Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

28 January 2016

ఉల్ఫ్ మెస్సింగ్ – రెండవ భాగం ( continued)ఇలా ఉల్ఫ్ మెస్సింగ్ తన ఆలోచనల్లో ఉండగా ఆఖరికి  ఆ రైలు చేరవలసిన గమ్యం చేరింది. అతను ఆ ప్రయాణీకుల గుంపుతో పాటు అక్కడే దిగాడు. అది జర్మనీ రష్యాదేశాలకి మధ్య ఉన్న సరిహద్దు అంటే ఉల్ఫ్ మెస్సింగ్ రష్యాదేశం చేరాడు. అది ఒక కుగ్రామం చాలా చిన్న పల్లెటూరు. అతను ఇప్పుడు  ఏం చేయాలా అంటే తన తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తుండగా అతని దృష్టి అక్కడ ఉన్నజన సముదాయం మీద పడింది. గుండ్రంగా నిల్చుని వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారా? అని ఆసక్తితో ఉల్ఫ్ మెస్సింగ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక మెజీషియన్ రకరకాల ట్రిక్స్ చేసి చూపుతు, అక్కడ గుమిగూడిన జనాల చప్పట్లు, ఈలలు అంగీకరిస్తూ మాయాజాలం చేయసాగాడు. 

Daivika Shaktulu - Asura Shaktulu - Episode 4మరునాడు పొద్దున్నే రాజావారు చెప్పినట్టుగా,  ఫూల్ బాఘ్ లోని  శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్ళాడు.  అక్కడ ఎంతో బ్రహ్మాండంగా మళ్ళా పున:ప్రతిష్ట జరగటంఆ సందర్భంలో రాజావారు మోహన్ చేతకూడా  విలువైన రత్నాలు ఆ శంకుస్థాపన జరుగుతున్నటువంటి ప్రదేశంలో అంటే ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతున్న ప్రాంతంలో కొన్ని వేయించి మోహన్ కి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు మూడు రోజులు చాలా వైభవంగా జరిగింది. ఇవన్నీ పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రస్తుతం ఉన్న జీయర్ స్వామివారు అప్పుడు చాల చిన్న ప్రాయంఅంటే ఇది జరిగి దాదాపు 48, 49 సంవత్సరాలు అయ్యింది. అప్పుడే శిష్యరికం పొందుతూ ఉండేవారు. ఇలా మూడు రోజులు ఘనంగా కార్యక్రమాలు జరిగాక మోహన్రాజావారి దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. ఆయన అప్పుడప్పుడు వస్తూఉండు అని చెప్పి పంపించివేసారు. ఆ తరువాత చాల కాలానికి మళ్ళి ఆయనని మోహన్ కలుసుకోవడం చాలా విచిత్రంగా జరిగింది. 

25 January 2016

Jataka tales - Bhoota Dayaబుద్ధ భగవానులు ఒక సారి తన శిష్యులతో ఇలా అన్నారు "మహాత్ములకు (గొప్పవారికి) ఎంత ధనము, సంపద ఉన్నా వారు భూతదయ మానరు" పిల్లలూ! భూతదయ అంటే ఇతర జీవాల పట్ల ప్రేమ. ఈ విషాయన్ని తెలుపుతూ వారు ఈ కథ చెప్పారు.

స్వర్గానికి రాజైన ఇంద్రుడిగా ఒకసారి ఒక గొప్ప వ్యక్తి పాలించాడు. ఇంద్రుడు అంటె మనము ఎవరో ఒక దేవుడు  అని అనుకుంటాము. కాని నిజానికి అది కూడా ఒక పదవి లేదా అధికారం లాంటిదే. దానికి ఎంతో పుణ్యం చేస్తేనే అర్హులౌతారు. ఈ ఇంద్రుడికి ఎంతో ఐశ్వర్యం, అధికారం ఉన్నా కొంచెం కూడా గర్వం లేదు. ఎంతో మంచి వాడు.
 ఒకసారి రాక్షసులు స్వర్గం పైకి యుద్ధానికి వచ్చారు. అది చూసి దేవతలు భయపడ్డారు. కాని ఇంద్రుడు తన బంగారు రథముపై యుద్ధానికి కావలసిన ఆయుధాలు, అస్త్రాలు(బాణాలు) పెట్టుకుని రాక్షసులకి ఎదురుగా వెళ్ళాడు. దేవతల సైన్యం రాక్షసుల సైన్యం ఒక సముద్ర తీరమున యుద్ధము మొదలుపెట్టాయి. భయంకరంగా యుధ్ధం జరిగింది. ఏనుగులు ఒకదానితో ఒకటి కొట్టుకున్నాయి.దేవతలు, రాక్షసులు ఒకరిపై ఒకరు బాణాలు, కత్తులు వేసుకుని యుధ్ధం చేసుకున్నారు. కొంతసేపటికి దేవసేన రాక్షసుల ధాటికి తట్టుకోలేక పారిపోవటం మొదలు పెట్టింది.  

