ఉల్ఫ్ మెస్సింగ్
– మొదటి అధ్యాయం
ఒక అద్భుతమైన యదార్థమైన గాథ
అవి జర్మనీ దేశానికి హిట్లర్ నాయకత్వం వహిస్తూ,
పరిపాలిస్తున్న రోజులు. అతని ఉద్రేకపూరితమైనటువంటి మరియూ వాక్చాతుర్యంతో అతను
మెల్ల మెల్లగా జర్మని దేశానికి నాయకుడుగా వచ్చినట్టి రోజులు. హిట్లర్ జర్మనీ
దేశానికి నాయకత్వం వహిస్తున్న రోజుల్లో అతడు ముఖ్యంగా జర్మనీ దేశంలో ఎన్నో
ఏళ్ళనుంచి ఉన్నటువంటి యూదులు అంటే Jewish సముదాయాన్ని చాలా ఎదుర్కొని వాళ్ళను
తీవ్రంగా బాధలు పెట్టిస్తూ వాళ్ళని అతిక్రూరంగా చంపేస్తూ ఉండేవాడు. దీనికి కారణం
ఏమిటంటే ఆ జర్మనీ దేశాన్ని చాలామంది మతాధికారులు ఆ రోజుల్లో రాజ్యాన్ని
ఏలుతుండేవాళ్ళు. వారికి ఎప్పుడైనా ధనం కొరతగా ఉన్నప్పుడు ఈ యూదులు అంటే jews
దగ్గర్నుంచి ఎంతో ధనాన్ని అప్పుగా తీసుకుంటు౦డేవాళ్ళు. స్వతహాగా యూదులు కష్టపడే
స్వభావమున్న వాళ్ళు. అద్భుతమైన తెలివితేటలున్నటువంటివాళ్ళు.
ఎంతో పొదుపుగా, ఎంతో
తెలివిగా వివిధమైన వ్యాపారాలు చేస్తూ పెద్ద పెద్ద ధనవంతులకి,రాజులకి పెద్ద
మొత్తంలో ధనాన్ని వడ్డీకి ఇస్తుండేవాళ్ళు. అయితే ఈ మతాధికారులు తీవ్రమైన కాంక్షతో
ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు ప్రకటిస్తూ ఆ ధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టేస్తుండే
వాళ్ళు. చాలా కాలమైనాక కూడా వారు అప్పు తీసుకున్న ధనాన్ని వాపసు ఇవ్వకపోవడం తో
ఈ యూదు వర్తకులు (jewish merchants)ఆ ధనం కోసం ఒత్తిడి చేస్తున్నప్పుడు
అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ యూదులను బెదిరించి ఆ తర్వాత ఏదో విధంగా
వాళ్ళని నానా రకాల కష్టాలు పెట్టి చాలా మార్లు రహస్యంగా వారిని చంపేస్తూ
ఉండేవాళ్ళు. ఈ విధంగా ఈ యూదులు (jewish people) జర్మనీలో చాలా మంది ధనవంతులందరికీ
కూడా శత్రువులుగా భావించబడే వాళ్ళు. ప్రార్థనలు చేసుకోడానికి వాళ్లకి వేరే
మందిరాలు ఉండేవి. వాటిని synogag అంటు౦డేవాళ్ళు. ఈ jewish జనాభా తక్కువగానే ఉండేది
కాని వ్యాపారం మటుకు విస్తారంగా ఉండేది.
ఎప్పుడైతే హిట్లర్ జర్మనీ దేశానికి నియంతగా రావడం
జరిగిందో అప్పట్నుంచి అతను తన పగ, ప్రతీకారాలన్నీఈ యూదులమీద ప్రయోగించాడు.
