Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

24 December 2017

Anagastami Vratam book

If anyone is interested in Anagastami Vrata Kalpam book, it is available with Sairam garu.
Please contact him for copies.

His phone: +91 7901268716
Email: srnanduri50@gmail.com


4 December 2017

Swaminarayana Telugu Audio chapters 31, 32  & 33 are available now. Please click here.

22 November 2017



Swaminarayana Telugu Audio chapters 28, 29  & 30 are available now. Please click here.

19 November 2017

దేవదత్తుని వృత్తాంతం - 16

దేవదత్తుని వృత్తాంతం - 16 


నాగనాథుని సమ్యక్ విచారణ


నాగనాథుడు తన మనోనేత్రాలకు కనపడినటువంటి దృశ్యాలను అందులోని వ్యక్తులను గురించి చాల తీక్షణంగా విమర్శను మొదలు పెట్టాడు. అయ్యో ఈ భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు 9సార్లు అవతారాలు ఎత్తి ఎన్నో రకములుగా ప్రజల్ని దుష్టులనుండి రక్షించి ధర్మస్థాపన కోసం మనుషుల యొక్క మనసుల్లో ఆలోచనలతో సహా ఎలా పవిత్రంగా ఉండాలో పవిత్రమైన తను మనుష్య జన్మను ఎత్తి ఆచరించి చూపించినప్పటికి కూడా ఈ ప్రజల్లో ఎటువంటి మార్పులేదేమిటి అనుకున్నాడు.
అంతేకాకుండా సాక్షాత్తు దత్తస్వామి కూడా ఎన్నో అవతరల్లో భూమిమీద ధర్మప్రచారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి అనేక కోట్ల మందుని ఉధ్ధరించిన్నప్పటికి వారి యొక్క ఉపదేశాలు స్వల్ప కాలంలోనే మరచి, ఆయన తత్వాన్ని వక్రీకరించి తమకు అనుగుణంగా మార్చుకొని చిన్న చిన్న మాయలతో అమాయక ప్రజల్ని తప్పుదారి పట్టింస్తున్నారు. వారు భ్రష్టులవడమే కాకుండా ప్రజలని కూడా మోసం చేస్తున్నారే. ఎన్నో శాస్త్రాలు చదివిన పండితులు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ముఖ్యంగా భారతదేశంలో గోమాతకి, స్త్రీమూర్తికి, భూమాతకి ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారే అని వాపోయాడు.




ఎంతో మంది మేము దత్త పురాణం108 సార్లు మిగతా పురాణాలు పారాయనము చేసాము అని గొప్పలు చెపుకుంటున్నారు. వారిలో కూడా ఇసుమంత అయినా మార్పు లేదు బాగా ధర్మ విరుధ్ధంగా ప్రవర్తిస్తున్నారు.ఈ మూర్ఖ ప్రజలు కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న మాయలకు మర్మాలకు లోబడి పోయి అసలు తత్వాని మరిచి దారి తప్పి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చాలా రకాలుగా ఆయన విమర్శ చేసుకోవడం మొదలు పెట్టాడు.



అయినా ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? ఎందుకు దేవదత్తుల వారు నన్ను ఈ విధముగా గమనించమని చెప్పారు దీనిలో అంతరార్దం ఏమిటి ?అని ఆలోచించ సాగాడు. ఎక్కడ చుసినా నాకు ఒక్కడు కూడ నిజమైన దత్త భక్తులు కనబడుట లేదు.ఎంత సేపు వారి ద్రుష్టి గొప్పలు చెప్పుకోవడం,డబ్బు సంపాదించు కోవడం తప్ప మరొకటి లేదు. నిజంగా దత్తుని గురించి ఆయన తత్వాన్ని గురించి ప్రజలకి మార్గోపదేశం చేసి సంఘాన్ని ఒక్క శాస్త్రీయపరమైన మార్గంలో ఎందుకు పెట్టడం లేదు అని అనుకున్నాడు.



శ్రీ దత్త పురాణంలో సాక్షాత్తు దత్త స్వామి ఎంతో శాస్త్రీయతతో ఎన్నో విషయాలు చెప్పారు.ఆ స్వామి నేను సాక్షాత్తు భగవంతుడిని అని ఎక్కడా చెప్పలేదు. మరి ఈ చిల్లర దేవ్వుళ్ళు అందరు కూడా ఈ దత్త స్వామిని మించిపోయి ఉన్నారు. కొన్ని వేల కోట్ల ధనాన్ని పోగు చేయటం, ఆస్తులను సంపాదించడం, తనని నమ్మిన అమాయక యువతులను శిష్యురాల్లుగా చేసుకొని మోసపూరితంగా వారిని ప్రభావితం చేసి చివరికి వారిని వివాహం కూడా చేసుకుంటుంన్నారు.వారి ధన, మానాన్ని కూడ హరించి వేస్తున్నారు కదా స్వామి ఎమిటి, ఎందుకు నాకు ఈ శిక్ష? అని ఆయన పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టాడు. సాక్షాత్తు శ్రీ స్వామి వారు కురుపురంలో తపస్సు చేసిన ప్రదేశంలోను రుక్మిని పాండురంగ ఆలయం ఎదురుగా పశువుల కొట్టంలో స్వామి దర్బారు చేసిన ఆ ప్రాగణంలోనగనాధుడు తీవ్ర ధ్యానంలో నిమగ్నులయ్యారు.



ఆయన మనో నేత్రానికి శ్రీ దేవదత్తుల వారు కనిపించి "నాయనా, నాగనాధ నీ అంతరంగం నాకు అవగతమైనది నువ్వు సాక్షాత్తు దత్తాత్రేయ నిజమైన భక్తుడివి అందుకే నీకు ఇంత ఆవేదన నిర్వేదన కలుగుతున్నది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన భారత దేశంలో కర్మ సిద్దాంతాన్ని మహా పండితులు కూడా అపార్ధం చేసుకొని వారికి ఉన్న వాక్చాతుర్యంతో వివిధ సిద్దాంతములను ప్రవేశపెడుతున్నారు. దతాత్రేయుని యొక్క వివిధ అవతారాలను కూడా వారి భక్తులు విమర్శిస్తున్నారు. అలాగే శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి భక్తులు శ్రీ నరసింహ సరస్వతి గారిని, షిర్డీ సాయిబాబాను కూడా విమర్శిస్తు, విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వారే ప్రస్తుతం సమాజంలో చాలా గొప్ప వ్యక్తులుగా చలామని అవుతున్నారు. సామాజికంగా,శాస్త్రీయపరంగా అన్ని విధాలుగా యుగాలు మారుతూన్నాయి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి . దానికి అనుగుణంగా ఇప్పుడు పురాణ ప్రవచనాలు చెప్పేవారు శాస్త్రీయతను జోడించి చెప్పలేక పోతున్నారు, పురాణ ప్రవచనాలు తరతరాల నుంచి వస్తున్నఅదే బానిలో చెప్పుకుంటున్నారు.



విష్ణు భక్తులు ఒంటి మీద శంకు చక్రాలను వాతలుగా పెట్టుకొని శివుని యొక్క నామశరణం చేయకూడదని భక్తుల దగ్గర విపరితమైన ప్రమణాలు చేయిస్తున్నారు.శివ భక్తులు విష్ణు భక్తులను ధ్వేశించడం,వీర శైవులు విష్ణు భక్తులను సంహరించడం చేస్తున్నారు.ఈ భారత దేశానికి మత గురువులు చేసిన ద్రోహం ఇంక ఎవ్వరు చెయ్యలేదని చెప్పడం అతిసయోక్తి కాదు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న ఈ తరం పిల్లలు ప్రజ్ఞాపుత్రులు అని వారిని వ్యవరిస్తుంటారు. వాళ్ళందరు కూడ ఈ పురాణంలో ఉన్నవాటిని పుక్కిట పురాణాలుగా తీసి పారేస్తున్నారు. శాస్త్రీయ పరంగా వారు అడిగే ప్రశ్నలకు బహుముఖ పాడింత్యం ఉందని ప్రకటించుకున్న వారు కూడా ఏమి సమాధానం చెప్పలేక పోతున్నారు.వారందరు కూడా కీర్తికి ఆశపడో, డబ్బుకు ఆశపడో తమకు తోచిన విధంగా వారు చదువుకున్న పురాణాలకు వక్చ్యాతుర్యంతో వారికి అణుగుణంగా ఆలోచించే విధంగా తయారు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం భారతదేశంలో నాస్తికత్వం ప్రభలింది.వీరబ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొన్ని వేల మంది దొంగ సాధువులు,సన్యాసులు,అవదూతలు సమాజాన్ని అనేక విధంగా బ్రష్టు పట్టిస్తూ సర్వ నాశనం చేస్తున్నారు.ఇటువంటి వారి దురాగతాలని బయటికి చెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే వారందరికి కూడా కర్మ సింద్దంతం భయపెడుతు ఉంటుంది, కాని ఈ నవ యుగ నిర్మాణ శక్తిలో ఈ పాత శక్తులన్ని కూడ కొట్టుకు పోతాయి. సాక్షాత్తు శ్రీ దత్త స్వామి చెప్పిన విధంగా ఒక్క నూతన యుగ శక్తి నిర్మాణం జరుగుతుంది. దీనికి నాందిగా చాలా మంది మహత్ములు కృషి చేస్తున్నారు. అందులో చెప్పుకో దగ్గ మహత్ముడు పండిత శ్రీ రామశర్మ ఆచార్య. కానీ ఆయనకు కూడ చాలా భక్తి భావం ఉండి ప్రియ శిష్యులుగా ఉన్నవారికి కూడ వారికి తెలియకుండానే అహం పెరిగిపోతూ ఉన్నది. వీటనింటిని కూడ నువ్వు విశ్లేషించాలి దానికి తగినట్టువంటి పరిస్థితులను అవకాశాలని ఆ విచక్షణ శక్తిని ఆ విమర్శనాత్మకమైనటువంటి ఆ జ్ఞానాన్ని నీకు దత్త స్వామి అనుగ్రహిస్తున్నాడు.ఇవన్ని కూడ నీలోనే నిద్రాణ స్థితిలో ఉన్నాయి వాటికి ఇప్పుడు అంకురార్పన జరిగింది. కాబట్టే నువ్వు నన్ను దర్శించుకోగలిగావు, నేను కూడ పనిముట్టుని మాత్రమే సుమా. కాబట్టి నువ్వు ఈ దత్త స్వామి యొక్క నూతన యుగ శక్తి నిర్మాణాన్ని ప్రజలకి చెప్పాలి. ఈ కపట సాదు సన్యాసులు గురించి నీకు అనుభవంలో వచ్చినది వివిధ పాత్రల ద్వార తెలియజేయడం జరుగుతుంది.ఇటువంటి విషయాలన్నిటిని కూడ నువ్వు నిర్భయంగా నిర్మొహమాటంగా చెప్పవలసి ఉంటుంది. ఎన్నో విమర్శలు నీకు వస్తాయి కాని నువ్వు వాటికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత దేశంలో ఇటువంటి చేదు నిజాలని వినటానికి ఎవరు కూడ ఇష్టపడరు ఎందుకంటే తర తరాలుగా వారి పెద్దల నుంచి వచ్చినదే వాళ్ళు వల్లె వేస్తు ఉంటారు తప్ప వారిలో ఒక్క విమర్శనాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికి కూడ వారికి ఎన్నో సందేహాలు ఉన్నప్పటికి వాటిని భయటికి చెప్పటానికి మాత్రం భయపడుతుంటారు కాబట్టి నువ్వు ఈ పనిని చేయడానికి ఎంచుకోబడ్డావు నాయనా కాబట్టి ఈ నిర్వేదాన్ని పోగొట్టుకో అని మరి కొన్ని యోగ రహాస్యాలు ఆయనకు వెల్లడించి ఆయన మాయమైపోయాడు."



19 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 15


దేవదత్తుని వృత్తాంతం

నాగనాథుని నిర్వేదన


దత్తస్వామి మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి భక్తుడైన నాగనాథునికి తాను చూస్తున్నదాంట్లో  దత్తభక్తులుగా తమని తాము చెప్పుకుంటున్న కపట స్వాములను తలచుకొని ఎంతో నిర్వేదన కలిగింది. ఒకప్పుడు పరశురాముడికి కూడా ఇలాంటి నిర్వేదన భావం కలిగింది. సాక్షాత్తు దత్తస్వామి అవతారమైన శ్రీపాదులు భూమిమీదకు వచ్చి ఎంతోమంది ప్రజలను ఉద్ధరించ వెళ్లిపోయిన అనతి కాలంలోనే ఇలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ దత్తాతత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదేమిటి అని, శ్రీపాదుని      పేరు చెప్పుకొనో లేదా నృసింహ సరస్వతి పేరు చెప్పుకొనో, షిరిడీ సా యిబాబా మహిమల గురించి పైకి చెప్పుకొనో అమాయక ప్రజల విశ్వాసాలను సొమ్ముచేసుకుంటున్నది చూసి  చాలా మదన పడ్డాడు. అయితే అతనికి ఒక సారి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలావున్నాయి అని గమనించాలని సంకల్పం కలిగింది.

అతను తన సంకల్ప శక్తితో తత్ క్షణం స్వామివారు తపస్సు చేసుకున్న కురువపుర క్షేత్రానికి వెళ్లడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీపాదులు తపస్సు చేసుకున్న ప్రాతం ఎటువంటి సౌకర్యాలు లేకుండా పురతనంగా ఉండటం గమనించాడు. కానీ అక్కడ నియమింపబడ్డ బ్రహ్మణోత్తములు శ్రద్ధగా మడికట్టుకొని ఆ కృష్ణానది  పాయ నుండి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలుచేస్తూ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.శ్రీవల్లభ స్వామివారు ఇచ్చిన ఆదేశాలప్రకారం ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబాన్ని కర్ణాటక రాష్ట్రంలోని ధార్వార్ నుండి తీసుకురావడం జరిగిందని ఆ వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారు అక్కడ పరిస్థితిని గమనించి నాలుగు వైపులా నీరువున్న ఆ ద్వీపాన్ని చూసి, మేము ఇక్కడ ఎలా జీవించగలం అని వాపోయారు.దత్త స్వామి ప్రియ శిష్యుడైన శ్రీ టెంబేస్వామి అక్కడి భక్తుల సహకారంతో శ్రీస్వామివారికి చిన్న ఆలయం కట్టించి, ఆ బ్రాహ్మణ కుటుంబాల అన్నదమ్ముల ఇద్దరికి నివాస యోగ్యమైన రెండు ఇళ్లను కట్టించి, వారి జీవనోపాదికై కొంత మంది భూస్వాముల సహాయంతో భూములను దానం చేయడం జరగడంతో వారు అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి వారు ఆ రెండు కుటుంబాలను తన సేవకు నియమించుకున్నారు.

ఇప్పటికి ఆ కుటుంబాలకు చెందిన తరాలవారే వంతుల వారీగా స్వామివారి సేవచేసుకుంటూ భక్తులు ఇచ్చే కానుకలతో తమ జీవనాన్ని గడుపుకుంటున్నారు.భక్తులు ఇచ్చే సంబారాలతో మడికట్టుకొని చేసిన పదార్థములతో అన్నదానాలు చేస్తువున్నారు.ఆ కుటుంబీకులను భట్టాక కుటుంబీకులు అంటారు. స్వామివారు ప్రతినిత్యం కృష్ణా నదిలో స్నానం ఆచరించి సూర్యనమస్కారాలు చేసిన తరువాత నీటిమీద నడుచుకుంటూ రుక్మిణి పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న పశువుల పాకలో రోజూ దర్బార్ చేస్తుండేవారు అని తెలిసి అటుగా వెళ్లి చూసి నాగనాథునికి చాలా మనస్తాపం కలిగింది.ఆలయం పర్యవేక్షణ లేక పడుబడి, పశువులకు నివాసమై వాటి విసర్జన పదార్థములతో, భరించరాని దుర్గంధంతో నిండిఉన్నది.ఆలయంలో పూజావిధులు లేక పాడుబడివున్నది, పాండురంగని ఆలయం చూసి చాలా కలత చెందాడు.దత్త జయంతి రోజున, పుణ్య తిధుల రోజులలో అక్కడికి వచ్చిన భక్తులు సరైన వసతులు లేక రుక్మిణి ఆలయం వెనుక ఉన్న కాలి నడక దారిలో వచ్చి తొట్టిలో కూచుని కృష్ణా పాయనిదాటి వచ్చి శ్రీపాద స్వామిని దర్శించుకోడం గమనించాడు.ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తృత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కులకర్ణి కుటుంబాన్ని తలుచుకొని బాధవేసింది.ఆప్రదేశాన్ని పంచదేవపహాడ్ అని పిలుస్తారని తెలుసుకున్నాడు, కాలచక్రం అతని కళ్ళముందు వేగంగా తిరిగింది.

ఆయనకు ఒక సాధువు దత్తస్వామి భక్తుడు ఒకరు తన అనుచరులతో భక్తుల సౌకర్యార్థం ఆ ఆలయం వద్ద మెట్లు కట్టించి వారు తొట్టిల్లో ఆవలి వడ్డుకు చేరడానికి అనుకూలం కల్పించాలి అని  సంకల్పిచారు.స్థానికుల సహకారంతో ఆ జిల్లా అధికార యత్రాంగంతో సంప్రదించి ఆ ఆలయప్రాంగణాన్ని శుభ్రపరచి భక్తులద్వారా వచ్చిన విరాళాలు సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడం నాగనాథునికి సంతోషం కలిగించింది.మరియు శ్రీపీఠికాపురం సంస్థానం వారు ఈ ఆలయ ప్రగనంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.ఈ ప్రక్రియ వెనుక ఒక బెంగాలీ సాధువు   యొక్క పట్టుదల శ్రమ ఉందని తెలిసి నాగనాథుడు సంతోషించాడు.కానీ నిధుల కొరత వల్ల ప్రతినిత్యం రుక్మిణీ పాండురంగని ఆలయం లో దీపారాధన కార్యక్రమం నిర్వహించడానికి సాధ్యపడలేదు.ఐతే పరిస్థితులు మెల్లగా మార్పులురావడం నాగనాథునికి సంతోషాన్ని ఇచ్చింది. స్వామి వారు తపస్సు చేసిన ప్రదేశంలోను, రుక్మిణీ ఆలయంలోను ధ్యానం చేసుకుంటూ సమయం గడపడం చేసాడు.

శ్రీవాసుదేవనంద సరస్వతి (శ్రీ టెంబే స్వామి)  ఏవిధంగా అయితే ధ్యానంలో శ్రీపాదస్వామి జన్మస్థానాన్ని కనుగొన్నారో అదేవిధంగా స్వామివారి తపస్సుచేసుకున్న స్థలం వెతుకుతూ పాండురంగని ఆలయానికి రావడం, అది క్రీస్తు శకం 1238వ సంవత్సరంలోనే నిర్మింపబడటం, అక్కడ బసచేసి స్వామివారు ధ్యానం లో శ్రీపాద స్వామి తపస్థానం, దర్బార్ ప్రదేశం, కురువపురం  కనుగొన్నారు అన్న విషయం నాగనాథుని మనోగతానికి అర్థం అయింది.
మిగిలిన విషయాలు తరువాయి భాగంలో.

14 September 2017

The Indigos

A small English story about Indigos by Adithi. Click here to listen

Swaminarayana Telugu Audio chapters 22, 23  & 24 are available now. Please click here.


12 September 2017

You opinion matters

Since we started audio version of the stories recently, we want to know your valuable feed back on audio stories.

Please answer the poll question on the right side ---->>>>>>^^^^^^^^

5 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 14

దేవదత్తుని వృత్తాంతం - 14


ఇలా ఆ స్వామి వారి నుండి. కబురు రాగానే సుమతి తల్లిదండ్రులు వారి కుమార్తె ని తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది. అప్పటికే రాత్రి 9:30 కావస్తున్నది. అక్కడ చాలా మంది భక్తులు  ఏవో భజనలు పాడుకుంటున్నారు. కొంత మంది ఉన్మాద స్థితి లో ఉండి ఎంతో పరవశంతో రకరకాల హావభావాలతో నాట్యం చేస్తున్నట్టుగా ఊగిపోతున్నారు మరియు పాటలు పాడుతున్నారు. ఎంతో కొంత కవిత్వం తెలిసిన వారు ఆ స్వామి వారి మీద  ఎన్నో పాటలు కట్టి మహిమలు పొగుడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ  పాడుతున్నారు . ఆ స్వామి వారి మీద ఆఖరికి అష్టోత్తర శత నామావలి చదివి ఆయనకి హారతి ఇచ్చారు. చాలా మంది భక్తులు ఆ హారతి పళ్ళెంలో చాలా డబ్బులు వేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టిపినీలు సమర్పించుకున్నాక అందరూ వెళ్లిపోయారు. ఈ తతంగం అయిపోయే సరికి 10:30 అయింది. స్వామి వారు అందర్నీ పంపించివేసి సుమతి తల్లిదండ్రులను బయటికి పంపించివేశారు. మీ కుమార్తె కు వచ్చిన భయం ఏమీ లేదు నా రక్షణలో ఉంటుంది. మీరు సుఖంగా మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పగా వారు అలాగే స్వామి అని బదులిచ్చి  నిష్క్రమించారు. కానీ ఇంటికి వెళ్ళాక రాదమ్మ గారు రహస్యంగా ఆ స్వామి వారు బస చేసిన ప్రదేశం దగ్గరకి వచ్చింది.


ఈ లోపల వల్లభదాసు అనుచరులందరు కూడా నిశ్శబ్దంగా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నారు. నిద్ర నటిస్తున్నారు. చాలా మంది సిఐడి పోలీసు శాఖ వారు మారువేశాల్లో జనం మధ్యలో తిరుగుతూ, అందరిని గమనిస్తూ, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వారికి వచ్చిన ఆదేశాల విధంగా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది మహిళ పోలీసులు భజనలు చేస్తున్న వారిలో కలిసిపోయి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా సుమతి ఉన్న గదిలోనే ఉండటం జరిగింది. ఆ గదిని ఆనుకొని ఉన్న గదిలో ఇంకొక మహిళా పోలీస్ మామూలు సాదాసీదా దుస్తుల్లో ఉండి అన్ని గమనిస్తుంది. అక్కడ ఒక స్త్రీ రహస్యంగా వచ్చి ఎవరు లేరనే ధీమాతో పాలలో పొట్లం లోని మందు కలపటం, ఆ కలిపిన మందు సుమతికి ఇవ్వబోతుందని గ్రహించిన ఆ మహిళ పొలీస్ నిశ్శబ్దంగా ఆ స్త్రీని వెనక నుంచి పట్టుకొని, నోరు నొక్కి ఆమె కాళ్ళు చేతులు కట్టి మామూలు పాలగ్లాసుని తీసుకొని సుమతి ఉన్న గదిలోకి వెళ్లి రహస్యంగా ఏం భయపడకు సుమతి నేను ఉన్నాను నీకు రక్షణగా అని చెప్పటంతో  ముందే పథకం అంతా తెలిసిన సుమతి నిబ్బరంగా ఉండిపోయింది. ఆ గది మొత్తం పోలిసు వారు మారు వేశాల్లో ఉండి అంతా గమనిస్తుండగా ఈ లోగా స్వామి వారు సుమతి ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఒళ్ళంతా సుగంధ పరిమళాలు చల్లుకుని వచ్చి అతను వచ్చి రాగానే అమ్మాయి నీకు ఏం భయం లేదు నేను సాక్షాత్తు అవదూత స్వామిని కాబట్టి నీ వ్యాధిని నయం చేస్తాను నన్ను మాత్రం నువ్వు సేవించుకో అని సమీపంగా రాసాగాడు. అతని నోటినుంచి గంజాయి వాసన రావటంతో సుమతి తల తిప్పుకున్నది. మనసులో ఆమె శ్రీపాద శ్రీ వల్లభుల స్మరణ చేస్తోంది. ఎప్పుడైతే ఆ స్వామివారు ఎవరు లేరనే ధీమాతో వచ్చి ఇక్కడ నువ్వు ఎంత అల్లరి చేసినా ఎవరు నీ సహాయానికి రారు కాబట్టి మర్యాదగా నేను చెప్పిన మాట విను  అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో ఆ గదిలో లైటు వెలిగి ఆ స్వామి వారికి అర్థం అయ్యే లోపలే పోలీసు వారు అతన్ని చుట్టు ముట్టి బందించివేశారు. అంతకుముందే వారు వచ్చి తమకు కావాల్సిన సాక్షాలన్నీ సేకరించారు. వారి అనుచరులని ముందే గుర్తు పట్టి బందించివేసి, వారిని ప్రశ్నించసాగారు.  ఇంతైనా కూడా ఆ స్వామివారి మత్తు ఇంకా దిగలేదు. సుమతి బయట ఉన్న తన తల్లిని కౌగిలించుకుని ఆ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని స్మరించకుంటూ ఉన్నది.


ఈ విషయం తెలిసిన ప్రజలంతా, భక్తజనులంతా రావటం అక్కడ చేరిన ప్రజలందరికీ కూడా స్వామివారి అనుచరులు ఒక్కో క్కలు  స్వామివారి రహస్యాలు బయట పెట్టటం జరిగిపోయినాయి. సాయిబాబా భక్తునిగా చెప్పుకున్న ఆ జగతాప్ గారు చడీ చప్పుడు లేకుండా మాయమైపోయినాడు. ఆశ్రయం ఇచ్చినటువంటి శ్రీ  రంగారావుని విచారించగా  ఆయన ఏమీ తెలియని అమాయకుడని ఈ రంగబాబు రంగదాసు అనే ముఖ్య అనుచరుడు స్వామివారి కి లేనిపోని మహిమలు ఆపాదించటం వల్ల అతను తన ఇంటిని ఆ స్వామి వారి బస కింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడని  తెలిసింది. ఈ కపట అవదూత గారిని సోదా చేసినప్పుడు పది లక్షల పైన రొక్కం, కొన్ని .కిలోల బంగారం, వెండి పోలీసు వారు పట్టుకున్నారు. చాలా గొడవ అయినాక స్వామి వారికి కర్ణాటక దేశంలో కూడా పెద్ద పెద్ద ఆస్థులున్నాయని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని ఎన్నో రకాల అక్రమాలు చేశాడని తెలియటంతో అతనికి పడవలసిన కారాగార శిక్ష పడింది. పోలీసు వారు ప్రజాలనందర్ని ఉద్దేశించి ఇటువంటి కపట అవదూతలని, స్వాములని మీరు నమ్మవద్దు అని, పరి పరి విధాల వల్లభదాసు గారిని ఎంతో మెచ్చుకొని ఆయన అక్కన్నించి వెళ్లిపోయారు. అక్కడ ప్రజలందరూ కూడా  వల్లభదాసు గారిని చుట్టుముట్టి ఎంతో మెచ్చుకొన్నారు. సుమతి తల్లిదండ్రులు కూడా అభినందించారు.


అయితే వల్లభదాసు నిర్లిప్తంగా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఇచ్చిన ప్రేరణ తొనే ఈ పనులు చేయగలిగానని తాను నిమిత్తమాత్రుణ్ణి అని ఏమి జరగనట్టుగానే ఆయన మాట్లాడారు. శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పుడు ఇటువంటి మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకూడదని సాక్షాత్తూ శ్రీ సాయి సచ్చరిత్ర లో కూడా నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడలు ఎందుకని సాయి చెప్పినట్టు మరియు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం అనేక ఘట్టాలని ఆయన వివరిస్తూ అవదూత అనే పదానికి నిర్వచనం అంతా పోయిందని అవదూత అంటే పెంట కుప్పలపై బీడీ చుట్ట సిగరెట్లు ఏరుకొని మురుగు కాలువలో నీళ్లు తాగుతూ బండ బూతులు తిడుతూ జుట్టంతా చింపిరిగా ఉండి చినిగిపోయిన బట్టలతో స్నానం లేకుండా ఉండేవాడు తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు అని ఈ కలియుగంలో అవదూతలకి నిర్వచనం ఇవ్వబడింది కానీ నిజానికిశ్రీ దత్త పురాణంలో సరె దత్త స్వామి వారునేను అవదూతను అని చెప్పుకోవడం జరగలేదు. అవదూత అంటే కేవలము శ్రీ దత్త స్వాముల వారే తప్ప ఇంకా ఎవరు కాదని, కేవలం దత్త స్వామి ఆశీర్వాదంతో  శ్రీ పాద శ్రీ వల్లభుల ఆశీర్వాదంతో మాత్రమే అనన్య భక్తి భావంతో ఉన్న వ్యక్తికి వెంకయ్య స్వామిగా అవదూత తత్వంతో ఉంటావని చెప్పటం తప్పితే , శ్రీ స్వామివారిని మించిన అవదూత రెండోవాడు లేడని, మీరు ఎప్పుడూ మూలాన్నే పట్టుకొని ఉండాలని మాయలు,మర్మాలు, గోసాయి చిటికెలు చేసేవారి దగ్గరికి కనీసం వెళ్ళను కూడా వెళ్లకూడదని , ఎంతో వినయంగా నమ్రతగా అక్కడికి వచ్చిన జనాన్ని అందర్నీ సంబోదిస్తూ చాలా చక్కగా చెప్పటం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరు కూడా వల్లభదాసుకి, శ్రీ పాద శ్రీ వల్లభులకి జయ జయ ధ్వనులు పలుకుతూ తాము చేసిన తప్పుకి లెంపలు వేసుకొని, ఇంటికి వెళ్లి ఆ కపట అవదూత ఛాయా చిత్రాలసు అవతల పారవేసి కేవలం ముందు ఇక దత్తస్వామి అవతారాలు మాత్రమే పట్టుకుంటామని ఎంతో భక్తి భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి శ్రీ వల్లభ దాసు చేసిన మంచి పనికి ఎంతో సంతోషించారు. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నేను దత్త భక్తున్ని, అవదూతని అని చెప్పుకునేవారు దరిదాపుల్లో రాలేదు. అంతేకాదు చాలామంది దత్త భక్తులుగా, శ్రీ పాద భక్తులుగా మారిపోవటం జరిగింది.

దేవదత్తుని వృత్తాంతం - 13

దేవదత్తుని వృత్తాంతం - 13



ఇదంతా చూస్తున్న నాగనాథునికి ఈ కొత్త శిరిడి సాయి బాబా భక్తుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.  వెంటనే అతను ఆయన్ను ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని సంకల్పించ గానే ఆయనకు మనోనేత్రము ముందు చాలా స్పష్టంగా ఆయనను గురించిన విషయాలు  తెలిశాయి. అతని పేరు జగతాప్ అని భారత ప్రభుత్వం లో ఆర్మిలో కొంతకాలం పని చేసి రిటైర్ అయ్యారని పరమ శిరిడి బాబా భక్తుడని, ఆయనకు సాక్షాత్తు శిరిడీ సాయి బాబా సంస్థానం లో రాచ మర్యాదలతో అసలు సమాధి అంటే ప్రస్తుత సమాధి కింద ఉన్న మరొక సమాధి ఉంటుంది. అదే సాయి బాబా గారి అసలు సమాధి. ఆయనను అక్కడి దాకా ప్రవేశం నిరాటంకం గా ఉంటుంది అని తెలిసింది. అతను శిరిడీ కి ఎప్పుడు వెళ్లినా శ్రీ సాయిబాబాకు పెట్టిన పదార్థాలన్నింటిని ఆయనకు మరియు అతని అనుచరులకు వడ్డిస్తారని తెలిసింది. ఆయన చేతిలో అద్భుతమైన వ్యాధి నివారణ శక్తి ఉందని ప్రచారం జరిగింది. అనేకమంది ధనవంతులతో అతనికి పరిచయాలు ఉన్నాయని తెలిసింది. అయితే ఎవరైనా అతన్ని  వారి గ్రామాలకు, పట్టణాలకు గాని పిలిపించుకోవాలంటే ఆయన విమానంలో రాను పోను ప్రయాణ ఖర్చులు భరించాలి. ఖరీదైన హోటల్లో ఆయనకు బస.  24 గంటలు ఆయన ఉన్నంత వరకు కారు కేటాయించబడాలి అని ఆయనకి తెలుస్తూ ఉన్నాయి.  మరి ఆయన మహారాష్ట్ర వాసి అని గ్రహించారు. మరునాడు పెద్ద గుడారాలు వేయటం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి రుసుము స్వీకరించబడలేదు కానీ మన ఆచారం ప్రకారం అక్కడకి వచ్చిన  రోగులందరు ఎంతో కొంత దక్షిణ, కొన్ని పలహారాలు ఇవి సమర్పించటానికి వచ్చారు. అంతక్రితం రోజు దత్త యజ్ఞం చేసిన ఒక వ్యక్తికి మెడ బాగం దగ్గర ఎముకలు అరిగి బాధ పడుతున్నాడని ముందుగా ఆయన్ని రమ్మని చెప్పి విభూతి తీసుకొని ఆయన నుదిటిపై పెట్టి ఆయన మెడ అంత రాస్తూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు ఆయనతో చెప్పించసాగారు.



ప్రతి రెండు నిమిషాలకు మీకు తగ్గిందా మీకు తగ్గిందా తగ్గిపోయిందా అని  అనటంతో అంతకుముందే చాలా పెద్ద మొత్తంలో దక్షిణ సమర్పించటంతో చాలా మోహమాటనికి తగ్గింది అని చెప్పటం నాగనాథునికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క శ్రీమతి భర్త చెప్పింది నమ్మింది. ఆమె కూడా తనకి కింది భాగంలో చాలా బాధగా ఉందని చెప్పటంతో ఆయన ఒక్క క్షణం కూడా సందేహించకుండా వేల మంది చూస్తుండగా తన చేతిని ఆమె చీర లోపలి భాగం నుంచి పైకి వెళ్లి ఆమె తొడలను స్పర్శిస్థూ  ఆమె నడుము నొక్కుతూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు చెప్తూ విభూతి రాస్తూ మీకు తగ్గిందా తగ్గిందా అని అనడంతో ఆమె నిర్గాంతపోయింది. అంతమంది జనం ముందు ఈ విధంగా సాహస కృత్యం చేస్తాడని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆమె గాబరా పడిపోయి తగ్గలేదు అంటే ఆ చేయిని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తాడో అని తగ్గింది తగ్గింది చెప్పటం, అతను మెల్లగా చేయి తీసేయటం జరిగే సరికి అక్కడ వల్లభదాసుకి, అతని అనుచరులకి భాద కలిగింది, కోపం కూడా వచ్చింది. ఇంకా అతన్ని లోతుగా పరిశీలిస్తే నాగనాథునికి అతను శిరిడి సాయిబాబా పరమ భక్తుడైన శివనేషన్ స్వామి ఒక తమిళుడు . శిరిడీ లో ఉన్న ఊరు స్థానం ఎదురుగా మెట్లదారికింద ఉన్న చిన్న గదిలో ఉంటూ బాబా గారిని గురించి కొన్ని ఏళ్లు ధ్యానము చేస్తున్న మహాత్ముడు. ఆయన పరమపదించాక శిరిడిలొనే ఒక చోట సమాధి చేసి అక్కడే ఒక ఆశ్రమం ఏర్పరచటం జరిగింది. అక్కడ శిరిడ సాయి బాబా తెలుగు చరిత్రను అనువదించి, ఎన్నో దత్త యజ్ఞాలు చేసిన  సాధకుడు దత్త యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఆ బ్రాహ్మణుని భార్యతో ఇదే విదంగా ప్రవర్తించడం తో ఆమె సిగ్గుతో చితికిపోయింది.



ఇలా జగతాప్ గారు చేసిన చికిత్స లో చాలా మందికి  గుణం కనిపించలేదని , ఒక వేళ గుణం కనిపించకపోతే మీ ప్రారబ్ద కర్మ బలంగా ఉందని సాకుతో తప్పించుకొనేవాడు. ఇవన్నీ నాగనాథుని మనో నేత్రం ముందు ఒక చలన చిత్రం లాగా కన్పించసాగాయి. ఒకవేళ చిన్న చితక వ్యాధులు తగ్గే అవకాశం ఉన్న ఇదంతా ఆ జరిగిన అద్బుతాలని జగతాప్ గారికి ఆపాదించటం, బాబాని స్మరించకపోవటం చూసి కూడా ఆయన కొంతగా బాధ పడ్డాడు. ఈ ప్రారబ్ద కర్మ సిద్ధాంతం జనాలు ఎంతగా అపార్థం చేసుకుంటున్నారు. పండితులు కూడా విపరీతమైనటువంటి అసంబద్దమైనటువంటి  తర్కానికి అందనంతగా దత్త బోధనలకు వ్యతిరేకంగా పలు భాష్యాలు చెప్పటం కూడా ఆయనకు కించిత్తు భాద కలిగించింది. జనులు ముఖ్యంగా పండితులు పామరులు  కూడా ఎంతో అజ్ఞానంలో ఉన్నారు. సాక్షాత్తు దత్తుని నమ్ముకున్నవారు కూడా ఇటువంటి మధ్యవర్తుల ఛాయా చిత్రాలను పూజ మందిరంలో పెట్టుకోవటం వాళ్ళను ప్రార్థించటం, గది నిండా ఇటువంటి సాధువులు ఉండటం మధ్యలో శ్రీ పాద స్వామి మరియు దత్తాత్రేయుల వారి పటం ఉండటం చూసి ఆయన జనం ఎంతగా దత్తాత్రేయ తత్వానికి దూరంగా ఉన్నారా అని కూడా అనుకున్నారు. వల్లభ దాసు కూడా తన అనుచరులను ఆయన దగ్గరికి పంపటం, వారందరు వచ్చి జరుగుతున్న మోసాన్ని చెప్పటం ఈయన గ్రహించారు. అదే సమయంలో ఎంతో మంది మహిళలు వచ్చి జరుగుతున్న తతంగాన్ని ఫోటోల రూపంలో చిత్రీకరించడం అది ప్రతివాళ్ళు కూడా ఏదో మాములు విషయాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు.



ఈలోగా ఆ స్వామి వారు సుమతి తండ్రికి కబురు చేసి ఏమయ్యా ఐదు రోజులు అయిపోయింది మరి ఎప్పుడు పంపిస్తావు వ్యాధి ముదిరితే కష్టం కదా అని చెప్పటంతో స్వామి నేను ఈ రాత్రి తీసుకొస్తాను అని చెప్పటం జరిగింది. సుమతి తండ్రి ఇంటికి వచ్చి రాధమ్మకి, సుమతికి కూడా చెప్పి స్వామి వారు రాత్రి తీసుకురమ్మన్నారు కాబట్టి మనం వెళ్దాం తప్పకుండా మన సుమతికి తెలియనటువంటి అంతులేని వ్యాధి తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉందని పదే పదే చెప్పటం జరిగింది. అయితే రాధమ్మకి సుమతికి కూడా చాలా దైర్యం కలిగింది. శ్రీపాద స్వామి తమని తప్పకుండా కాపాడతాడానే ఒక గట్టి విశ్వాసం వారికి కలిగింది. ఆ ధైర్యంతోనే వారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వారి నివాస స్థానానికి వెళ్ళటం జరిగింది .

దేవదత్తుని వృత్తాంతం - 12

దేవదత్తుని వృత్తాంతం - 12

స్వామి వారు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి అందరికి ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. ఆయన తాగుతున్నటువంటి చుట్ట, సిగరెట్, బీడీ నుంచి వచ్చినటువంటి అమూల్యమైన నుసిని ప్రజలంతా భక్తి, శ్రద్దలతో పోగు చేసుకుంటున్నారు. దానికి తోడు అక్కడ ఉన్న ఒక ముఖ్య అనుచరుడు ఒక దారపు పోగు చేతికి కనక కంకణంగా కట్టుకుంటే ఎన్నో జబ్బులు పోతాయని, లక్ష్మీ కటాక్షం లబిస్తుందని చెప్పటంతో అక్కడ కూడా జనం విపరీతంగా గుమి గూడారు.  ఒక్కొక్క పసుపు పచ్చ దారపు కంకణానికి 50 రూపాయలు వసూలు చేయడం , సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, దరిద్రంలో ఉన్నవారికి డబ్బు వస్తుందని చెప్పటంతో అక్కడ కూడా ఎంతో ఒత్తిడి జరిగింది. అక్కడ భక్తుల ఇళ్ళలో శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి వారి ఛాయా చిత్రాలు ఉండేవి. వాటి పక్కనే ఈ కొత్తగా   వచ్చిన స్వామి వారి పెద్ద ఫొటోలు ల్యామినేట్ చేయబడి ఒక్కొక్కటి రెండు వందల రూపాయల చొప్పున విక్రయింపబడుతున్నాయి. అవి కూడా శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి ఫోటోల కంటే నాలుగు రెట్లు పెద్ద సైజులో ఉండటం , పెద్ద పోస్టర్ కు వేయి రూపాయల ధనం వసూలు చేయటం జరిగింది. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి పరి పరి విధాల ఆలోచనలు వస్తున్నాయి. మరి ఈ కలియుగంలో కలి కూడా అంత దుర్మార్గుడిగా ఉండడు కదా. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వల్లభ దాసు ఏం చేస్తాడు అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వేలమంది అక్కడ భోజనాలు చేసి ఆరోజు రాత్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి శిరిడి సాయి బాబా గారి పరమ భక్తుడు వేంచేస్తున్నాడని అతను కూడా ఎటువంటి వ్యాధులనైనా క్షణంలో తీసివేస్తాడాని ప్రచారం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్లు ఉదయం 8 గంటల నుంచి సమావేశం కావాలని చెప్పటం జరిగింది. దీంతో వల్లభదాసుకి వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు అని నిశ్చయం దృఢం కాసాగింది. సరే అది కూడా ఏం జరుగుతుందో చూద్దామని తన సహచరులతో ఇంటికి  వెళ్ళటం జరిగింది.

3 September 2017

చేదు నిజాలు: Episode 6

చేదు నిజాలు
episode-6

రాజీవ్ దీక్షిత్  - మన్మోహన్ సింగ్ తో భేటీ 

      నాకు ఒకసారి  పూర్వ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో మూడు గంటలు చర్చలు జరిపే అవకాశం దొరికింది. మహారాష్ట్ర లోని సేవక్ రాం అనే ఒక చిన్న గ్రామంలో గాంధీ గారు నిర్మించిన ఒక చిన్న ఆశ్రమంలో నేను ఉంటూండగా మన్మోహన్ సింగ్ అక్కడకి వచ్చారు. ఆయన అక్కడకి ఎందుకు వచ్చారంటే సేవక్ రాం గ్రామం పక్కన ఉండేటువంటి వ్యవసాయం చేసుకునే రైతులు 56,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక మూడు గంటలు అక్కడ ఆగినప్పుడు నేను ఆయనని కలవడం జరిగింది. అప్పుడు అక్కడ జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఆయన తలక్రిందులైపోయినారు. నేను ఆయనని మొట్టమొదటిసారిగా ఒక ప్రశ్న అడిగాను. మీరు ఎంతో ప్రముఖమైన ఆర్ధిక శాస్త్రవేత్త కదా!విదేశీయులు కూడా మిమ్మల్ని గొప్ప ఆర్థికవేత్త అని ఎంతో పొగుడుతూ ఉంటారు. కానీ నాకు అర్ధంకాని విషయం మీరు డాలర్ ధరని పెంచారు మరియు రూపాయి విలువను తగ్గించారు. మీరు ఆర్ధికమంత్రి అయ్యాక ఒక్కరోజులోనే  చాలా శాతం రూపాయి యొక్క విలువని తగ్గించి, అమెరికన్ డాలర్ విలువని పెంచారు. మరికొద్ది రోజులకే మళ్ళీ చాలా శాతం రూపాయి విలువను మీరు తగ్గించి డాలర్ విలువను పెంచారు కదా!మీరు ప్రధానమంత్రి అయ్యాక కూడా ఇదే విధానం కొనసాగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? తన స్వంత దేశం యొక్క ద్రవ్యపు విలువను తగ్గించుకుంటూ డాలర్ విలువను పెంచడం భావ్యం కాదు కదా!ఇదెలా సాధ్యం?      


       ఈవిధంగా మీరు చేసినందువల్ల మన దేశానికి చాలా నష్టం జరుగుతోంది కదా?అని నేను ప్రశ్నించగా, ఆయన నన్ను తిరిగి బదులు ప్రశ్నించారు "ఏవిధంగా నష్టం జరిగింది అని"? నేను ఆయనతో రెండు విషయాలు చెప్పాను,మళ్ళీ అవే విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నాను. మొదటి ఉదాహరణ మన్మోహన్ సింగ్ గారు ఆర్ధికమంత్రిగా  పనిచేసిన రోజుల్లో భారతదేశం అమెరికాకి లోహాన్ని ఒక కిలో 7 రూ/- చొప్పున అమ్ముతూండేది. మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రూపాయి రేటుని తగ్గించడం వల్ల కిలో లోహం విలువ 15 పైసలకు పడిపోయింది. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో సామాన్య భారతీయిడిని అడిగినా వాడు చెప్పగలుగుతాడు. అంటే ప్రతీ ఒక్క  కిలో ఇనుప ఖనిజానికి మనకి 6.85 రూ/- నష్టం వచ్చింది. మొత్తంగా 13 వేల కోట్ల రూపాయల నష్టం ఈయన చేసిన తప్పిదం వలన మనకు కలిగింది. ఈవిధంగా 15 ఏళ్ళకి కనుక లెక్క కడితే మనకు కలిగిన నష్టం భారీ మొత్తంలోనే ఉంటుంది కదా? ఇంత భారీ మొత్తంలో వచ్చిన నష్టం కనుక  నివారించగలిగితే మనం ఆ డబ్బుతో పంజాబ్ లోని ప్రతీ గ్రామానికి బంగారంతో రహదారులు నిర్మించుకోగలం. మరి ఎందుకు ఈవిధంగా మీరు చేశారు అని నేను ఆయనని ప్రశ్నించినపుడు ఆయన ఈవిధంగా బదులు చెప్పారు. "ఏమిచెయ్యాలి? భారతదేశం అమెరికా, IMF, వరల్డ్ బ్యాంకు మరియు ఇంకా అనేక విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకుంది. అమెరికా వారి షరతుల ప్రకారం రూపాయి ధరని తగ్గించవలసివచ్చింది అని."  మరలా నేను ఆయనని ఈవిధంగా ప్రశ్నించాను "అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళ షరతుల ప్రకారం మీరు రూపాయి విలువను తగ్గించారు. దాని వలన మన దేశానికి ఎంతో నష్టం జరిగింది. 

      మరి మీరు దేశభక్తుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏది చెయ్యమంటే అది చేస్తే, దేశానికి నష్టం కలిగితే, అది మీ దేశ భక్తి ఎలా అవుతుంది? వాళ్ళు రూపాయి విలువని తగ్గించమని షరతు పెట్టినప్పుడు  నేను తగ్గించను అని మీరు ఖచ్చితంగా చెబితే మీరు నిజమైన దేశభక్తులు అయ్యుండేవారు. వాళ్ళు ఎదో చెబుతున్నారు మీరు వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు. నేను మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను. పంజాబ్ లో మనం మంచి నాణ్యత గల  చక్కెర  కిలో 20/- కి అమ్ముతుంటాం. ఇదే చక్కెరని మనం అమెరికాకు ఒక కిలో 50 పైసల చొప్పున ఎగుమతి చేస్తున్నాం. అలాగే పంజాబ్ లో బాస్మతి బియ్యం బాగా పండిస్తారు. ఈ బియ్యం ధర మన దేశంలో కిలో 86/- ఉంది. మరి ఇదే బాస్మతి బియ్యాన్ని కిలో 1/- కే మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అంటే డాలర్ రేట్ తో పోలిస్తే ఎంత నష్టం వస్తోందో చూడండి! అలాగే 60 నుండి 70 రూపాయలు  ధర ఉన్న మినపప్పుని మనం కిలో 2/- చొప్పున ఎగుమతి చేస్తున్నాం. ఈవిధంగా మీరు ఏ వస్తువుని చూసినా  కూడా అమెరికాకు ఎగుమతి చేస్తున్నప్పుడు మన దేశానికి తీవ్ర నష్టం వస్తోంది. భారతీయులు ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారు, అదే అమెరికన్లకు అయితే మనం చాలా  తక్కువ ధరకే  అమ్ముతున్నాం. మంచి నాణ్యత గల జీడిపప్పు, ద్రాక్ష ఇంకా అనేక రకమైన ఉత్పాదనలను అమెరికాకు 45 రెట్లు తక్కువ ధరకి అమ్ముతూంటాం. మీరు దేశానికి ప్రధాని మరియు గొప్ప ఆర్థికవేత్త అయ్యుండి దేశానికి తీవ్ర నష్టం కలిగే ఈ విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారు? ఇంతకీ మీరు భారతదేశానికి ప్రధానియా? లేక అమెరికాకు ప్రధానియా? అని నేను చాలా ధైర్యంగానే ఆయన్ను ప్రశ్నించాను. దానికి మన్మోహన్ సింగ్ గారికి కొంచెం కోపం వచ్చింది కానీ ఆయన మేము ఏమీ చెయ్యలేమనే సమాధానాన్నే మళ్ళీ చెప్పారు. అందరి దగ్గరా అప్పులు తీసుకున్నాం కాబట్టి వాళ్లు చెప్పినట్టే నేను చేయాల్సివచ్చింది అని చెప్పారు. భారతదేశంలో పండే పంటలన్నీ భారతీయులకి అందని ధరలలో ఉన్నాయి వాళ్ళు కొనుక్కోవడానికి ఎంతో సతమతమవుతున్నారు. మరి అవే  పంటలు మరియు ధాన్యాలని మీరు దాదాపు ఉచితంగానే అమెరికాకు సరఫరా చేస్తున్నారు. ఇదేవిధంగా మనం వజ్రాలు, బంగారం మొదలైన ఆభరణాలని కూడా అమెరికాకు ఎగుమతి చేస్తూంటాం. మొత్తం  ఎగుమతి యొక్క విలువ 50 లక్షల కోట్లు అని అనుకుంటే దాని యొక్క అసలైన ధర అంతర్జాతీయ మార్కెట్లో 25 వేల లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.ఎందుకు ఈవిధంగా చేయవలసివస్తోంది? దానికి ఒకే ఒక్క కారణం డాలర్ రేట్ ను పెంచి రూపాయి ధరను తగ్గించడం. 

     ఇందుమూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.నేను అడిగే ప్రశ్నల పరంపరకి,మరియు చెబుతున్నలెక్కల వివరాలు అన్నీ విన్నాకా ప్రధానికి ఏమి చెప్పాలో అర్ధంకాక నిరుత్తరుడైపోయాడు. వెంటనే ఆయన రాజీవ్ దీక్షిత్ గారూ,"మీరు పార్లమెంట్ కు వచ్చి నా కుర్చీలో కూర్చున్నట్లయితే నేను చేసినట్టుగానే మీరూ చెయ్యక తప్పదు"అని నాతో చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే నేను ఆ ప్రధాని పదవిని అసలు కోరుకోను. దేశానికి ఇంత నష్టం వాటిల్లే పనులు నేను చెయ్యలేను. నిజానికి మీరు ప్రజలకి వాస్తవాలను ఎందుకు చెప్పటంలేదు? ఎందుకు ప్రజలందరినీ మభ్యపెడుతూ ఇంత అఘాతంలోకి తోసివేస్తున్నారు? మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు   ప్రజలందరికీ globalization, liberization అని పెద్దపెద్ద మాటలు చెప్తారు. కానీ మీరు చేస్తున్నది మాత్రం americanization. సరే ఇటువంటి విషయాలు సామాన్యమైనటువంటి ప్రజలకు ఎలాగూ తెలియదు, నాయకులూ ఏమీ చెప్పరు. కానీ నాలాగ కాస్త చదువుకున్నవాడు, కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఏమి చేస్తున్నారంటే ఎంతసేపూ ఆ టీవీ లో వచ్చేటటువంటి కార్యక్రమాలు చూడటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, ఇతరత్రా వినోద కాలక్షేపాలు చేస్తున్నారే తప్ప అసలు మన భారతదేశం ఎక్కడికి వెళ్తోంది, ఏమవుతోంది అని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. నాలాంటి యువకులకి నేనెప్పుడూ సలహా ఇస్తుంటాను, మీరు నాలాగా గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలని చైతన్యవంతం చెయ్యండి అని. కావున మీరు చేస్తున్నది ప్రపంచీకరణ(globalization) కాదు, బానిసత్వాన్ని వ్యాప్తి చెయ్యడం మాత్రమే. 


                     ఈవిధంగా ప్రపంచ బ్యాంకులు, మరియు అమెరికా లాంటి దేశాలు ఒక చేత్తో అప్పు ఇచ్చి మరొక  చేతులతో ఆ దేశాల యొక్క జాతీయ సంపదను అంతా దోచుకుంటున్నాయి. భారతదేశం మాత్రమే కాదు ఇథియోపియా, సోమాలియా లాంటి ఎన్నో దేశాలు ఇలా దోచుకోబడుతున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం చాలా గొప్పగా ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతీసుకున్నామని ప్రజలకి  చెబుతారు. అడుక్కుతెచ్చుకుంటున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గు, అభిమానం కొంచమైనా లేదు మన నాయకులకి. దీనినే పత్రికల వాళ్ళు మరియి టీవీ వాళ్ళు చాలా పాసిటివ్ గా చూపిస్తుంటారు. కావున మన నాయకులు దేశానికి నష్టం కలిగించే ఇటువంటి పనులని మానుకుంటే మన దేశం త్వరలోనే సంపన్న దేశంగా ఎదగగలదు. ప్రియమైన పాఠకులారా మీరు ఇప్పటికైనా మేల్కొనండి. ఈ చేదు నిజాలను తోటి భారతీయులతో పంచుకోండి. కనీసం మీరు చెప్పిన పదిమందిలో ఒక్కరు మారినా కూడా దాని ప్రభావం ఎంతో మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం.  

1 September 2017

చేదు నిజాలు: Episode 5

చేదు నిజాలు
Episode5


నేను ఒకసారి కాన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ భారతీయ స్వాభిమాన్ సభకి వెళ్లడం జరిగింది. కాన్పూర్ స్టేషన్ లో దిగి ప్లాటుఫారం క్రాసింగ్ వంతెన దాటి వస్తున్నప్పుడు ఆ ప్రక్కనే ఒక చిన్న టీ దుకాణం ఉంది, అక్కడ ఒక తల్లి మరియు ఆమె పిల్లలు కొడుకు, కూతురు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న అమ్మాయి తల్లిని, అమ్మా!"మనమెందుకు పేదవాళ్లుగా ఉన్నాము?" అని ప్రశ్నించడం విని నేను ఒక్క క్షణం ఆగిపోయాను. ఇలా ఈ ప్రశ్న అడుగుతున్న ఆ పాప, ఆ కుటుంబం సామాన్యులు కారు అని నాకు ఎందుకో అనిపించింది. సరే! వెళ్లి కనుక్కుందాం వారిగురించి అనే కుతూహలంతో నేను వెళ్ళాను. మీరు ఎవరు? ఏం చేస్తున్నారిక్కడ? అని అడగ్గా వాళ్ళు చెప్పిన సమాధానం విన్నాక నేను దిగ్భ్రాంతి చెందాను. మేమంతా తాంతియాతోపే పరివారం వాళ్ళం అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసం కొనసాగించడానికి కొంత సమయం పట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, గొంతు గద్గదమైపోయింది. మన భారతదేశంలో తాంతియాతోపే వంటి దేశభక్తుని యొక్క పరివారం ఆఖరికి టీ దుకాణం పెట్టుకుని బ్రతకవలసివస్తోంది. తాంతియాతోపే కి విరుద్ధంగా పనిచేసినటువంటి దేశద్రోహులకి ఈ భారతదేశంలో సింహాసనాలు దక్కాయి, రాజభోగాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ వ్యక్తులైతే తాంతియాతోపేను  వెన్నుపోటు  పొడిచి, విద్రోహచర్యలు గావించి అతనిని హత్య చేశారో  ఆ విద్రోహులలో ఇద్దరు  భారతదేశంలో  ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. మీకు తెలుసా ఈ నిజాలు? ఏ దేశ ద్రోహులైతే తాంతియాతోపే యొక్క రహస్య స్థావరాన్ని ఆంగ్లేయులకు తెలిపారో అటువంటి వంశస్థులు ఈ భారతదేశంలో చాలా ఉన్నత పదవులలో ఉన్నారు. ఏ దేశ ద్రోహులైతే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి దేశ భక్తురాలిని, ధైర్యవంతురాలిని కుట్ర పన్ని చంపించారో వారు ఈ దేశంలో ఉన్నత పదవులని  అలంకరించారు. ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన  దేశ భక్తుడైన తాంతియాతోపే యొక్క పరివారం మాత్రం టీ దుకాణం పెట్టుకొని చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.ఇటువంటిది మన భారతదేశం. ఇటువంటి దుర్మార్గాలని మనం ఎందుకు సహించాలి?సహించవలసిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఎంతోమంది దేశ భక్తులు భారతదేశం ఈ విధంగా తయారవుతుందని వారెప్పుడూ అనుకోలేదు. వారి యొక్క కల్పన వేరేవిధంగా ఉండేది.తాంతియాతోపే, ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, చంద్రశేఖర్ లాంటి దేశ భక్తులు కలలో కూడా భారతదేశం స్వాతంత్య్రం తరవాత ఇలాగ ఉంటుందని బహుశా ఉహించి ఉండనే ఉండరు. వారు ఎంత దేశ భక్తులో చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనని నేను మీకు వివరిస్తాను. చంద్రశేఖర్ చాలా  బీద కుటుంబంలో పుట్టాడు వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. అతడు 13 ఏళ్ల వయసులోనే ఇంట్లోంచి పారిపోయి బెనారస్ చేరాడు. అక్కడ విప్లవకారుల సంఘంలో అతడు చేరిపోయాడు. అక్కడే విప్లవకారులతో పాటు కాకోరికాన్డ్ లో వారు ఖజానాని కొల్లగొట్టడం జరిగింది. దాని వాల్ల  వారికి  కొంత డబ్బులు సమకూరాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తల్లితండ్రులు అతనికి ఒక ఉత్తరం రాశారు.  "నీ దగ్గర ఉన్న డబ్బులలో కొంత మాకు ఇస్తే మా దారిద్య్రం కొంత తీరుతుంది కదా!" అని దాని సారాంశం.  అప్పుడు చంద్రశేఖర్ స్వయంగా తన తల్లితండ్రులను కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అతడు తల్లితండ్రులతో ఈవిధంగా అన్నాడు "నా దగ్గర ఉన్న డబ్బుని నేను మీకు ఇవ్వలేను అది దేశానికి సంబంధించినది. అయితే ఒక విషయం! నా దగ్గర ఒక రివాల్వర్ ఉంది దానిలో రెండు బుల్లెట్లు ఉన్నాయి అది మాత్రం నేను మీకు ఇవ్వగలను అని చెప్పాడు." ఇటువంటి దేశ భక్తులకి జన్మ ఇచ్చినటువంటిది భారతదేశం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?మనం ఇంకొక రకమైన యుద్ధం చేయవలసి ఉంటుంది. ఒక యుద్ధాన్ని ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, తాంతియాతోపే మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు చేశారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక యుద్ధాన్ని చేయక తప్పదు. మేము భారతీయ స్వాభిమాన్ రక్షించే ఉద్యమంగా ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం.

30 August 2017


దత్తాత్రేయ  తత్త్వం - విశ్లేషణ  -- Dattatreya Tatvma on Lakshmi Kataaksham Story (Telugu) published here: Click here


New Telugu story  వడ్ల గింజలు ( Grains of Rice) audio file is published here: Click here

29 August 2017

Vinayaka Chavithi Importance in Telugu

Please listen to Telugu version of Greetings and importance of Vinayaka Chaviti by Sairam Garu here:
Click here to play.


28 August 2017


Swaminarayana Telugu Audio chapters 19, 20  & 21 are available now. Please click here.



23 August 2017


Happy Ganesh  Chaturdhi and Sripada Sreevallabha Jayanthi to readers.


Importance of Ganesh Chaturdhi - message from Sairam Garu:  Click here to listen.

11 August 2017

Telugu Audio Stories

తెలుగు పాఠకులకు శుభవార్త!

        ఇక నుండి మన ఈ వెబ్సైటులో తెలుగు ఆడియో కధలు ప్రచురించబడును. శ్రీ సాయిరామ్ గారి  స్వరంలో ఈ కధలు చెప్పబడును. మీరు ఈ కధలను Audio సెక్షన్ లో డౌన్లోడ్ చేసుకుని వినవచ్చును. ఈ మా కొత్త ప్రయోగాన్ని అందరూ ఆహ్వానిస్తారు అని భావిస్తున్నాం. ఈ కధలను విని మీ విలువైన అభిప్రాయాలని మాకు email ( srnanduri50@gmail.com ) చేస్తారు అని ఆశిస్తున్నాము.   

ఈ వారము కధ లక్ష్మీ కటాక్షము. ఈ కధని audio  సెక్షన్ లో వినవచ్చును. ఇక్కడ క్లిక్ చెయ్యండి 
 

ఇట్లు ,
Admin


Good news for visitors,

From now onwards we are going to post stories in audio format instead of text format. Most of the audios will be in Sri Sairam garu's voice. We hope you guys enjoy these. Please send your feedback to srnanduri50@gmail.com.

This week's story is Grace Of Goddess Lakshmi. You can listen to audio by clicking here.

Thanks,
Admin

10 August 2017

ఉపనిషత్తులు-12:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం,

         ఉపనిషత్తులు-12
 ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

         సమిష్ఠి ఆకాశం యొక్క ఉత్తరార్థ భాగంలో ఉన్న సత్వగుణం నుండి ఏ శక్తి కూడా ఉద్భవించ లేదు. దీనికి కారణం ఏమిటంటే మనలో ఉన్న బ్రహ్మచైతన్యానికి అణువైన ప్రదేశం ఒకటి ఉండాలి కాబట్టి ఖాళీగా ఉన్న ఆకాశం యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగంలో ఈ బ్రహ్మచైతన్యం స్థావరం ఏర్పరచుకుని అక్కడ ఉంటుంది. ఇది  క్షేత్రజ్ఞుని స్థానం గా కూడా పేర్కొనబడింది. ఇదేవిధంగా వాయువు యొక్క సత్వగుణ సమిష్ఠి ఉత్తరార్థ భాగం నుండి మనస్సు పుట్టింది. దేఇ అధిదేవత చంద్రుడు. ఎప్పుడూ సంశయించడమే దీని లక్షణం. అస్థిరంగా ఉండడం. అలాగే అగ్ని యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి బుద్ధి పుట్టింది. దీనికి బృహస్పతి అధిదేవత. దీని పని ఏమిటంటే నిశ్చయం లేక నిర్ణయం చేయడం. ఇదేవిధంగా జలం యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి చిత్తం పుట్టింది. దీనికి బుధుడు అధిదేవత.  దీని యొక్క స్వభావం చంచలత్వం. ఇదేవిధంగా భూమి యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి అహంకారం  పుట్టింది. దీనికి జీవుడు అధిదేవత. దీని లక్షణం ఏమిటంటే కటుత్వస్వభావం  నేనే చేసాను, అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన. అంటే మనం ఇక్కడ సూక్ష్మ భూతముల యొక్క సత్వగుణ ఉత్తరార్థం నుండి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎలా ఉద్భవించాయో తెలుసుకున్నాం. 


      ఉత్తరార్థ ఆకాశంలో మాత్రమే ఏమీ లేదు. దాని కారణం అది బ్రహ్మచైతన్యానికి వీలుగా ఉన్న ప్రదేశం అని కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగు గుణాలని కలిపి అంతఃకరణం అని పిలుస్తూ ఉంటాం. అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ నాలుగు గుణాలు అన్నమాట. ఇప్పుడు పంచ భూతాల అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం మరియూ భూమి మొదలైన వాటి  సత్వగుణం యొక్క పూర్వార్థ మరియూ ఉత్తరార్థ భాగాలు ఈ రెండూ కూడా మనం ఖర్చు చేసాం. దీనితో సత్వగుణం అయిపొయింది. ఇంక మనం పంచ భూతాలలోని రజోగుణ, తమోగుణాలని పరిశీలిద్దాం. సత్వగుణం లాగానే ఈ రాజోగునాన్ని కూడా మనం రెండు భాగాలుగా విభజిద్దాం. అంటే సూక్ష్మ భూతంలోని ఆకాశంలో ఉన్న రజో గుణాన్ని పూర్వార్థం,ఉత్తరార్థ భాగాలుగా అదేవిధంగా అగ్ని,వాయువు,జలం,భూమి మొదలైన వాటిలో ఉన్న రజో గుణాన్ని కూడా పూర్వార్థ,ఉత్తరార్థ భాగాలుగా విభజిద్దాం. అంటే పంచ భూతముల యొక్క రజోగుణ సమిష్ఠి పూర్వార్థ ఆకాశం నుండి వాక్కు  అనే శక్తి ఉద్భవించింది. దీని యొక్క అధిదేవత అగ్ని. దీని స్వభావం మాట్లాడడం. అలాగే సూక్ష్మ భూతముల యొక్క సమిష్ఠి వాయువు యొక్క పూర్వార్థ భాగం నుండి పాణి అనే శక్తి ఉద్భవించింది. పాణి అంటే చేతులతో మనం చేసే పనులకి కావలసినంత శక్తి అన్న మాట. ఇది చేతులు అనబడే అవయవానికి సంబంధించిన శక్తి. దీనికి అధి దేవత ఇంద్రుడు. ఇక్కడ పాణి అంటే మనం చేతులతో చేసే వ్యవహారాలని గుర్తించాలి. అగ్ని యొక్క రజోగుణ సమిష్ఠి పూర్వార్థ భాగం నుండి పాద అనే శక్తి ఉద్భవించింది. పాద అంటే కాళ్ళకి నడవగలిగే శక్తి అన్న మాట దీనికి అధిదేవత ఉపేంద్రుడు. అంటే మన పాదాలకి నడవడానికి కావలసిన శక్తి అని అర్థం. అలాగే సమిష్ఠి జలము యొక్క రజోగుణ పూర్వార్థ భాగం నుండి వాయువు అనే శక్తి ఉద్భవించింది. దీని పని ఏమిటంటే విసర్జన క్రియ అన్నమాట. ఈ విసర్జన క్రియకి కావాల్సిన శక్తి  ఇచ్చిన అధిదేవత గుజు. అలాగే సమిష్ఠి భూమి యొక్క రజోగుణ పూర్వార్థ భాగం నుండి ఉపస్థ అనే శక్తి ఉద్భవించింది. అంటే ఇది జనేద్రియాలకి సంబంధించిన శక్తి అన్నమాట. ఈ శక్తికి అధిదేవత ప్రజాపతి. దీని యొక్క లక్షణం ఆనందం అన్నమాట. 


        ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే పంచభూతాల రజో గుణ పూర్వార్థ భాగం నుండి వరుసగా ఆకాశం నుంచి భూమి వరకు చెప్పుకుంటే వాక్కు, పాణి, పాద, వాయు , ఉపస్థ అనే శక్తులు పుట్టాయి. ఇవన్నీ కూడా క్రియలకి సంబంధించినవి కనుక రజోగుణ పూర్వార్థ భాగం నుండి ఉద్భవించాయి. వీటిని మనం కన్వేంద్రియ శక్తులుగా చెప్పుకుంటాం. ఈ విధంగా సమిష్ఠి పంచభూతాల యొక్క రజోగుణ పూర్వార్థ భాగాలన్నీ కూడా మనం ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు రజోగుణ ఉత్తరార్థ భాగం నుంచి ఏ శక్తులు పుట్టాయి తెలుసుకుందాం. సూక్ష్మభూతముల యొక్క సమిష్ఠి ఆకాశపు రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ప్రాణము అనే శక్తి ఉద్భవించింది. ఇది హృదయస్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి విశిష్టుడు. ఇది ఉచ్చ్వాస నిశ్వాస పనులను నడిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ప్రాణశక్తి, ప్రాణ వాయువుగానే భావించాలి. సూక్ష్మభూతం యొక్క సమిష్ఠి వాయువు యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి అపాన శక్తి ఉద్భవించింది. ఈ అపాన శక్తి స్థానంలో ఉంటుంది. ఇది విసర్జన క్రియకి తోడ్పడుతుంది. దీని యొక్క అధిదేవత విశ్వకర్తగా వ్యవహరించబడుతుంది. ఇదేవిధంగా సమిష్ఠి అగ్ని యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి జ్ఞాన అనే శక్తి ఉద్భవించింది. దీని యొక్క అధిదేవత విస్మయోని. ఈ జ్ఞాన శక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ జ్ఞాన శక్తి ప్రాణ, అపాన వాయువులని సంచరింప చేస్తూ ఉంటుంది. సమిష్ఠి జలం యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ఉదానం అన బడే శక్తి  ఉద్భవించింది. ఇది కం స్థానంలో ఉంటుంది. దీని అధిదేవత అజుడు. ముఖ్యంగా ఇది ఆహారాన్ని లోనికి తీసుకోవడం, జీర్ణింప చేసుకోవడం అనే లక్షణాలను కలిగి ఉంటుంది. 


      ఇంకా ఇది అనేక పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా సమిష్ఠి భూమి యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి సమాన అనే శక్తి ఉద్భవించింది. దీని స్థానం నాభి. దీనికి అధిదేవత జయుడు. ముఖ్యంగా ఇది శరీరంలోని అన్ని భాగాలలోకి ఆహారాన్ని పంపిణి చేస్తూ ఉంటుంది. అంటే ఈ పంచ ప్రాణులన్నీ కూడా రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ఉద్భవించాయన్నమాట. ఈ రజోగుణం నుంచి పనులు చేయాలి కదా ! అంటే activity ఉండాలి కదా ! వాటికి సంబంధించినటువంటి కర్మేంద్రియములు, ప్రాణాలు ఈ రజోగుణ భాగం నుండి పుట్టాయి. దీని అర్థం ఏమిటంటే రజోగుణం లోనే క్రియాశీలత ఉంది అన్నమాట. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే పంచభూతాల సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు, ఉత్తరార్థ భాగం నుండి అంతఃకరణలు వచ్చాయి. ఆకాశపు సత్వగుణ గున ఉత్తరార్థ భాగంలో ఏమీ లేదు అని చెప్పుకున్నాం. అలాగే సమిష్ఠి రజోగుణ పూర్వార్థ భాగం నుండి కర్మేంద్రియములు ఐదు   ఉత్తరార్థ భాగం నుండి ప్రాణములు ఐదు మొత్తం అన్నీ కలిపి 19 శక్తులు ఉద్భవించాయని తెలుసుకున్నాం. వీటినే తత్వములు అని కూడా అంటారు. వీటినే మనం సూక్ష్మతత్వాలుగా వ్యవహరించాల్సి వస్తుంది. వీటిని మనం సూక్ష్మ ఇంద్రియములుగా కూడా పేర్కొనవచ్చును. ఈ 19 శక్తులన్నింటినీ కలిపి భగవంతుడు ప్రాణమయ శరీరాన్ని తయారు చేయడం జరుగుతుంది.


గమనిక : ఇప్పటివరకు మనం ఉపనిషత్తులలో చెప్పుకున్న విషయాలన్నీ ఎంతో గాఢ౦గా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళడం అందరికీ మంచిది. ఎందుకంటే మనం సాధారణంగా పురాణాలు, పురాణాల్లో ఉన్న కథలే ఎక్కువగా వింటూ ఉంటాం కాని ఈ ఉపనిషత్తుల గురించి అంతగా వినలేదు కాబట్టి ఇందులోని విషయాలు గ్రహించడానికి కొంత  ధారణశక్తి చాలా అవసరం. ఇవి మనం నాలుగైదు సార్లు చదివి, మననం చేసుకుంటే కాని అర్థం కాదు. ఒక పట్టిక మాదిరిగా తయారు చేసుకుని చదివితే ఇదే విషయాన్ని మనం చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతాం. వచ్చే అధ్యాయంలో సృష్టి, సమిష్ఠి గురించి మనం చర్చిద్దాం. అంతవరకూ పాకులందరూ కూడా ఇదే విషయాన్ని పదేపదే చదివి మననం చేసుకోండి. వీలైతే ఇద్దరు సభ్యులు కనుక ఉంటే ఆ ఇద్దరూ ఈ విషయాలని చర్చ చేసుకుంటే చాలా తొందరగా, తేలిగ్గా అర్థమవుతుంది.
                                     ఓం దత్తాత్రేయాయ నమో నమః

Swaminarayana Telugu Audio chapters 16, 17 & 18 are available now. Please click here.



7 August 2017

ఉపనిషత్తులు-11:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

ఉపనిషత్తులు-11
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


                ముందుగా మీరు ఎలా ఊహించుకోవాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి వీటన్నింటినీ కూడా ఒక్కొక్క ముద్దగా మీరు మీముందు ఊహించుకొండి. బొమ్మ తెల్ల మట్టితో చేస్తే తెల్లగానూ, ఎర్రమట్టితో చేస్తే ఎర్రగానూ, నల్లమట్టితో చేస్తే నల్లగానూ ఉంటుంది కదా ! ఈ మూడు రంగుల మట్టితో బొమ్మను చేస్తే ఆ బొమ్మలో మరి ఈ మూడు రంగులు ఉండడం సహజం కదా ! అలాగే త్రిగుణాత్మ నుండి ఉద్భవించినటువంటి ఈ పంచభూతములలో ఈ త్రిగుణాలు వాసిస్తుంటాయి. అంటే దీని అర్థం ఏమిటీ? ఆకాశంలో సత్వగుణ ఆకాశం,రజోగుణ ఆకాశం, తమోగుణ ఆకాశం అలాగే సత్వగుణ వాయువు, రజోగుణ వాయువు, తమోగుణ వాయువు ఉంటాయి. ఇదేవిధంగా మిగతా మూడింటిలో అగ్ని,జలము మరియూ పృథ్విలో కూడా ఉంటాయి. ఇలా మీరు ఊహించుకోండి. ఈ విధంగా ఈ పంచభూతాలలో ఈ మూడుగుణాలు అంటే సత్వ, రజో, తమోగుణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం.

                   మీరు ఆకాశాన్ని సత్వగుణ ఆకాశం, రజోగుణ ఆకాశం, తమోగుణ ఆకాశం అని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన నాలుగు పంచభూతాల్ని కూడా ఇలాగే మూడు భాగాలుగానే విభజించుకోవాలి. వీటినుంచి సత్వగుణం ఎలా పుట్టిందో మనం పరిశీలిద్దాం. మనం ముందుగా సత్వగుణ ఆకాశం, సత్వగుణ వాయువు, సత్వగుణ భూమి, అగ్ని, జలం ఈ విధంగా కేవలం సత్వగుణాన్ని కలిగినటువంటి భాగాన్ని మాత్రమే పరిశీలిద్దాం. సత్వగుణ ఆకాశాన్ని, సత్వగుణ భూమిని మనం రెండు భాగాలుగా చేసుకుందాం. ఇదంతా కేవలం మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇలా భాగాలుగా విభజించుకుంటున్నాం కాని నిజానికి అవి ఇలా భాగాలుగా విభజించబడలేదు అని గుర్తుంచుకోండి. ఇలా రెండు భాగాలుగా విభజించబడిన వాటిలో మొదటి భాగాన్ని పూర్వార్థ భాగం, రెండవ భాగాన్ని ఉత్తరార్థ భాగం అని అంటారు. పంచ భూతాలలోని సత్వగుణం లోని పూర్వ భాగాన్ని మొదటి భాగంగా , ఉత్తర భాగాన్ని రెండవ భాగంగా ముందు ముందు మనం చెప్పుకుంటాం.
                ఇప్పుడు మనం సత్వగుణం యొక్క పూర్వార్థ భాగాన్నిఅంటే ఆకాశం, వాయువు, జలం, అగ్ని, భూమి  లోని సత్వగుణం  యొక్క పూర్వార్థం, మాత్రమే మనం పరిశీలిద్దాం. ఇలా సత్వగుణం యొక్క పూర్వార్థ భాగంలో  నుంచి ఒక్కొక్క శక్తి ఉద్భవించింది. అవి ఏమిటో మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇలా భాగాలుగా విభజించుకున్నఈ  ప్రక్రియని శాస్త్రాల్లో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. పంచభూతాల్లోని కేవల సత్వగుణం యొక్క పూర్వార్థ భాగాన్ని మనం విడివిడిగా దేనితో కలపకుండా పరిశీలిస్తున్నాం. ఈ ప్రక్రియని శాస్త్రాల్లో పంచీకరణ చేయకపోవడం అని అంటారు. పంచీకరణ అంటే ఐదు కదా ! ఈ ఐదింటినీ ఒకదానితో ఒకటి కొన్ని పాళాలలో కలిపినప్పుడు పంచీకరణ చేసాం అని చెప్తాం. ఇక్కడ అలా చేయలేదు కాబట్టి ఈ ప్రక్రియని పంచీకరణ చేయకపోవడం అని చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు అర్థం కావడానికి ఈవిధంగా చెప్పాల్సివస్తుంది. వీటిని ఏ పాళల్లో కలపలేదు కాబట్టి ఇవి అపంచీకరణ  సూక్ష్మభూత రూపాలు. ఇవి శాస్త్రోక్తపరంగా ఎలా చెప్పుకోవాలంటే అపంచీభూతమైన, సూక్ష్మభూతమైన సమిష్ఠి ఆకాశం అని చెప్పుకొనవచ్చును. ఇక్కడ సమిష్ఠి అంటే మొత్తం ఆకాశం అని అర్థం. మొట్టమొదట ఆకాశం ఏర్పడిందని మనం చెప్పుకున్నాం కదా !
               అపంచీభూతమైన, సూక్ష్మభూతమైన సమిష్ఠి ఆకాశం యొక్క సత్వగుణం లోని పూర్వార్థ భాగం నుండి ఈ శ్రవణశక్తి పుట్టిందన్నమాట. ఉదాహారణకి మనకి చెవులు ఉన్నాయి. ఆ చెవులకి వినబడే శక్తి ఉన్నప్పుడే కదా అవి పని చేస్తున్నాయి అని  మనం చెప్పుకుంటాం. ఈ విధంగా శ్రవణ శక్తి పుట్టింది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఈ శ్రవణ శక్తికి అధిదేవత దిక్కులు. ఈవిధంగానే మిగతా సూక్ష్మభూతాలనుండి వివిధశక్తులు ఉద్భవించాయి. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠివాయువు యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి స్పర్శ అనే శక్తి ఉద్భవించింది. దీనియొక్క అధిదేవత స్పర్శనుడు  అని చెప్పుకుంటారు. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠి అగ్ని యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి చక్షుశక్తి పుట్టింది. చక్షు శక్తి అంటే చూడగలిగే శక్తి. దీని అధిదేవత సూర్యుడు. అదేవిధంగా సమిష్ఠి జలం యొక్క  సత్వగుణ పూర్వార్థ భాగం నుండి రస శక్తి అంటే రుచి చూడగలిగే శక్తి ఉద్భవించింది. దీనికి అధిదేవత వరుణుడు. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠి భూమి యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి గ్రహణ శక్తి అంటే వాసన చూడగలిగే శక్తి ఉద్భవించింది. దీనికి అధి దేవత అశ్వినీదేవతలు. ఈ విధంగా సూక్ష్మభూతాలనుండి పుట్టిన వివిధశక్తులు, వాటి అధిదేవతల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ శక్తులనే శాస్త్రపరంగా జ్ఞానేంద్రియాలు అని అంటారు.
ఉదాహరణకి ఒక మనిషికి కన్నులు ఉన్నాయి. కేవలం కన్నులు ఉండడంతో సరిపోదు. ఆ కళ్ళకి చక్షు శక్తి ఉన్నప్పుడే అవి చూడగలుగుతాయి. గుడ్డివాడికి కూడా కళ్ళు ఉంటాయి కాని ఏం ప్రయోజనం ఆ కళ్ళకి చూడగలిగే శక్తి లేనప్పుడు? ఆ వ్యక్తి ఆ కళ్ళతో దేన్నీ కూడా చూడలేదు. అదేవిధంగా చెవిటి వాడు చెవులున్నా వినలేడు. అంటే దీని అర్థం ఏమిటీ? మనం చెప్పుకున్న అన్నీ జ్ఞానేంద్రియ శక్తులు ఈ అవయవ వికారాలు అని చెప్పడం కాదు. అవి ఉన్నప్పటికీ, వాటిలో ఏ శక్తి ప్రాప్తించనప్పుడు అవి ఉండి కూడా పని చేయవు. అందుకని మనం ఈ అవయవాల గురించి మాట్లాడడం లేదు. వాటికి గల శక్తి గురించి ప్రస్తుతం మనం చర్చిస్తున్నాం. అలాగ లోపల ఉన్న ఈ శక్తులు శాస్త్రాల్లో ఇంద్రియాలుగా చెప్పబడ్డాయి. కాని సాధారణంగా ఇంద్రియాలు అనగానే మనం అవయవాలని అనుకుంటాం. కాని అది సరి కాదు. ఈ అవయవాల లోపల ఉన్న శక్తులని మాత్రమే మనం ఇంద్రియాలుగా భావించాలి. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రక్రియ మూలంగా సూక్ష్మభూతంలోని మొదటి భాగమైనట్టి అంటే పూర్వార్థ భాగమైన సత్వగుణం అంతా ఖర్చయిపోయింది. ఏమీ మిగల లేదు. అంటే ఆకాశం, అగ్ని, వాయువు, జలం, అగ్ని మొదలైన పంచభూతాల్లో పూర్వార్థ భాగం లో ఉన్న సత్వగుణం అంతా మనం ఖర్చు చేసాం. ఇప్పుడు మనం ఉత్తరార్థ భాగం గురించి చర్చిద్దాం.
(.............contd ..............)

21 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 11_b

దేవదత్తుని వృత్తాంతం - 11_b
వల్లభదాసు పథకం,

 జిల్లా కలెక్టర్ గారు జవాబుగా ఇచ్చిన ఉత్తరంతో వల్లభదాసుకు దత్త ప్రభువు సహాయంతో సమస్య తొలగుతుంది అని నమ్మకం కుదిరి స్వామి వారి పూజలో నిమగ్నం అయ్యాడు. అదే సమయంలో సుమతి అనన్య భక్తితో శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించి అహర్నిషలు ధ్యానం చేస్తోంది. జిల్లా కలక్టర్ గారు అన్ని జిల్లాల యంత్రాంగానికి కపట సన్యాసి చిత్ర పటాలతోసహ హెచ్చరికలు పంపారు. దాంతో రాష్ట్రయంత్రాంగం అంతా కదలింది. అయితే ఈవిషయాలను అన్నింటిని రక్షణ ద్రుష్ట్యా గోప్యంగా ఉంచడం జరిగింది. వాల్లు కొన్ని రహస్య వ్యూహాలు చేసి వాటికి అనుగుణంగా ఎంతో మంది ఈ చర్యల్లో పాల్గొనడానికి సాధారణ దుస్తుల్లో రావడం వంటి జాగ్రత్తలు కుడా తీసుకున్నారు.మరునాడు జరగబోయే దత్త యాగానికి వేలసంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు చాలా మంది ముందుగానే ధన విరాళాలు, వస్తు విరాళాలు,యాగసామాగ్రి విరాళాలు ఇచ్చారు.  అక్కడ ధనవంతులైన భక్తులకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 కుండీల యాగం ప్రారంభం అయ్యింది. దీన్ని వీక్షించేందుకు ఎంతో మంది దత్త మహా యజ్ఞంలో  పరిపక్వత సాధించినటువంటి  ఘనాపాటీలు కూడా కర్ణాకర్ణిగా స్వామివారి గురించి విని అక్కడకు విచ్చేయడం జరిగింది, అసలు విషయాలు వారికి కూడా తెలియదు. ఈ ఘనాపాటీలు అందరూ వయోవృద్దులు, వారిని ఎవరు ఆహ్వానించక పోయినప్పటికి దత్తస్వామిపైన వున్న భక్తితో వారే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. 





వయసు అనుభవము ఉన్న వృద్ధ బ్రాహ్మణులు అంతా అక్కడ జరిగే తంతు చూసి విస్తుపోయారు.అక్కడ ఎటువంటి మంత్రోచ్ఛటన లేదు, కాసేపు "దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర" అనే నామజపం, తరువాత ఆ సన్యాసి పేరుతో నామాజపం చేస్తూ అక్కడ వచ్చిన పేద, ధనిక అను భేదం లేకుండా అందరిచేత ఖరీదైన ఆవునెయ్యిని ఆహుతులుగా వెయిస్తున్నారు. భక్తి భావం లేకుండా హవనం పొడిని కూడా ఇష్టం వచ్చునట్టు యజ్ఞంలో చల్లడం చేస్తున్నారు.అక్కడ యజ్ఞ విధి అంతా విధి పూర్వకంగా కాకుండా, యాంత్రికంగా జరిగిపోతోంది. భక్తజనం కూడ క్రమశిక్షణ లేకుండా తోసుకోవడం వంటివి చేస్తున్నారు.


మన  సనాతన ధర్మంలో వేదాలకు, యాగాలు ఒక విశిష్టమైన స్తానం ఉన్నది.  దానిలో మంత్రశాస్త్రం ఒకభాగం, స్వయంగా దత్తస్వామి వారు వేదాలను ఎంతో గౌవరవించేవారు, గాయిత్రి యజ్ఞం విధిపూర్వకంగా చేస్తూవుండేవారు. ఎందుకంటే గాయత్రియందే సమస్త శాస్త్రం ఇమిడి ఉంది. శ్రీపాద చరితామృతంలో స్వామి స్వయంగా "అహర్నిశలు ఎవరతే నా నామజపం చేస్తారో వారికి స్వయంగా దర్శనం ఇస్తాను" అని చెప్పారు. కాని ఇక్కడ జరిగే ప్రక్రియ శాస్త్రవిరుద్ధంగా ఉన్నది. అక్కడ చేరిన బ్రహ్మణోత్తములు అంత నిర్ఘాంతపోయారు, దేశంలో జరిగే అన్ని యాగాలకు, హోమాలకు, తంతుకు విరుద్ధంగా ఇక్కడి ప్రక్రియలు జరుగుతున్నవి. కొన్ని లక్షలు ఖరీదు చేసే స్వఛ్చమయిన ఆవునెయ్యి ఇలా అగ్నిపాలు కావడం.చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేయడం చూసి బ్రాహ్మణులంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భక్తుల్లో కూడా కొందరుఆడా, మగ  తేడ తెలియని విధంగా  ఆధునిక దుస్తులు ధరించి పూజా విధానంలో పాల్గొని ఉండటం, శుచి శుభ్రం లేని పూజ విధానాలు వాళ్లకు భరించరాని విధంగా ఉన్నాయి. కానీ ఏమి అడ్డుచెప్తే ఏమిజరుగుతుందో అన్న భయం కూడా  వారిలో లేకపోలేదు.  గౌరవభంగం కాకూడదు అని బయటికి కూడా వెళ్ల లేక పోయారు, ఈ తతంగానికి వారు ప్రేక్షకపాత్ర పోషించ వలసి వచ్చింది.

బాగా అలంకరించి ఉన్న వేదికపై వెండి సింహాసనం మీద కూర్చుని ఆ సన్యాసి ఈ యాగాలనన్నింటిని గమనిస్తూ వున్నాడు.ఆయన చుట్టూ సపర్యలు చేస్తూ భక్తులు (ఎక్కువ భాగం స్త్రీలు) వున్నారు. కాసేపటికి ఆ సన్యాసి తన ఆంతరంగ గదిలోకి వెళ్లిపోయారు. కొంతమంది అధికమొత్తంలో దక్షిణ ఇచ్చిన వారతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.  ఆసన్యాసి తాగిన చుట్టల భస్మం తీసుకుంటే ఉబ్బసవ్యాధి లాంటి పోతాయి అని అతని అనుచరులు ప్రచారం చేయడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. దక్షిణ ఇచ్చిన భక్తులకు మాత్రమే ఆ స్వామి వారి తాగి విదిల్చిన చుట్టాలు, బీడీల, సిగిరెట్ల బూడిద పంచడం వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఇళ్లకు తీసుకు పోయే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తున్న వల్లభదాసుకు చాలా బాధతోపాటు ఆగ్రహం కలిగింది.
మిగిలినది తరువాయి భాగంలో..

Swaminarayana Telugu Audio chapters 13, 14 & 15 are available now. Please click here.




18 July 2017

దేవ దత్తుని వృత్తాంతం 11

దేవ దత్తుని వృత్తాంతం 11
వల్లభదాసు యొక్క కీర్తి 


నాగనాథుడు తన మనో నేత్రానికి కనిపిస్తున్నఈ వ్యవహారాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వున్నాడు.  వల్లభదాసు రాజమ్మగారు వెల్లిన తదుపరి, స్నానానంతరం పూజా మందిరంలో శ్రీపాదవల్లభుని ముందు ధ్యానం లో కూచున్నారు. సమస్యల పరిష్కారానికి దత్త ధ్యానం చేయడం వల్లభదాసుకు అలవాటు. ఆరోజు ధ్యానానంతరం  వల్లభదాసు ధైర్యంగా వుండడం చూసి అతని అనుచరులు సంతోపడ్డారు.అతను తన ఆంతరంగిక అనుచరులను పిలిచి కొన్ని ఆదేశాలను ఇచ్చి పంపడం జరింది. తరువాత మరికొందరికి ఏవో ఉత్తరాలు రాసి ఇచ్చి పంపివేసారు. తరువాత కమలమ్మగారికి ఏవో ఆదేశాలను ఇచ్చి రాజమ్మగారి దగ్గరకు పంపారు. 

రాజమ్మగారి కుమార్తె సుమతి చాల తెలివైన అమ్మాయి, లౌకికజ్ఞానం కలిగినది. శ్రీపాదుని పై అనన్య భక్తి కలిగినది  అయినందు వల్ల తనకు రాబోవు ప్రమాదము పసిగట్టి శ్రీపాదుని పరి పరి విదముల తనను కపాడమని వేడుకుంటోంది.తన తండ్రి, నాన్నమ్మగారు కపట సన్యసిని నమ్మడం ఆ అమ్మయికి ఎంతో అయిష్టతగా ఉంది.ఈ లోపు కమలమ్మగారి ద్వారా అందిన వల్లభదాసు ఆదేశాలను రాజమ్మ తన కుమార్తెకు  చేరవేసింది.  తరువాత తన భర్తను పిలిచి అతనికి  సుమతి గురిచి ఎదో చెప్పడంతో, ఆమె భర్త స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఏదో సర్ది చెప్పడంతో ఆ కపట సన్యసి సరే అంటూ నాలుగు రోజుల తరువత అమ్మయిని వెంటపెట్టుకురమ్మన్నారు.ఇదంత చూసి రాజమ్మ తన కుమార్తె రక్షింపబడటానికి నాలుగు రోజుల సమయం దొరికినందుకు సంతసించింది. ఈలోపు వల్లభదాసు శ్రీపాదుని అండతో ఎదో ఒకటి చేసి తన కుమార్తెను రక్షిస్తాడు అని విశ్వసించింది.సుమతి ఈ విషయం తెలిసి ఈ అయిదు రోజులు శ్రీపాదుని ధ్యానంలో ఏకభుక్తం చేస్తూ తన సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి మరి కొంత మంది జనులు ఆ స్వామీజీపై మూఢవిశ్వాసం కలవారు అవడం చేత స్వామీజీకి లేని మహిమలు ఆపాదించి తెలిసిన బందు,మిత్రులకు ప్రచారం చేస్తున్నారు.

ఆరోజు మధ్యహ్న సమయంలో స్వామివారు దత్త హోమం చేస్తారు దానిలో పాల్గొనదలచిన వారు హోమమునకు కావలసిన నెయ్యి, ద్రవ్యాలతో రావలసిందిగా చాటింపువేసారు.అన్నదానంలో పాల్గునేవారిద్వారా, హోమంలో పాల్గునేవారి ద్వారా ఎంతో వ్యాపారం చుట్టుప్రక్కల దుకాణాలలో జరిగింది.పెద్ద సంఖ్యలో ధనిక, పేదా అను తేడా లేకుండా భక్త జనం గుమి కూడారు, పందిల్లు వేయపడ్డాయి,  అన్నదాన సామాగ్రి సమకూడింది. ముందుగా ధనం చెల్లించిన దుకాణదారులు  దుకాణాలలోనే స్వామి అనుచరులు నిర్దేసించిన విదంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో స్వామివారి చిత్రపటాలు, స్వామి వారి అభిషేకతీర్థం లాంటివి వేల సంఖ్యలో మూఢభక్తులకు అమ్మసాగారు. ఎంతో మంది  స్వామివారి సన్నిహితులు అయిన విధ్యావంతులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రక్షకశాఖాధికారి స్వామి వారి  భక్తుడు అవటం చేత   రక్షకభటులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

వల్లభ దాసు రాసి ఇచ్చిన ఉత్తరాలు జిల్లా అధికారికి అందించారు వల్లభదాసు అనుచరులు. అది చదివి ఆ అధికారి తన యంత్రాంగానికి చేయవలసిన పనులను పురమాయించారు. ఎప్పటిలాగా ఈసారి కూడా శ్రీపాదుని లీలల మహత్యం వెల్లడి కాబోతున్నందులకు వల్లభదాసు, అతని అనుచరులు ఎంతో ఆనందంతోను ఆసక్తితోను ఎదురు చూస్తున్నారు.

8 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 10

దేవదత్తుని వృత్తాంతం - 10

వల్లభ దాసు యొక్క కీర్తి,

వల్లభదాసు కొద్ది మంది అనుచరులతో కలిసి తమని అవధూతగా చెప్పబడే సాధువు ఉన్న నివాసానికి చేరుకున్నాడు. ఆప్రాంతం అంతా అట్టహాసంగా, కోలహలంగా ఉన్నది. అక్కడ పందిరి వేసి ఉన్నది, దాని క్రింద ఆ కపట అవధూత అనుచరులు కూర్చొని అతని మహత్తున్ని పలురకాలుగా చెపుతూ వచ్చారు. ఆ సమయంలో ఆ స్వామి అభ్యంగన స్నానం చేస్తువున్నారు. ఆ స్వామి అభ్యంగన స్నానం చూడాలి అనుకున్నవారు 100 రూపాయలు చెెల్లించి స్వామి వారి దగ్గరకు వెళ్ళవచ్చు అని చెపుతున్నారు. ముందుగా స్త్రీలకు అవకాశం ఇచ్చారు. అక్కడి స్త్రీలందరు 100 రూపాయలు కట్టి స్వామివారు స్నానము చేస్తున్న గదిలోకి వెళ్ళ సాగారు.

స్వహస్తాలతో స్నానం చేయించాలి అనుకున్నవారు 500 రూపాయలు ఇచ్చి తమ చేతులతో స్వామికి భగవంతునికి  అభిషేకం చేసే భావంతో చేయవచ్చు అన్నారు. అలా చేసే వారికి కష్టాలు తొలగి, సిరి సంపదలు కలుగుతాయి అని ప్రచారం చేస్తున్నారు. జనం అంతా ఆ అవకాశం కోసం  500 రుసుము చెల్లించి ఆ కార్యక్రమంలో పల్గొనడం జరిగింది. ఎంతో మంది మహిళలు స్వామి వారి దగ్గరకు వెళ్లడం జరిగింది. పథకం ప్రకారం వల్లభదాసు తన సహచరులలో ఒకరి శ్రీమతిని ఆ కార్యక్రమం చూడటానికి పంపడం జరిగింది. ఆ గదిలో చాలా కోలాహలంగా ఉన్నది పురుషులెవ్వరికి ప్రవేశం లేదు. స్వామి వారు ధ్యాన స్థితిలో ఉన్నారు కేవలం గోచి గుడ్డను ధరించి జుట్టు జడలతో ధ్యాన స్థితిలో ఉన్నారు. ఖరీదైన అభ్యంగన సామగ్రి కొని స్త్రీలు లోన గుమిగూడారు, వారిలో కొందరు మహిళలు ఇది మహా భాగ్యం అని ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వల్లభదాసు అనుచరుని శ్రీమతి కమలమ్మ ముగ్గరు స్త్రీలను గమనించింది. వారు ముగ్గురు  పూనకం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు.వాళ్ళు మాకు ఉన్న కీళ్ల నొప్పుల జబ్బు ఎంత ఖర్చు చేసి వైద్యం చేసుకున్నాతగ్గనిది స్వామి వారి అభిషేకం లో పాల్గొనడం వల్ల ఈ మూడురోజుల్లో తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు.స్వామి వారు కూడా స్త్రీలు చుట్టూ చేరి మర్ధనలు చేస్తూ స్నానం చేయిస్తూ ఉంటే తన్మయత్వంతో ఆనందిస్తున్నారు. ఇదంతా చూస్తన్న కమలమ్మగారికి చాలా జుగుప్సా భావం కలిగింది. ఈ తతంగం చూస్తున్న కమలమ్మగారికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆమెకు  ఇంట్లో అత్త మామలైన పెద్దలను గౌరవించని, ప్రేమను పంచలేని  తనకు తెలిసిన మహిళలు కూడా స్వామి వారికి స్నానము చేయిస్తూ కనిపించారు. మధ్య మధ్యలో స్వామి వారు కళ్ళు తెరిచి ఆ ఆడవారిని కొడుతున్నాడు.

వారితో ఏవో పరాచకాలు ఆడుతూ వున్నాడు. ఇతనికి చేస్తున్న సేవ ఎందుకు అత్తమామలకు వీరు చేయలేక పోతున్నారు అని కమలమ్మ ఆలోచనలో పడ్డారు. ఇంక అక్కడ ఉండలేక వచ్చేస్తున్న ఆమెకు బయటి ఖాలీస్థలంలో నుంచి ఎదో వాగ్వివాదాలు  కిటికీ ద్వారా వినిపించాయి, ఆమె ఎవరి కంట పడకుండా అది ఏమిటి అని గమనించ సాగింది. మధ్య వయస్కుడైన ఒక స్వామి వారి అనుచరుడు ముగ్గురు మహిళలతో వాగ్వాదం చేస్తున్నారు. ఆ మహిళల్లో ఒక ఆవిడ ,"ఏమయ్యా రంగదాసు నువు చెప్పినట్లే మేము ఎంతో ప్రచారం చేసాము ఇప్పటికే నేను పదిమందిని స్వామి వైపు ఆకర్షితులను చేసాను, నా వాటా ఎందుకు ఇంకా ఇవ్వలేదు అన్నది, మిగిలిన మహిళలు లేని జబ్బులు చెప్పి స్వామి వారి అభిషేకం తో నయం అయ్యాయి అని చెప్తున్న మా మాటలకు ఎంతో మంది ఆకర్షితులు అవుతున్నారు మా వాటా ఇవ్వు అన్నారు. దానికి రంగదాసు "అమ్మ నా వాటా కూడా మూడువేల వరకు రాలేదు. అది వస్తే  కానీ నేను మీకు ఇవ్వలేను. ఈలోపు మీరు గొడవ చేస్తే ఎవరి కంట్లో అయిన పడితే మనకు దేహ శుద్ధి జరుగుతుంది. కాబట్టి దయ చేసి ఓపిక పట్టండి అని ప్రార్థించాడు." ఇది అంత గమనించిన కమలమ్మ మాట్లాడ కుండా మెల్లగా బయటకు వచ్చి వల్లభదాసు సహచరులను  సైగలతోబయటకు తీసుకు వచింది.ఇది అంత వల్లభదాసు గమనిస్తూనే వున్నారు.వల్లభదాసుకు కపట సన్యాసి విషయంలో ఉన్న అనుమానం నిజమని తేలింది. తదుపరి ప్రణాళిక ఏమిటా అని వల్లభదాసు ఆలోచనలో పడ్డారు. 


ఆరోజు సాయంత్రం వల్లభదాసు ఇంట్లో ఉండగా రాజమ్మ గారు వచ్చి " నాయనా ఎలాగైనా నువ్వే నా కూతుర్ని రక్షించాలి. మా ఇంట్లో ఎవరూ నామాట వినటం లేదు, నాకుతురికి  ఏవిధమైనటువంటి జబ్బు లేదు, కానీ మావారు, మా అత్తగారు అమాయకత్వంతో బయట వారి మటలు నమ్మి  ఈ స్వామి వారిని ఇంటికి పిలిపించి పాదపూజ చేసి 1116 సమర్పించారు. ఆ స్వామి వారి దృష్టి నా కుతురి మీద పడింది. అతను మా అత్తగారిని పిలిచి మీ మనవరాలిని చూసాను ఆమెకు మీకు తెలీకుండా ఒక రుగ్మత అనగా ఒక చెడు గాలి సోకింది. ఇది ఆమెకు కాని మీకు కాని తెలీకుండా అలా జరిగింది. మీరు ఆమెను కాపాడుకోండి అన్నాడు. దానికి మావాల్లు భయపడి మీరె ఏదో ఒకటి చేసి తనను కాపాడండి అన్నారు. దానికి అతను  రాత్రి సమయం 7 గంటల ప్రాతంలో మీ అమ్మాయిని నా దగ్గరకు తీసుకు రండి ఆమెకు నేను నయం చేస్తాను అన్నాడు. నాకెందుకో అతని ప్రవర్తన చూపులు నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. తల్లిగా నాకు తెలుసు నాకుతురు ఆరోగ్యవంతురాలు, అతడు ఏదో చెడు ఉద్దేశంతో అలా అన్నట్టు నాకు అనిపిస్తూన్నది. కాబట్తి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను రక్షించు నాయనా వల్లభదాసు అని బ్రతిమాలుకున్నది. 
 

మొదటి రోజు స్వామి వారి దగ్గరకు వెల్లినప్పుడు స్వామి  ఇచ్చిన పాలు త్రాగి నా కూతురు మత్తుగా కూచున్న దగ్గరే నిద్రలోకి జారుకున్నది. ఆమెను ఏకాంతంగా గదిలొ వంటరిగా వుంచమని ఆమెకు ఎవో ప్రక్రియలు చేయలి అని చెప్పడంతో నాకు భయం అనిపించింది. దాంతో సమయస్ఫూర్తితో నేను ఈ రోజు పంచాంగం చూసాను మంచి రోజు కాదు అని ఒప్పించి మావరితో చెప్పి మా అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చాను. 

ఆ స్వామి రేపు అమ్మాయిని తీసుకు రమ్మని చెప్పాడు. కాబట్టి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు నాయనా వల్లభదాసు అని ఆర్తితో ప్రదేయపడింది. ఇది అంతా విన్న వల్లభ దాసు అమ్మా మీరు నిశ్చింతగా వెల్లండి దత్తుని దయతో శ్రీపాదుని అనుగ్రహంతో ఏదో ఒకటి చేసి మీ అమ్మాయిని రక్షిస్తాను అని అభయం ఇచ్చి పంపాడు.ఈ విషయం గోప్యంగా వుంచమని కూడా హెచ్చరించాడు. తరువాయి భాగం వచ్చే అధ్యాయములో ..