Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

27 February 2017

ఉపనిషత్తులు-4:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

                      ఉపనిషత్తు సారాంశం - రెండవ అధ్యాయం (Part-1)

ఇంతవరకు మనం సృష్టికి ముందు ఉండే బ్రహ్మము గురించి చెప్పుకున్నాం. మరి సృష్టి అన్నది బ్రహ్మము లోనిదే కదా! అక్కడ సృష్టికి పూర్వం ఉన్న బ్రహ్మములో మనం చాలా లక్షణాలు చెప్పుకున్నాం. బ్రహ్మమొక్కటే, రెండవ వస్తువు లేదని, షడ్వికారం లేదని, ఎటువంటి గుణముల చేత మలినం కాని వస్తువని ఇలాగ ఎన్నో చెప్పుకున్నాం. కాని మరి అదే బ్రహ్మములోని సృష్టిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కదా అనే సందేహం మనందరికి తప్పకుండా వస్తూ ఉంటుంది. ఒకవైపు బ్రహ్మము ఒక్కటే అని చెప్తున్నాం, వేరే పదార్ధం లేదంటున్నాం. మళ్ళీ బ్రహ్మములోనే సృష్టి ఉందని రెండో పదార్ధం గురించి చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం తికమకగా ఉంటుంది. శ్రీ రమణ మహర్షిగారు “త్రిపురా రహస్యం” ప్రతి ఒక్కళ్ళు చదవవలసిన గ్రంథరాజమని చెప్పారు. “త్రిపురా రహస్యంలో” శ్రీ దత్త మహా ప్రభువు పరశురామునికి కలిగిన అనేక సందేహాలను తీరుస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇలా అద్వితీయాన్నే బోధించారు. ఆది శంకరాచార్యులు కూడా అద్వైతాన్నే బోధించారు. ఎదురుగుండా కనిపిస్తున్న సృష్టిని అది మాయ అని చెప్తూ ఉంటారు. అది మిధ్య అని చెప్తుంటారు. మిధ్యా అనే వస్తువు మన కళ్ళకి కనపడకూడదు కదా ! కాని అది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే ! ఇక్కడ మనం కొంచెం ప్రయత్నం చేద్దాం ఈ సృష్టి రహస్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి.
              ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊరిలో భవనాలాన్నీ, మార్గాలన్నీ, చెట్లన్నీ, కొండలన్నీ, మనుష్యులంతా, సమస్త వసువులన్నీ కూడా మట్టితోటే తయారు  చేయబడి ఉన్నాయని అనుకుందాం. అక్కడ ఆకారాలన్నీ వేరు కాని అవన్నీ మట్టితోటే చేయబడి ఉన్నాయి, నిర్మించబడ్డాయి. అలాంటప్పుడు మనం ఏ కొండలోని పదార్థాన్ని తీసుకున్నా, చెట్టులోని పదార్థాన్ని తీసుకున్నా అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ పరీక్షించినప్పుడు దానిలో మనకి మట్టి రేణువులే తప్ప వేరే ఏ పదార్ధం కనపడదు కదా ! అంటే దీని అర్థం ఏమిటీ? వస్తువులన్నీ ఏ పదార్ధం తో చేయబడతాయో ఆ వస్తువుని మనం ఛేదనం చేసి చూసినప్పుడు మనకి అదే పదార్ధం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ విషయం మనం బ్రహ్మ పదార్థానికి కూడా అన్వయించుకోవచ్చును. అంటే దీని అర్థం ఏమిటీ? ఈ సృష్టిలోని అన్ని వస్తువులు కూడా ఈ భూమండలం, 14 లోకాలు, నక్షత్రమండలం, ఆకాశం, చెట్లు-చేమలు మొదలైన సమస్త వస్తువులు కూడా మరి బ్రహ్మముతోటే తయారు చేయబడి ఉన్నాయి. దానిలో మనం ఏ పదార్థాన్ని పరీక్షించినా ఆ బ్రహ్మ యొక్క పదార్ధం తప్ప ఇంకొకటి మనకు కనిపించదు. ఇక్కడ మనకు ఒక పెద్ద సందేహం వస్తుంది. మనం బ్రహ్మము గురించి దాదాపు 20 లక్షణాలు చెప్పుకున్నాం. షడ్భావవికారాలు లేవని, పరిచ్చేదం కానిదని, అఖండమైనదని, నిరాకారమైనదని, త్రిగుణముల చేతను మలినం కాబడదని ఏ ఒక వస్తువు లేనిది నిరాకార, నిర్గుణ రూపమని ఇలా మనం ఎన్నో లక్షణాలు చెప్పుకున్నాం. ఇంద్రియగోచరం కాదని కూడా చెప్పుకున్నాం. మరి అటువంటి బ్రహ్మములోనుంచి మనకు బ్రహ్మానికి విరుద్ధమైన లక్షణాలతో కనిపించే సృష్టి ఎలా వచ్చింది? మనకి కనిపించే సృష్టి సాకారం, షడ్భావవికారాలు ఉన్నవి, ఇంద్రియగోచర, త్రిగుణముల చేత మలినం కాబడినది అని మనం బ్రహ్మమునకు విరుద్ధంగా ఉన్న లక్షణాలతో కూడి ఉన్న సృష్టినే కదా మనం చూస్తున్నాం . ఇది ఎలా సాధ్యం? అనే ఒక పెద్ద ప్రశ్న మనకు రావడం అతి సహజం. మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. నీరు ఎలా ఏర్పడింది? కళ్ళకి కనిపించని ఆక్సిజన్ వాయువు, అలాగే కంటికి కనపడని హైడ్రోజన్ వాయువు యొక్క సమ్మేళనమే కదా నీరు !
(...... continued ......)

19 February 2017

దేవదత్తుని వృత్తాంతం

          దేవదత్తుని వృత్తాంతం - 2

                          ప్రతి నాణానికి రెండువైపులు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడైతే దైవీ సంపద విజృ౦భిస్తుందో అప్పుడు  అవతార పురుషుడు భూమ్మీద ప్రజలని ఉద్ధరించడానికి వస్తాడు. అదేవిధంగా దానికి కొన్ని వందల రెట్ల అసుర శక్తులు కూడా అవతరిస్తాయి. పైకి వారు సామాన్యంగానే సత్ప్రవర్తన ఉన్నట్టుగా కనిపిస్తారు కాని వాళ్ళలో అజ్ఞానం, అహంకారం, అరిషడ్వర్గాలనే దుష్టశక్తులు,అసురశక్తులు విజృ౦భిస్తూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికపరంగా తక్కువ పరిణామ౦లో ఉన్నవారికి అర్థం కాని సమస్య. అందుకే వాళ్ళు తికమక పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అసురశక్తులకి అద్భుతమైన వాక్చాతుర్యం, ఎంతో కొంత పాండిత్య ప్రవేశం ఉంటుంది. దేవతాశక్తులు ఎక్కువగా మౌనంగానే ఉండి తమ శక్తుల్ని మరుగుపరచుకుని ఉంటారు. పైకి వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటూ ఉంటారు. ఇదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, మాటల్లో చెప్పలేనటువంటి సాక్షాత్తు ఆ శ్రీపాద దత్త స్వామి యొక్క బ్రహ్మాండమైన తేజస్సుతో మానవరూపంలో అవతరి౦చిన ఈ పీఠికాపురంలో కూడా ఎన్నో అసురశక్తులు కూడా ప్రవేశించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి పవిత్రమైన భూమిలో సాక్షాత్తు దేవుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులవారిని దత్తుని రూపంలో, మహా పండితులని చెప్పబడే మనుష్యులు కూడా గుర్తించలేకపోయారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా, లౌకిక ప్రపంచం కన్నా ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. కాని అమాయకులైనటువంటి మానవులందరూ కూడా ఈ దైవిక శక్తుల కన్నా అసుర శక్తులకి ఎక్కువగా దాసోహమంటారు.  పూర్వజన్మలో ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేసినవాళ్ళుకూడా చాలాసార్లు ఈ మాయాప్రభావానికి లోబడి ఎంతో కొంత దత్తాత్రేయుని అనుగ్రహం ఉన్నప్పుడు, కొద్దిగా చెడు అనుభవాలు జరిగినా, వాళ్ళు ఈ మాయనుండి బయటపడడం జరుగుతుంది. ఆ అసురశక్తులని ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు. సాక్షాత్తు షిర్డీ సాయిబాబా గారు కూడా ఈ మాయను జయించడానికి చాలా కష్టపడ్డారని చెప్పడం జరిగింది.

            పీఠికాపురంలో అప్పటిపరిస్థితుల్లో  ఉన్న రాజకీయాలు అంటే ఆధ్యాత్మికపరంగా ఎన్నో ఉంటూ ఉండేవి. బ్రాహ్మణోత్తములుగా చెప్పబడ్తున్న వారు కూడా ఈ అవతారాన్ని గుర్తించలేక పోయారు. చాలా మంది ఈ కలియుగంలో దత్తుని భక్తులుగా చెప్పబడుతూ, పైకి భక్తిని నటిస్తూ కొన్ని లక్షలమంది సామాన్య జనుల్ని మోసం చేసి చాలా ధనాన్ని, భూసంపదలని సంపాదించుకున్నారు. వారి పేరుప్రఖ్యాతులు ఎంతగా ప్రాకిపోయాయంటే నిజమైన దత్త భక్తులు వారు చేస్తున్నటువంటి మోసాలని గ్రహించి, కొంతమంది జనాలనైనా భ్రష్టులుగా కాకుండా ఉండాలనే సదుద్దేశ్యంతో వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కపట సన్యాసులు, ఈ కపట భక్తుల వల్ల వారికి ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, ఒక్కొక్కసారి మృత్యువాతపడడం కూడా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది.

            ఇలా ధ్యానస్థితిలో దేవదత్తుని మనోనేత్రాల ముందు అన్ని పరిస్థితులు అవగతమవుతూ ఉన్నాయి. దానికి ఆయన కొంత క్షేదపడసాగాడు. ఇలా ధ్యానస్థితినుండి ఆయన ఒక్క క్షణకాలం ఈ మాయా ప్రపంచంలోకి వచ్చారు. వచ్చే ముందు ఆయన మనోనేత్రానికి ఎదురుగుండా ఎంతో తేజస్సుతో ఉన్న ఒక యువకుడు కనిపించాడు. దత్త మహాప్రభువు యొక్క సూచన ఆయనకి పరావాక్కులో అందింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఒక పాతికేళ్ళ వయస్సు ఉన్న యువకుడు కనిపించాడు. అతని ముఖంలో ఎంతో తేజస్సు, ప్రశాంతత, కుతూహలం కనిపించింది. అతని మనోనేత్రానికి ఆ యువకుడు శంకరభట్టు వంశానికి చెందిన వ్యక్తి లాగా అనిపించాడు కాని అది ఆయన బయట పడనీయలేదు. ఆ ఎదురుగా ఉన్న యువకుడు మెడలో జంధ్యం వేసుకుని, ముఖాన విభూతి రాసుకుని, పంచ కట్టుకుని ఎంతో శ్రద్ధాభక్తులతో దేవదత్తునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, అంజలిఘటించి, ఎంతో వినమ్రంగా ఇలా అన్నాడు. “స్వామీ! నా పేరు నాగనాథుడు. నా పూర్వీకులు కన్నడదేశంలో ఉండేవారు. ప్రస్తుతం నేను ఈ తెలుగుగడ్డలో నివసిస్తున్నాను. మా వంశ పారంపర్యంగా దత్తుని మేము ఆరాధన చేస్తూ ఉంటాం. నాకు ఒక వారం రోజులక్రితం మీరు దత్త దీక్షలో ఉండగా, ఏకముక్తంతో ద్రుత పారాయణం చేస్తూ ఉండగా నాకు స్వప్నంలో ఒక అద్భుతమైన పురుషుడు, మహానుభావుడు కనిపించాడు. అలాగే నాలో ఒక దివ్యవాణి నాకు నీవు ఫలానా రోజున పిఠాశ్రీపీఠికాపురంలో స్వయంభూ ఆలయం దగ్గర ఒక వృక్షం దగ్గర ఉన్న ఒక మహానుభావుడ్ని కలవవలసిందిగా ఆజ్ఞాపించారు. నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలతో పదేపదే ఈ స్వప్నం గురిచి ఆలోచిస్తూ ఉండగా, అది కలయా, నిజమా, భ్రాంతియా అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ మరుసటి రోజు కూడా అదే స్వప్నం రాసాగింది. లోపల ఎంతో వేదన కలిగి నేను ఈ ప్రదేశానికి వచ్చాను. ఇక్కడ మీరు ఎంతో నిశ్చలంగా ధ్యానస్థితిలో ఉన్నారు. మీ చుట్టూతా ఒక అద్భుతమైన కాంతిని నేను చూడగలిగాను. దానితో నాకు ఎంతో మనఃశాంతి, ఏదో తెలియని ఆనందం, ఆనందకరమైన అనుభూతులు కలిగాయి. మీరు తప్పకుండా ఎవరో మహాత్ములు, మహానుభావులని నాకు తెలిసిపోయింది. నేను దాదాపు మూడుగంటల నుండి ఇక్కడే నిల్చుని మిమ్మల్నే తదేకంగా చూస్తున్నాను. మీరు ఏమాత్రం చలనం లేకుండా సమాధిస్థితిలో ఉండడం చూసి నాకు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. ఈ కలియుగంలో నేను ఎంతో మంది దత్త భక్తులని చెప్పబడే సాధువులని, సన్యాసుల్ని చూశాను. వారి దర్శనభాగ్యం చేత నాకు ఎటువంటి శాంతి కల్గకపోగా ఎంతో అశాంతికి గురి అవుతూ ఉండేవాడిని. నేను దత్తభక్తున్ని కావడం వల్ల పరిపరి విధాలుగా ఆ దత్తాత్రేయున్ని అనేకవిధాలుగా నాకు దత్తతత్వాన్ని చెప్పి అసలైన, నిజమైన మహాత్ముని దర్శనం చేయించమని ఆర్తితో పదేపదే ప్రార్థిస్తూ ఉండేవాడిని. స్వామీ ! ఇన్నాళ్ళకి ఆ దత్తాత్రేయుడు నన్ను అనుగ్రహించాడు. మీ దగ్గరకి పంపించాడు. మీరే నన్ను ఉద్ధరించాలి. ఈ కలియుగంలో మా చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి అనేక విషయాలు మేము గమనిస్తున్నప్పుడు మాకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అనేది అర్థం కావడంలేదు. ఒక అయోమయస్థితిలో ఉండిపోయాము. మా  ప్రశ్నలకి సరి ఐన సమాధానాలు చెప్పేవారు ఎవరూ లేరు. అసలు దత్తాత్రేయుని తత్త్వం ఏమిటీ? అది ఒక అనంతమైన ఆధ్యాత్మిక చైతన్యం అని తెలుసు కాబట్టి మరి ప్రస్తుత౦, నేను చూస్తున్నటువంటి దత్తభక్తులని చెప్పబడేవారు పరస్పర విరుద్ధంగా  ప్రవర్తిస్తున్నారు. అందుకని నేను కొంత అయోమయస్థితిలో ఉన్నాను. దయచేసి నా సందేహాలని నివృత్తి చేసి నాకు నిశ్చల భక్తిని ప్రసాదించండి” అని కన్నీళ్ళతో దేవదత్తుడ్నివేడుకొన్నాడు.      