కొన్నివేల యూదులని రెండవ ప్రపంచ యుద్ధం సమయం లో సామూహికంగా హింసించి, తీవ్రమైన
బాధలకి గురి చేసి వారందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో
చాలామంది యూదులు జర్మనీ దేశాన్ని రహస్యంగా వదిలి , సరిహద్దులు దాటి వేరే
దేశాలకి పారిపోవడం సర్వ సాధారణమైపోయింది. అటువంటి యూదులలో ఒకడైన ఉల్ఫ్
మెస్సింగ్ కూడా ఈ తోటి నాజీల (Nazis –హిట్లర్ ని ఫాలో చేసే వారందరినీ Nazis అని
అంటారు) దుర్మార్గాలనుంచి తప్పించుకుని సరిహద్దులు దాటి రష్యా దేశానికి వెళ్ళే
ప్రయత్నంలో ఒక రైలు ఎక్కాడు. అయితే పాపం ! అతని దగ్గర డబ్బులేవీ లేవు. అతను
దోచుకోబడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. టికెట్టు కొనుక్కోవడానికి చేతిలో చిల్లి రూగుల్
కూడా లేదు. ఆ రైలు డబ్బాలో ( రైల్వే -compartment) సీటు క్రింద దాక్కోవలసిన
పరిస్థితి కలిగింది. గత్యంతరం లేక అలాగే సీటు క్రింద దాక్కుని, గుండెలు
బిగబట్టుకుని, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆర్తితో ఉండిపోయాడు. ఏ స్టేషన్ లో టికెట్
కలెక్టర్ వస్తాడో ? ఆ తర్వాత ఏమిటా? అన్నది అతను ఆలోచిస్తూ, మనస్సులో మధన పడుతూ ఆ
భగవంతున్ని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ప్రపంచం మొత్తం గొడవల్లో మునిగి ఉండగా(
రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా) ఎవ్వరూ ఏదీ పట్టించుకోకుండా ఉన్నారు. ఆ రైల్వే
డబ్బాలో కూర్చున్న చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఒక రైల్వే టికెట్
కలెక్టర్ ఈ ఉల్ఫ్ మెస్సింగ్ ఉన్న కంపార్ట్మెంట్ లో ఎక్కడం జరిగింది. ప్రతి వాళ్ళ
దగ్గర టికెట్ అడిగి తీసుకుని చెక్ చేస్తూ, టికెట్ లేనివాళ్ళ దగ్గర్నుంచి
పైసలు తీసుకుని రసీదులు ఇస్తూ ఉంటె ఆకస్మాత్తుగా ఆ T.C. దృష్టి ఉల్ఫ్ మెస్సింగ్
దాగి ఉన్న బెంచ్ మీద పడింది. ఆ బెంచ్ క్రింద నుంచి మెస్సింగ్ దుస్తులు
కనిపిస్తుంటే “ఇదేమిటీ ! ఈ బెంచ్ క్రింద ఇతను ఎందుకు ఉన్నాడు?” అని ఆశ్చర్య పోతూ
అతన్ని మర్యాదగా బయటకి రమ్మని చెప్పాడు. ఆ డబ్బా అంతా మనుషులతో క్రిక్కిరిసి
ఉంది.
ఉల్ఫ్ మెస్సింగ్ కి ఏం చేయాలో తోచలేదు. అతని చేతికి
ఒక చిత్తు కాగితం దొరికింది. అతడు దాన్ని పట్టుకుని బయటకి వచ్చాక నెమ్మదిగా T.C టికెట్
అడగ్గా అప్పటికప్పుడు అతనికి ఏం జరిగిందో తెలియదు. చేతిలో ఉన్న చిత్తు కాగితాన్ని
T.C కి ఇచ్చి “ఇదే నా టికెట్ !” అని అన్నాడు. ఆ T.C ఆ చిత్తు కాగితం మీద
టిక్కు మార్కు, సంతకం కూడా పెట్టి “ ఇదేమిటండీ ! మీరు టికెట్ కొనుక్కుని హాయిగా
సీటు మీద కూర్చోకుండా ఇలా బెంచ్ క్రింద ఎందుకు కూర్చున్నారు? హాయిగా ఇక్కడ
సీటు మీద కూర్చోండి” అని చెప్పి ఆ చిత్తు కాగితపు టికెట్ ని అతనికి వాపసు ఇచ్చి
మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దీనితో ఉల్ఫ్ మెస్సింగ్ చాలా విభ్రాంతి చెందాడు.
అతనికి ఏం జరుగుతుందో అన్నది ఏమీ అర్థం కాలేదు. నిజంగా చూస్తే అది చిత్తు కాగితమే.
మరి దాన్ని చూసి ఆ T.C ఎలా టికెట్ అని భావించాడు? చక్కగా దాని మీద టికెట్ చెక్
చేసినాట్టుగా టిక్కు మార్కు కూడా పెట్టి , పైగా మీరు టికెట్ పెట్టుకుని ఇలా సీటు
క్రింద ఎందుకు దాక్కున్నారు? అని వ్యాఖ్యానం కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదంతా
ఎలా సాధ్యం? ఏమిటో ఏమీ అర్థం కాలేదు ఉల్ఫ్ మెస్సింగ్ కి.
కాని అప్పుడు ఉన్న పరిస్థితులలో మానసికంగా ఒక నిశ్చల
స్థితిలో ఉండి, ఏం జరుగుతుందా అనే విమర్శనాత్మక దృక్పథంతో చూసే ఆస్కారం
లేదు. ఏ స్టేషన్ అయినా రాగానే గుంపులు గుంపులుగా మనుషులు రావడం, ఒకళ్ళ నొకళ్ళు
త్రోసుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ సరిగ్గా గమనించడానికి కూడా అక్కడ ఎవ్వరు
లేరు. అతడు ఈ విషయమే ఆలోచించుకుంటూ, తనలోతానే ఈ అద్భుతానికి ఆశ్చర్య పడుతూ ఆ రైలు
తనను ఎప్పుడు గమ్య స్థానానికి చేర్చుతుందా, అది ఏ స్టేషన్ లలొ ఆగుతుందా తర్వాత తన
తదుపరి కార్యం ఏం చేయాలి అనే ప్రశ్నలు మూకుమ్ముడిగా వస్తుంటే వాటి గురించి
ఆలోచనల్లో మునిగిపోయాడు.
(To be continued .............)