Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

8 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 10

దేవదత్తుని వృత్తాంతం - 10

వల్లభ దాసు యొక్క కీర్తి,

వల్లభదాసు కొద్ది మంది అనుచరులతో కలిసి తమని అవధూతగా చెప్పబడే సాధువు ఉన్న నివాసానికి చేరుకున్నాడు. ఆప్రాంతం అంతా అట్టహాసంగా, కోలహలంగా ఉన్నది. అక్కడ పందిరి వేసి ఉన్నది, దాని క్రింద ఆ కపట అవధూత అనుచరులు కూర్చొని అతని మహత్తున్ని పలురకాలుగా చెపుతూ వచ్చారు. ఆ సమయంలో ఆ స్వామి అభ్యంగన స్నానం చేస్తువున్నారు. ఆ స్వామి అభ్యంగన స్నానం చూడాలి అనుకున్నవారు 100 రూపాయలు చెెల్లించి స్వామి వారి దగ్గరకు వెళ్ళవచ్చు అని చెపుతున్నారు. ముందుగా స్త్రీలకు అవకాశం ఇచ్చారు. అక్కడి స్త్రీలందరు 100 రూపాయలు కట్టి స్వామివారు స్నానము చేస్తున్న గదిలోకి వెళ్ళ సాగారు.

స్వహస్తాలతో స్నానం చేయించాలి అనుకున్నవారు 500 రూపాయలు ఇచ్చి తమ చేతులతో స్వామికి భగవంతునికి  అభిషేకం చేసే భావంతో చేయవచ్చు అన్నారు. అలా చేసే వారికి కష్టాలు తొలగి, సిరి సంపదలు కలుగుతాయి అని ప్రచారం చేస్తున్నారు. జనం అంతా ఆ అవకాశం కోసం  500 రుసుము చెల్లించి ఆ కార్యక్రమంలో పల్గొనడం జరిగింది. ఎంతో మంది మహిళలు స్వామి వారి దగ్గరకు వెళ్లడం జరిగింది. పథకం ప్రకారం వల్లభదాసు తన సహచరులలో ఒకరి శ్రీమతిని ఆ కార్యక్రమం చూడటానికి పంపడం జరిగింది. ఆ గదిలో చాలా కోలాహలంగా ఉన్నది పురుషులెవ్వరికి ప్రవేశం లేదు. స్వామి వారు ధ్యాన స్థితిలో ఉన్నారు కేవలం గోచి గుడ్డను ధరించి జుట్టు జడలతో ధ్యాన స్థితిలో ఉన్నారు. ఖరీదైన అభ్యంగన సామగ్రి కొని స్త్రీలు లోన గుమిగూడారు, వారిలో కొందరు మహిళలు ఇది మహా భాగ్యం అని ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వల్లభదాసు అనుచరుని శ్రీమతి కమలమ్మ ముగ్గరు స్త్రీలను గమనించింది. వారు ముగ్గురు  పూనకం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు.వాళ్ళు మాకు ఉన్న కీళ్ల నొప్పుల జబ్బు ఎంత ఖర్చు చేసి వైద్యం చేసుకున్నాతగ్గనిది స్వామి వారి అభిషేకం లో పాల్గొనడం వల్ల ఈ మూడురోజుల్లో తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు.స్వామి వారు కూడా స్త్రీలు చుట్టూ చేరి మర్ధనలు చేస్తూ స్నానం చేయిస్తూ ఉంటే తన్మయత్వంతో ఆనందిస్తున్నారు. ఇదంతా చూస్తన్న కమలమ్మగారికి చాలా జుగుప్సా భావం కలిగింది. ఈ తతంగం చూస్తున్న కమలమ్మగారికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆమెకు  ఇంట్లో అత్త మామలైన పెద్దలను గౌరవించని, ప్రేమను పంచలేని  తనకు తెలిసిన మహిళలు కూడా స్వామి వారికి స్నానము చేయిస్తూ కనిపించారు. మధ్య మధ్యలో స్వామి వారు కళ్ళు తెరిచి ఆ ఆడవారిని కొడుతున్నాడు.

