Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

21 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 11_b

దేవదత్తుని వృత్తాంతం - 11_b
వల్లభదాసు పథకం,

 జిల్లా కలెక్టర్ గారు జవాబుగా ఇచ్చిన ఉత్తరంతో వల్లభదాసుకు దత్త ప్రభువు సహాయంతో సమస్య తొలగుతుంది అని నమ్మకం కుదిరి స్వామి వారి పూజలో నిమగ్నం అయ్యాడు. అదే సమయంలో సుమతి అనన్య భక్తితో శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించి అహర్నిషలు ధ్యానం చేస్తోంది. జిల్లా కలక్టర్ గారు అన్ని జిల్లాల యంత్రాంగానికి కపట సన్యాసి చిత్ర పటాలతోసహ హెచ్చరికలు పంపారు. దాంతో రాష్ట్రయంత్రాంగం అంతా కదలింది. అయితే ఈవిషయాలను అన్నింటిని రక్షణ ద్రుష్ట్యా గోప్యంగా ఉంచడం జరిగింది. వాల్లు కొన్ని రహస్య వ్యూహాలు చేసి వాటికి అనుగుణంగా ఎంతో మంది ఈ చర్యల్లో పాల్గొనడానికి సాధారణ దుస్తుల్లో రావడం వంటి జాగ్రత్తలు కుడా తీసుకున్నారు.మరునాడు జరగబోయే దత్త యాగానికి వేలసంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు చాలా మంది ముందుగానే ధన విరాళాలు, వస్తు విరాళాలు,యాగసామాగ్రి విరాళాలు ఇచ్చారు.  అక్కడ ధనవంతులైన భక్తులకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 కుండీల యాగం ప్రారంభం అయ్యింది. దీన్ని వీక్షించేందుకు ఎంతో మంది దత్త మహా యజ్ఞంలో  పరిపక్వత సాధించినటువంటి  ఘనాపాటీలు కూడా కర్ణాకర్ణిగా స్వామివారి గురించి విని అక్కడకు విచ్చేయడం జరిగింది, అసలు విషయాలు వారికి కూడా తెలియదు. ఈ ఘనాపాటీలు అందరూ వయోవృద్దులు, వారిని ఎవరు ఆహ్వానించక పోయినప్పటికి దత్తస్వామిపైన వున్న భక్తితో వారే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. 





వయసు అనుభవము ఉన్న వృద్ధ బ్రాహ్మణులు అంతా అక్కడ జరిగే తంతు చూసి విస్తుపోయారు.అక్కడ ఎటువంటి మంత్రోచ్ఛటన లేదు, కాసేపు "దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర" అనే నామజపం, తరువాత ఆ సన్యాసి పేరుతో నామాజపం చేస్తూ అక్కడ వచ్చిన పేద, ధనిక అను భేదం లేకుండా అందరిచేత ఖరీదైన ఆవునెయ్యిని ఆహుతులుగా వెయిస్తున్నారు. భక్తి భావం లేకుండా హవనం పొడిని కూడా ఇష్టం వచ్చునట్టు యజ్ఞంలో చల్లడం చేస్తున్నారు.అక్కడ యజ్ఞ విధి అంతా విధి పూర్వకంగా కాకుండా, యాంత్రికంగా జరిగిపోతోంది. భక్తజనం కూడ క్రమశిక్షణ లేకుండా తోసుకోవడం వంటివి చేస్తున్నారు.


మన  సనాతన ధర్మంలో వేదాలకు, యాగాలు ఒక విశిష్టమైన స్తానం ఉన్నది.  దానిలో మంత్రశాస్త్రం ఒకభాగం, స్వయంగా దత్తస్వామి వారు వేదాలను ఎంతో గౌవరవించేవారు, గాయిత్రి యజ్ఞం విధిపూర్వకంగా చేస్తూవుండేవారు. ఎందుకంటే గాయత్రియందే సమస్త శాస్త్రం ఇమిడి ఉంది. శ్రీపాద చరితామృతంలో స్వామి స్వయంగా "అహర్నిశలు ఎవరతే నా నామజపం చేస్తారో వారికి స్వయంగా దర్శనం ఇస్తాను" అని చెప్పారు. కాని ఇక్కడ జరిగే ప్రక్రియ శాస్త్రవిరుద్ధంగా ఉన్నది. అక్కడ చేరిన బ్రహ్మణోత్తములు అంత నిర్ఘాంతపోయారు, దేశంలో జరిగే అన్ని యాగాలకు, హోమాలకు, తంతుకు విరుద్ధంగా ఇక్కడి ప్రక్రియలు జరుగుతున్నవి. కొన్ని లక్షలు ఖరీదు చేసే స్వఛ్చమయిన ఆవునెయ్యి ఇలా అగ్నిపాలు కావడం.చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేయడం చూసి బ్రాహ్మణులంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భక్తుల్లో కూడా కొందరుఆడా, మగ  తేడ తెలియని విధంగా  ఆధునిక దుస్తులు ధరించి పూజా విధానంలో పాల్గొని ఉండటం, శుచి శుభ్రం లేని పూజ విధానాలు వాళ్లకు భరించరాని విధంగా ఉన్నాయి. కానీ ఏమి అడ్డుచెప్తే ఏమిజరుగుతుందో అన్న భయం కూడా  వారిలో లేకపోలేదు.  గౌరవభంగం కాకూడదు అని బయటికి కూడా వెళ్ల లేక పోయారు, ఈ తతంగానికి వారు ప్రేక్షకపాత్ర పోషించ వలసి వచ్చింది.

బాగా అలంకరించి ఉన్న వేదికపై వెండి సింహాసనం మీద కూర్చుని ఆ సన్యాసి ఈ యాగాలనన్నింటిని గమనిస్తూ వున్నాడు.ఆయన చుట్టూ సపర్యలు చేస్తూ భక్తులు (ఎక్కువ భాగం స్త్రీలు) వున్నారు. కాసేపటికి ఆ సన్యాసి తన ఆంతరంగ గదిలోకి వెళ్లిపోయారు. కొంతమంది అధికమొత్తంలో దక్షిణ ఇచ్చిన వారతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.  ఆసన్యాసి తాగిన చుట్టల భస్మం తీసుకుంటే ఉబ్బసవ్యాధి లాంటి పోతాయి అని అతని అనుచరులు ప్రచారం చేయడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. దక్షిణ ఇచ్చిన భక్తులకు మాత్రమే ఆ స్వామి వారి తాగి విదిల్చిన చుట్టాలు, బీడీల, సిగిరెట్ల బూడిద పంచడం వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఇళ్లకు తీసుకు పోయే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తున్న వల్లభదాసుకు చాలా బాధతోపాటు ఆగ్రహం కలిగింది.
మిగిలినది తరువాయి భాగంలో..