                     
                      నేను ఆ యువకుడిని చూసి చాలా సంతోషపడ్డాను. అతని యొక్క భావతరంగాలు ఎంతో పరిశుద్ధంగా, స్వచ్చంగా, నిర్మలంగా ఉన్నాయి. అతను ఎంతో ఆర్తితో ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలను ముఖ్యంగా దత్తాత్రేయునితత్వం తెలుసుకోవాలని ఉన్నాడని నాకు అర్థం అయింది. అతను ఎన్నో జన్మలనుండి ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది ఉన్నాడు. అందుకనే అతనికి సాక్షాత్తు దత్తాత్రేయుల వారి మీద భక్తి కలిగింది. అందులో అతను శంకర భట్టు వంశానికి చెందినవాడు కదా! అని నేను నా మనస్సులో ఆలోచించుకున్నాను. చిరునవ్వు నవ్వుకుని, “నాయనా! నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు వస్తావని నాకు మనస్సులో ఎంతో అనిపిస్తూ ఉండాలి. నీ సందేహాలని నేను నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. కాని నాయనా, దత్తాత్రేయుని తత్వం తెలుసుకోవడం అంత సులభం కాదు. అది అనంతమైనటువంటి శక్తి. అన్ని రూపాల్లో, అన్ని శక్తులలో అది ఏవిధంగా అయితే మహాసముద్రంలో అన్ని సముద్రాలు, నదులు, తటాకాలు, సరస్సులు, సెలయేళ్ళు కలిసిపోతాయో అదేవిధంగా చరాచర సృష్టి అంతా అందులోనే తత్వాలు, లక్షణాలు అన్నీ కూడా ఇటువంటి మహాచైతన్యంలో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినట్టి ఒక చిన్న నీటిబిందువంత ఆ దత్తాత్రేయునితత్వాన్ని చెప్పడానికి ఆ దత్తుడి యొక్క అనుగ్రహాన్ని అర్థించి నీకు నేను చెప్తాను. సందర్భానుసారంగా దత్తుని పేరుతొ నా నోటినుండి ఏ సమాధానాలు వస్తాయో అవి నీవు గ్రహించు గాక !”  అయితే మనమొకసారి ఈ పీఠికాపురం లో మామూలు వ్యక్తులవలె నడుచుకుందాం” అని చెప్పి అతనితో కూడి వారు మరొక్కసారి అక్కడ కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయునికి నమస్కరించి బయటకి వచ్చారు. బయటకి రాగానే వారు శ్రీపాద శ్రీవల్లభులవారి దేవస్థానానికి దారి చూపించమని ఇద్దరు ముగ్గురు ఆగంతుకులని అడిగితే వాళ్ళు మాకు తెలియదని చెప్పారు. ఈ సమాధానం వినేసరికి దేవదత్తునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి ప్రఖ్యాతి దేశదేశాలా వ్యాపించి అనేకదేశాల నుండి మహా భక్తులు ఆయన్ని దర్శించడానికి వస్తుండేవాళ్ళు. అటువంటి అ మహానుభావుని యొక్క మరి నివాసం ఎక్కడ ఉందని అడిగినప్పుడు మాకు తెలియదని చెప్పితే చాలా ఆశ్చర్యం అనిపించింది. “ఆహా ! యేమిరా ఈ కలియుగ మానవులు ! అట్టడుగు స్థాయికి వచ్చారు!” అని కించిత్తు అయన బాధ పడ్డాడు. అప్పుడే అక్కడకి వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారికి “మీరు వేణుగోపాలస్వామి వారి ఆలయం దగ్గరకి వెళ్ళండి. అక్కడే శ్రీపాదశ్రీవల్లభులవారి సంస్థానం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు అలాగే అక్కడకి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ దేవ దత్తుడు సామాన్య మానవుని వలె ప్రవర్తించాల్సి వచ్చింది కాబట్టి ఆయన మానవధర్మం ప్రకార౦ తన శక్తులని ఏమాత్రం ఉపయోగించకుండా అలాగే ఆ మార్గం గుండా పయనించ సాగారు. ఆయన దృష్టిగోచరానికి కనిపించనిదంటూ ఏమీ ఉండదు కదా! కాని ఆయన తన మహిమల్ని మరుగుపరచుకుని ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మౌనంగానే ఆ దారిన నడుస్తున్నారు. ఆ దారి అంతా ఇరుకుగా ఉండాలి. అటుప్రక్కన ఇటుప్రక్కన మురికినీళ్ళు. ప్రజలందరూ  ఏమాత్రం క్రమశిక్షణ లేకుండానే మంచం మీద పిల్లాపాపలతో సంభాషణలతో, అరుపులతో కేకలతో ప్రవర్తించడం గమనించాడు. అలాగే వాళ్ళు మార్గమధ్యంలో వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ అడుక్కుంటూ చివరకి వేణు గోపాల స్వామి ఆలయం వీథిలో ప్రవేశించారు. వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైనది. దానికి ముందుగానే వారికి స్వామి వారు నివసించిన గృహం కనిపించింది. దాన్ని సాక్షాత్తు వాసుదేవానంద సరస్వతి గారే తమ తపశ్శక్తితో కనుక్కున్నారని చెప్పడం జరిగింది.

                        అక్కడ లోనికి ప్రవేశించగానే సామాన్యదుస్తుల్లో కనిపించిన visitors ని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా చెప్పారు. అక్కడ పూజ చేసేందుకు కొద్దిగా దక్షిణ ఇవ్వమని చెప్పారు. ముందుగా వారిద్దరూ కూడా శ్రీపాదశ్రీవల్లభ స్వామి, నృసింహ స్వామి విగ్రహాలకి నమస్కారం చేసుకున్నారు. పైకి సామాన్య మానవునివలేనే ప్రవర్తించవలసి వచ్చింది కాబట్టి సంకల్పమాత్రంతో కావలసినంత దక్షిణ చెల్లించుకుని అర్చన చేయించుకున్నారు. ఆహా ! ఏమి ఈ విధీవైపరీత్యం ! ఎంత విశాలంగా పెద్ద పెద్ద గదులతో వెనకా ముందు బోలెడంత ఖాళీ స్థలంతో ఉండే ఇల్లు ఇలా అయిపోయిందే! అని ఆయన కించిత్తు బాధపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. వెనక ఎన్నో పూల చెట్లు, తులసి మొక్కలు, కొబ్బరి చెట్లు, బావితో విశాలంగా ఉండేది. ముందు వైపు కూడా చాలా విశాలంగా పెద్ద పెద్ద అరుగులతో ఉండేది. ప్రక్కనే పశువులగొట్టంలో ఆవులు ఉంటూ ఉండేవి. పటిష్టమైన గోడలతో, దృఢమైన స్తంభాలతో ఎంతో వైభవంగా కళకళలాడుతూ ఉండేది. అక్కడ వాళ్ళు డబ్బు చెల్లించారు. అక్కడకి వచ్చిన భక్తులు చాలా మంది కన్నడ దేశస్థులు, మరాఠి దేశస్థులు కనిపించారు. అక్కడ భోజనాల కోసం ఎత్తైన బల్లలు అమర్చారు. స్టీల్ డైనింగ్ టేబుల్స్ ని వారు అమర్చారు. అని నాగనాథుడు చెప్పాడు. ఆహా ! ఏమిటో పద్ధతులన్నీ మారిపోయాయి. హాయిగా క్రింద దర్భచాపలు వేసుకుని , సుఖాసనంలో కూర్చుని, ఆచమనం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో అతిథులకి, భక్తులకి వడ్డిస్తుంటే ఆ కమ్మని భోజనం దేవీప్రసాదంగా తింటూ ఉండే ఆ దృశ్యం ఆయన కళ్ళకి గోచరించింది. కాని మామూలుగానే ఆయన తన భోజనాన్ని ముగించారు. దురదృష్టవశాత్తు ఆయన చేస్తున్న భోజనంలో ఒక క్రిమికీటకం కనిపించింది. అది నాగనాథుడు చూసి చాలా బాధ పడ్డాడు. ఆ వడ్డించేవాడిని పిలిచి ఇది ఏమిటీ భోజనంలో పురుగు వచ్చింది అని చెప్పగా అతడు చాలా నిర్లక్ష్యంగా “బొద్దింకయే కదా ! తీసి ప్రక్కన అవతల పడేసి భోజనం చేయండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న నాగనాధుడికి, దేవదత్తుడికి చాలా బాధ అనిపించింది. ఎంతో భక్తిశ్రద్ధలతో , మడి కట్టుకుని శుభ్రంగా వంటగది పరిశుభ్రం చేసి, పాత్రలన్నీ శుభ్రంగా తోమి, ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా శ్రద్ధగా ఇక్కడకి వచ్చిన భక్తులకి భోజనం పెట్టవలసిన ఈ ప్రదేశంలో వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఏమాత్రం భక్తులపట్ల శ్రద్ధ లేకుండా  వాళ్ళకి భోజనం వడ్డించడం చాలా విడ్డూరంగా అనిపించింది. అయితే ఇప్పుడు దేవదత్తుడు కొద్ది కొద్దిగా ఈ కలియుగ మానవుని అర్థం చేసుకోగలుగు తున్నాడు కాబట్టి, ఆశ్చర్యం కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. సరే మిగతా సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడాలని అనిపించింది. అక్కడకి భక్తులు రాగానే వారికోసం కొన్ని గదులు కేటాయిస్తారు. వాళ్ళకి కేటాయించిన గది తలుపు తెరిచేసరికి, ఆయన అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయాడు. ఒక చెక్క మంచం, దాని పైన మాసిపోయి అసహ్యంగా ఉన్న దుప్పటి పరిచి ఉంది. గదంతా చెమట దుర్వాసనతో నిండి ఉంది. శ్రీపాదశ్రీవల్లభుల వారు స్వయంగా నివసించిన ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఈ భగవంతుని శక్తి ఇటువంటి అపవిత్రమైన మనుష్యుల మధ్య ఎలా ఉంటుంది అన్నది ఆయన గ్రహించాడు. ఆయన మనోనేత్రానికి అక్కడ శక్తి చాలా మటుకు మటుమాయమైపోయిందని తెలిసిపోయింది. అక్కడ కార్యకర్తల మనస్సులో డబ్బు సంపాదించడం తప్ప వేరే ఆలోచన లేదు. శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి యొక్క మహిమలను ఊహించుకుని, ఇంకా ఎన్నో అబద్దాలని కల్పించి  చెప్పుతూ, అక్కడకి వచ్చిన భక్తుల దగ్గరనుండి చాలా డబ్బులు వాళ్ళు లాగుతున్నారు. అక్కడ పారాయణం చేసుకోవడానికి డబ్బులు, ఎంతో కొంత దక్షిణ ఇచ్చినవారికి మర్యాదలు చేస్తున్నారు. ఆయన మనోనేత్రానికి వారసులు ఎవరూ అక్కడ కనిపించలేదు. మనసులన్నీ భావకాలుష్యంతోనే నిండి ఉన్నాయి. అక్కడనుండి బయలుదేరి బయటకి రాగానే అక్కడ కాషాయవస్త్రం ధరించిన ఇంకొక యువకుడు కనిపించి ద్విచక్రవాహనం(స్కూటర్ or బైక్) మీద వెళ్ళుతూ, అది ఒక్క నిమిషం ఆపి దేవదత్తుడికి నమస్కరించి “అయ్యా ! మీరు ఎక్కడకి వెళ్ళాలి?” అని అడిగాడు. దానికి సమాధానంగా నాగనాథుడు ఇటుపైన ఉన్న బాపనార్యులుగారి ధాన్యాగారానికి వెళ్ళాలి అని చెప్పాడు. అతను మేము కూడా దత్తాత్రేయుని భక్తులమే అని చెప్పి విసురుగా, నిర్లక్ష్యంగా అక్కడ్నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నాగనాథుని మరియూ దేవ దత్తుని ఆలోచనలు ఒక్క మాదిరిగానే ఉన్నాయి అదేమిటీ ఆ వచ్చినతను దత్తభక్తుడని చెప్తున్నాడు మరి వీళ్ళుకూడా దత్తభక్తులే కదా! మరి వీళ్ళకి వాళ్లకి పడకపోవడం ఏమిటీ అని ఆలోచించారు. దేవదత్తుడిగారికి మాత్రం శ్రీ పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు ఉన్నప్పుడే ఎన్నోరాజకీయాలు, వదంతులు, పుకార్లు ఉన్నాయి అని తెలుసును. అవి ఇప్పటికి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువగా విజృ౦భి౦చాయి. కనీసం ఇప్పటికి ఇక్కడ నిజమైన పుణ్యాత్ములు, దత్త భక్తులు శ్రీపాదశ్రీవల్లభుల మహిమ తెలుసుకుని గుర్తించినవారు ఉన్నారు కాని ఇక్కడ ఇంతవరకు వాళ్లకి కనిపించలేదు. సరే ! అక్కడ బాపనార్యులు గారి ధాన్యాగారం ఉన్నది కదా! అది చూద్దామని వాళ్ళు బయలుదేరారు. మెల్లగా నడుస్తూ ఉన్నారు ఆ ఇరుకు సందుల్లో. ఎక్కడ చూస్తే అక్కడ మురికి వాసన, పందులు అక్కడా హాయిగా స్వైరవిహారం చేస్తున్నాయి. అలాగే వాళ్ళు వెళ్ళుతూ ఉన్నారు. మొత్తానికి ఎలాగో అలాగ కష్టపడి నాగనాథుని సహాయంతో బాపనార్యులు గారి ధాన్యాగారం చేరుకున్నారు. అది ఒక పెద్ద విశాలమైన ప్రాంగణం. ఒకప్పుడు ఈ ప్రాంగణం అంతా కూడా ధాన్యాలతో నిండి పోయి ఉండేది. వచ్చినవారందరికీ అక్కడ భోజన సదుపాయాలూ చేస్తుండేవారు. దూరప్రాంతాల నుండి వచ్చేవాళ్ళకి అక్కడ ఉండడానికి వసతిసౌకర్యాలు కూడా బాపనార్యులు గారు చేస్తూ ఉండేవారు. ఎంతో శోభాయమానంగా, కళకళ లాడుతూ, పట్టువస్త్రాలు ధరించి సాక్షాత్తు దేవతామూర్తుల లాగా కనిపించే స్త్రీలతో అది ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. ప్రస్తుతం అది ఎంతో కళావిహీనంగా కనిపించింది. 