వారితో ఏవో పరాచకాలు ఆడుతూ వున్నాడు. ఇతనికి చేస్తున్న సేవ ఎందుకు అత్తమామలకు వీరు చేయలేక పోతున్నారు అని కమలమ్మ ఆలోచనలో పడ్డారు. ఇంక అక్కడ ఉండలేక వచ్చేస్తున్న ఆమెకు బయటి ఖాలీస్థలంలో నుంచి ఎదో వాగ్వివాదాలు  కిటికీ ద్వారా వినిపించాయి, ఆమె ఎవరి కంట పడకుండా అది ఏమిటి అని గమనించ సాగింది. మధ్య వయస్కుడైన ఒక స్వామి వారి అనుచరుడు ముగ్గురు మహిళలతో వాగ్వాదం చేస్తున్నారు. ఆ మహిళల్లో ఒక ఆవిడ ,"ఏమయ్యా రంగదాసు నువు చెప్పినట్లే మేము ఎంతో ప్రచారం చేసాము ఇప్పటికే నేను పదిమందిని స్వామి వైపు ఆకర్షితులను చేసాను, నా వాటా ఎందుకు ఇంకా ఇవ్వలేదు అన్నది, మిగిలిన మహిళలు లేని జబ్బులు చెప్పి స్వామి వారి అభిషేకం తో నయం అయ్యాయి అని చెప్తున్న మా మాటలకు ఎంతో మంది ఆకర్షితులు అవుతున్నారు మా వాటా ఇవ్వు అన్నారు. దానికి రంగదాసు "అమ్మ నా వాటా కూడా మూడువేల వరకు రాలేదు. అది వస్తే  కానీ నేను మీకు ఇవ్వలేను. ఈలోపు మీరు గొడవ చేస్తే ఎవరి కంట్లో అయిన పడితే మనకు దేహ శుద్ధి జరుగుతుంది. కాబట్టి దయ చేసి ఓపిక పట్టండి అని ప్రార్థించాడు." ఇది అంత గమనించిన కమలమ్మ మాట్లాడ కుండా మెల్లగా బయటకు వచ్చి వల్లభదాసు సహచరులను  సైగలతోబయటకు తీసుకు వచింది.ఇది అంత వల్లభదాసు గమనిస్తూనే వున్నారు.వల్లభదాసుకు కపట సన్యాసి విషయంలో ఉన్న అనుమానం నిజమని తేలింది. తదుపరి ప్రణాళిక ఏమిటా అని వల్లభదాసు ఆలోచనలో పడ్డారు. 


ఆరోజు సాయంత్రం వల్లభదాసు ఇంట్లో ఉండగా రాజమ్మ గారు వచ్చి " నాయనా ఎలాగైనా నువ్వే నా కూతుర్ని రక్షించాలి. మా ఇంట్లో ఎవరూ నామాట వినటం లేదు, నాకుతురికి  ఏవిధమైనటువంటి జబ్బు లేదు, కానీ మావారు, మా అత్తగారు అమాయకత్వంతో బయట వారి మటలు నమ్మి  ఈ స్వామి వారిని ఇంటికి పిలిపించి పాదపూజ చేసి 1116 సమర్పించారు. ఆ స్వామి వారి దృష్టి నా కుతురి మీద పడింది. అతను మా అత్తగారిని పిలిచి మీ మనవరాలిని చూసాను ఆమెకు మీకు తెలీకుండా ఒక రుగ్మత అనగా ఒక చెడు గాలి సోకింది. ఇది ఆమెకు కాని మీకు కాని తెలీకుండా అలా జరిగింది. మీరు ఆమెను కాపాడుకోండి అన్నాడు. దానికి మావాల్లు భయపడి మీరె ఏదో ఒకటి చేసి తనను కాపాడండి అన్నారు. దానికి అతను  రాత్రి సమయం 7 గంటల ప్రాతంలో మీ అమ్మాయిని నా దగ్గరకు తీసుకు రండి ఆమెకు నేను నయం చేస్తాను అన్నాడు. నాకెందుకో అతని ప్రవర్తన చూపులు నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. తల్లిగా నాకు తెలుసు నాకుతురు ఆరోగ్యవంతురాలు, అతడు ఏదో చెడు ఉద్దేశంతో అలా అన్నట్టు నాకు అనిపిస్తూన్నది. కాబట్తి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను రక్షించు నాయనా వల్లభదాసు అని బ్రతిమాలుకున్నది. 
 

మొదటి రోజు స్వామి వారి దగ్గరకు వెల్లినప్పుడు స్వామి  ఇచ్చిన పాలు త్రాగి నా కూతురు మత్తుగా కూచున్న దగ్గరే నిద్రలోకి జారుకున్నది. ఆమెను ఏకాంతంగా గదిలొ వంటరిగా వుంచమని ఆమెకు ఎవో ప్రక్రియలు చేయలి అని చెప్పడంతో నాకు భయం అనిపించింది. దాంతో సమయస్ఫూర్తితో నేను ఈ రోజు పంచాంగం చూసాను మంచి రోజు కాదు అని ఒప్పించి మావరితో చెప్పి మా అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చాను. 

ఆ స్వామి రేపు అమ్మాయిని తీసుకు రమ్మని చెప్పాడు. కాబట్టి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు నాయనా వల్లభదాసు అని ఆర్తితో ప్రదేయపడింది. ఇది అంతా విన్న వల్లభ దాసు అమ్మా మీరు నిశ్చింతగా వెల్లండి దత్తుని దయతో శ్రీపాదుని అనుగ్రహంతో ఏదో ఒకటి చేసి మీ అమ్మాయిని రక్షిస్తాను అని అభయం ఇచ్చి పంపాడు.ఈ విషయం గోప్యంగా వుంచమని కూడా హెచ్చరించాడు. తరువాయి భాగం వచ్చే అధ్యాయములో ..