ఎపిసోడ్-4: రాజీవ్ దీక్షిత్ గారి హిందీ ఉపన్యాసానికి తెలుగు అనువాదం
మన భారతదేశానికి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి బదులు జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు ఎన్నికయ్యాడు?అసలు వాస్తవాలేమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే ముందుగా ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ వారందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. అప్పట్లో మొత్తం పదిహేను మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వివిధ రాష్ట్రాల నుంచి ఉండేవారు. వారందరూ కలిసి ఎవరైతే ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతారో ఆ వ్యక్తియే భారత ప్రధానిగా నియమింపబడాలి అని తీర్మానించారు. ఈ అధ్యక్ష పదవికి నెహ్రూ మరియు పటేల్ ఇద్దరూ పోటీకి నిలబడ్డారు. మొత్తం పదిహేను మందిలో పద్నాలుగు ఓట్లు పటేల్ గారికి రాగా కేవలం ఒకేఒక్క ఓటు నెహ్రూకి పడింది. ముందుగా నిర్ణయించిన తీర్మానం ప్రకారం మెజారిటీ వచ్చినందు వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడాలి అలాగే మొట్టమొదటి ప్రధానిగా కూడా నియమింపబడాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చేదునిజం వింటే మీరందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇంకొక ఘోరమైన దుర్మార్గమైనటువంటి కుట్రని పన్నాడు. అందరి చేత చాచా నెహ్రూ అని పిలిపించుకునే అతని మనస్తత్వం బయటపడింది. పరమ ఘోరంగా కేవలం ఒకే ఒక్క ఓటు సంపాదించి నెహ్రూ ఓడిపోయాడు. కారణం ఏమిటంటే అసలు పార్టీలో సభ్యులందరికీ నెహ్రూ అంటే ఇష్టమే లేదు. ఎందుకంటే నెహ్రూకి అన్ని దురలవాట్లు ఉన్నాయి.సిగెరెట్ తాగేవాడు,మద్యం సేవించేవాడు అలాగే మౌంట్ బాటన్ భార్య అయినటువంటి లేడీ ఎడ్వినాతో అక్రమ సంబంధాలు కలిగి ఉండేవాడు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ సభ్యునికి తెలుసు కాబట్టి అంత ఘోరంగా నెహ్రూ ఓడింపబడ్డాడు. ధరావత్తు కూడా కోల్పోయాడు. దాదాపు ఇటువంటి చరిత్రే సీతారాం కేసరికి కూడా ఉన్నది. ప్రపంచంలో, భారతదేశంలో నెహ్రూ వంటి చరిత్రహీనుడు ఇంకొకడు కనిపించడు. ఇంత గట్టిగా నేనెందుకు చెప్తున్నానంటే దానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నాలుగు ఫొటోగ్రాఫ్ లు నెహ్రూ మరియు ఎడ్వినాలకు సంబంధించినవి నా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టే ఇంత ధైర్యంగా నెహ్రూ అంత చరిత్రహీనుడు లేడని చెప్తున్నాను. అయితే ఇదివరకే ఒక రెండు ఫోటోలు ఇండియా టుడే లో ప్రచురింపబడ్డాయి. ఎంత జుగుప్త్సాకరంగా ఉన్నాయంటే దాన్ని చూసి భారతీయులంతా తలదించుకోవాల్సిందే. ఇటుంవటి అశ్లీల చరిత్ర ఉన్నందువల్లే కాంగ్రెస్ లో ఎవరికీ కూడా నెహ్రూ పట్ల ఆదరణ కానీ గౌరవం కానీ లేవు. కానీ ఆంగ్లేయులకు మాత్రం ముఖ్యంగా మౌంట్ బాటన్ కి నెహ్రూ అంటే చాల ఇష్టం. లేడీ ఎడ్వినా పన్నినటువంటి వలలో నెహ్రూ పడిపోయాడు. ఆంగ్లేయ అధికారులంతా కూడా నెహ్రూ గురించి ఏకగ్రీవంగా చెప్పేదేమిటంటే నెహ్రూ శారీరికంగా భారతీయుడే అయినా అతని ఆత్మ అంతా కూడా ఆంగ్లేయులదే కాబట్టి వారు ఇటువంటివాడి చేతిలో అధికారాన్ని ఉంచాలనుకున్నారు. ఇలా నెహ్రూ కనుక భారతదేశ ప్రధానిగా ఉంటే ఆంగ్లేయులు దేశాన్ని పరిపాలించినట్టే అని వారు అనుకునేవారు. అందుకనే వారు ఎంతో డబ్బుని వెచ్చించి పలుకుబడిని ఉపయోగించి నెహ్రూ ని గురించి మీడియాలో చాలా బ్రహ్మాండంగా రాస్తూండేవారు ఆవిధంగా ప్రజల్ని మభ్యపెట్టేవారు. ఘోరంగా ఓడిపోయిన నెహ్రూ తన ఓటమిని అంగీకరించలేకపోయాడు.అతను సరాసరి మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లి, బాపూజీ ఒకవేళ భారతదేశానికి ప్రధానిగా నేను ఎన్నుకోబడకపోతే ఈ కాంగ్రెస్ ను రెండు ముక్కలుగా విడదీస్తాను అప్పుడు ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్లరు ఎందుకంటే ఏ కాంగ్రెస్ కి మేము అధికారం అప్పచెప్పాలి అని వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతారు కాబట్టి మీరు ఆలోచించుకోండి అని మహాత్మా గాంధీకి గట్టిగా చెప్పాడు. ఇక్కడే గాంధీ తప్పిదాన్ని చేశారు. దానిమూలంగా ఇప్పటికి కూడా భారతీయులు మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఈవిధంగా గాంధీని, నెహ్రూ బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. గాంధీ ఒక పర్సనల్ లేఖని రాసుకున్నారు అది ఇప్పటికీ కూడా ఆయన డైరీలో ఉంది. దాని ఆధారంగా గాంధీ యొక్క సెక్రటరీ అయినటువంటి ప్యారేలాల్ "పూర్ణాహుతి" అనే ఒక గ్రంధంలో చాలా విషయాలు పొందుపరిచాడు. కావాలంటే మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూడవచ్చు. బాపూజీ స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి రాసినటువంటి లేఖలో, "పటేల్ గారు మీరు గెలిచినట్టు నాకు తెలుసు నిజానికి మరి మీరే ప్రధానిగా కావాల్సివుంది కానీ ప్రస్తుతం నెహ్రూ అధికార వ్యామోహంతో కాంగ్రెస్ ను రెండు ముక్కలు చేస్తానని బెదిరిస్తున్నాడు అదేకనుక జరిగితే ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. నెహ్రూ కాంగ్రెస్ వర్గానికి అధికారాన్ని ఇవ్వాలా లేక గాంధీ వర్గం వారికి ఇవ్వాలా అని వారు తాత్సారం చేస్తుంటారు కాబట్టి నీవు నీ పేరుని వెనక్కి తీసుకోవలసిందిగా" ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన్ని స్వయంగా కలిసి, బాపూజీ ఒకవేళ మీ అంతరాత్మ ఇదే కనుక చెబితే నేను మీ సేవకుడిని తప్పకుండా నా పేరుని వెనక్కు తీసుకుంటానని ఆయన ఎంతో విశాల హృదయంతో బాపూజీ ఆదేశాన్ని శిరసా వహించారు. ఆవిధంగానే ఆయన తన పేరుని వెనక్కు తీసుకోవడం జరిగింది.ఇదే భారతదేశంలో చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని యొక్క పరిణామం మనం అనుభవిస్తూనే ఉన్నాం.ఈవిధంగా నెహ్రూ చాలా అన్యాయంగా పదవీ కాంక్షతో దేశద్రోహానికి తలపెట్టి కపటోపాయంతో బ్లాక్ మెయిల్ చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు.అందుకే నేను ఇతడిని చరిత్రహీనుడు అని చెపుతూంటాను.