దేవదత్తుని వృత్తాంతం - 11_b
వల్లభదాసు పథకం,
వయసు అనుభవము ఉన్న వృద్ధ బ్రాహ్మణులు అంతా అక్కడ జరిగే తంతు చూసి విస్తుపోయారు.అక్కడ ఎటువంటి మంత్రోచ్ఛటన లేదు, కాసేపు "దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర" అనే నామజపం, తరువాత ఆ సన్యాసి పేరుతో నామాజపం చేస్తూ అక్కడ వచ్చిన పేద, ధనిక అను భేదం లేకుండా అందరిచేత ఖరీదైన ఆవునెయ్యిని ఆహుతులుగా వెయిస్తున్నారు. భక్తి భావం లేకుండా హవనం పొడిని కూడా ఇష్టం వచ్చునట్టు యజ్ఞంలో చల్లడం చేస్తున్నారు.అక్కడ యజ్ఞ విధి అంతా విధి పూర్వకంగా కాకుండా, యాంత్రికంగా జరిగిపోతోంది. భక్తజనం కూడ క్రమశిక్షణ లేకుండా తోసుకోవడం వంటివి చేస్తున్నారు.
మన సనాతన ధర్మంలో వేదాలకు, యాగాలు ఒక విశిష్టమైన స్తానం ఉన్నది. దానిలో మంత్రశాస్త్రం ఒకభాగం, స్వయంగా దత్తస్వామి వారు వేదాలను ఎంతో గౌవరవించేవారు, గాయిత్రి యజ్ఞం విధిపూర్వకంగా చేస్తూవుండేవారు. ఎందుకంటే గాయత్రియందే సమస్త శాస్త్రం ఇమిడి ఉంది. శ్రీపాద చరితామృతంలో స్వామి స్వయంగా "అహర్నిశలు ఎవరతే నా నామజపం చేస్తారో వారికి స్వయంగా దర్శనం ఇస్తాను" అని చెప్పారు. కాని ఇక్కడ జరిగే ప్రక్రియ శాస్త్రవిరుద్ధంగా ఉన్నది. అక్కడ చేరిన బ్రహ్మణోత్తములు అంత నిర్ఘాంతపోయారు, దేశంలో జరిగే అన్ని యాగాలకు, హోమాలకు, తంతుకు విరుద్ధంగా ఇక్కడి ప్రక్రియలు జరుగుతున్నవి. కొన్ని లక్షలు ఖరీదు చేసే స్వఛ్చమయిన ఆవునెయ్యి ఇలా అగ్నిపాలు కావడం.చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేయడం చూసి బ్రాహ్మణులంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భక్తుల్లో కూడా కొందరుఆడా, మగ తేడ తెలియని విధంగా ఆధునిక దుస్తులు ధరించి పూజా విధానంలో పాల్గొని ఉండటం, శుచి శుభ్రం లేని పూజ విధానాలు వాళ్లకు భరించరాని విధంగా ఉన్నాయి. కానీ ఏమి అడ్డుచెప్తే ఏమిజరుగుతుందో అన్న భయం కూడా వారిలో లేకపోలేదు. గౌరవభంగం కాకూడదు అని బయటికి కూడా వెళ్ల లేక పోయారు, ఈ తతంగానికి వారు ప్రేక్షకపాత్ర పోషించ వలసి వచ్చింది.
బాగా అలంకరించి ఉన్న వేదికపై వెండి సింహాసనం మీద కూర్చుని ఆ సన్యాసి ఈ యాగాలనన్నింటిని గమనిస్తూ వున్నాడు.ఆయన చుట్టూ సపర్యలు చేస్తూ భక్తులు (ఎక్కువ భాగం స్త్రీలు) వున్నారు. కాసేపటికి ఆ సన్యాసి తన ఆంతరంగ గదిలోకి వెళ్లిపోయారు. కొంతమంది అధికమొత్తంలో దక్షిణ ఇచ్చిన వారతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆసన్యాసి తాగిన చుట్టల భస్మం తీసుకుంటే ఉబ్బసవ్యాధి లాంటి పోతాయి అని అతని అనుచరులు ప్రచారం చేయడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. దక్షిణ ఇచ్చిన భక్తులకు మాత్రమే ఆ స్వామి వారి తాగి విదిల్చిన చుట్టాలు, బీడీల, సిగిరెట్ల బూడిద పంచడం వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఇళ్లకు తీసుకు పోయే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తున్న వల్లభదాసుకు చాలా బాధతోపాటు ఆగ్రహం కలిగింది.
మిగిలినది తరువాయి భాగంలో..