చేదు నిజాలు - 3
భారతదేశం యొక్క విభజన - లార్డ్ మౌంట్ బాటన్ అతని భార్య లేడీ ఎడ్వినా - ఆంగ్లేయుల యొక్క కుట్ర
ఒక విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకోవడానికి, మన సంస్కృతిని నాశనం చెయ్యడానికి మనలో మనకి కలతలు పెట్టి నిరంతరం కలహించుకునే విధంగా చాలా దుర్మార్గంగా కుట్ర పన్నారు. ఎంతోమంది ఆంగ్లేయులు మన భారతదేశాన్ని, భారతీయుల్ని చాలా రకాలుగా నాశనం చేశారు అయితే వారందరిలో కూడా అగ్రగణ్యుడు ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు అతని పేరే లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ తనంతట తాను భారతదేశానికి రాలేదు. బ్రిటీష్ పార్లమెంట్ లో ఆ సభ్యులందరూ కలసి ఒక తీర్మానం చేశారు, భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ముందు బ్రిటన్ కి అనుగుణంగా పనిచేయగల వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు మౌంట్ బాటన్ అని తీర్మానించారు. మరొక తీర్మానం ఏమిచేశారంటే అది నేను వివరంగా చెప్పలేను అదేమిటంటే మౌంట్ బాటన్ సతీమణి లేడీ ఎడ్వినా భారతదేశంలోని కొంతమంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులని చాలా సమర్ధవంతముగా ప్రభావితం చెయ్యగలదు అని తీర్మానించి వారిని భారతదేశానికి పంపించడం జరిగింది. లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ కాంగ్రెస్ నాయకుల్ని సమర్ధవంతంగా ప్రభావితం చేస్తుంది అంటే దానిలో అర్ధం మీరు ఈపాటికే గమనించి ఉంటారు, వివరంగా చెప్పలేను నేను. భారతదేశంలో ప్రముఖమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి లేడీ ఎడ్వినా చాలా సమర్ధవంతంగా ప్రభావితం చేస్తుంది అని వాళ్ళనుకోవడం నిజంగా గర్వించదగ్గ పని కాదు చాలా సిగ్గుచేటు వ్యవహారం అని మనం చెప్పుకోక తప్పదు. ఒక స్త్రీ ని ఆంగ్లేయులు ఒక కార్యాచరణ ఇచ్చి అంటే ఒక ఎజెండా ఇచ్చి భారతదేశానికి వాళ్ళు పంపించారంటే ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. లేడీ ఎడ్వినా భారతదేశానికి రాగానే వెంటనే తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మంటలు మండించే కార్యక్రమం మొదలయ్యింది. జిన్నాని ప్రత్యేక పాకిస్థాన్ రాజ్యం కావాలి అని నువ్వు పట్టుబట్టు నేను నీకు సహాయం చేస్తాను అని పదేపదే అతనిని వేధించసాగింది. మౌంట్ బాటన్ కూడా తన పాత్రని నిర్వహించాడు. అతడు కూడా జిన్నాని ఎగదోసి నువ్వెలాగైనా సరే ప్రత్యేక పాకిస్థాన్ దేశం కావాలని పట్టుబట్టు అని నూరిపోయడం జరిగింది. కానీ జిన్నా ఏమాత్రం కూడా ప్రత్యేక పాకిస్థాన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి అతను ముసల్మాన్ కానేకాదు. జిన్నా మరియు అతని అనుచరులు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ కావాలని కోరుకోలేదు కానీ సోహ్రాబ్ అనే వ్యక్తి మాత్రం ప్రత్యేక పాకిస్థాన్ కావాలని చెప్పాడు. మౌంట్ బాటన్ మరియు అతని శ్రీమతి కలిసి జిన్నాని వేధించసాగారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల్ని కూడా మీ యొక్క పరంపర వేరు, సంస్కృతి వేరు , వల్ల యొక్క పరంపర వేరు. మీరిద్దరూ ఎలా కలసి ఉంటారు కాబట్టి మీరు కూడా దేశవిభజన కావాలని గట్టిగా పట్టుబట్టండి మేము సహాయం చేస్తాం అని పదేపదే జిన్నాని మరియు జవహర్ లాల్ నెహ్రూని వేధించసాగారు. ఆఖరికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి దిగజారారంటే స్వయంగా లేడీ ఎడ్వినా ని వారు ఒక ఆయుధంగా మలచుకున్నారు. ఆ ఆయుధాన్నే ఇద్దరు నాయకుల మీదా ప్రయోగించారు. అంతిమసమయం వరకు అంటే 1946వ సంవత్సరం వరకు కూడా భారతదేశ ప్రజలు కానీ, ముస్లింలు కానీ దేశ విభజన కావాలని కోరుకోనేలేదు. స్వాతంత్య్రం వచ్చిన భారతదేశానికి జవహర్ లాల్ నెహ్రు ప్రధాని గాను, ఉప