Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

24 March 2017

Sripada New Age Energy - 1

Sripada New Age Energy - 1

After every 5,000 earth years, there will be great shift in North and South Poles. It means there will be a great change in the magnetic grid of the earth.  The time starts from the beginning of the Kaliyug, which started after the end of great battle of Maha Bharath and the exit of Lord Sri Krishna from the earth. Our astrologers and great scholars have calculated from that day and exactly 5,000 years have elapsed in the year 1987. For every 1,000 years there will be some minor changes in the earth’s magnetic grid and the Collective Human Consciousness. After the beginning of the Kaliyuga, slowly the negative forces have started gaining upper hand and after the passage of every 1,000 years they have gathered strength and finally at the end of 5,000 years it has reached its pinnacle. That is why the entire world has seen lot of bloodshed and the sadistic behavior of the world leaders and, the great change in the thinking of the people all over the world and particularly in India i.e, Bharat.

In 1987, the seeds were sown for the new age. As the Negative Forces were gaining  strength and influencing their ideology which did a great damage to the entire world, as they tried to force upon their ideology forcibly by all means on the other people of the world. There are two prominent religions which have done this in different ways. In this process the more docile and soft people all over the world and their countries were eliminated and their civilizations were digested by the cunning tigers eating away the goats. These tigers have digested the best part of the goat and completely digested and they had incorporated these things in their own ideology and started claiming that they were the founders of all such good aspects of the other spiritual world. After digesting the best parts of the goats they had thrown away the parts which were not important. That is how Tibet, which was the great believer of nonviolence and a very peaceful country was digested by the cunning tiger named as China. Unfortunately some of the people in the Tibet, who supported the so called communism of China worked against their motherland Tibet and helped China to invade Tibet, and these Chinese did not spare even these traitors.

The same thing is happening in India even now. The other religions have invaded other countries, in the disguise of sophisticated clothes, pretending as gentle people and slowly, they grabbed the other people of the world and completely conquered those peaceful people and the masters were turned as servants in course of time. This happened in India, Africa, America, Australia, New Zealand and rest of the world.

The new age means slowly, slowly the Collective Human Consciousness is turning to  Positive and opposing the dark forces. This is the transitional period which started from 1987 to another 25 years. During this period the people of the world would witness horrible things happening to the people all over the world.  On onside these sadistic people eliminate better part of the population of the world by using lethal and chemical weapons and some of the great countries they believe in amassing wealth by selling sophisticated ammunition and would enjoy when they hear their lethal weapons had brought a massive damage to the beautiful cities and civilizations of the world.

During this transitional period, not only the oppressive countries and their leaders but also nature would also show its wrath on the entire world in the form of famines, earthquakes, tsunami, and fire accidents. All the Pancha Bhutas will also cause untold damage to the entire world. In fact, this is not the folly of the nature, it is only because of the human beings who had disrupted the harmony among natural Five Elements were responsible for this devastation. This transitional period is only for 20 years by which slowly the world will recover from their wounds and slowly the peace would prevail and finally the harmony will be prevailing after 9 to 10 years. In order to accelerate this, the collective Human Consciousness has a greater role to suppress the dark forces and establish peace all over the world. The potentials are great, it all depends on the collective Human Consciousness, and they have to decide which way they would like to go. At present seeing the things, it would take some more years and by 2025 we will see a better part of the world having harmony and slowly the peace would prevail all over the world.

The Indigoes, the Rainbow and Crystals
The Indigoes, the Rainbow and Crystals children have arrived. These people are very compassionate and kind hearted and their consciousness is expanding beyond, crossing their own motherland and engrossing entire world. They are going to change the entire world and establish peace and harmony. The Indigo adults and children with higher consciousness ie., with higher intelligence are very sensitive, compassionate and would sacrifice their lives fighting the evil forces in the society. The Indigoes are quick to understand anything without much effort as they already have learnt all this knowledge in their past lives. The indigo s look like rebels, work like rebels and they sacrifice their lives only in order to pave a way for the Rainbow children whose consciousness is much greater than the Indigo s. Just like the Rainbow starting from one end and expanding to a greater extent in the sky and touching the other end displaying all its beautiful 7 colors. The Indigo s have much higher intelligence and are inclusive. It means their consciousness is expanding so much that they think that, the entire world is in them and they love people of the world as they love themselves. They are always outgoing and their consciousness is full of love, compassion, kindness etc. and they know the purpose of their life on this earth and what parts they need to play and they don’t hesitate to sacrifice their life in order to bring peace and harmony on this earth. This energy is called as New Age Energy. In this New Age Energy,  they discard all the old belief systems which had done much damage to people of the world dividing people into many different sects and sub sects causing distress among the people and encouraging them to kill their own people in the name of religion conditioned by various irrelevant rules and regulations.

(........to be continued...........)

22 March 2017

దేవదత్తుని వృత్తాంతం - 3

                    దేవదత్తుని వృత్తాంతం – మూడవ భాగం


             ఈ విధంగా దేవదత్తుడు, నాగనాథుడు కొంచెంసేపు ఆ ప్రాంగణమంతా కలియతిరుగుతూ అక్కడ ఉన్న ఔదుంబర వృక్షం క్రింద కూర్చున్నారు. దేవదత్తుని ముఖం చాలా గంభీరంగా ఉండిపోయింది. బహుశా ఆయనకి పాత స్మృతులన్నీ ఎన్నో ఆయన మనోవీధిలో తిరుగాడుతున్నట్టుగా నాగనాథుడు గమనించాడు. చివరకి ఆయన “నాగనాథా! నీలో ఎంతో ఆర్తి, ఆవేదన ఉంది. శ్రీ దత్తాత్రేయులవారి తత్వం గురించి చెప్పమని నీవు నను అడిగావు. నేను నీకు తప్పకుండా చెప్తాను. కాని ఆయన తత్వం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నీవు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి లోకపుతీరుని  గమనించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మానవనైజాలు, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతున్నది అన్నది నీవు ఒక సాక్షిగా గమనిస్తూ ఉండు. నీకు ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ముందు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకి ఇలా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు కలుగుతూ ఉండడం సహజమే. ఎవర్ని అడిగి ఈ సందేహాలు తీర్చుకోవాలో తెలియని అయోమయ  పరిస్థితి ఉంటుంది. కనుక నీ మనస్సుకి తోచినట్టుగా నీ అంతరాత్మ చెప్పిన విధంగా నీవు కొద్ది రోజులు పరిస్థితులను గమనించు. నీవు ఎంతో కొంత సాధన చేశావు కనుక నీ మనో నేత్రానికి నీవు చూస్తున్నదేమిటీ? అసలు వాస్తవమేమిటీ? అన్న విషయాలన్నీ కూడా, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా కనిపించే విధంగా నీకు నేను దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ మూడు కాలాలు ఏకకాలంలో సందర్శించడం అన్నది ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ. అది పై భూమికలో ఉన్నవారికే గోచరమవుతుంది, అర్థమవుతుంది. నీకు కలుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు వాటంతట అవే దొరికే విధంగా పరిస్థితులు వాటికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ కలవాలి అన్న విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా నీవు నడుచుకో” అని చెప్పి ఆయన ఎంతో ప్రేమగా నాగనాథుని శిరస్సు మీద తన దక్షిణ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి ఆ తర్వాత ఆయన అదృశ్యమై పోయారు.

