Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

18 October 2016

అతీంద్రియ శక్తులు - Chapter -7

అతీంద్రియ శక్తులు
Chapter -7

విదేశస్థులకి మన భారతదేశమంటే చాలా కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా  అతి పవిత్రమైన హిమాలయ పర్వతాలు, మహిమలు చేస్తుండే సిద్ధులు, సాధువులు వీళ్ళందరి పట్ల వాళ్లకి ఎంతో కుతూహలం ఉంటూ ఉండేది. అప్పుడు మన భారతదేశంలో ఉండేటటువంటి సాధువులలో ఎంతమంది నిజమైన సాధువులో, ఎంతమంది కపట సాధువులో అని తెలుసుకొనడం చాలా కష్టంగా ఉండేది. అందుకని పాల్ బ్రంటన్ (Paul Brunton) అనే జర్నలిస్టుని వాళ్ళు స్పాన్సర్ చేసి భారతదేశానికి పంపించారు. అతని రాకలో ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఆ సమయంలో పేరుప్రఖ్యాతులున్నమహాత్ములని దర్శించడం, దగ్గరగా ఉండి వాళ్ళని పరీక్షించడం వాళ్ళు నిజంగా మహిమ కల వాళ్ళా , మహాత్ములా లేక దొంగ సాధువులా అని తేల్చుకోవడం.  మొట్టమొదటగా అప్పట్లో అతను
బొంబాయి నగరానికి చేరినప్పుడు అప్పట్లో అక్కడ  బాగా ప్రఖ్యాతమైన తాజ్ మహల్ హోటల్లో బస చేయడం జరిగింది. అయితే విదేశస్థులు భారతదేశానికి వచ్చేముందు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని ముందే ఒక పథకం తయారు చేసుకుని దాని ప్రకారం ఒక క్రమశిక్షణతో వాటిని పాటిస్తూ ఉంటారు. తాజ్ మహల్ హోటల్లో మామూలుగా దిగాడు. అతను ఒక రోజు బయటకి వచ్చి నిల్చున్నప్పుడు ఆ వరండాలో చాలామంది ఉన్నారు. అందులో ఒకతను విచిత్ర వేషధారణలో ఉండి వస్తున్నప్పుడు అతన్ని చూసిన అక్కడ ఉన్నవాళ్ళందరూ మెల్లగా, గబగబా తొందరగా జారుకున్నారు. ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయి నిశ్శబ్దంగా తలుపులు వేసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో కొంత ఆందోళన, భయం కూడా కనిపించింది. అక్కడ అతను వచ్చే లోగా ఆ వరండా అంతా నిర్మానుష్యమై పోయింది. అప్పటివరకు
మాటలతో, కేకలతో. అల్లరితో, రణగొణధ్వనులతో ఉన్న ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఇదంతా గమనిస్తున్న పాల్ బ్రంటన్ (Paul Brunton)  చాలా ఆశ్చర్య పడ్డాడు. ఎందుకు వీళ్ళంతా భయపడి ఎక్కడికక్కడ జారుకున్నారు అనే కుతూహలం ఆయనకి కలిగింది.  అయితే వీళ్ళంతా బయటకి వచ్చినప్పుడు మీరంతా ఆ వ్యక్తిని చూసి భయపడి పారిపోయారు , ఎందుకు ఆందోనగా ఉన్నారు అని అడగ్గా కొంతమంది ఆయన మహా మాంత్రికుడు, తాంత్రికుడు అందుకనే అతనంటే మాకు చాలా భయం. అతను వస్తున్నాడంటే మేమంతా పారిపోతూ ఉంటామని చెప్పారు. దానితో పాల్ బ్రంటన్ (Paul Brunton) కి ఇంకా ఆశ్చర్యం వేసింది. తాను ఇక్కడికి ఇలాంటి విషయాలు పరిశోధించడానికే వచ్చాడు కాబట్టి ఒక రోజు ఆ వ్యక్తి నివసిస్తున్న గదికి వెళ్లి, తలుపు తట్టి, అతను తలుపు తెరవగానే చాలా వినయంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలి నన్ను లోపలకి రానిస్తారా? అని ప్రశ్నించాడు. అతని ధైర్యానికి,వినయానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపడి లోపాలకి రమ్మని ఆహ్వానించాడు. లోపల కూర్చున్నాక పాల్ బ్రంటన్ (Paul Brunton)  తాను జర్నలిస్టునని అమెరికానుండి వచ్చానని, ఇక్కడ భారతదేశంలో మహాత్ములని దర్శించాలనే ఉద్దేశ్యంతో వచ్చానని తనని తాను పరిచయం చేసుకున్నాడు. అయితే మిమ్మల్ని చూడగానే జనమంతా భయంతో ఎక్కడి వాళ్ళక్కడికి పారిపోయారు. మీకేవో మాంత్రిక తాంత్రిక శక్తులున్నాయని చెప్పారు. అది నిజమేనా? అనే కుతూహలం నాకు కలిగింది కాబట్టి నేను ధైర్యం చేసి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మరోలా భావించకూడదు అని చెప్పాడు. దానికి ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వి మీ ధైర్యానికి, వినయానికి, మీ నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను. నా దగ్గర కొన్ని మాంత్రిక తాంత్రిక శక్తులు ఉన్నమాట నిజమే. నేను ఇజ్రాయల్ దేశస్థున్ని. భారతదేశానికి వచ్చాను. నాక్కూడా భారతదేశమంటే కొంచెం కుతూహలం ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడకి రావడం జరిగింది. అయితే మీకు ఎటువంటి విద్యలు వచ్చు? ఎటువంటి మాయలు చేస్తారు? అని ప్రశ్నించాడు. మీరు ఒక పేపరు పెన్ను తీసుకుని అక్కడ ఏదైనా మీకిష్టమైన ప్రశ్న వ్రాయండి అని చెప్పాడు అప్పుడు పాల్ బ్రంటన్ (Paul Brunton) ఒక మూలకి వెళ్లి అతనికి కనిపించకుండా ఆ కాగితంలో నా భార్య పేరేమిటీ అని వ్రాసి ఆ కాగితాన్నిమడత పెట్టి దాన్ని అతను ఒక చోట పెట్టి ఆ వ్యక్తి దగ్గరకి రాగానే మీరు వ్రాసిన ప్రశ్నకి సమాధానం ఇది అని ఫలానా ఆవిడ , ఫలానా పేరని చెప్పడంతో బార్టన్ దిగ్భ్రాంతి చెందాడు. అయినా అతనికి నమ్మ బుద్ధి కాలేదు. సరే అని చెప్పి ఆ వ్యక్తి మీరు ఇంకా దూరం ఎక్కడికైనా వెళ్లి వ్రాయండి నేను మీకు సమాధానం చెప్తాను అని అన్నాడు. అయితే ఆ జర్నలిస్టు వ్రాసిన ప్రశ్న క్రింద మంచి దస్తూరితో అతని భార్య పేరు వ్రాయడం జరిగింది. అదే పేరు ఆ వ్యక్తి కూడా చెప్పాడు. బయటకి చాలా దూరం వెళ్లి అతని గడిలోకో ఇంకా ఎక్కడికో వెళ్లి రహస్యంగా కాగితం మీద ఒక ప్రశ్న వ్రాశాడు. తర్వాత ఆ కాగితాన్ని జాగ్రత్తగా దాచి పెట్టి గదిలోకి వచ్చి కూర్చున్నాడు. క్షణంలో ఆ కాగితం ఆ వ్యక్తి చేతిలో ఉండడమే కాకుండా ఆ కాగితంలో వ్రాసిన ప్రశ్న క్రింద చక్కటి దస్తూరితో సమాదానం కూడా వ్రాసి ఉండాలి.  అది చూసి పాల్ బ్రంటన్ (Paul Brunton)  చాలా ఆశ్చర్య పోయాడు. ఈ విధంగా ఆ వ్యక్తిని మూడుసార్లు పరీక్షించాడు. మూడుసార్లు కూడా ఆ వ్యక్తి చెప్పిన , వ్రాసిన సమాధానాలు నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు పాల్ బ్రంటన్ (Paul Brunton) మీరేమీ అనుకోకపోతే దీనివల్ల మీకు ఏం ప్రయోజనం ఏమిటీ? మీరు ఎందుకు ఎలా నేర్చుకున్నారు?అని అడిగాడు. సరే ! రేపు మళ్ళా కలుద్దాం! అప్పుడు అన్నీ వివరంగా చెప్తాను అని ఆ వ్యక్తి చెప్పడంతో అక్కడనుంచి నిష్క్రమించాడు. పాల్ బ్రంటన్ తో ఇదివరాకు మాట్లాడిన వ్యక్తులు కలిసినప్పుడు ఇతనికి చాలా శక్తులు ఉన్నాయి. వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పనులకోసం టెండర్లు వేస్తూ ఉంటారు. అయితే  వ్యాపారస్తులు ఇతని దగ్గరకి వచ్చి ఆ టెండర్ లో ఎంత కొటేషన్ ఉందో చెప్పమని అడగడం, అతను ఈ గదిలోనే ఉండి ఆ టెండర్ లో ఉండే కొటేషన్ ఆ వ్యాపరస్థులకి చెప్పడం, దానికి తగ్గట్లుగా వీళ్ళు కొటేషన్లు అక్కడ సమర్పించడం, ఆ కాంట్రాక్టు వీళ్ళకే రావడం ఇలా జరుగుతుండేది. ప్రతిఫలంగా వాళ్ళు ఎంతో కొంత డబ్బుని అతనికి సమర్పిస్తుండేవాళ్ళు. ఈ విధంగా అతను చాలా ధనాన్ని సేకరించాడని ఆ మిగతా వ్యక్తులు పాల్ బ్రంటన్ (Paul Brunton) కి చెప్పారు. sealed కవరులో ఉన్న ఆ టెండర్లని విప్పకుండానే లోపల ఉన్నది చదివి ఆ సమాచారాన్ని తన దగ్గరకి వచ్చిన కస్టమర్ కి చెప్పడం, దాని ప్రకారంగా అతను టెండర్ వేయడం, ఆ కాంట్రాక్టు అతనికే రావడం ఇవన్నీ జరిగాయి. తర్వాత రెండు మూడు రోజుల తర్వాత పాల్ బ్రంటన్ (Paul Brunton)  ఒక రోజు ఈ వ్యక్తి హోటల్ లో ఉండడం గమనించి అతన్ని మళ్ళీ ప్రశ్నించగా “రండి ! చెప్తాను అని ఈ విధంగా చెప్పాడు. నిజమే ! నా దగ్గర మంత్రం శక్తి ఉంది.  నేను ఇజ్రయెల్ పట్టణంలో ఒక మేడ మీద అతిథి గా ఉండేవాడిని. ప్రతిరోజూ రాత్రి క్రింద నాకు ఎవరో మాంత్రికులు మంత్రాలు చదువుతున్నట్లుగా అనిపించేది. చాలా రోజులు విన్నాక నాలో కుతూహలం పెరిగింది. క్రిందకి వెళ్లి చూశాను. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఆ వ్యక్తిని అక్కడ అందరు గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఎంతో మంది వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఒక్క క్షణం తీరిగ్గా ఉండేవాడు కాదు. ఒక రోజు నేను ఆయన్ని ప్రశ్నించగా ఆయన నాకు చాలా రోజుల వరకు ఏమీ చెప్ప లేదు. తర్వాత ఒక సారి నా దగ్గర ఒక మంత్రమున్నది ఆ మంత్రాన్ని ఉపాసన చేసినప్పుడు ఆ మంత్రానికి కట్టు బడ్డ ఒక భూతం నాకు వశమైంది. వాటికి సాధ్యాసాధ్యాలు ఏమీ ఉండవు. కొంత పరిధి వరకు నేనడిగిన ప్రశ్నలన్నింటికీ వాళ్ళు జవాబులు ఇస్తు౦డేవాళ్ళు. ఈ విధంగా నా దగ్గరకొచ్చే వ్యక్తులందరికీ, వారి సమస్యలకి పరిష్కారం కూడా నేను చెప్తూ ఉంటాను అని చెప్పాడు. నేను అతన్ని ఎంతో ప్రాధేయపడ్డాను నాక్కూడా ఆ మంత్రం నేర్పించమని. దాదాపు ఒక సంవత్సరం తర్వాత నా మీద ఆయనకి నమ్మకం కలిగినప్పుడు అతను నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. నేను కూడా ఆ మంత్రాన్ని చదవగా, చదవగా ఆ భూతం నాకు వశమైంది. దాని సహాయంతోటే నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అతను చెప్పిన ఆ సమాధానం విని పాల్ బ్రంటన్ (Paul Brunton)  చాలా ఆశ్చర్య పడి పోయాడు.
ఓహో ! ఇటువంటి శక్తులు కూడా ఉంటాయా  అంటే మనిషి జన్మ ఎత్తాక కొంతమంది స్పిరిట్ form లో ఉంటారు దాన్ని మనం దయ్యం అంటాం , భూతం అంటాం, పిశాచం అంటాం. కొతమంది కనుమలు దట్టంగా ఉంటె వాళ్లకి వాళ్ళ ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ సాంద్రత తగ్గినప్పుడు అది వాళ్ళెవరికి కనిపించకుండా ఉంటారు. ప్రారభ్ధకర్మలు మెల్లగా మెల్లగా కరిగిపోతున్నప్పుడు మనుష్యులకి కనిపించని ఒక వాయు రూపం లో ఉంటారు. వాళ్ళలో కూడా మంచి చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు ఉంటారు అని తర్వాత అతను తెలుసుకున్నాడు.