ఉపనిషత్తులు-3:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


                      ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం  (continued....)

             బ్రహ్మము అద్వితీయం, అవిభాజ్యం. బ్రహ్మము అద్వితీయం ఎందుకంటే అది నిరంతరం సాగుతుండే ఒక మహా చైతన్య శక్తిగా మనం చెప్పుకున్నాం కదా ! ఇక్కడ ప్రతి పరమాణువులో, సృష్టిలో ప్రతి చోట ఈ బ్రహ్మము వ్యాపించి ఉన్నది. దీనికి ఆది లేదు , అంతం లేదు కాబట్టి అక్కడ మూడవ వస్తువు అనే మాటకి అసలు అర్థమే లేదు. బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి మహాచైతన్యం కనుక , రెండవ వస్తువు లేదు కనుక శాస్త్రంలో ఇది అద్వితీయమని చెప్పడం జరిగింది. బ్రహ్మము   అంటే మనకి ఈ సృష్టిలో జాగరణవస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ అని మూడు అవస్థలు ఉన్నాయి. అంటే మెలకువగా గాని, నిద్రలో గాని, నిద్రలో స్వప్నంలో కాని చూడడం  అని ఈ మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలకి భిన్నంగా ఉన్నదే తురీయవస్థ. అంటే ఈ బ్రహ్మకి జాగరణవస్థ కాని, కలలు కనే అవస్థ కాని నిద్ర పోయే అవస్థ కాని ఈ మూడు అవస్థలు లేవు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక మహా చైతన్య శక్తి కనుక అది ఎప్పుడూ కూడా స్పృహలో ఉంటుంది. తెలివిగా తురీయ అవస్తలోనే ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మము తురీయముగా పెద్దలు చెప్పుతూ ఉంటారు. బ్రహ్మమునకు శరీరము కాని మనస్సు కాని లేవు. అది నిరాకారము. మనస్సు లేనందువల్ల ఎటువంటి సంకల్పం ఉండే ఆస్కారం లేదు. అంతే కాకుండా బ్రహ్మము సర్వస్వతంత్రము, అఖండమైన, అనంతమైన మహా చైతన్య శక్తి గా ఉండే ఈ బ్రహ్మమునకు ఎవ్వరినీ శాసించే శక్తి లేనే లేదు. ఎందుకంటే బ్రహ్మము అద్వితీయం, రెండవది లేదు కనుక. సర్వ వ్యాపకత్వం, సర్వ శక్తిత్వం, సర్వ స్వతంత్రం అనే లక్షణాలు కలిగినటువంటి ఈ మహా చైతన్య శక్తి స్వరూపమే ఈ బ్రహ్మము అని చెప్పుకొనవచ్చును. 


                    బ్రహ్మమునకు ఉన్న ఇంకొక లక్షణం అది ఏమిటంటే స్వయంప్రకాశం. ఇక్కడ ప్రకాశం అనే అర్థానికి మనం వెలుగుగా తీసుకుందాం. బ్రహ్మం అద్వితీయం కనుక ఈ బ్రహ్మమును ప్రకాశింపజేసే ఏ ఒక్క వస్తువైనా లేనే లేదు, ఇది స్వయం ప్రకాశం. ఇంకొక లక్షణం బ్రహ్మమునకు అది ఏమిటంటే అది అనిర్వచనీయం. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మనం నిర్వచించ లేము కనుక బ్రహ్మము అనిర్వచనీయముగా మనం చెప్పుకొనవచ్చును. ఈ బ్రహ్మము ఇలా ఉంటుంది అని చెప్పిమనం ఎటువంటి వర్ణనలు చేయలేము అందుకని  బ్రహ్మము అనిర్వచనీయమని శాస్త్రాలు చెప్పుతూ ఉన్నాయి. ఇంకొక ముఖ్య లక్షణమేమిటంటే బ్రహ్మమునకు త్రిపుటి లేనేలేదు. త్రిపుటి అంటే ఏమిటీ? ఈ లోకంలో మనం ఏదైనా ఒక వస్తువుని పొందడానికి సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం ఆ వస్తువుని సాధిస్తామో అప్పుడు దాన్ని సాధ్యం అని అంటాం. మనం చేసే ప్రయత్నాన్ని సాధన అని అంటాం. ఎవరైతే ఈ సాధనని చేస్తూ ఉంటారో వారిని మనం సాధకుడు అని అంటాం. అంటే ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి. సాధకుడు, సాధన  సాధ్యం. ఈ మూడింటినీ కలిపి మనం త్రిపుటిగా పేర్కొనవచ్చును. అయితే ఈ బ్రహ్మమునకు ఈ మూడు కూడా లేవు. ఇది ముఖ్యమైన లక్షణం. అంటే బ్రహ్మంలో సాధన, సాధకుడు, సాధ్యం అనే ఈ మూడూ లేనే లేవు. ఈ బ్రహ్మమునకు మరి యొక లక్షణమేమంటే సాధ్యము. మరి సాధ్యము, అసాధ్యం అని చెప్పుతున్నప్పుడు మరి ఎందుకు మనం ప్రయత్నం చేయడం అనే ప్రశ్న మీకు వెంటనే స్పురిస్తుంది. ఇక్కడ అసాధ్యం అంటే దాని లోపల ఒక పరార్థం, గూడార్థం ఉంది. లోగడ మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మంలో త్రిపుటి లేదు. సాధన, సాధకుడు, సాధ్యం ఈ మూడూ లేనే లేవు దీని అర్థం మరి ఏమిటీ ? అని అంటే ఎప్పుడైతే సాధకుడు తన నిరంతర సాధన ప్రయత్నంలో తాను వేరు, తన సాధన వేరు , తాను పొందవలసిన వస్తువు వేరు అనే భ్రమలో లేకుండా నేనే ఆ బ్రహ్మం అనే ఏక భావన వచ్చినప్పుడు ఆ సాధకుడు బ్రహ్మని అనుభవిస్తాడు, కాని సాధించడు. మన లౌకిక వ్యవహారంలో ఏదన్నా ఒక వస్తువును పొందడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. డబ్బు సంపాదించే మార్గం కోసం మనం ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తాం. వ్యాపారం చేయవచ్చును, ఉద్యోగాలు చేయవచ్చును ఇంకా ఇతరేతర ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడైతే మనం ధనాన్ని సంపాదిస్తామో , సాధిస్తామో అది సాధించిన తర్వాత కూడా ఆ సాధకుడు మిగిలే ఉంటాడు. కాని ఇక్కడ ఎప్పుడైతే సాధకుడు త్రిపుటిని దాటి తానె బ్రహ్మం అని అనుభూతి చెందుతాడో అప్పుడు ఆ సాధకుడు బ్రహ్మములో ఐక్యమైపోతాడు. అప్పుడు సాధకుడు మిగిలి ఉండడు. అంటే దీని అర్థం ఏమిటీ? బ్రహ్మం సాధించబడేది కాదు. కనుక అది అనుభవించాలే తప్ప సాధించవలసినది ఏమీ లేదు అని దీనిలో సూక్ష్మార్థం. బ్రహ్మం ఉండడానికి మూలకారణం అంటూ ఏమీ లేదు. ఏ కారణం చేత బ్రహ్మం ఉంది అని చెప్పడానికి రెండో వస్తువు లేదు కనుక ఈ బ్రహ్మమునకు , బ్రహ్మం యొక్క ఉనికికి ఏదీ కూడా కారణభూతం కానే కాదు. కేనోపనిషత్తులో ఒక చోట  ఎవరైతే నాకు బ్రహ్మం గురించి తెలుసు అని చెప్తారో , నిజానికి వాళ్లకి బ్రహ్మం గురించి ఏమీ తెలియదని చెప్పవలసి వస్తుంది. ఇంతవరకు బ్రహ్మము యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఈ లక్షణాలన్నీ ఉపనిషత్తు లోని వాక్యాలే. కేనోపనిషత్తు, కఠినోపనిషత్తు, భగవద్గీత , ఉపనిషత్తు, వేదాంత పంచదశ  ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మం గురించి, వాటి లక్షణాల గురించి చెప్పడం జరిగింది. (మొదటి అధ్యాయం సంపూర్ణం.)
“ఓం బ్రహ్మానందం పరమసుఖదం  కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం  తత్వమత్స్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం  సర్వాది సాక్షీభూతం, భావాతీతం, త్రిగుణ రహితం సద్గురుం త్వం నమామి”  అహం బ్రహ్మోస్మి ఓం  శాంతి, శాంతి , శాంతి .

(The end of 1st Chapter )

18 February 2017

దేవదత్తుని వృత్తాంతం

                              దేవదత్తుని వృత్తాంతం - 1

                  పూర్వం దేవదత్తుడనే ఒక పరమ భక్తుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ వారి భక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో జన్మలనుంచీ ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఎంతో పుణ్యసంపదని  ప్రోగు చేసుకున్నాడు. దాని ఫలితం వల్ల దత్తాత్రేయుల వారి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభించాయి. అతను నిరంతరం శ్రీ దత్తాత్రేయులవారి ధ్యాసలోనే ఉండి ఆయనతో ఒక  మానసికమైన అనుసంధానం ఏర్పరచుకున్నాడు. కూర్చున్నా, లేస్తున్నా, పడుకున్నా, భోంచేస్తున్నా, ఏ పని చేస్తున్నా 24 గంటలు కూడా  ఆ దత్తాత్రేయులవారి స్మరణలోనే, ధ్యానంలోనే  ఉంటూ ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధ ఎంత గొప్పదంటే స్వయంగా ఆ దత్తాత్రేయులవారు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తుండేవాళ్ళు. శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల అతనికి పవిత్ర హిమాలయాలలోని  ద్రోణగిరి లోని శంబల అనే పవిత్రమైన ప్రదేశంలో స్థానం లభించడం జరిగింది. శంబల అని అంటే దీనికి నానా అర్థాలు ఉన్నాయి. ‘శం’ అంటే ‘మంచిది’, ‘బల’ అంటే ‘శక్తి’. ఇక్కడ ‘మంచి శక్తి’ అంటే అద్భుతమైన దైవిక శక్తి ఘనీభవించి  మొత్తం విశ్వానికి అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానూ, యోగపరంగా విశ్వానికంతటికి కుండలిగా వ్యవహరింప బడుతూ ఉండేది. ఈ అద్భుతమైన ప్రదేశంలో ప్రవేశించడం అంటే మన అదృష్టం పండినట్లే ఎందుకంటే ఎంతో పుణ్యం సంపాదించుకున్నవాళ్ళే ఇక్కడకి రాగలుగుతారు. ఇక్కడనుంచే కలికి అవతారం రాబోతుందని భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉంది. నిరంతరం ఈ దేవదత్తుడు సమాధి స్థితిలో సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి తేజో రూపంతో అనుసంధానింప బడుతూ ఉండేవాడు. ఇక్కడ కాల, ప్రదేశం అనే సిద్ధాంతం వర్తించదు. ఇక్కడ కాలం ఒక అనంత ప్రవాహ లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కాలమానానికి ఎక్కడా పోలిక ఉండదు. మానవులకి కాలం ముక్కలు, ముక్కలుగా విభజింప బడి ఉంటుంది. ఇక్కడ శంబలాలో కాలం నిరంతరం ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని అక్కడ ఎందఱో సాధువులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన అందరూ కొన్ని వేల సంవత్సరాలనుంచి ధ్యానం చేయగల స్థితిలో ఉంటారు. వారికి ఆకలి, దప్పులు ఉండవు. ప్రకృతియే వారిని సదా రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి అంతఃకరణం ఎంతో నిర్మలంగానూ, పవిత్రంగానూ  ప్రకృతి వలె స్వయంసిద్ధగానూ పరిశుద్ధం గానూ ఉంటుంది కాబట్టి.


                   ఇలా దేవదత్తుడు కొన్ని వేల సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండి విధివశాత్తు ఒకసారి లోపల ఎక్కడో దాగిఉన్నట్టి ఒక ఆలోచనా తరంగం బహిర్గతం కావడంతో అతను నెమ్మదిగా కనులు తెరిచాడు. అతని అంతరాతరాల్లో ఎక్కడో ఒక సారి మానవులు నివసించే ప్రదేశాలకి వెళ్ళాలని , ముఖ్యంగా దత్త క్షేత్రాలని దర్శించాలని ఆలోచన కలిగింది. ఆయన దానికోసం శ్రీ దత్తాత్రేయుల వారి అనుమతి కోరగా మానసికంగానే దత్తాత్రేయులవారు ఆయన అంతఃకరణలో కనిపించి “నీ మనస్సులో కలిగినట్టి ఈ సంకల్పం మంచిదే అయినప్పటికీ అది పూర్తిగా తీరితే కాని నీవు ఇంకా ఉన్నతస్థితికి వెళ్ళలేవు. కాబట్టి నీవు నీ సంకల్పాన్ని నెరవేర్చుకో. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకో. నీవు ఇప్పుడు వెళ్ళబోతున్న భూలోకపు పరిస్థితులు, మానవులు నీవు ఇదివరకు భూలోకంలో ఉన్నప్పటి మాదిరిగా ఉండవు. ఇప్పటివాళ్ళు చాలా భిన్నంగా ఉంటారు. అక్కడ నీవు చూడబోయే విషయాలని గమనించి ఏమాత్రమూ ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. అక్కడ నీ ఇష్టప్రకారం గానే అక్కడి పరిస్థితులని బట్టి నీ వేషం ధరించు. ఎట్టి పరిస్థితులలోను నీ మనస్సును  నిశ్చలంగానే ఒక ప్రేక్షకుడి మాదిరిగా నే వీక్షించు” అని కొన్ని సూచనల్ని దేవదత్తునికి ఇచ్చి తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతో సంతోషంతో ఎంతో వినయగా శ్రీ దతాత్రేయులవారికి సాష్టాంగ ప్రణామం పెట్టి, ఆయన  మానవులు నివసించే ప్రదేశానికి అదృశ్య రూపంలో తాను సంకల్పించినంత మాత్రాన తను కోరుకున్నటువంటి ఒక దివ్యమైన దత్తక్షేత్రానికి చేరుకున్నాడు. ఆయన మనస్సులో ఉన్న సంకల్పం మూలంగా శ్రీదత్తాత్రేయులవారు జన్మించినట్టి ఒక క్షేత్రానికి రావడం జరిగింది.


                         శ్రీ పాద శ్రీ వల్లభుల వారి జన్మస్థలం

               మొట్టమొదటిసారిగా సాక్షాత్తు శ్రీ దత్తప్రభువులు అవతారం ధరించినటువంటి శ్రీ పీఠికాపురానికి ఆయన రావడం జరిగింది. ఇక్కడ మొదటి అవతారమైనట్టి శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించారు. దేవదత్తుడు తనకళ్ళను తాను నమ్మలేకపోయినాడు. తాను చూసినట్టి పీఠికాపురానికి ప్రస్తుతం ఉన్న పీఠికాపురానికి ఎక్కడా పోలిక లేదు. ఏమీ సంబంధం లేదు. అతను ఆకాశంలో ప్రయాణిస్తూ పీఠికాపురానికి దగ్గరలో వస్తున్నప్పుడు అతనికి కించిత్తు బాధ కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఆకాశంలో ఉన్నటువంటి భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో కాలుష్యం ఆయన భరించ లేకపోయాడు. ప్రస్తుత పీఠికాపురానికి ఆ పట్టణంలోనే సామూహిక, మానసిక జన చైతన్యం యొక్క భావాలు పూర్తిగా కల్మషంతో నిండిపోయి ఉన్నాయి. స్వార్థం,  అహంకారం. మోసం, అజ్ఞానం, పరస్పర ద్వేషాలు, స్వార్థ చితన, ధనాపేక్ష, అధర్మ ప్రవర్తన,పరస్పర దూషణ, ఈర్ష్యా , అసూయ ద్వేషాలు అరిషడ్వర్గాలు విజ్రుంభించి ఆ చుట్టుప్రక్కల ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని దాటి అపవిత్రం చేస్తున్నాయి. ఆయనకి ఈ విషయాలేవీ అంతుపట్టకుండా ఉన్నాయి. సాక్షాత్తు భగవత్స్వరూపుడైనట్టి  దత్తాత్రేయుల వారి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీ పాద శ్రీ వల్లభుల వారు ఇక్కడ భరద్వాజ మహర్షి గుట్ట పైన వారు సాగించినటువంటి సావితృకాకచయనం కొన్నివేల సంవత్సరాల తర్వాత కాని ఎక్కడో సూర్య మండలం అవతల ఉన్న కొన్ని వేల బ్రహ్మాండాల వెనక కొన్ని కోట్ల సూర్య కాంతులతో ప్రకాశించే సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క ప్రకాశ పుంజం, శ్రీ భరద్వాజ మహర్షి అతి పవిత్రంగా మంత్రయుక్తంగా చేసినట్టి సావితృకాకా చయనం వల్ల ఆ సూర్యమండలం వరకు ఆయన ఆకర్షించ బడ్డాడు. ఇలా ఆకర్షించబడడానికి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అంత పట్టుదలతో, ఎంతో భక్తిశ్రద్ధలతో భరద్వాజ ముని ఇంకా అనేక ఋషులు దేవర్షులు సాగించినట్టి వేదయుక్తంగా, మంత్రయుక్తంగా చేసిన సావితృకాకచయనం వల్ల ఇక్కడ అవతారం ఎత్తినటువంటి పుణ్యభూమిలో ఇంత విపరీతపు పరిణామాలు వికృత ధోరణిలో ఇలా ఉన్నాయేమిటి? అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. శ్రీ దత్తాత్రేయుల వారు తనకి మర్మగర్భంగా చెప్పిన సూచనలు ఆయనకి గుర్తుకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఈ భావకాలుష్యం అంతటా వ్యాపించి ఉండడం ఆయన గమనించారు. అయితే ఇతను మహా శక్తిసంపన్నుడు కాబట్టి, దత్తాత్రేయులవారి కరుణాకటాక్షాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి శక్తియుతమైనటువంటి అసురశక్తుల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉన్నటువంటి ఈ భావ కాలుష్య తరంగాలని ఆయన శరీరం తట్టుకోగలిగింది.  


                 ఆయన మెల్లగా తెప్పరిల్లుకుని పూర్తిగా ఆ భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది. ఇక్కడ మనుష్యులంతా కూడా విచిత్రవేషధారణలో ఉన్నారు. వారు మాట్లాడే భాష కూడా అంత స్వచ్చంగా లేదు. వారి మనస్సులోని దురాలోచనలు బయటకి వాక్కు రూపంలో మాత్రం ఎంతో వికృతంగా ఉన్నాయి. ఎంతో కుతూహలంతో ఆయన మెల్లగా స్వామివారు జన్మించినటువంటి ప్రదేశానికి తన మనోనేత్రంతో ఆ ప్రదేశాన్ని చూసి రావడం జరిగింది. ఆయన తన కళ్ళని తానే నమ్మలేక పోయాడు. వీథులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆ గృహం కూడా కుచించుకుపోయి అసలు గుర్తు పట్టలేనంత విధంగా మారిపోయింది. ఆ రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తం నుంచే వినపడే వేద ఘోష ఆ చుట్టుప్రక్కల వాతావరణానికి ఎంతో పవిత్రతని చేకూరుస్తూ ఉండేది. బాపనార్యులుగారి గంభీరమైనటువంటి వాక్కుతో, వారితోపాటు అప్పలరాజు శర్మగారు, శ్రీపాదులవారు గొంతు కలిపి పాడుతుంటే ఎంతో మధురంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ వీథులన్నీ అపరిశుభ్రంగా , కొన్ని ఇల్లు పడిపోయి, కొన్ని పాడుబడి ఉండడంతో ఎంతో కళావిహీనంగా ఉంది. అక్కడ పందులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడంవల్ల ఆ వీథి అపరిశుభ్రంగా ఉంది. ఎప్పుడైతే చుట్టుప్రక్కల వాతావరణం అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే ఈ జంతువులూ స్వేచ్చగా తిరుగుతూ ఉంటాయో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రకృతికి విరుద్దమైనటువంటి అయస్కాంత క్షేత్రం కలిగి ఉంటాయి. అయితే ఆయనకి ఒక ఆలోచన వచ్చి వెంటనే సంకల్పమాత్రం చేత ఒక సాధారణ మానవుని వేషం ధరించారు. కాకపోతే ఆయన వస్త్రధారణ మాత్రం పూర్వంలాగే ఒక పంచ,ఒక అంగీని ధరించారు. చూడడానికి ఆయన ఒక సామాన్య మానవుడిలాగే కనిపించారు. ముందుగా ఆయన ప్రఖ్యాతి గాంచిన శ్రీపాదగయప్రదేశానికి  సంకల్పమాత్రం చేత చేరుకున్నారు. ముందుగా ఆయన సాక్షాత్తు స్వయంభూ దత్తాత్రేయులవారిని దర్శనం చేసుకుని నమస్కారం చేసి తదుపరి కార్యక్రమాన్నిచేసుకోడానికి సంకల్పించుకున్నారు. శ్రీపాదగయ క్షేత్రాన్ని చూడగానే ఆయనకి ఎంతో బాధ కలిగింది. అక్కడ కూడా వీథులన్నీ, పరిసర ప్రాంతాలన్నీచెప్పరానంత అపరిశుభ్రంగా ఉన్నాయి. దైవ సన్నిధికి సంకేతాలైనటువంటి పరిశుభ్రత అన్నది ఎక్కడా కనుచూపుమేరలో లేదు. ఎంతో అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతమంతా కూడా బురదతో, పందులతో నిండిపోయి ఉంది. లోనకు ప్రవేశించగానే అక్కడ ఉన్న పుష్కరిణి ఎంతో అపరిశుభ్రంగా ఉంది. అలాగే మెల్లగా ఆయన లోనికి ప్రవేశించి స్వయంభూదత్తుడి విగ్రహం దగ్గరకి వెళ్ళాడు. ఆ విగ్రహాన్ని చూడగానే ఆయన మనసంతా పులకరించిపోయింది. అక్కడే దగ్గరలో ఉన్న అరుగు మీద కూర్చుని ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అక్కడ వేదఘోష వినిపిస్తూ ఉండేది. బ్రాహ్మీ ముహూర్తంనుంచే వేదఘోషతో ఆ పరిసర ప్రాంతాలన్నీ అంతరిక్షమండలం కూడా ఎంతో పవిత్రంగా గోచుతూ ఉండేవి. కొన్ని వేల మైళ్ళ వరకు ఈ పరిశుద్ధమైన భావతరంగాలు చాలా మేర ఒక ప్రశాంతతని వ్యాపి౦పచేస్తూ ఉండేవి. ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలయొక్క మానసిక చైతన్యాన్ని స్పృశించిన మాత్రానే వారి  మనస్సులో కూడా పవిత్ర భావాలు, ప్రేమ , కరుణ మొదలైన భావాలన్నీ ఉప్పొంగిపోతూ ఉండేవి. పుష్కరిణి కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండేది. నిత్యం అక్కడ శివలింగానికి, స్వయంభూ దత్తునికి పూజలు జరుగుతూ ఉండేవి, దత్తపారాయణం పురాణ ప్రవచనాలు నిరంతరం అక్కడ జరుగుతూ ఉండేవి. ఎంతో ఘనంగా పూజలు అతివైభవంగా జరుగుతూ ఉండేవి. వీథులన్నీ విశాలంగా, ఎంతో పరిశుభ్రంగా ఉండేవి. అక్కడ జంతువులూ కూడా వాటి వాటి పరిధుల్లో ఉండేవి తప్ప ఎప్పుడు ఆలయంలోనికి ప్రవేశించేవి కావు. ఇక్కడ మనుషులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావాలు కలిగి వారు సంపాదించిన దంతా పరస్పరం పంచుకుంటూ ఉండేవారు.  అందరివంతు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ప్రజలంతా కలిసి మెలిసి ఉండేవారు.


                ఏ రోజైతే మానవ రూపంలో శ్రీపాదులవారి పాదకమలాలు ఈ భూమ్మీద పీఠికాపురాన్ని స్పృశించినాయో అక్కడ భూమాత పులకించి పోయింది. అక్కడ సమస్త ప్రాణులు, వృక్షాలు, జలప్రవాహాలు, పక్షులు, జంతువులు మొత్తం ప్రకృతి అంతా పరవశించి పోయింది. ముల్లోకాలలో ఉన్నటువంటి సిద్ధపురుషులు,సాధువులు, మహర్షులు, సమస్త దేవగణాలన్నీ కూడా ప్రతి రోజూ వచ్చి ఆయన్ని సేవిస్తూ ఉండేవి. శ్రీ పాదులవారు  మూలంగా మాటలతో చెప్పలేనంత అందంగా,జగన్మోహనంగా బాలకృష్ణుడివలె అందరికీ కనిపిస్తూ ఉండేవారు. వారి యొక్క ప్రేమపూరితమైన, కరుణాపూరితమైన దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళలో క్షణంలో ఒక అద్భుతమైనటువంటి శాంతి, సంతోషం కలుగుతూ ఉండేవి. వారిలో మచి సంస్కారాలు పుష్కలంగా కలుగుతూ ఉండేవి. పండుగలు-పబ్బాలు ఆ వీథుల్లోని ప్రజలే కాకుండా ఆ చుట్టూ ప్రక్కల ఉన్నలక్షలాది  ప్రజందరు పీఠికాపురానికి వచ్చి స్వామి వారిని అనేక రకాలుగా అర్చిస్తూ ఉండేవాళ్ళు. ప్రజల్లో అసలు  అరిషడ్వర్గాలనేవి పూర్తిగా మటుమాయమైపోయాయి. అందరి హృదయాలు కూడా ఎంతో పవిత్రభావాలతో ఉండేవి.
(మొదటి అధ్యాయం సమాప్తం )

15 February 2017

ఉపనిషత్తులు ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం - 2

బ్రహ్మజ్ఞానం – 2
                         బ్రహ్మమునకు ఉన్న ఇంకొక లక్షణాన్ని పరిశీలిద్దాం. బ్రహ్మమునకు దిక్కులు లేవు. బ్రహ్మమునకు పైన కాని, క్రింద కాని, కుడివైపు కాని, ఎడమవైపు కాని దిక్కులు ఉన్నాయని చెప్పుకోడానికి వీల్లేదు. సృష్టిలోని ప్రతి వస్తువుకి కూడా దిక్కులున్నాయి. ఈ దిక్కులన్నీ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి మానవులు ఏర్పరచుకున్నట్టివి. మనింటి ప్రక్కనే ఉంది, కుడివైపునే ఉంది, ఎడమవైపునే ఉంది, చెట్టు పైనే ఉంది, చెట్టు క్రిందనే ఉంది ఇవన్నీ మనకు ఉన్నవి. కాని అనంతంగా సాగుతున్నట్టి ఈ మహాశక్తి , చైతన్య శక్తి అయినటువంటి బ్రహ్మమునకు ఏ దిక్కులు లేవు. అది అనంతంగా ముందుకు సాగుతూఉంటూనే  ఉంది. ఎంత దూరం వెళ్ళినా కొన్ని కోట్ల మైళ్ళు , యోజనాలు వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మం ఉంటుంది. అలాగే ఎటు ప్రక్క వెళ్ళినా, అన్ని దిక్కుల్లో వెళ్ళినా కూడా అనంతంగా సాగుతున్నటువంటి ఈ బ్రహ్మమునకు ఎటువంటి దిక్కులు లేనే లేవు. ఇది మరి యొక ముఖ్యమైనటువంటి లక్షణం. బ్రహ్మము అవిభాజ్యం. అంటే దానిని మనం  ముక్కలుగా మనం చేయలేము. ఇది అఖండమైన స్వరూపం. ఉపనిషత్తులు దీన్ని ఏవిధంగా చెప్పాయంటే అది ఏకరసాన్నికలిగి ఉంటుంది. అంటే ఈ బ్రహ్మము కొద్ది చోట్ల పల్చగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, దళసరిగా ఉంటుందా అనే లక్షణాలు ఈ బ్రహ్మమునకు లేనే లేవు. ఇది అఖండమైనటువంటి, అనంతంగా సాగేటటువంటి ఒక మహా చైతన్య స్వరూప శక్తి. బ్రహ్మమునకు స్థలపరిచ్చేదం కాని వస్తుపరిచ్చేదం కాని లేనే లేవు. ఇక్కడ దేశ ప్రచ్చేదమన్నా, స్థల ప్రచ్చేదమన్నా అంటే ఉదాహరణకి ఒక జిల్లా ఒక ప్రదేశంనుంచి మొదలై ఇంకొక ప్రదేశంతో అంతమై దాని తర్వాత ఇంకొక జిల్లా మొదలవుతుంది. ఈ విధమైన లక్షణాలు మన సృష్టిలో ఉన్నాయి కాని బ్రహ్మామునకు ఇటువంటి స్థల ప్రచ్చేదం అనే లక్షణాలేవీ లేవు. ఎందుకంటే లోగడ మనం చెప్పుకున్నట్టె బ్రహ్మానికి సరిహద్దులంటూ ఏవీ లేవు కదా ! పరిమితులు లేవు కదా ! కాబట్టి బ్రహ్మానికి స్థలప్రచ్చేదం లేదు. అదేవిధంగా బ్రహ్మానికి కాల ప్రచ్చేదం లేదు. కాలం అనేది అనంతమైన చైతన్య శక్తి , ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కాని సృష్టిలో ఉన్నటువంటి కాలానికి పరిమితి ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్రహ్మకల్పం మొదలవుతుంది దానికి అంతం ఉంటుంది. ఈ మొదలు, అంతం మధ్యలో ఉన్నదాన్ని మనం ఒక కల్పం అంటాము. దాన్ని ఇంకా విభజించుకుంటే మహా యుగాలు అంటాం.  దాంట్లో మనకి యుగాలుంటాయి. యుగాలనుంచి సంవత్సరాలుంటాయి. సంవత్సరాలనుంచి నెలలు, పక్షాలు, వారాలు, దినాలు ఉంటాయి. ఇలా కాలాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసుకుంటాము. ఎందుకంటే దానికి మొదలు ఉంది, అంతం ఉంది కాబట్టి. కాని బ్రహ్మమునకు కాలపరిమితి లేదు ఎందుకంటే బ్రహ్మానికి ఆది లేదు, అంతం లేదు కాబట్టి అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దీన్నే మనం ఇంగ్లీష్ భాషలో “Time and Space Concept” అని చెప్పుకుంటాం. అలాగే బహ్మానికి వస్తు పరిచ్చేదం కూడా లేదు. వస్తు పరిచ్చేదం అంటే మనం ఒక వస్తువుని రకరకాలుగా విభజించుకోవచ్చును. ఉదాహరణకి ఒక గృహం ఉందనుకోండి ఇంటి ముందుని వసారా అని అంటాం లేక వీధి అరుగు అని అంటాం. దీనికి ప్రవేశద్వారం ఉంటుంది. ముందు గదిలో కూర్చున్నప్పుడు ముందుగది అంటాం , ఇంకొక గదిని సగం భాగం వంటగది అని అంటాం, మిగతా భాగాన్ని పూజగది అని అంటాం , ఇంకొక భాగాన్ని నిద్ర పోయే స్థలంగా అనుకుంటాం ఈ విధంగా ఒక వస్తువుని మనం రకరకాలుగా విభజించుకుంటాం. కాని ఇటువంటి వస్తు పరిచ్చేదం బ్రహ్మమునకు లేదు. ఎందుకంటే లోగడ మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మం అనంతం, అఖండం , అద్వితీయం, కాలాతీతం అని కూడా మనం చెప్పుకొనవచ్చును.
(.... to be continued......)

14 February 2017

Chedu Nijalu - Episode 3

చేదు నిజాలు - 3  
భారతదేశం యొక్క విభజన - లార్డ్ మౌంట్ బాటన్ అతని భార్య లేడీ ఎడ్వినా - ఆంగ్లేయుల యొక్క కుట్ర