          నాగనాథుడు ఎంతో కొంత సాధన చేసినవాడే కనుక ఎక్కువగా ఆశ్చర్య పడలేదు. అక్కడే కూర్చుని కొంచెం సేపు ధ్యానం చేసుకుని చుట్టుప్రక్కల పరిస్థితులని గమనించడానికి ఉద్యుక్తుడైనాడు. అయితే శ్రీ దేవదత్తుల వారి హస్త స్పర్శతో అతనికి ఏదో తెలియని ఒక అలౌకిక ఆనందం కలిగింది. నూతన ఉత్సాహం అతని అణువణువులో నిండి పోయింది. ఆకలిదప్పులు అనేవి ఆ క్షణం నుంచి మాయమైపోయినాయి. శరీరమంతా ఎంతో శక్తివంతంగా తయారయింది. ఆయనకి తాను ప్రాణమయ జగత్తులో అంటే మామూలు మనుష్యుల కన్నా పై భూమికలో ఉన్నట్టుగా గ్రహించాడు. ముందుగా శ్రీ పీఠికాపురాన్ని పరిశీలించడానికి అతను బయల్దేరాడు. అంతకు ముందు నాగనాథుడు ఒక ధ్యాన స్థితిలోను అందులో ఒక మహాత్ముని చేరువ ఉండడం, అటువంటి ఆధ్యాన స్థితిలో నుంచి వర్తమాన కాలంలోనికి అతను వీక్షించినప్పుడు తామసిక పరమైనటువంటి ఎన్నో భావస్పందనలు అతన్నితుడిచి  తాకాయి. నిశ్చలమైన నది లో ఒక రాయి వేసినప్పుడు ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, ఎంత అనిశ్చితంగా ఉంటుందో అలాంటి అనుభూతి అతని మనస్సుకి కలిగింది. ఆ ఊరంతా చాలా గందరగోలంగా ఉంది. రణగొణధ్వనులు, అరుపులు, కేకలు, ఊరంతా ఎంత అసహ్యంగా, అపరిశుభ్రంగా ఉందో, అంతకన్నా దారుణమైనటువంటి మనుష్యుల యొక్క మానవ ప్రకృతి అంత కన్నా ఎన్నో రెట్లు వికృతంగా అతని కళ్ళకి కనిపించింది. తీవ్రమైన పదజాలంతోటి వాదోపవాదాలు, పనికిరాని విషయాలు, రాగద్వేషాలు, కోపతాపాలు వీటితోటి ఆ  పిఠాపురం పైన ఉన్న గగనతలం అంతా కూడా ఈ భయంకరమైన స్పందనలతో వ్యాపించడం ఆయనకి స్పష్టంగా కనిపించింది. అలా ఆయన నడుస్తూ శ్రీ బాపనార్యులు గారి ధాన్యాగార౦ ఉన్నప్రదేశానికి  వచ్చినప్పుడు ఆయనకి శ్రీ దత్తాత్రేయులవారి పేరిట ఒక సంస్థ నెలకొల్పబడినట్టుగా గమనించారు. ఈ ప్రదేశాన్ని లోగడ ఆయన దేవదత్తునితో పాటు దర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంగణమంతా గోలగోలగా ఉంది. కార్యదర్శి కాబోలు అక్కడ ఒక కుర్చీపై ఆసీనుడై, ఏవో దక్షిణలు తీసుకుంటూ, రసీదులు ఇస్తున్నట్టుగా ఆయన చూశాడు. ఆక్కడి వాతావరణం కూడా అంత పరిశుద్ధంగా లేనట్టుగా ఆయనకి గోచరం అయ్యింది. అక్కడ దత్తాత్రేయుల వారి నామస్మరణ కాని, ఆ స్వామివారికి సంబంధించిన ఆధ్యాత్మిక గోష్టి కాని ఏమీ జరగడం లేదు. వాళ్ళలోవాళ్ళు వారి యొక్క  ఆర్ధిక పరిస్థితిని గురించి చింతిస్తున్నట్టుగా తెలిసింది. కొన్ని కొన్ని మంచి ప్రణాళికలు కూడా చేస్తున్నందుకు నాగనాథునికి సంతోషం కలిగింది. అక్కడ ఆయనకి వంగ దేశస్థుడైన ఒక సాధు పురుషుడు కనిపించాడు. ఆయనే ఆ సంస్థకి వ్యవస్థాపకుడని గమనించాడు. ప్రజల్లో ఎంతో కొంత ప్రేరణని శ్రీపాదుని పట్ల కలిగించాడు. అది విని నాగనాథునికి కొంత ఊరట కలిగింది. ఆయన మనోనేత్రానికి  భీమవరం అనే ఒక పట్టణం ద్రుగ్గోచరమయింది. అక్కడ ఒక సాధు పురుషుడు మావూళ్ళమ్మ గుడి ప్రక్కనుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు. ఆయన్ని చూడగానే నాగనాథునికి మల్లాది బాపనార్యులు గారి వంశానికి 33వ తరానికి చెందిన వ్యక్తి శ్రీ గోవింద దీక్షితులు గారు అని గ్రహించారు. ఆయనకి ఎదురుగుండా ఇంకొక వ్యక్తి వచ్చి శ్రీ దీక్షితులు గారిని దక్షిణ అడగడం, ఆయన మారుమాట్లాడకుండా జేబులోనుంచి కొంత పైకం ఇవ్వడం,  ఆయన దక్షిణ తీసుకున్నటువంటి వ్యక్తి దత్తస్వామి గా గుర్తించిన నాగనాథుడు వారిద్దరికి ఎంతో గౌరవంగా నమస్కరించుకున్నాడు. కించిత్తు ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. ఆ సాధుపురుషుడు ఏం తెలియకుండా తన దారిన తాను వెళ్ళడం జరిగింది. తర్వాత దీక్షితులు గారికి శ్రీ దత్త స్వాముల వారే ప్రత్యేకంగా గంధర్వపురం (గాణగాపురం) నుంచి ప్రసాదాన్ని , 11 రూపాయలు అందినట్టుగా రసీదుని ఇచ్చినట్లుగా గమనించారు.


         అయితే లోగడ శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పిన విధంగా శంకర భట్టు అనే కన్నడ భక్తుడు కురుపురంలో వ్రాసినట్టి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలని నాగనాథుడు దర్శించాడు. ఎంతో నిగూఢమైనటువంటి యోగ రహస్యాల తోటి నిండినటువంటి శ్రీపాద శ్రీవల్లభావతారానికి చెందిన ఆరు పుస్తకాలు, శ్రీ నృసింహ సరస్వతికి చెందిన ఆరు పవిత్ర గ్రంథాలు , మరి యొక ఆరు పవిత్రమైన గ్రంథాలు శ్రీ సమర్థ గారి గురించినవి కూడా ఆయన దర్శించారు. అయితే ఇవన్నీ కూడా తాడపత్రాలలోఆ ముగ్గురి గురించి వారి జీవితం గురించి, ఎన్నో యోగ రహస్యాలు 18 భాగాలుగా ఆయనకి కనిపించాయి. శ్రీపాదులవారి సూచనమేరకు ఆ గ్రంథాలన్నీ ఆయన మాతామహులైన బాపనార్యులు గారి హస్తస్పర్శతో ఒక శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం మొదటిభాగం తప్ప అన్నీ సంధ్యా భాషలోకి అదృశ్యమైపోయాయి. ఆ మొదటి భాగం గ్రంథాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో  బాపనార్యులు గారు ఆంధ్ర భాషలో అనువాదం చేసి వ్రాయడం ఆ గ్రంథాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో దాన్ని పూజాగదిలో పెట్టి నిత్యం ధూప,దీప నైవేద్యాలు పెట్టడం, ఆ తర్వాత శ్రీపాద స్వామి వారి ఆజ్ఞప్రకారం ఆ పుస్తకం మల్లాది వారి కుటుంబం లో ఒక తరం  తర్వాత ఇంకొక తరానికి వెళ్ళడం, సాక్షాత్తు శ్రీపాద స్వామి వారే ఆ గ్రంథంలో ఉన్నట్టుగా వాళ్ళు ఎంతో పవిత్ర భావంతో దానికి పూజా పునస్కారాలు చేయడం , ఆ తర్వాత శిథిలమవుతున్న వాటిని మిగతా తరాల వారు కాగితపు పరిశ్రమ వచ్చినప్పుడు కాగితాల మీద  తిరిగి వ్రాయడం, అది మెల్లగా 33వ తరానికి చెందిన శ్రీ గోవింద దీక్షితులు గారికి చేరడం, మళ్ళీ అది ఆయన ద్వారా  తిరిగి వ్రాయబడినట్లుగా ఆయనకి అర్థం అయిపోయింది.


           మల్లాది గోవింద దీక్షితులు గారికి శ్రీపాదులవారి దివ్య వాణి వినిపించడం, అతను ఎంతో శ్రద్ధాభక్తులతో అటక మీద ఉన్నటువంటి ఆ గ్రంథరాజాన్ని ఎంతో శ్రద్ధగా మళ్ళీ తిరిగి వ్రాయడం జరిగింది. ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక దేవతాసర్పం ఎల్లప్పుడూ భక్తిశ్రద్ధలతో కాపాడుతూ ఉండడం కూడా కనిపించింది. భీమవరంలో  ఆ గ్రంథరాజాన్నిఆయన తిరిగి వ్రాస్తున్న సందర్భంలో తన మకాం శ్రీ పీఠికాపురానికి మార్చడం జరిగింది. ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఆ గ్రంథాన్నినాలుగేళ్ళు  కష్ట పడి చేతివ్రాతతో వ్రాయడం కూడా నాగనాథుడు గారు  గమనించారు. అప్పుడే ఇద్దరుముగ్గురు యుక్తవయస్కులు, శ్రీపాద శ్రీవల్లభ భక్తులు శ్రీ బాపనార్యులు గారి ధాన్యాగారంలో దత్త స్వామి పేరిట స్థాపించబడిన సంస్థలో పని చేస్తున్నట్టుగా గమనించారు. వారు ఎంతో గౌరవంగా శ్రీ మల్లాది దీక్షితులు గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి టీ, ధూమ్రపానం చేయడానికి కావలసిన వస్తువులు ఇస్తూ ఉండడం కూడా ఆయన మనోనేత్రానికి అవగతమయింది. శ్రీ పాద శ్రీవల్లభుల వారి ఆదేశం ప్రకారంగా, శ్రీ మల్లాది దీక్షితులు గారికి వినిపించిన ఆయన దివ్యవాణి ప్రకారంగా పాత ప్రతిని చూసుకుంటూ తిరిగి  తాను తయారు చేసిన వ్రాత ప్రతి అయిపోయినాక, పాత ప్రతిని  ఆయన కృష్ణా నదిలో నిమజ్జనం చేసి (అంటే పాత గ్రంథాన్ని) తాను చేతివ్రాతతో వ్రాసిన పుస్తకాన్నంతా కూడా ఆధునిక యంత్రాలతో వాటిని ఆయన చక్కగా ఒక ప్రతి (One Copy of DTP)  ముద్రింప చేసి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి జన్మస్థలంలో చిన్నగా ఉన్న ఆయన సంస్థానానికి వెళ్ళడం, అక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులతో జరిగింది చెప్పడం, వాళ్ళు ఆశ్చర్యం, ఆనందపడడం తదుపరి ఒక మంచిరోజు వాళ్ళు నిర్ణయించుకుని, ఆ రోజున ఆ ఊరి ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతోఅక్కడ చేరడం,  శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు ఆ గ్రంథాన్ని అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహపారాయణం చేసి  చదివారు. ఆ తర్వాత ఆ గ్రంథరాజాన్ని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహాల ముందు ఉంచి, పూజ చేసి, దానిని ఆ సంస్థానానికి అప్పగించారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. అక్కడ చేరిన ఆ భక్తులందరి హృదయాలు ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో నిండి పోయాయి. అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా పవిత్రమైన ఆధ్యాత్మిక స్పందనలతో మునిగిపోయినట్టుగా కనిపించింది. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు అక్కడి కార్యదర్శకులతో ఈ గ్రంథరాజంలోని ఒక్క అక్షరం కూడా మీరు మార్చవద్దు, మీరు ప్రతులు చేయిస్తున్నప్పుడు స్వామి వారు స్వయంగా తన ప్రియ శిష్యుడైన  శంకర భట్టుకి ఏవిధంగా అయితే చెప్పారో అదేవిధంగా నేను ఒక్క అక్షరం కూడా మార్చకుండా దీన్ని తిరిగి రచించాను. కాబట్టి మీరు ఏమాత్రం మార్పు చేయకుండా ప్రతులను ముద్రించండి. సంస్థానానికి మాత్రమే  ఇవ్వమని శ్రీపాదులవారి ఆజ్ఞ కనుక ఆజ్ఞప్రకారం నేను దీన్ని మీకు అందజేస్తున్నాను. మీరు ఎంతో పవిత్రంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలని తప్పనిసరిగా పాటించాలని నేను కోరుకుంటున్నానని ఆనందాశ్రువులతో ఆ గ్రంథరాజాన్ని వాళ్లకి సమర్పించినట్టుగా నాగనాథునికి గోచరమయింది.  