18 January 2016

Daivika Shaktulu - Asura Shaktulu - Episode 3

సరోజగారి వృత్తాంతం రాజా ఆంజనేయ ప్రసాద్ గారికి స్వయంగా చెప్పటం తన బాధ్యత అని భావించి మోహన్ ఒకరోజు మళ్ళా సైకిల్ తీసుకుని ఆ శాలిబండ పక్క సందులో ఉన్న ఆయన గృహానికి బయలుదేరాడు. పొద్దున్నే వెళ్ళగానే ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. యధాప్రకారం రెండు కప్పుల టీ ఆర్డర్ చేసారు. వారి ఇంట్లో అందరికీ మోహన్ పరిచయం అయ్యాడు. అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూండగా  రాజావారు ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పారు. 

10 January 2016

అతీంద్రియ శక్తులుఉల్ఫ్ మెస్సింగ్ – మొదటి అధ్యాయం
ఒక అద్భుతమైన యదార్థమైన గాథ
అవి జర్మనీ దేశానికి  హిట్లర్ నాయకత్వం వహిస్తూ, పరిపాలిస్తున్న రోజులు. అతని ఉద్రేకపూరితమైనటువంటి మరియూ వాక్చాతుర్యంతో అతను మెల్ల మెల్లగా జర్మని దేశానికి నాయకుడుగా వచ్చినట్టి రోజులు. హిట్లర్ జర్మనీ దేశానికి నాయకత్వం వహిస్తున్న రోజుల్లో అతడు ముఖ్యంగా జర్మనీ దేశంలో ఎన్నో ఏళ్ళనుంచి ఉన్నటువంటి యూదులు అంటే Jewish సముదాయాన్ని చాలా ఎదుర్కొని వాళ్ళను తీవ్రంగా బాధలు పెట్టిస్తూ వాళ్ళని అతిక్రూరంగా చంపేస్తూ ఉండేవాడు. దీనికి కారణం ఏమిటంటే ఆ జర్మనీ దేశాన్ని చాలామంది మతాధికారులు ఆ రోజుల్లో  రాజ్యాన్ని ఏలుతుండేవాళ్ళు. వారికి ఎప్పుడైనా ధనం కొరతగా ఉన్నప్పుడు ఈ యూదులు అంటే jews దగ్గర్నుంచి ఎంతో ధనాన్ని అప్పుగా తీసుకుంటు౦డేవాళ్ళు. స్వతహాగా యూదులు కష్టపడే స్వభావమున్న వాళ్ళు. అద్భుతమైన తెలివితేటలున్నటువంటివాళ్ళు. 

7 January 2016

Daivika Shaktulu - Asura Shaktulu - Episode 2


మరునాడు ఆ రాజావారు చెప్పిన విధంగానే పొద్దున్నే లేచి తయారయ్యి, ఎవ్వరికీ ఏమి అనుమానం రాకుండానే తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవ్వరికీ చెప్పకుండానే యధా ప్రకారంగా సైకిల్ అద్దెకి తీసుకొని వారింటి వైపు తన ప్రయాణాన్ని సాగించాడు. అనుకున్న దానికంటే ఒక అరగంట ముందుగానే చేరుకొని మెల్లగా రాజావారి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అప్పటికే రాజావారు పూజాసామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ఉన్నారు. సరిగ్గా పూజామందిరం అంటే అమ్మవారి ఎదురుగుండా, ఆ పసుపు, కుంకుమతో తడిసిన దళసరి వస్త్రం,దాని మీద విచిత్రమైన ముగ్గులు, దానిలో కొయ్య బొమ్మలు,తరువాత అడ్డంగా కోసినటువంటి నిమ్మకాయలు అవన్నీ కనిపించాయి. రాజావారి పూజామందిరం పక్కనే ఇంకొక గది కూడా ఉంది. 

Daivika Shaktulu - Asura Shaktulu


మా వెబ్ సైట్ పాఠకులకి ఒక సూచన
ఇదివరకు మోహిని కథ ప్రచురించినట్టుగానే ఇప్పుడు మేము మీకు అదేలాంటి కథ దైవిక శక్తులు – అసుర శక్తులు అనే ధారావాహిని అందించబోతున్నాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కూడా కల్పించిన కట్టు కథ కాదు నిజంగా జరిగిన సంఘటనలే.

దైవిక శక్తులు - అసుర శక్తులు
ఉపోద్ఘాతం
మానవులందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అందులో ముఖ్యంగా దైవిక  శక్తులు మరియు దుష్ట శక్తుల గురించి ఎక్కువగా మనకు సందేహాలు వస్తూ ఉంటాయి. మనం ఇళ్ళలో ఎప్పుడూ పూజలు పునస్కారాలు, నోములనివ్రతాలని, గాయత్రీ హోమాలని, జపాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఎందుకు ? మన౦దరికి కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కొంత మంది కోరుకుంటే, కొంత మంది మానవులు ఏ పరంగానూ బోలెడన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు.