు మన భారతదేశంలో ఉండేటటువంటి సాధువులలో ఎంతమంది నిజమైన సాధువులో, ఎంతమంది కపట సాధువులో అని తెలుసుకొనడం చాలా కష్టంగా ఉండేది. అందుకని పాల్ బ్రంటన్ (Paul Brunton) అనే జర్నలిస్టుని వాళ్ళు స్పాన్సర్ చేసి భారతదేశానికి పంపించారు. అతని రాకలో ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఆ సమయంలో పేరుప్రఖ్యాతులున్నమహాత్ములని దర్శించడం, దగ్గరగా ఉండి వాళ్ళని పరీక్షించడం వాళ్ళు నిజంగా మహిమ కల వాళ్ళా , మహాత్ములా లేక దొంగ సాధువులా అని తేల్చుకోవడం. మొట్టమొదటగా అప్పట్లో అతను
బొంబాయి నగరానికి చేరినప్పుడు అప్పట్లో అక్కడ బాగా ప్రఖ్యాతమైన తాజ్ మహల్ హోటల్లో బస చేయడం జరిగింది. అయితే విదేశస్థులు భారతదేశానికి వచ్చేముందు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని ముందే ఒక పథకం తయారు చేసుకుని దాని ప్రకారం ఒక క్రమశిక్షణతో వాటిని పాటిస్తూ ఉంటారు. తాజ్ మహల్ హోటల్లో మామూలుగా దిగాడు. అతను ఒక రోజు బయటకి వచ్చి నిల్చున్నప్పుడు ఆ వరండాలో చాలామంది ఉన్నారు. అందులో ఒకతను విచిత్ర వేషధారణలో ఉండి వస్తున్నప్పుడు అతన్ని చూసిన అక్కడ ఉన్నవాళ్ళందరూ మెల్లగా, గబగబా తొందరగా జారుకున్నారు. ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయి నిశ్శబ్దంగా తలుపులు వేసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో కొంత ఆందోళన, భయం కూడా కనిపించింది. అక్కడ అతను వచ్చే లోగా ఆ వరండా అంతా నిర్మానుష్యమై పోయింది. అప్పటివరకు