19 March 2017

Chedu Nijalu - Episode-4

ఎపిసోడ్-4: రాజీవ్ దీక్షిత్ గారి హిందీ ఉపన్యాసానికి తెలుగు అనువాదం 

                   మన భారతదేశానికి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి బదులు జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు ఎన్నికయ్యాడు?అసలు వాస్తవాలేమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే ముందుగా ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ వారందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. అప్పట్లో మొత్తం పదిహేను మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వివిధ రాష్ట్రాల నుంచి ఉండేవారు. వారందరూ కలిసి ఎవరైతే ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతారో ఆ వ్యక్తియే భారత ప్రధానిగా నియమింపబడాలి అని తీర్మానించారు. ఈ అధ్యక్ష పదవికి నెహ్రూ మరియు పటేల్ ఇద్దరూ పోటీకి నిలబడ్డారు. మొత్తం పదిహేను మందిలో పద్నాలుగు ఓట్లు పటేల్ గారికి రాగా కేవలం ఒకేఒక్క ఓటు నెహ్రూకి పడింది. ముందుగా నిర్ణయించిన తీర్మానం ప్రకారం మెజారిటీ వచ్చినందు వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడాలి అలాగే మొట్టమొదటి ప్రధానిగా కూడా నియమింపబడాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చేదునిజం వింటే మీరందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇంకొక ఘోరమైన దుర్మార్గమైనటువంటి కుట్రని పన్నాడు. అందరి చేత చాచా నెహ్రూ అని పిలిపించుకునే అతని మనస్తత్వం బయటపడింది. పరమ ఘోరంగా కేవలం ఒకే ఒక్క ఓటు సంపాదించి నెహ్రూ ఓడిపోయాడు. కారణం ఏమిటంటే అసలు  పార్టీలో సభ్యులందరికీ నెహ్రూ అంటే ఇష్టమే లేదు. ఎందుకంటే నెహ్రూకి  అన్ని దురలవాట్లు  ఉన్నాయి.సిగెరెట్  తాగేవాడు,మద్యం సేవించేవాడు అలాగే మౌంట్ బాటన్ భార్య అయినటువంటి లేడీ ఎడ్వినాతో అక్రమ సంబంధాలు కలిగి ఉండేవాడు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ సభ్యునికి తెలుసు కాబట్టి అంత ఘోరంగా నెహ్రూ ఓడింపబడ్డాడు. ధరావత్తు కూడా కోల్పోయాడు. దాదాపు ఇటువంటి చరిత్రే సీతారాం కేసరికి కూడా ఉన్నది. ప్రపంచంలో, భారతదేశంలో నెహ్రూ వంటి చరిత్రహీనుడు ఇంకొకడు కనిపించడు. ఇంత గట్టిగా నేనెందుకు చెప్తున్నానంటే దానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నాలుగు ఫొటోగ్రాఫ్ లు నెహ్రూ మరియు ఎడ్వినాలకు సంబంధించినవి నా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టే ఇంత ధైర్యంగా నెహ్రూ అంత చరిత్రహీనుడు లేడని చెప్తున్నాను. అయితే ఇదివరకే ఒక రెండు ఫోటోలు ఇండియా టుడే లో ప్రచురింపబడ్డాయి. ఎంత జుగుప్త్సాకరంగా ఉన్నాయంటే దాన్ని చూసి భారతీయులంతా తలదించుకోవాల్సిందే. ఇటుంవటి అశ్లీల చరిత్ర ఉన్నందువల్లే కాంగ్రెస్ లో ఎవరికీ కూడా నెహ్రూ పట్ల ఆదరణ కానీ గౌరవం కానీ లేవు. కానీ ఆంగ్లేయులకు మాత్రం ముఖ్యంగా మౌంట్ బాటన్ కి నెహ్రూ అంటే చాల ఇష్టం. లేడీ ఎడ్వినా పన్నినటువంటి వలలో నెహ్రూ పడిపోయాడు. ఆంగ్లేయ అధికారులంతా కూడా నెహ్రూ గురించి ఏకగ్రీవంగా చెప్పేదేమిటంటే నెహ్రూ శారీరికంగా భారతీయుడే అయినా అతని ఆత్మ అంతా  కూడా ఆంగ్లేయులదే కాబట్టి వారు ఇటువంటివాడి చేతిలో అధికారాన్ని ఉంచాలనుకున్నారు. ఇలా నెహ్రూ కనుక భారతదేశ ప్రధానిగా ఉంటే ఆంగ్లేయులు దేశాన్ని పరిపాలించినట్టే అని వారు అనుకునేవారు. అందుకనే వారు ఎంతో డబ్బుని వెచ్చించి పలుకుబడిని ఉపయోగించి నెహ్రూ ని గురించి మీడియాలో చాలా బ్రహ్మాండంగా రాస్తూండేవారు ఆవిధంగా ప్రజల్ని మభ్యపెట్టేవారు. ఘోరంగా ఓడిపోయిన నెహ్రూ తన ఓటమిని అంగీకరించలేకపోయాడు.అతను సరాసరి మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లి, బాపూజీ ఒకవేళ  భారతదేశానికి ప్రధానిగా నేను ఎన్నుకోబడకపోతే ఈ కాంగ్రెస్ ను రెండు ముక్కలుగా విడదీస్తాను అప్పుడు ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్లరు ఎందుకంటే ఏ కాంగ్రెస్ కి మేము అధికారం అప్పచెప్పాలి అని వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతారు కాబట్టి మీరు ఆలోచించుకోండి అని మహాత్మా గాంధీకి గట్టిగా చెప్పాడు. ఇక్కడే గాంధీ  తప్పిదాన్ని చేశారు. దానిమూలంగా ఇప్పటికి కూడా భారతీయులు మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఈవిధంగా గాంధీని, నెహ్రూ బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. గాంధీ ఒక పర్సనల్ లేఖని రాసుకున్నారు అది ఇప్పటికీ కూడా ఆయన డైరీలో ఉంది. దాని ఆధారంగా గాంధీ యొక్క సెక్రటరీ అయినటువంటి ప్యారేలాల్ "పూర్ణాహుతి" అనే ఒక గ్రంధంలో చాలా  విషయాలు పొందుపరిచాడు. కావాలంటే మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూడవచ్చు. బాపూజీ స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి రాసినటువంటి లేఖలో, "పటేల్ గారు మీరు గెలిచినట్టు నాకు తెలుసు నిజానికి మరి మీరే ప్రధానిగా కావాల్సివుంది కానీ ప్రస్తుతం నెహ్రూ అధికార వ్యామోహంతో కాంగ్రెస్ ను రెండు ముక్కలు చేస్తానని బెదిరిస్తున్నాడు అదేకనుక జరిగితే ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. నెహ్రూ కాంగ్రెస్ వర్గానికి అధికారాన్ని ఇవ్వాలా లేక గాంధీ వర్గం వారికి ఇవ్వాలా అని వారు తాత్సారం చేస్తుంటారు కాబట్టి నీవు నీ పేరుని వెనక్కి తీసుకోవలసిందిగా" ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన్ని స్వయంగా కలిసి, బాపూజీ ఒకవేళ మీ అంతరాత్మ ఇదే కనుక చెబితే నేను మీ సేవకుడిని తప్పకుండా నా పేరుని వెనక్కు తీసుకుంటానని ఆయన ఎంతో విశాల హృదయంతో బాపూజీ ఆదేశాన్ని శిరసా వహించారు. ఆవిధంగానే ఆయన తన పేరుని వెనక్కు తీసుకోవడం జరిగింది.ఇదే భారతదేశంలో చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని యొక్క పరిణామం మనం అనుభవిస్తూనే ఉన్నాం.ఈవిధంగా నెహ్రూ చాలా అన్యాయంగా పదవీ కాంక్షతో దేశద్రోహానికి తలపెట్టి కపటోపాయంతో బ్లాక్ మెయిల్ చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు.అందుకే నేను ఇతడిని చరిత్రహీనుడు అని చెపుతూంటాను.

17 March 2017

ఉపనిషత్తులు-7:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

                                                       ఉపనిషత్తులు 

( continuation...)
         మరి మాయ కూడా బ్రహ్మమే అని అన్నప్పుడు బ్రహ్మము మాదిరిగానే మాయ కూడా అనంతంగా ఉండవల్సివస్తుంది కదా! బ్రహ్మము మాదిరిగానే నాశనం లేనిదిగా ఉండాలి కదా! అంటే బ్రహ్మము ఉన్నంత కాలం కూడా మాయ కూడా ఉండక తప్పదు కదా! అనే ఒక ప్రశ్న మనందరికీ కలుగుతుంది. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపంగా మనం చెప్పుకున్నప్పుడు మధ్య లోని పదం చిత్తు అంటే చైతన్యము. ఈ బ్రహ్మము యొక్క  చైతన్యశక్తినే మనం సృష్టి, మాయ అని  మనం చెప్పుకుంటున్నాం. మరి అది కూడా బ్రహ్మము వలె శాశ్వతంగానే ఉండాలి కదా !మరి బ్రహ్మజ్ఞానుల యొక్క దృష్టిలో మాయ అనేది లేదు అని చెప్పుతున్నారు కదా ! బ్రహ్మము మాదిరిగానే శాశ్వత వస్తువు లేక అశాశ్వత వస్తువు అని నిర్ణయించడానికి వీలు లేదు.శాశ్వతము, ఆశాశ్వతము అనే పదాలకి  సత్యము, అసత్యము అంటే నాశనం లేనిది, నశించేది  అని మనం చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఉన్నాయా లేవా అని నిర్ణయించడానికి వీలు లేనిది ఈ మాయ.
     మరి ఈ మాయకి అవయవాలు ఉన్నాయా అంటే ముందు మంచుపదార్థంగా ఉన్నప్పుడు దానికి ఆకారం ఉంది అవయవం అంటే ఇక్కడ కనిపించే భాగం అని చెప్పుకొనవచ్చును. ఈ కనిపించే మంచుముక్క ఉష్ణోగ్రత ప్రభావానికి లోనైనప్పుడు అది కనిపించకుండా ఆకాశతత్వంలో ఉన్నది కదా ! కాబట్టి ఇది కనిపించని స్థితిలో ఉన్నప్పుడు దీనికి అవయవాలు లేవని చెప్పక తప్పదు. ఈ కనిపించని పదార్ధం, కనిపించే అవయవాలుగా అంటే జలరూపం, మంచు రూపం ధరించినప్పుడు అవి మనకి ఇంద్రియగోచరం అవుతున్నాయి. ఇదే విధంగా ఈ మాయ  అనే సృష్టి ఒకప్పుడు అవయవాలు లేకుండా కనిపించని స్థితిలో ఇంద్రియాలకి అగోచరంగా ఉండి అది మళ్ళీ రూపాంతరం చెంది సృష్టిగా మారినప్పుడు అందులో ఈ సమస్త సృష్టికి చెందిన పదార్థాలు కొండలు, నదులు, చెట్లు చేమలు, మనుష్యులు, జంతువులూ, పక్షులు, ఖగోళాలు, నక్షత్రాలు ఇలా అవయవాలను ప్రకటించే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మాయే జగత్తుగా రూపాంతరం చెందినప్పుడు దానికి అవయవాలు ఉన్నాయి. ఇదే మాయ లయమైనప్పుడు అవి రూపాంతరం చెంది నిరాకార రూపంలో బ్రహ్మములో కలిసినప్పుడు దానికి ఉనికి లేదు, ఎటువంటి అవయవాలు ఉండవు. మనం గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు మరి ఈ మాయ, సృష్టి అవయవాలు లేకుండానే ఉంటుంది కదా! కాని మనం ఎప్పుడైతే జాగ్రతావస్థ లోకి వస్తామో  ఈ జగత్తంతా మనకి  ఉంటుంది. అంటే అది మళ్ళీ అవయవాలను కలిగి ఉంటుంది. అంటే ఒకప్పుడు అవయవాలు లేకుండా, మరొకప్పుడు అవయవాలు ఉన్నట్లుగా ఈ మాయ మనకి గోచరిస్తూ ఉంటుంది. మరి ఈ మాయ ఉన్నట్టు చెప్పుకోవాలా లేక లేనట్టుగా చెప్పుకోవాలా? ఒక స్థితిలో అది లేకుండా ఉంటుంది, ఇంకొక స్థితిలో అది ఉన్నట్లుగా ఉంటుంది.
        ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి ఉన్నాడు. చాలా సజ్జనుడు. అన్ని విధాలుగా ఎంతో మంచివాడు. సాధుగుణం కలిగి ఉంటాడు.అటువంటి మనిషిని మనం చాలా మంచివాడని చెప్పుకుంటాం. కాని అదే మనిషి ఒక్కొక్కసారి దుష్టస్వభావాల్ని కూడా కలిగి ఉంటాడు. కోపంగా ఉంటాడు. విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ మనిషిని గురించి మనం ఏమని చెప్పాలి? అతను చాలా మంచివాడని చెప్పాలా? లేక చాలా చెడ్డవాడని చెప్పాలా? ఈ రెండు విధాలుగా మనం చెప్పలేము ఎందుకంటే అవి నిజాలు కావు. అప్పుడు ఏమని చెప్పవలసి వస్తుంది? ఇతను చాలా మంచివాడు కాని అప్పుడప్పుడు మాత్రం కొంత కోపస్వభావాన్ని కలిగి ఉంటాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ మాయ కూడా సత్య వస్తువా, అసత్యవస్తువా, శాశ్వతమా, అశాశ్వతమా అని నిర్ణయించే అవగాహన శక్తి మనకి కాని మహర్షులకి కాని లేదని చెప్పడం కాదు, ఈ లక్షణాలన్నీ ఉన్నాయని కాని లేవని కాని చెప్పలేనటువంటి స్వరూపమే అని నిర్ధారించుకోవలసి వస్తుంది. అవయవాలు ఉన్నవని కాని లేవని కాని బ్రహ్మము వలె ఉంటుందని కాని కాదని కాని చెప్పలేనటువంటి స్థితిలో ఉండే లక్షణాలే ఈ మాయకి ఉన్నాయి. దాని స్వరూపమే అంత.
     ఒకవేళ మాయే బ్రహ్మము అని అనుకుంటే బ్రహ్మము అవమానస గోచరము కదా ! కాని దానికి విరుద్ధంగా మాయ ఇంద్రియగోచరం కదా !అంటే మాయ ఇంద్రియముల చేత జగత్తుగా అనుభవింప బడుతుంది కదా ! కనుక మాయ బ్రహ్మమునకు విరుద్ధంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. బ్రహ్మము అఖండము మరి  మాయ ఖండము. అది అనంతము, ఇది పరిమితులు కలిగినటువంటిది. అది సర్వవ్యాపకము, ఇది సర్వవ్యాపకము కాదు. ఈవిధంగా మాయ బ్రహ్మమునకు పూర్తిగా విరుద్ధ లక్షణాలతో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి మనం బ్రహ్మము అద్వితీయమని, ఇంకొక వస్తువు లేదని చెప్పుకున్నాం కదా ! అన్నింటిలో బ్రహ్మమే ఉన్నదని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మాయ మనకి వేరేలాగా కనిపిస్తున్నది కదా ! ఇలా అనుకుంటే  మరి బ్రహ్మమునకు ఉన్న లక్షణాలు బ్రహ్మములోని భాగమైన మాయకి కూడా ఉండాలి కదా! అనే ఇంకొక ప్రశ్న మళ్ళీ మనకి ఇక్కడ కలుగుతుంది. అలా అనుకుంటే బ్రహ్మము యొక్క నిర్వచనము తప్పు అవుతుంది కదా ! కాబట్టి మరి ఏమనుకోవాలి? మాయ బ్రహ్మము కంటే వేరు గాను లేక బ్రహ్మముగానే మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఈ రెండు లక్షణాలు ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు. మరి మాయకి నిర్వచనం ఏమిటీ?ఇటు బ్రహ్మము అని చెప్పలేము, కాదని చెప్పలేని స్థితి. ఎప్పుడైతే ఈ మాయ త్రిగుణాలతో సంబంధం ఏర్పరచుకుంటుందో అప్పుడు దాన్ని మాయ అని చెప్పుకోవాల్సి వస్తుంది అని  మన పూర్వీకులు, శాస్త్రాలు చెప్పుతున్నాయి.


           లోగడ మనం ఈ బ్రహ్మము త్రిగుణరహితం అని చెప్పుకున్నాం. అయితే బ్రహ్మమునకు మాయకు కల తేడా ఏమిటీ? ఎప్పుడైతే బ్రహ్మము త్రిగుణాలతో సంబంధం ఏర్పరచుకుంటుందో అప్పుడు అది బ్రహ్మమునకు విరుద్ధంగా మాయ లేక సృష్టి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ త్రిగుణాలు అంటే ఏమిటీ? సత్వ, రజ, తామస గుణాలు అన్నమాట. ఈ త్రిగుణాలకి మాయకి ఉన్న సంబంధం మరి కొంత విశదీకరంగా చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నీటిబిందువులు ఎలా ఏర్పడినాయి? ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ కనిపించని రెండింటి సమ్మేళనమే ఈ నీటిబిందువులు కదా ! ఇప్పుడు మనం ఈ నీళ్ళలో పంచదార కలిపినప్పుడు తియ్యగానూ, ఉప్పు కలిపినప్పుడు ఉప్పగానూ, మట్టితో కలిపినప్పుడు మాలిన్య జలంగా మనం చెప్పుకుంటాం. కాని ఇక్కడ ఇప్పుడు ఈ నీటిలోనుంచి తియ్యదనాన్ని కాని, ఉప్పదనాన్ని కాని, దానిలో కలిసిన మట్టి మాలిన్యాన్ని కాని తొలగించినప్పుడు నీరు మాత్రం అలాగే ఉంటుంది. అంటే తొలగించబడినట్టి ఈ మూడు పదార్థాలు నీటి యొక్క అంశ కానే కావు. అందుకనే అవి తొలగించబడినప్పటికినీ నీరు యథాప్రకారంగానే ఉంది. కాని వేటి మూలంగా నీరు ఏర్పడిందో ఆ రెండు పదార్థాలు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ రెండు పదార్థాల్ని మనం నీటినుంచి తొలగించినప్పుడు అక్కడ నీటి యొక్క ఉనికి ఉండదు. ఎందుకంటే ఈ నీరు అనే పదార్ధం హైడ్రోజన్, ఆక్సిజన్ అనే రెండు అంశలతో తయారు చేయబడింది. ఆ అంశాలనే తీసివేసినప్పుడు నీటి యొక్క  ఉనికే ఉండదు. అదేవిధంగా ఈ మాయలో ఈ త్రిగుణాలు అంశగా చేరి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ త్రిగుణాలని తీసివేస్తామో అప్పుడు అది మాయగా మనం చెప్పుకోలేము. ఈ త్రిగుణములు అంటే సత్,రజో,తమ గుణములచేత ఉనికిని పొందినది మాయగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే మాయకి త్రిగుణాలకి ఉన్న అవినాభావ సంబంధం.

12 March 2017

ఉపనిషత్తులు-6:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

                                    ఉపనిషత్తులు- రెండవ అధ్యాయం ( Part-3)


                        మహర్షుల యొక్క అభిప్రాయ

              ఈ మాయను గురించి అనేకమంది మహర్షులు విచారణ చేసినప్పుడు వారు ఈ మాయ బ్రహ్మము కంటె వేరుగా ఉన్నదా లేదా అనే విషయనిర్ధారణ చేయడం అనవసరమని అభిప్రాయ పడ్డారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నా మాయ బ్రహ్మాదులకు కూడా అర్థం కాని విషయమని చెప్పాడు. ఇక్కడ మాయ అనేది బ్రహ్మము కన్నా వేరా ? కాదా ? అనే విషయ నిర్ధారణ చేయలేము. అది చేయలేనటువంటి ఒక శక్తి. ఇక్కడ మహర్షులకి ఈ విషయం అర్థం కాక వాళ్ళు చెప్పలేదు. మాయ అనేది బ్రహ్మము కంటే వేరా? కాదా ? అనేది నిర్ధారణ చేయలేనటువంటి మాయ కాబట్టి వాళ్ళు అలా అభిప్రాయ పడ్డారు.

               ఇక్కడ మాయ అనే శక్తి బ్రహ్మములోని సృజనాత్మక శక్తి బహిర్గతం అయినప్పుడే సృష్టి జరుగుతుంది అని లోగడ చెప్పుకున్నాం. మాయ తానే సృష్టిగా మారుతుంది. ఉదాహరణకి ఒక కుమ్మరివాడు మట్టితో కుండలని చేశాడు. అయితే ఈ కుండ అనేది  మట్టితో తయారు చేసే పదార్థంలో కేవలం మట్టి మాత్రమే ఉన్నది. అది తయారు చేసిన కుమ్మరి మాత్రం వేరుగా ఉన్నాడు. అతను మట్టితో కుండను సృష్టించినప్పటికీ తాను సృష్టించిన పదార్థాని కన్నా వేరుగా ఉన్నాడు. కుండ యొక్క ఆకారం లేనప్పుడు అది మట్టిగా మాత్రమే ఉన్నది. అది కుమ్మరి చేతిలో ఆకారం మారినప్పుడు కుండగా మారింది. కాని కుమ్మరి వాడు మాత్రం మారలేదు. కాని సృష్టి విషయంలో,మాయ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.

      ఉదాహరణకి ఒక మంచు ముక్కను తీసుకున్నప్పుడు దాని ఆకారం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఉష్ణోగ్రత ప్రభావానికి గురి అయినప్పుడు అదే  మంచు ముక్క జలంగా మారుతుంది. అయితే మంచుముక్క ఏమయింది? అది జలంగా మారింది. ఇంకా ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినప్పుడు అది ఆవిరిగా మారింది. ఇప్పుడు ఆ మంచుముక్క ఎక్కడ ఉన్నది? అది ఆవిరి రూపంలో ఉన్నది. ఇంకా ఉష్ణోగ్రత పెంచినప్పుడు అది ఆకాశతత్వంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మంచుముక్క ఎక్కడ ఉన్నది?అది అదృశ్యమైపోయింది. కనిపించడం లేదు. కాని ఒకటే పదార్ధం అనేక రూపాల్లో రూపాంతరం చెందింది. అదేవిధంగా ఈ మాయ కూడా సృష్టిలో అనేక రూపాలను ధరిస్తుంది. మనుష్యులుగా, కొండలుగా, చెట్లుగా, జంతువులుగా, నక్షత్రాలుగా ఇలా సృష్టిలో అనేక రూపాలుగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇలా ఒకటే వస్తువు రకరకాలుగా రూపాంతరం చెందినప్పుడు దాన్ని మనం రకరకాలుగా పిలవడం జరిగింది. అదే ఈ మాయని కూడా సృష్టికార్యం అని  మనం చెప్పవచ్చును. అంటే ఈ మాయను కూడా సృష్టికారిణిగా  అని మనం పిలవవచ్చును. అనుకోవచ్చును. ఈ జగతిని కూడా నడిపించేది మాయే. అందుకని దీన్ని స్థితి కారిణి అని కూడా పిలవవచ్చును. అలాగే ఈ మాయ తన రూపాలన్నింటినీ లయ చేసి లయకారిణిగా పిలవబడుతున్నది. కాబట్టి మాయని మనం సృష్టికారిణి, స్థితికారిణి మరియు లయకారిణిగా చెప్పవచ్చును.

     ఇప్పుడు మరొక్క ప్రశ్న ఉదయిస్తుంది. మరి బ్రహ్మము ఏం చేస్తుంది? అంటే దానికి ఉదాహరణగా ఆకాశంలో మబ్బు ఉన్నది. ఈ మబ్బుకి ఉనికి ఆకాశం. ఈ మబ్బు కాని మేఘం కాని నశించినప్పుడు నీటి బిందువులు వర్షరూపంలో బయటకి వస్తాయి. కాని మనమేమనుకుంటాం ? ఈ వర్షానికి కారణం ఆకాశం అని అనుకుంటాము. కాని నిజానికి అది ఆకాశం కాదు కదా! అదేవిధంగా ఇక్కడ ఆకాశం బ్రహ్మము అని అనుకుంటే ,మేఘాన్ని మనం సృష్టి లాగా భావిస్తే, ఇక్కడ ఈ మాయలో నుంచి సృష్టి వచ్చింది కాని అది బ్రహ్మములోనుంచి వచ్చినది కాదు అని  మనం ఈ ఉదాహరణతో తేలికగా అర్థం చేసుకొనవచ్చును. కాబట్టి ఈ బ్రహ్మమే సృష్టికి కారణం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని మనం ఈ ఉదాహరణతో  గమనించ వచ్చును.

      బ్రహ్మమునకు లోగడ మనం చెప్పుకున్నట్టుగానే అరిషడ్వికార భావనలు లేవు. అందుకని సృష్టికర్త కేవలం మాయనే. అదే సృష్టికి కారణమని మనం తెలుసుకుంటాం. ఇంకొక్క విషయం. మేఘం ఎన్నిసార్లు ఆకాశంలో ఉండి ఎన్నిసార్లు ద్రవరూపంలోనికి మారినప్పటికీ ఆకాశం మాత్రం నిర్వికారంగానే, నిశ్చలంగానే ఉంటుంది. దానిలో ఏమాత్రం మార్పు అనేది సంభవించదు. ఇంకా వివరించి చెప్పాలంటే ఎన్నో సార్లు ద్రవాలు మేఘ రూపం దాల్చడం,  ఆ మేఘాలు ద్రవరూపంలోనికి మారి వర్షించడం,  మళ్ళీ అది మేఘరూపం దాల్చడం ఇలా ఎన్ని వందలసార్లు జరిగినా కూడా ఏవిధంగా అయితే ఆకాశానికి ఏమాత్రం సంబంధం లేదో అదేవిధంగా బ్రహ్మములో ఉన్నటువంటి ఈ మాయ యొక్క సృష్టి అది ఎన్ని సార్లు సృష్టించబడి, మరి పెంచబడి, లయ చెంది మళ్ళీ సృష్టిగా మారి, పెంచబడి, లయ చెంది మళ్ళీ సృష్టిగా మార్పులు చెందుతూ ఇలా ఎన్నిసార్లు జరిగినా బ్రహ్మము మాత్రము ఎప్పుడు కూడా నిర్వికారంగానే, నిశ్చలంగానే ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. అయితే బ్రహ్మము, మాయ ఈ రెండూ ఒకటే చోట ఉన్నాయి కాని మాయకి సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు ఉన్నాయి. అది పుడ్తుంది, పెరుగుతుంది, నశిస్తూ ఉంటుంది.. చివరకి అది నశించినప్పుడు నిర్వికారంగా బ్రహ్మములో కలిసిపోతుంది. బ్రహ్మ జ్ఞానుల దృష్టిలో మాయ బ్రహ్మము ఒక్కటే. కాని ఇది అన్యులకి వేరుగా కనిపిస్తూ ఉంటుంది. పైన మనం చెప్పుకున్న ఉదాహరణల మూలంగా అది మనకు కలిగే భ్రమ అని గుర్తించవచ్చును. ఈ మాయ అనేది సత్యవస్తువు కాదు. ఆధ్యాత్మిక భాషలో సత్యవస్తువు అంటే నాశనం లేనిది. కాని ఇక్కడ ఈ మాయ అనే సృష్టి పుడ్తుంది, పెరుగుతుంది, నశిస్తుంది కనుక మాయని మనం సత్యవస్తువు అని చెప్పుకోడానికి వీలు లేదు.  
                      (...... conte......... )

11 March 2017

Audio CD for purchase

Dear Readers
                      It brought to our attention that some of you are unable download Telugu audio CD on Sri Pada Sri Vallabha. Those who are interested to buy the  audio CD it is available with N.S.SaiRam. Cellphone contact: 7901268716, Secunderabad. I will be available in  India till April 10th, 2017.

Kind Regards,
Sai Ram

6 March 2017

ఉపనిషత్తులు-5:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

                     ఉపనిషత్తు సారాంశం - రెండవ అధ్యాయం  (Part-2)
(....... continuation )

ఈ విధంగా హైడ్రోజన్ , ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు  ఏర్పడిన నీటికి ఈ రెండిటి స్వభావాలు లేవు. అది ఆక్సిజన్ లాగా ఇతర పదార్థాన్ని మండించదు, అలాగే హైడ్రోజన్ లాగా తనంతట తాను మండదు వీటికి విరుద్ధంగా మంటని ఆర్పుతుంది. అది కళ్ళకి కనపడుతుంది. ఇదేవిధంగా మనం బ్రహ్మముకి, సృష్టికి ఆపాదించ వచ్చును. లోగడ మనం చెప్పుకున్న ఇన్ని లక్షణాలున్నటువంటి బ్రహ్మము నుంచి దానికి విరుద్ధంగా ఉన్నటువంటి సృష్టి, దానిలోనే ఇంద్రియాలు  ఉండడం సంభవించింది. ఇంకొక లక్షణం ఏమిటంటే ఈ సృష్టి మాయతో కూడా తయారు కాబడింది. ఇక్కడ మనకి మరొక్క  చిక్కు ప్రశ్న వస్తుంది. ఇంతకుమునుపు బ్రహ్మము తప్ప ఏమీ లేదు అని అనుకున్నాం. ఆ తర్వాత సృష్టి బ్రహ్మము నుంచే వచ్చింది అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ సృష్టి  మాయతో తయారు కాబడింది అని చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది. కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం. ఇంతకు ముందు బ్రహ్మని అద్వితీయం అని చెప్పుకున్నాం, అంటే రెండవ వస్తువు లేనిది అని. మరి దానికి భిన్నంగా సృష్టి కూడా ఉందని చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా దానిలో మాయ కూడా ఉంది అని ఇంకొక లక్షణాన్ని జోడించాం. ఏమిటీ ఈ గందరగోళం?బ్రహ్మయే సృష్టియా? బ్రహ్మయే మాయా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ముందుగా మనం మాయ అంటే ఏమిటో తెలుసుకుందాం. దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. కొంచెం నిదానంగా మనం విమర్శన చేసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పంచదారలో తియ్యదనం ఉంది. ఉప్పులో ఉప్పదనం ఉంది. అదేవిధంగా సూర్యుడిలో ప్రకాశం ఉంది. అదే విధంగా బ్రహ్మములో మాయ దాగి ఉన్నది. ఇక్కడ ఇంకొక పెద్ద సందేహం వస్తుంది  అదేమిటంటే బ్రహ్మము అనంతం, అద్వితీయం అని చెప్పుకున్నాం కదా ! ఆది అంతం లేని ఈ బ్రహ్మములో మరి మాయ, సృష్టి ఎక్కడ్నుంచి వచ్చింది? ఒకవేళ మాయ, బ్రహ్మము ఒక్కటే అయితే మనం బ్రహ్మముని మాయ అని చెప్పుకోవచ్చును కదా! మాయ ఎక్కడ ఉంది? బ్రహ్మము లోపల ఉందా లేక బయట ఉందా? అనే ఇంకొక చిక్కు ప్రశ్నమన మనస్సులో  వస్తుంది. ఈ బ్రహ్మము అనేది ఎక్కడో లేదు బ్రహ్మములోనే ఉంది. ఏవిధంగా తీపిదనం పంచదారలో ఉందో, ఉప్పుదనం ఉప్పులో ఉందో, తేజస్సు సూర్యునిలో ఉందో  ఆ తియ్యదనాన్ని మనం పంచదారలో నుండి తీసివేసినప్పుడు అది ఇసుక లాగానే అనిపిస్తుంది కదా అదేవిధంగా ఉప్పుదనాన్ని ఉప్పులోనుంచి తీసివేస్తే అది కూడా ఇసుక మాదిరిగానే ఉంటుంది కదా! తేజస్సుని సూర్యుడి నుంచి తీసివేస్తే అక్కడ ఏమీ మిగలదు కదా ! ఈ  మూడు లక్షణాలు ఈ మూడు పదార్థాల్లో ఎలా నిమిడి ఉన్నాయో అదేవిధంగా మాయ అనేది బ్రహ్మములో ఉన్నది. అలాగే ఈ మాయ అన్నది లేకపోతె బ్రహ్మము లేదు. ఈ బ్రహ్మము అనేది మాయలో ఏకదేశమై ఉన్నదని శాస్త్రాలు చెప్పుతున్నాయి. పంచదార యొక్క ఉనికి దానిలో ఉన్న తియ్యదనం మూలంగానే మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా మాయ అనే దాని బట్టి మనం బ్రహ్మముని తెలుసుకోగలుగుతాం. ఇది కాస్త తికమకగా ఉంటుంది. ఈ మాయ అనేది బ్రహ్మము యొక్క శక్తిగా చెప్పుకుంటారు. ఏవిధంగా అయితే తియ్యదనం మూలంగా పంచదార ఉనికి ఎలా కలిగిందో, అలాగే ఏకదేశం అన్నప్పుడు ఎక్కడ బ్రహ్మము ఉందో అక్కడే మాయ ఉంటుంది. ఎక్కడ తియ్యదనం ఉంటుందో అక్కడ పంచదార ఉనికి ఉంటుంది, ఎక్కడ సూర్యుని తేజస్సు ఉంటుందో అక్కడ సూర్యుని ఉనికి ఉన్నట్టుగా ఈ బ్రహ్మమలోనే ఈ మాయ అనే శక్తి దాగి ఉంది అందుకనే దాన్ని ఏకదేశం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మేఘాలు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో. ఒక వేళ ఆకాశమే లేకపోతే మేఘాలకి ఉనికి లేదు కదా ! అదేవిధంగా మాయకు ఉనికి బ్రహ్మము. బ్రహ్మము లేకపోతే మాయ లేదు. ఈ మాయ అనేది పంచదారలోని తియ్యదనం లాంటిది, ఉప్పులోని ఉప్పదనం లాంటిది, సూర్యునిలోని తేజస్సు లాంటిది. ఏవిధంగానయితే మనం పంచదారలో నుంచి తియ్యదనాన్ని, ఉప్పులోని ఉప్పదనాన్ని, సూర్యునిలోని తేజస్సును విడదీయ లేమో అదే విధంగా మాయను బ్రహ్మము నుండి విడిగా చెప్పుకోలెం. ఏవిధంగా అయితే ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు యొక్క శక్తి ఏవిధంగా ఒక చిన్న విత్తనంలో దాగి ఉంటుందో , ఏవిధంగా అయితే స్త్రీ పురుషుల సుప్రశోణితాల సమ్మేళనం లో బ్రహ్మాండమైనటువంటి మానవ శరీరధారణ కలిగే శక్తి ఇమిడి ఉంటుందో, ఒక వ్యక్తి యొక్క శక్తి ఆ వ్యక్తిలో దాగి ఉన్న మాదిరిగా అవి కలిసే ఉంటాయి. అయితే ఈ శక్తి అంతర్గతంగా ఒక నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఆ శక్తి బహిర్గతమవుతుంది. అంటే మనకు అవసరమైనప్పుడు ఆ శక్తి బయటకి వస్తుంటుంది. అది మనకు కనిపించదు. నిగూఢగా, నిక్షిప్తంగా అది దాక్కుని ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మములో సృష్టి చేయటానికి కావలసినంత శక్తి దాక్కుని ఉంటుంది. అది సృష్టి కార్యం అవసరమైనప్పుడు మాత్రమే ఆ బ్రహ్మములో నుంచి బహిర్గతమవుతుంది. ఈ బ్రహ్మము యొక్క సృష్టి చేసే శక్తినే మనం మాయగా చెప్పుకుంటున్నాం. అంటే బ్రహ్మము యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి యే మాయ. కాబట్టి మాయ కూడా బ్రహ్మమే. ఒక వ్యక్తిగా చెప్పుకున్నప్పుడు నేను అనే ఇంకొక వ్యక్తిగా నన్ను నేను చెప్పుకున్నప్పుడు నేను, నాలోని శక్తి వేరు కాదు. రెండు కలిపి నేను అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మము మాయ రెండూ ఒకటే.    

3 March 2017

We are happy to announce english version of Sripada Sri Vallabha Charitramtrutam audio CD now available on this website to listen.
Please click here for CD