ఒక విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకోవడానికి, మన సంస్కృతిని నాశనం చెయ్యడానికి మనలో మనకి కలతలు పెట్టి నిరంతరం కలహించుకునే విధంగా చాలా దుర్మార్గంగా కుట్ర పన్నారు. ఎంతోమంది ఆంగ్లేయులు మన భారతదేశాన్ని, భారతీయుల్ని చాలా రకాలుగా నాశనం చేశారు అయితే వారందరిలో కూడా అగ్రగణ్యుడు ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు అతని పేరే లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ తనంతట తాను భారతదేశానికి రాలేదు. బ్రిటీష్ పార్లమెంట్ లో ఆ  సభ్యులందరూ కలసి ఒక తీర్మానం చేశారు, భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ముందు బ్రిటన్ కి అనుగుణంగా పనిచేయగల వ్యక్తి ఎవరైనా ఉంటే  అతడు మౌంట్ బాటన్ అని తీర్మానించారు. మరొక తీర్మానం ఏమిచేశారంటే అది నేను వివరంగా చెప్పలేను అదేమిటంటే మౌంట్ బాటన్ సతీమణి లేడీ ఎడ్వినా భారతదేశంలోని కొంతమంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులని చాలా సమర్ధవంతముగా ప్రభావితం చెయ్యగలదు అని తీర్మానించి వారిని భారతదేశానికి పంపించడం జరిగింది.  లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ కాంగ్రెస్ నాయకుల్ని సమర్ధవంతంగా ప్రభావితం చేస్తుంది అంటే దానిలో అర్ధం మీరు ఈపాటికే గమనించి ఉంటారు, వివరంగా చెప్పలేను నేను. భారతదేశంలో ప్రముఖమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి  లేడీ ఎడ్వినా చాలా సమర్ధవంతంగా ప్రభావితం చేస్తుంది అని వాళ్ళనుకోవడం నిజంగా గర్వించదగ్గ పని కాదు చాలా సిగ్గుచేటు వ్యవహారం అని మనం చెప్పుకోక తప్పదు. ఒక స్త్రీ ని ఆంగ్లేయులు ఒక కార్యాచరణ ఇచ్చి అంటే ఒక ఎజెండా ఇచ్చి భారతదేశానికి వాళ్ళు పంపించారంటే ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. లేడీ ఎడ్వినా భారతదేశానికి రాగానే వెంటనే తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మంటలు మండించే కార్యక్రమం మొదలయ్యింది. జిన్నాని ప్రత్యేక పాకిస్థాన్ రాజ్యం కావాలి అని నువ్వు పట్టుబట్టు నేను నీకు సహాయం చేస్తాను అని పదేపదే అతనిని వేధించసాగింది. మౌంట్ బాటన్ కూడా తన పాత్రని నిర్వహించాడు. అతడు కూడా జిన్నాని ఎగదోసి నువ్వెలాగైనా సరే ప్రత్యేక పాకిస్థాన్ దేశం కావాలని పట్టుబట్టు అని నూరిపోయడం జరిగింది. కానీ జిన్నా ఏమాత్రం కూడా ప్రత్యేక పాకిస్థాన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి అతను ముసల్మాన్ కానేకాదు. జిన్నా మరియు అతని అనుచరులు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ కావాలని కోరుకోలేదు కానీ సోహ్రాబ్ అనే వ్యక్తి మాత్రం ప్రత్యేక పాకిస్థాన్ కావాలని చెప్పాడు. మౌంట్ బాటన్ మరియు అతని శ్రీమతి కలిసి జిన్నాని వేధించసాగారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల్ని కూడా మీ యొక్క పరంపర వేరు, సంస్కృతి వేరు , వల్ల యొక్క పరంపర వేరు. మీరిద్దరూ ఎలా కలసి ఉంటారు కాబట్టి మీరు కూడా దేశవిభజన కావాలని గట్టిగా పట్టుబట్టండి మేము సహాయం చేస్తాం అని పదేపదే జిన్నాని మరియు జవహర్ లాల్ నెహ్రూని వేధించసాగారు. ఆఖరికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి దిగజారారంటే స్వయంగా  లేడీ ఎడ్వినా ని వారు ఒక ఆయుధంగా మలచుకున్నారు. ఆ ఆయుధాన్నే ఇద్దరు నాయకుల మీదా ప్రయోగించారు. అంతిమసమయం వరకు అంటే 1946వ సంవత్సరం వరకు కూడా భారతదేశ ప్రజలు కానీ, ముస్లింలు కానీ దేశ విభజన కావాలని కోరుకోనేలేదు. స్వాతంత్య్రం వచ్చిన భారతదేశానికి  జవహర్ లాల్ నెహ్రు ప్రధాని గాను, ఉప ప్రధానిగా మొహమ్మద్ జిన్నా ఉంటారని భావించారు తప్ప ఎవ్వరూ మాత్రం దేశ విభజనని కోరుకోలేదు. కానీ లార్డ్ మౌంట్ బాటన్ అతని భార్య లేడీ ఎడ్వినా ఇద్దరు కూడా వారి ప్రయత్నాల్ని విరమించుకోలేదు.  నెహ్రూ కి, జిన్నా కి మధ్య పచ్చగడ్డి  వేస్తే భగ్గుమనేలాగా విశ్వప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నం చేస్తుండగానే నెహ్రూ తన మంత్రిమండలిలో ఒక చప్రాసీ ఉద్యోగం కూడా నేను ఇవ్వను అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు. ఆ మాటని వాళ్ళు ఆసరాగా తీసుకుని లార్డ్ మౌంట్ బాటన్ జిన్నా దగ్గరకి వెళ్లి చూడు నెహ్రూ నీకు ఎంత మర్యాద ఇస్తున్నాడో నీకు చెప్రాసీ ఉద్యోగం కూడా ఇవ్వడట అని అతనిని బాగా రెచ్చగొట్టాడు దానితో జిన్నా యొక్క క్రోధం కట్టెలు తెంచుకుని అయితే సరే దేశ విభజనని నేను కోరుకుంటాను, ఆ దేశానికి ప్రధానినై నేను చూపిస్తాను అని  అతడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ విధంగా మౌంట్ బాటన్ అతని సతీమణి ఎడ్వినా రేయింబవళ్లు ఇద్దరినీ రెచ్చగొడుతూ  ఎటువంటి పార్లమెంట్ తీర్మానం లేకుండానే ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ అని చెప్పేసి దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు. నిజానికి ఇది అసలు చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానమే. ఈ సభలో ఈ విషయాన్నీ చర్చించి మంత్రిమండలి అంతా తమ ఆమోదం తెలియచేయకుండానే ఈ విధంగా దేశాన్ని రెండు ముక్కలుగా చేసే కుట్ర ఈవిధంగా ఫలించింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసిన గవర్నర్ జనరల్ గా వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ ని మనకి స్వాతంత్య్రం వచ్చాక మనం ఏంచెయ్యాలి? కానీ దురదృష్టం ఏమిటంటే ఇంత దుర్మార్గపు పని చేసిన మౌంట్ బాటన్ మరియు లేడీ ఎడ్వినా వీళ్ళ చిత్రపటాలన్నీ కూడా భారతదేశ ముఖ్య కార్యాలయాలలో ఉంచటం జరిగింది. వాళ్లకెంతో గౌరవం ఇవ్వడం జరిగింది. మ్యూజియంలోనూ, అన్నింట్లోనూ కూడా వీరి ఇద్దరి చిత్రపటాలు, ప్రశంసాపత్రాలు అన్నీ కూడా ప్రదర్శించబడటం ఈ భారతదేశంలో జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంక ఏముంటుంది. ఈ విధంగా అఖండమైన భారతదేశాన్ని ఆంగ్లయులు కుట్రలు పన్ని చాలా దారుణంగా ఒక స్త్రీని వాడుకుని కాంగ్రెస్ నాయకుల యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఈ అఖండ సామ్రాజ్యాన్ని రెండు ఖండాలుగా విభజించేశారు. అంతే కాదు ప్రపంచంలో అతి దారుణమైన సంఘటనలు భారతదేశ విభజన జరిగే ముందు జరిగాయి.  కొన్ని లక్షల మంది చంపబడ్డారు అటు పాకిస్థాన్ లోను, ఇటు ఇండియా లోను కూడా కొన్ని లక్షల మంది ఈ మారణకాండలో ప్రాణాలు వదిలారు, మానభంగాలు, ఆస్తిపాస్తులు, పుత్రులని,బంధువులని  అందరిని కూడా కోల్పోయి  కొన్ని లక్షల మంది శరణార్థులుగా  భారతదేశంలో అక్కడక్కడా వాళ్ళు నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. దాదాపు ఈ మారణకాండ సంవత్సరంన్నర పాటు జరిగింది. ఇది చాలా ఘోరమైన, భయంకరమైన మారణకాండ. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు జరిగినటువంటి సంఘటన.మొత్తం ప్రపంచంలోనే  ఇటువంటి మారణకాండ జరగడానికి బాధ్యుడైనటువంటి మౌంట్ బాటన్ గురుంచి మన పుస్తకాలలో వ్రాసి పిల్లలకి చెబుతున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. కనీసం మనకి స్వాతంత్య్రం వచ్చాక అయినా సరే మౌంట్ బాటన్ మరియు ఎడ్వినా ల యొక్క చిత్రపటాలు, వారి స్మృతి చిహ్నాలని మనం పూర్తిగా తొలగించి ఉండాల్సింది లేదా వాటినన్నింటిని వారి దేశానికి పంపించి ఉండాల్సింది. ఇలా మనం ఇంకా వాళ్ళని గౌరవిస్తూ ముఖ్యమైన కార్యాలయాల్లో వాళ్ళ ఫోటోలను పెట్టుకున్నామంటే ఇంకా మనలో ఆ బానిసత్వపు ధోరణి పోలేదని మనం చెప్పుకోకతప్పదు. ఇప్పటికి కూడా ఢిల్లీలోని ముఖ్యమైన కార్యాలయాలలో లేడీ ఎడ్వినా యొక్క ఛాయాచిత్రాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎంతో వినమ్రపూర్వకంగా ఆంగ్లేయులకు వారి ఫోటోలను మరియు వారి స్మృతి చిహ్నాలని పంపించివేయాలి లేదా వారు నిరాకరిస్తే ఇక్కడే వాటిని తగలబెట్టాలి. వాస్తవానికి అసలు జిన్నా ముస్లిం కాదు. అతడు మద్యపానీయాలు సేవిస్తాడు, వర్జితమైనటువంటి  పంది మాంసం భక్షిస్తాడు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తూంటాడు. అతని వంశస్థులందరూ వడ్డీ వ్యాపారాలు చేసి జీవించేవారు. ముఖ్యంగా ఇస్లాంలో ముస్లిం అనేవాడు రోజుకి ఐదు సార్లు నమాజు చెయ్యాలి కానీ జిన్నా తన జీవితంలో నమాజు చేసినట్టు ఎప్పుడూ ఎక్కడా మనకి తెలియదు. ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలోని ముస్లింలు ఎప్పుడూ కూడా జిన్నాని తమ నాయకునిగా అంగీకరించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్థాన్ లో కూడా జిన్నాని తమ నాయకునిగా ఎవ్వరూ అంగీకరించలేదు. జిన్నా కలలో కూడా ప్రత్యేక రాజ్యం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ బలవంతంగా వద్దు వద్దు అని అంటున్నా కూడా జిన్నా కి భారతదేశాన్ని రెండు  ముక్కలు చేసి ఒక భాగాన్ని పాకిస్థాన్ గా ప్రకటించి అతనికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం కూడా ఇంకొక ఆంగ్లేయుడు ఉన్నాడు. అతడు మౌంట్ బాటన్ తో పాటుగా పనిచేస్తుండేవాడు. అతని పేరు రెడ్ కార్పెట్. అతనితో కూడా బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఎన్నో విధాలుగా చర్చించి , తీర్మానించి భారతదేశానికి పంపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని విభజించమని చెప్పారు. ఎలాగంటే కొన్ని ప్రాంతాలలో ఎప్పుడూ కూడా శాంతి లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ కలహాలు సృష్టించే విధంగా భారతదేశాన్ని విభజన చెయ్యమని అతనికి  చెప్పి పంపించారు. రెడ్ కార్పెట్ భారతదేశానికి రాగానే ఇక్కడి ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. మా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మేము నిర్ణయించుకుంటాము కానీ నువ్వెవరు విభజించడానికి అని ప్రశ్నించారు. కానీ అతడు నేను బ్రిటిష్ పార్లమెంట్ తరఫున వచ్చాను అని చెప్పి మౌంట్ బాటన్ తో కలిసి అఖండ భాతదేశాన్ని రెండు ముక్కలుగా విభజన చేశాడు. ఆంగ్లేయులు కుట్ర పన్ని ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల వారు పరస్పరం కలహించుకునేలా సరిహద్దును నిర్మించారు. ఆ ఆంగ్లేయ అధికారి పేరు రెడ్ క్లిఫ్. మొత్తం మీద ఈ ఆంగ్లేయ అధికారి రెడ్ క్లిఫ్ మౌంట్ బాటన్ సహాయంతో నలుగురు అయిదుగురు నాయకులతో మాట్లాడి, ఒప్పించి తన ఇష్టం వచ్చిన విధంగా సరిహద్దుల్ని నిర్ణయించాడు. దౌర్భాగ్యం ఏమిటంటే దాన్ని ఇప్పటికీ కూడా "రెడ్ క్లిఫ్ లైన్" అని వ్యవహరిస్తూ ఉంటారు. డాకుమెంట్స్ లో కూడా ఆవిధంగానే రెడ్ క్లిఫ్ లైన్ అని ఉటంకించడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఆంగ్లేయులు  కుట్ర పన్ని ఎంతో చాకచక్యంగా ఒక స్త్రీని ఉపయోగించి  అఖండమైన భారత సామ్రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఇలాంటి పని చేసిన రెడ్ క్లిఫ్ యొక్క స్మృతి చిహ్నాలు ఇప్పటికీ  మనదేశంలో ఉన్నాయి. నిజానికి అసలు భారత దేశాన్ని విభజించడం మరియు సరిహద్దులు ఏర్పరచడం అతని పరిధిలో లేని విషయాలే. ఇలాంటి దుర్మార్గులని మనకి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ళకి కూడా గౌరవిస్తూనే ఉన్నాం. అందుకే ఇందాక చెప్పను కదా మనకి బానిసత్వపు గుణాలు పోలేదు.

12 February 2017

Chedu Nijalu Episode-2


జమ్మూ కాశ్మీర్ అసలు చరిత్ర  (Episode no - 2) 


నేను పనిచేసిన ఈస్ట్ ఆఫ్రికా దేశస్థులందరికి కూడా భారతదేశం మీద ఒక పెద్ద అపోహ ఉంది. మనమే దురాక్రమణ చేశాం జమ్మూ కాశ్మీర్ మీద అని. అసలు ఏం జరిగింది? యధార్ధం ఏమిటి? అన్నది మనలో చాల మందికి తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ప్రతీ భారతీయుడికి ఉన్నది. అప్పుడే  మనం ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతాం. రండి! రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన ఉపన్యాసం చదవండి. వాస్తవాలని గ్రహించండి. మన భారతదేశానికి స్వాతంత్య్రం  వచ్చాక జమ్ముకాశ్మీర్ ని హరి సింగ్ అనే ఒక హిందూ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు హిందువు మెజారిటీ ప్రజలు ఇస్లాం మతస్థులు. బ్రిటీష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ హరి సింగ్ ని ప్రభావితం చేశారు స్వతంత్ర దేశంగా ఉంటె మంచిది అని నానా రకాలుగా చెప్పి వెళ్లారు. హరి సింగ్ కూడా అదే మాదిరిగా స్వతంత్ర దేశంగానే నేను ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా పదే పదే బ్రిటీష్ వాళ్ళు హరి సింగ్ బుర్రని పాడుచెయ్యడం మొదలుపెట్టారు. అదే సమయానికి పాకిస్తాన్ తన సైన్యంతో జమ్ముకాశ్మీర్ పై దురాక్రమణ చెయ్యడం జరిగింది. మహారాజా హరి సింగ్ దగ్గర పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొనేటంత శక్తి లేదు. అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈలోగా పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ లోని చాలా భాగానికి చొచ్చుకుని వస్తున్నది. స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అని అనుకున్న అతని కలలన్ని నిరాశగా మిగిలిపోయాయి.  స్వతంత్ర రాజ్యం కాదు కదా ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో భాగంగా ఏర్పడే ప్రమాదం ముంచుకువచ్చింది. అటువంటి దిక్కు తోచని పరిస్థితిలో మహారాజా హరిసింగ్ అతని ప్రధానిని సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి పంపించడం జరిగింది. పాకిస్తాన్ దేశం బారి నుంచి వారిని కాపాడవలసినదిగా హరిసింగ్ గారి ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ ని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. దానికి నవ్వుతూ వల్లభాయ్ పటేల్ మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అనుకున్నారు కదా! భారతదేశంలో కలవకూడదని అనుకున్నారు కదా! అటువంటప్పుడు స్వతంత్ర రాజ్యంగానే ఉండిపోండి. మాకు అభ్యంతరం లేదు. మీకు మా సైన్యాన్ని ఎందుకు పంపించాలి? మీకోసం మేమెందుకు పోరాడాలి? అని చెప్పగా  ప్రధాని చాలా తెలివిగలవాడు కాబట్టి మీరడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం లేదు. అవన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు మా దేశాన్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. అని మళ్ళా ప్రాధేయపడ్డాడు. మీ దేశాన్ని మా సైన్యాన్ని పంపించి రక్షించాలి అని అనుకుంటే మేము ఒక షరతు మీద అంగీకరిస్తాం అది ఏమిటంటే మీరు బేషరతుగా మీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్నంతా కూడా మా భారతదేశంలో విలీనం చేస్తున్నామని మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో ఎప్పుడైతే ఆ దస్తావేజుల మీద సంతకాలు పెడతారో అప్పుడు మాత్రమే మేము ముందుకు వస్తాము ఎందుకంటే  నిభందనల ప్రకారం మీరు స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు మేము జోక్యం చేసుకోవడం సబబు కాదు. మా సైన్యాన్ని పంపించి మా సైనికుల ప్రాణాలు పోగొట్టడం న్యాయం కాదు అన్నారు. భారతదేశపు సైన్యం తన సరిహద్దులు రక్షించుకోవడానికే పోరాడతాయి తప్ప ఒక స్వతంత్ర దేశంగా ఉండాలనుకొనే మీ జమ్మూ కాశ్మీర్ కోసం వాళ్ళు పోరాడటం అనేది న్యాయసమ్మతం కాదు అని నచ్చజెప్పాడు. దిక్కుతోచని ప్రధాని ఆదరబాదరగా మళ్ళీ మహారాజా హరిసింగ్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. ఆయన సైన్యాన్ని పంపదలచుకోలేదు జమ్మూ కాశ్మీర్ ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేస్తున్నామని ఒక సంధి పత్రం మీద సంతకం చేస్తే కానీ ఆయన మనకి సహాయం చేసేటట్టుగా లేడు అని చెప్పాడు. అప్పటికే పాకిస్తానీ సైన్యం శ్రీనగర్ దాకా వచ్చేసింది. ఇంకా ఎంతో దూరంలో లేరు వాళ్ళు. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా పాకిస్తానీ సైన్యానికి మద్దతు పలకడం కూడా ఆయన్ని ఆలోచింపచేసింది. వెంటనే  సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినట్టుగానే జమ్మూ కాశ్మీర్ ని సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా సంతకం చేశాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్  పటేల్ భారత సైన్యానికి ఆదేశాలిచ్చాడు. వెంటనే భారతదేశపు వైమానిక దళం అలాగే పదాతి దళం జమ్ముకాశ్మీర్ లో ప్రవేశించింది. చాలా ఆశ్చర్యంగా 24 గంటల లోనే మన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించారు. భారతీయ సైన్యం చూపించినటువంటి అధ్భుతమైన ధైర్య సాహసాలు, పరాక్రమ పటిమ మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది. పాకిస్తానీ సైన్యం శ్రీనగర్ ని ఆక్రమించే దశలో ఉన్నప్పుడే  భారత సైన్యం అక్కడికి చేరి వాళ్ళని తిప్పి కొట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నరికివేయసాగారు. ఇక లాభం లేదనుకొని పాకిస్తానీ సైన్యం పలాయనం పటించారు. చివరికి భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్ని కూడా దాటింది. అలాగ భారత సైన్యం పాకిస్తానీ సైన్యాన్ని తరుముతూ తరుముతూ చాలా భూభాగాన్ని ఆక్రమించేసింది. ఇంకా లాహోర్ ఎంతో దూరంలో లేదు. అప్పుడు వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా వల్లభాయి పటేల్ ని కొంచెం సమయం ఇవ్వండి పాకిస్తాన్ ని పూర్తిగా ఆక్రమించేస్తాం అని అడిగారు. పాకిస్తాన్ కి  భారతదేశ సైన్యం ఒక మంచి గుణపాఠాన్ని  చెప్తున్న సమయంలో పాకిస్తాన్ దిక్కుతోచని సమయంలో ఉన్నప్పుడు ఒక ఘోరమైన చారిత్రాత్మక తప్పిదం జరిగింది. అదేమిటంటే ప్రధాని జవహరలాల్ నెహ్రు సర్దార్ వల్లభాయి పటేల్ తో సంప్రదించకుండానే  యుద్ధ విరమణ ప్రకటించారు. నిజానికి యుద్ధ విరమణ ఎప్పుడు ప్రకటిస్తారంటే క్యాబినెట్ సమావేశాలు జరిపి ఈ విషయాలని చర్చించి మెజారిటీ మంత్రులందరూ అంగీకారం తెలిపిన తరువాతనే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాలు ఏమీ పాటించకుండా జవహరలాల్ నెహ్రు వెంటనే యుద్ధ విరమణ ప్రకటించారు. ఇది మన భారత ప్రధాని చేసినటువంటి ఘోరమైన తప్పు. దానికి ఇప్పటికీ కూడా మనమంతా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకొక ఘోరమైన తప్పిదం నెహ్రు వాల్ల జరిగింది దానిని ఏ భారతీయుడు కూడా క్షమించరానిది ఏమిటంటే అది ఆయన ప్రజల ముందు కాకుండా సరాసరి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఢిల్లీ కి వెళ్ళి యుద్ధ విరమణ ప్రకటించాడు. అంతేకాకుండా మూడవ తప్పిదం ఏమి చేశాడంటే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉండాలా భారత్ లో ఉండాలా అనే విషయాన్నీ మేము యునైటెడ్ నేషన్స్ ద్వారా పరిష్కారం చేసుకుంటాము అని ప్రకటించేశాడు.మహారాజా హరి సింగ్ తన స్వతంత్య్ర రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ దస్తావేజుల మీద సంతకం చేశాడు. మిగతా రాజ్యాల మాదిరిగానే కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు ప్రధాని జవహరలాల్ నెహ్రుకి యునైటెడ్ నేషన్స్  వారి దగ్గరకి వెళ్ళాల్సిన పనేముంది?జమ్మూ కాశ్మీర్ ని ఒక వివాదాస్పద రాజ్యంగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ చారిత్రాత్మక సత్యం చాలామందికి తెలియదు. పండిట్ జవహరలాల్ నెహ్రు చేసినటువంటి  ఈ తప్పిదం మూలంగా మన గొంతుకి మనమే ఉరి వేసుకున్న మాదిరిగా అయిపోయింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ పదేపదే సవాలు చేస్తూ ఉంటుంది. ఈ పరిణామాల మూలంగా సంయుక్త రాష్ట్రాలు అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మరి జమ్మూ కాశ్మీర్ లోకి రావడం భారతదేశ సైన్యాన్ని వెనక్కి పిలిపించడం అక్కడ ఇవాళ ఉండి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ సాంకేతికపరంగా ఆలోచిస్తే అసలు యునైటెడ్ నేషన్స్ ఇక్కడకి రావాల్సిన అవసరమే లేదు. అనేక రాజుల మాదిరిగా, సంస్థానాధీశుల మాదిరిగానే మహారాజా హరి సింగ్ కూడా తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు అక్కడికి యునైటెడ్ నేషన్స్ రావాల్సిన అగత్యం లేదు కదా! ఈనాటికి కూడా మరి జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద రాజ్యంగానే ఉంది. అది భారతదేశానికి లేదా పాకిస్తాన్ కి దేనికి చెందాలో యునైటెడ్ నేషన్స్ నిర్ణయించాలి. కాబట్టి వాళ్ళు కాశ్మీర్ లోనే ఉండి సూచనలు ఇస్తూ ఉంటారు. ఈవిధంగా నెహ్రు ఇచ్చిన ఒక ప్రకటన మూలంగా ఈరోజుకి కూడా జమ్మూ కాశ్మీర్ రగిలిన కుంపటి మాదిరిగానే ఉంది. ఎంతో హాయిగా, సంతోషంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ ఈనాడు రగిలిన కుంపటి మాదిరిగా ఉంది. వేలాదిమంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు ఇంకా పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా పరమ ఘోరంగా ఉన్నది. ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ లో శిక్షణ పొంది రహస్యంగా కాశ్మీర్ లోకి చొరబడి ఎన్నో దురాగతాలు చేస్తున్నారు. ఈనాడు  చాలామంది యువకులు కూడా పాకిస్తాన్ కే వారి సమర్ధతని తెలపడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది అసలు జరిగినటువంటి వాస్తవిక గాధ. 

10 February 2017

Chedu Nijalu -Episode1

చేదు నిజాలు (ఎపిసోడ్-1)  

మన భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒక విధమైన ఆత్మన్యూనతా భావం అంటే inferiority complex తో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం చాలా ఏళ్ల వరకూ తురుష్కుల పాలనలో, ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో అనేక విదేశీ దురాక్రమణలతో భారతదేశం అంతా అతలాకుతలమైపోయింది. ఈ భారతదేశం పైన పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, తురుష్కులు, ఆంగ్లేయులు అందరూ దాడి చేసి అనేక రకాలుగా భారతదేశ సంస్కృతిని, సంస్కరాలన్నింటిని కూడా చాలామటుకు నాశనం చేశారు. కులాల పేరున, మతాల పేరున మత మార్పిడులు అనేక రకాలుగా భయపెట్టి, భ్రమపెట్టి , ఆశపెట్టి భారతదేశపు ప్రజలని అనేక వర్గాలుగా చీల్చివేశారు. మొదట నుంచి కూడా విదేశీ దురాక్రమణదారులకి మన వైదిక మతం పైన ప్రబలమైన విరోధభావం ఉండేది. మొత్తం ప్రపంచంలో కెల్లా అతి ప్రాచీనమైనటువంటి, ఎంతో గొప్పదైనటువంటి  వైదిక భూమి, కర్మ భూమి అయిన భారతదేశం దాని సమగ్రతని అనేక రకాలుగా వాళ్ళు చాలామటుకు నాశనం చెయ్యగలిగారు. అయితే తురుష్కుల పరిపాలనలో ఆ తరువాత ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నో దుష్క్రుత్యాలు చేశారు దానిలో మొట్టమొదటిది మన భారతదేశ చరిత్రనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చివేశారు. మన పురాణాలకి, వేదాలకి వక్ర భాష్యాలు చెప్పారు. ఎంతో సంపన్నులైనటువంటి బ్రిటీష్ వాళ్ళు, అమెరికన్లు విదేశీ ప్రొఫెసర్ లకి బోలెడంత డబ్బు ఆశ చూపి మన వేదాలకి వక్ర భాష్యాలు చెప్పడం సర్వసాధారణమైపోయింది. మనలోని మేధావులకి కూడా డబ్బు  ఆశ చూపి మన దేశ చరిత్రని మార్చివేశారు. చివరికి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేనేటటువంటి ఒక భ్రమలోకి  భారతదేశీయులని దిగజార్చారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కూడా చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నది. మన హిందూ జాతికి, మన సంస్కృతికి, మన నాగరికతకి పెద్ద ప్రమాదం పొంచుకుని ఉన్నది. అనేక మంది భారతీయులు విదేశీ గూఢచారులుగా పనిచేస్తూ రకరకాలుగా సమాజంలో అన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానులు కూడా మరి విదేశీ రాజనీతికి అనుగుణంగానే శాసనాలన్నీ మారుస్తూ భారతదేశాన్ని చాలా భ్రష్టు పట్టించారు. కానీ మేకతోలు కప్పుకున్న పెద్దపులులే మన భారతీయులే మన మధ్య మెలుగుతూ  మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. అతి దౌర్భాగ్యమైన స్థితి ఏమిటంటే మన పురాణాలు, మన వేదాలన్నింటిని కూడా విదేశీయులు మార్చి వ్రాశారు. మనం వాటిని చదివి అవే నిజమనుకుని ఒక మూఢ విశ్వాసంతో చాలా మంది యువతీయువకులు ప్రస్తుతం ఉన్నారు. మన భారతీయ భాష చాలా విశిష్టమైనది ఒకే పదానికి నానా  అర్ధాలు ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి మన సహస్రార చక్రాన్ని మన యోగ భాషలో వర్ణిస్తూ ఉంటాము అది ఇంగ్లీష్ లో తర్జుమా చేసినప్పుడు crown chakra అంటారు. క్రౌన్ చక్రాలో చాల చిన్న పరిధిలోనే అర్ధం ఉంటుంది కానీ సహస్రార చక్రం అంటే దానిలో ఎంతో అర్ధం ఉంది. అలాగే ఆజ్ఞ చక్రం, అనాహత చక్రం, స్వదిష్టాన చక్రం, మూలాధార చక్రం ఇలా మన యోగ భాషలో చెప్పుకున్నప్పుడు దానిలో ఎంతో గూఢమైన శాస్త్రీయపరమైన అర్ధాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసినప్పుడు విశుద్ధి చక్రాన్ని throat chakra అంటారు, అనాహత చక్రాన్ని heart chakra అంటారు మణిపూరక చక్రం ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని వెదజల్లే ఈ మణిపూరక చక్రాన్ని solar plexus chakra అంటారు. ఇలా వాళ్ళు వాళ్లకి ఇష్టం వచ్చినట్లు మన భాషలో ఉన్నటువంటి యోగపరమైన పదాలని మార్చినప్పుడు దానిలో ఉన్న ఎంతో విశిష్టమైన విజ్ఞానం అంతా కొట్టుకుపోతుంది కదా! ఈ విధంగానే Max Muller అనే జర్మనీ దేశస్థుడు భారతదేశాన్ని సందర్శించకుండానే, సంస్కృత భాషని నేర్చుకోకుండానే డబ్బుకి ఆశపడి మన వేదాలని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. ఈ తర్జుమా చేసే ప్రక్రియలో సంస్కృత పదాల అర్ధం అంతా కూడా మారిపోయింది.  అయితే మరి చాలా మంది భారతదేశీయులు, విదేశీయులు కూడా Max Muller వ్రాసినటువంటి ఆ వేదాలని ప్రామాణికంగా చూడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. స్వాతంత్య్రం రాగానే కాశ్మీర్ గురించిన సమాచారం అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఇంకొక విశిష్టమైన విషయం ఏమిటంటే మొత్తం ప్రపంచంలో కెల్లా భారతీయ సంస్కృతిలోనే ప్రతీ రాజుల యొక్క వంశ చరిత్ర ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిశాక మన దేశాన్ని ఏఏ రాజులూ పరిపాలించారు, ఎంతవరకూ పరిపాలించారు ఆ తరువాత వచ్చిన రాజు యొక్క చరిత్ర ఏమిటి ఇవన్నీ కూడా మన దగ్గర ప్రామాణికంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాశ్మీరు రాజవంశ చరిత్ర అంతా కూడా బిల్హణుడు వ్రాసినటువంటి  రాజతరంగిణిలో చాలా సమగ్రంగా ఉంది. అలాగే నేపాల్ దేశ చరిత్ర కూడా అన్ని ఆధారాలతో లిఖింపబడి ఉన్నది. వీటినే మన విశ్వనాధ సత్యనారాయణ గారు రాజతరంగిణి ని అంటే కాశ్మీరు రాజచారిత్రని తెలుగులోకి అనువాదం చేశారు అలాగే నేపాల్ దేశ చరిత్రని కూడా తెలుగులో అనువాదం చెయ్యడం జరిగింది. నేను ఆఫ్రికా దేశంలో ఉన్నప్పుడు కెన్యా వశస్థులు, ఉగాండాలో ఉండే  ఆఫ్రికన్లు మరియు టాంజానియా లో ఉన్నవాళ్ళందరూ కూడా భారతదేశాన్ని చాలా అపార్ధం చేసుకున్నారు. మీరెందుకు అనవసరంగా పాకిస్తాన్ కి సంబంధించిన కాశ్మీరు ని లాక్కున్నారు? ఎందుకు దురాక్రమణ చేశారు? అని వాళ్ళెప్పుడు  అడుగుతూ ఉండేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూండేది ఏ ఒక్క భారతీయుడు కూడా గొప్పగా, భయం లేకుండా అంటే నిర్భయంగా కాశ్మీరు మా భారతదేశానికి సంబంధించినది అని చెప్పలేడు. ఈమధ్య కాలంలోనే కాంగ్రెస్ పరిపాలన చాలా రాష్ట్రాలలో అంతరించిన తరువాతనే మనం కొంచెం ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికి కూడా మనకు స్వాతంత్య్రం వచ్చిందన్న మాటేగాని మహాత్మా గాంధీ యొక్క వాక్యాలలోను, పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారి వ్యాఖ్యానంలో కూడా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న విషయాన్నీ వారెప్పుడు నమ్మలేదు. కేవలం తెల్ల చర్మం ఉన్నవారి దగ్గరి నుంచి నల్ల చర్మం ఉన్నవారి దగ్గరకి అధికారం బదలాయింపు మాత్రమే జరిగింది.  

8 February 2017

ఉపనిషత్తులు ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం - 1

ఉపనిషత్తులు
                           ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం - 1 

               సృష్టి అనే పదంలో సృష్టించబడింది అనే అర్థం ఉంది. అంటే ఈ సృష్టి అంతా ఒకప్పుడు సృష్టించబడింది.  అనే కదా అర్థం! దానిలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే ఈ సృష్టి సృష్టించబడినప్పుడు అది ఎక్కడ ఉంది? సృష్టి అంటే 14 లోకాలు, ఖగోళం, నక్షత్ర మండలం, మనకు కనిపించేదంతా సృష్టి అనుకోవాలి కదా! ఒకప్పుడు అంటే ఇవి లేనప్పుడు మరి ఉన్నవి ఏమిటీ? అంటే శూన్యం అని చాలామంది చెప్పుతూ ఉంటారు. వేదాంత పంచదశలో మహర్షులు ఏం చెప్పారంటే ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మతత్వం ఉండేది. మనకు మన కంటికి కనిపించేంత మేర శూన్యమంతా పరబ్రహ్మతత్వం తో నిండి ఉండేది. అక్కడ ఉన్నది ఒక పరబ్రహ్మతత్వం తప్ప ఇంకొక వస్తువు లేనేలేదు అని చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మతత్వం లక్షణాలు ఏమిటీ? మొదటిలక్షణం ఏమిటంటే బ్రహ్మకు రంగు, రుచి, వాసన లేవు. దానికి ఆకారం అనేది కూడా లేదు. అది ఒక మహా చైతన్యం కలిగినటువంటి శక్తి స్వరూపం. అటువంటి ఈ మహాచైతన్య శక్తి ఈ సృష్టికి పూర్వం ఉండేది అన్నమాట. ఈ బ్రహ్మము ఇంద్రియగోచరం కాదు, అంటే కళ్ళకి కనిపించని శక్తి. అది శబ్దం చేత కాని, స్పర్శ చేత కాని, వాసనచేత కాని , కంటిద్వారా కాని ఈ కర్మపంచేంద్రియాల ద్వారా కాని ఈ బ్రహ్మాన్ని చూడలేం. దాన్ని అనుభవంలోకి తీసుకుని రాలేం. అంటే మన ఈ పంచకర్మేంద్రియాలకి ఈ బ్రహ్మతత్వం అగోచరం అని అర్థం. శబ్ద, రస, రూప, స్పర్శ, గంధ ఈ అయిదు పంచేంద్రియాలకి అనుభవంలోనికి రాలేదన్నమాట. ఏ వస్తువునైనా మనం అనుభవంలోనికి తీసుకుని రావాలంటే ఈ అయిదు గుణాలు ఉంటేనే మనం చూడగలుగుతాం. ఈ అయిదు గుణాలు లేనటువంటి ఈ బ్రాహ్మని మనం ఈ పంచకర్మేంద్రియాల ద్వారా అనుభవించ లేము. అందుకే ఇది ఇంద్రియ గోచరం కాదు.
              ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువుని మనం చూడాలంటే , అనుభవించాలంటే ఆ వస్తువుకి ఒక రూపం ఉండాలి, దానికి రసగుణం, స్పర్శగుణం, శబ్దగుణం ఉండాలి లేకపోతే మంచి వాసన ఉండాలి. ఇవన్నీ ఉండడమే కాకుండా చూసేవాడికి కూడా ఈ పంచకర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కూడా పని చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఎదురుగుండా ఒక భౌతికవస్తువు ఉన్నప్పటికీ కంటి చూపు లేనివాడు ఆ వస్తువు జ్ఞానాన్ని పొంద లేదు. అలాగే చెవిటివానికి గ్రహణ శక్తి ద్వారా ఆ విషయం యొక్క భౌతిక జ్ఞానం లభించదు. అలాగే స్పర్శ జ్ఞానం లేనివాడు ఆ వస్తువు యొక్క జ్ఞానం ఉండడం కష్టం. అందుకనే ఎదురుగుండా ఒక వస్తువుకి ఈ అయిదు గుణాలు ఉన్నప్పటికీ చూసేవానికి ఈ పంచ జ్ఞానేంద్రియాలు  పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ వస్తువు యొక్క సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అందుకనే ఈ అయిదింటినీ జ్ఞానేంద్రియాలు అని చెప్పుకోవడం జరిగింది. ఇంద్రియ గోచరం కాని వస్తువు మనస్సు చేత గ్రహించబడదు. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఉదాహరణకి., ఒక మామిడిపండు రుచి చూసినప్పుడు అది తియ్యగా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ వస్తువుకి రసగుణం ఉంది. ఇది మనస్సు చేత గ్రహించబడుతుంది. ఫలానా వస్తువు తియ్యగా ఉన్నది అని మనకి అనిపించినప్పుడు ఈ రుచిని మనస్సు ఇదివరకే అనుభవించింది కాబట్టి మనస్సుకి ఆ తియ్యదనం గురించి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మిగతా లక్షణాలన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలు అనుభవించి నప్పుడు వాటి యొక్క లక్షణాలు మనస్సు గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వస్తువు యొక్క లక్షణం తర్వాత ప్రస్తావనకి వచ్చినప్పుడు మనస్సు తెలుసుకుంటుంది. కాని ఇక్కడ ఈ బ్రహ్మ పదార్థానికి ఈ లక్షణాలన్నీ లేవు కాబట్టి మనస్సుకి కూడా ఇది అగోచరమే.  మనస్సు చేత కూడా అనుభవింప చేయ లేనట్టి పదార్థమే. అది  మనస్సు చేత ఊహింప బడదు కాబట్టి వాక్కు ద్వారా మనం దాన్ని వర్ణించ లేము. దీన్నే అవమానసగోచరం అని అంటారు. మనస్సు చేత కాని, వాక్కు చేత కాని వర్ణింపబడ లేని పదార్థాన్ని అలా మనం పిలుస్తూ ఉంటాం.
              మరి ఈ ఇంద్రియాల చేత కాని, వాక్కు ద్వారా కాని, మనస్సు ద్వారా కానీ గ్రహించ లేని ఈ పదార్థాన్ని మనం ఎలా తెలుసుకోవాలి ? ఎందుకంటే ఈ మూడు తత్వాలు లేని దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అది ఎలా సాధ్యం? అనే ప్రశ్న మనందరికి వస్తూ ఉంటుంది. ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి? ఎలా తెలుసుకోవాలి? అంటే ఈ బ్రహ్మ తత్వాన్ని అనుభవించినట్టి, గ్రహించినటువంటి మహాత్ములు, మహర్షుల యొక్క అనుభవం, సాధనల ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ బ్రహ్మ పదార్థాన్ని మనమంతా శాస్త్రంలో చెప్పబడ్డట్టుగా ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి చాలా మంది మా అనుభవం లో లేనిది మేము ఎలా నమ్ముతాం? అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎవరికో వచ్చిన అనుభవం మా అనుభవం కాదు కదా ! మరి  మేము ఆ అనుభవాన్ని ఎలా తెలుసుకోవాలి? అని అడుగుతూ ఉంటాం. ఇది సర్వ సాధారణమే. ఉదాహరణకి మీరు post graduation డిగ్రీ చేశారు అని అనుకోండి. మరి కాలేజి నుంచి ఉత్తీర్ణత సంపాదించినాక శాస్త్ర పరిజ్ఞానం ఉంది కాని అనుభవం లేదు కదా ! మరి ప్రతీ వాళ్ళు మీకు అనుభవం ఉంటేనే మేము మీకు ఉద్యోగం ఇస్తాం అని అంటే మీకు మరి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉండవు కదా! అప్పుడు మీరేం చేస్తారు? అనుభవం కోసం ఏదో చిన్న కంపెనీలో మీరు నేర్చుకున్న శాస్త్రీయ పరిజ్ఞానం అనుభవంలోనికి రావాలని చేరుతారు. అక్కడ మీకన్నా ఎంతో అనుభవం ఉన్నవారి క్రింద మీరు శిక్షణ పొందుతూ ఉంటారు. వారు చెప్పిన పద్ధతులను అనుసరించి మీరు మెల్ల మెల్లగా అనుభవాన్ని సంపాదించుకుంటారు. ఏవిధంగా అయితే మీరు ఈ లౌకిక ప్రపంచంలో మరి ఉత్తీర్ణత సంపాదించి, శాస్త్రీయ పరిజ్ఞానం ఉండి కూడా, అనుభవాన్ని పెద్దవాళ్ళ దగ్గర ఏవిధంగా నేర్చుకున్నారో అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఇటువంటి మహాత్ములు, మహర్షులు, వాళ్ళు అనుభవించినట్టి అనుభవాలు, సాధనాలు ఇవన్నీ గ్రంథస్థం చేసినప్పుడు మనం ఆ గ్రంథాలన్నీ చదివి వాళ్ళు చెప్పిన మార్గంలో మెల్లమెల్లగా వెళ్ళడం మొదలుపెడతాం. అంతే కాని ఏ విషయానికి కూడా సాధన లేకుండా ఫలానా వారికి అనుభవం లోనికి వచ్చింది మాకు అనుభవం లోనికి రాలేదంటే అది తర్కానికి అందని విషయం. మీరు కూడా క్రమక్రమంగా ఏదో మీకు నచ్చిన సాధన  మీరు చేస్తూ ఉంటే, మహాత్ములు అనుభవంలోనికి తెచ్చుకున్న విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా అనుభవంలోని వస్తాయి.
                                                                                              (సశేషం)