ప్రధానిగా మొహమ్మద్ జిన్నా ఉంటారని భావించారు తప్ప ఎవ్వరూ మాత్రం దేశ విభజనని కోరుకోలేదు. కానీ లార్డ్ మౌంట్ బాటన్ అతని భార్య లేడీ ఎడ్వినా ఇద్దరు కూడా వారి ప్రయత్నాల్ని విరమించుకోలేదు. నెహ్రూ కి, జిన్నా కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా విశ్వప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నం చేస్తుండగానే నెహ్రూ తన మంత్రిమండలిలో ఒక చప్రాసీ ఉద్యోగం కూడా నేను ఇవ్వను అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు. ఆ మాటని వాళ్ళు ఆసరాగా తీసుకుని లార్డ్ మౌంట్ బాటన్ జిన్నా దగ్గరకి వెళ్లి చూడు నెహ్రూ నీకు ఎంత మర్యాద ఇస్తున్నాడో నీకు చెప్రాసీ ఉద్యోగం కూడా ఇవ్వడట అని అతనిని బాగా రెచ్చగొట్టాడు దానితో జిన్నా యొక్క క్రోధం కట్టెలు తెంచుకుని అయితే సరే దేశ విభజనని నేను కోరుకుంటాను, ఆ దేశానికి ప్రధానినై నేను చూపిస్తాను అని అతడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ విధంగా మౌంట్ బాటన్ అతని సతీమణి ఎడ్వినా రేయింబవళ్లు ఇద్దరినీ రెచ్చగొడుతూ ఎటువంటి పార్లమెంట్ తీర్మానం లేకుండానే ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ అని చెప్పేసి దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు. నిజానికి ఇది అసలు చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానమే. ఈ సభలో ఈ విషయాన్నీ చర్చించి మంత్రిమండలి అంతా తమ ఆమోదం తెలియచేయకుండానే ఈ విధంగా దేశాన్ని రెండు ముక్కలుగా చేసే కుట్ర ఈవిధంగా ఫలించింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసిన గవర్నర్ జనరల్ గా వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ ని మనకి స్వాతంత్య్రం వచ్చాక మనం ఏంచెయ్యాలి? కానీ దురదృష్టం ఏమిటంటే ఇంత దుర్మార్గపు పని చేసిన మౌంట్ బాటన్ మరియు లేడీ ఎడ్వినా వీళ్ళ చిత్రపటాలన్నీ కూడా భారతదేశ ముఖ్య కార్యాలయాలలో ఉంచటం జరిగింది. వాళ్లకెంతో గౌరవం ఇవ్వడం జరిగింది. మ్యూజియంలోనూ, అన్నింట్లోనూ కూడా వీరి ఇద్దరి చిత్రపటాలు, ప్రశంసాపత్రాలు అన్నీ కూడా ప్రదర్శించబడటం ఈ భారతదేశంలో జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంక ఏముంటుంది. ఈ విధంగా అఖండమైన భారతదేశాన్ని ఆంగ్లయులు కుట్రలు పన్ని చాలా దారుణంగా ఒక స్త్రీని వాడుకుని కాంగ్రెస్ నాయకుల యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఈ అఖండ సామ్రాజ్యాన్ని రెండు ఖండాలుగా విభజించేశారు. అంతే కాదు ప్రపంచంలో అతి దారుణమైన సంఘటనలు భారతదేశ విభజన జరిగే ముందు జరిగాయి. కొన్ని లక్షల మంది చంపబడ్డారు అటు పాకిస్థాన్ లోను, ఇటు ఇండియా లోను కూడా కొన్ని లక్షల మంది ఈ మారణకాండలో ప్రాణాలు వదిలారు, మానభంగాలు, ఆస్తిపాస్తులు, పుత్రులని,బంధువులని అందరిని కూడా కోల్పోయి కొన్ని లక్షల మంది శరణార్థులుగా భారతదేశంలో అక్కడక్కడా వాళ్ళు నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. దాదాపు ఈ మారణకాండ సంవత్సరంన్నర పాటు జరిగింది. ఇది చాలా ఘోరమైన, భయంకరమైన మారణకాండ. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు జరిగినటువంటి సంఘటన.మొత్తం ప్రపంచంలోనే ఇటువంటి మారణకాండ జరగడానికి బాధ్యుడైనటువంటి మౌంట్ బాటన్ గురుంచి మన పుస్తకాలలో వ్రాసి పిల్లలకి చెబుతున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. కనీసం మనకి స్వాతంత్య్రం వచ్చాక అయినా సరే మౌంట్ బాటన్ మరియు ఎడ్వినా ల యొక్క చిత్రపటాలు, వారి స్మృతి చిహ్నాలని మనం పూర్తిగా తొలగించి ఉండాల్సింది లేదా వాటినన్నింటిని వారి దేశానికి పంపించి ఉండాల్సింది. ఇలా మనం ఇంకా వాళ్ళని గౌరవిస్తూ ముఖ్యమైన కార్యాలయాల్లో వాళ్ళ ఫోటోలను పెట్టుకున్నామంటే ఇంకా మనలో ఆ బానిసత్వపు ధోరణి పోలేదని మనం చెప్పుకోకతప్పదు. ఇప్పటికి కూడా ఢిల్లీలోని ముఖ్యమైన కార్యాలయాలలో లేడీ ఎడ్వినా యొక్క ఛాయాచిత్రాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎంతో వినమ్రపూర్వకంగా ఆంగ్లేయులకు వారి ఫోటోలను మరియు వారి స్మృతి చిహ్నాలని పంపించివేయాలి లేదా వారు నిరాకరిస్తే ఇక్కడే వాటిని తగలబెట్టాలి. వాస్తవానికి అసలు జిన్నా ముస్లిం కాదు. అతడు మద్యపానీయాలు సేవిస్తాడు, వర్జితమైనటువంటి పంది మాంసం భక్షిస్తాడు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తూంటాడు. అతని వంశస్థులందరూ వడ్డీ వ్యాపారాలు చేసి జీవించేవారు. ముఖ్యంగా ఇస్లాంలో ముస్లిం అనేవాడు రోజుకి ఐదు సార్లు నమాజు చెయ్యాలి కానీ జిన్నా తన జీవితంలో నమాజు చేసినట్టు ఎప్పుడూ ఎక్కడా మనకి తెలియదు. ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలోని ముస్లింలు ఎప్పుడూ కూడా జిన్నాని తమ నాయకునిగా అంగీకరించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్థాన్ లో కూడా జిన్నాని తమ నాయకునిగా ఎవ్వరూ అంగీకరించలేదు. జిన్నా కలలో కూడా ప్రత్యేక రాజ్యం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ బలవంతంగా వద్దు వద్దు అని అంటున్నా కూడా జిన్నా కి భారతదేశాన్ని రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని పాకిస్థాన్ గా ప్రకటించి అతనికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం కూడా ఇంకొక ఆంగ్లేయుడు ఉన్నాడు. అతడు మౌంట్ బాటన్ తో పాటుగా పనిచేస్తుండేవాడు. అతని పేరు రెడ్ కార్పెట్. అతనితో కూడా బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఎన్నో విధాలుగా చర్చించి , తీర్మానించి భారతదేశానికి పంపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని విభజించమని చెప్పారు. ఎలాగంటే కొన్ని ప్రాంతాలలో ఎప్పుడూ కూడా శాంతి లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ కలహాలు సృష్టించే విధంగా భారతదేశాన్ని విభజన చెయ్యమని అతనికి చెప్పి పంపించారు. రెడ్ కార్పెట్ భారతదేశానికి రాగానే ఇక్కడి ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. మా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మేము నిర్ణయించుకుంటాము కానీ నువ్వెవరు విభజించడానికి అని ప్రశ్నించారు. కానీ అతడు నేను బ్రిటిష్ పార్లమెంట్ తరఫున వచ్చాను అని చెప్పి మౌంట్ బాటన్ తో కలిసి అఖండ భాతదేశాన్ని రెండు ముక్కలుగా విభజన చేశాడు. ఆంగ్లేయులు కుట్ర పన్ని ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల వారు పరస్పరం కలహించుకునేలా సరిహద్దును నిర్మించారు. ఆ ఆంగ్లేయ అధికారి పేరు రెడ్ క్లిఫ్. మొత్తం మీద ఈ ఆంగ్లేయ అధికారి రెడ్ క్లిఫ్ మౌంట్ బాటన్ సహాయంతో నలుగురు అయిదుగురు నాయకులతో మాట్లాడి, ఒప్పించి తన ఇష్టం వచ్చిన విధంగా సరిహద్దుల్ని నిర్ణయించాడు. దౌర్భాగ్యం ఏమిటంటే దాన్ని ఇప్పటికీ కూడా "రెడ్ క్లిఫ్ లైన్" అని వ్యవహరిస్తూ ఉంటారు. డాకుమెంట్స్ లో కూడా ఆవిధంగానే రెడ్ క్లిఫ్ లైన్ అని ఉటంకించడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఆంగ్లేయులు కుట్ర పన్ని ఎంతో చాకచక్యంగా ఒక స్త్రీని ఉపయోగించి అఖండమైన భారత సామ్రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఇలాంటి పని చేసిన రెడ్ క్లిఫ్ యొక్క స్మృతి చిహ్నాలు ఇప్పటికీ మనదేశంలో ఉన్నాయి. నిజానికి అసలు భారత దేశాన్ని విభజించడం మరియు సరిహద్దులు ఏర్పరచడం అతని పరిధిలో లేని విషయాలే. ఇలాంటి దుర్మార్గులని మనకి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ళకి కూడా గౌరవిస్తూనే ఉన్నాం. అందుకే ఇందాక చెప్పను కదా మనకి బానిసత్వపు గుణాలు పోలేదు.