అతీంద్రియ శక్తులు
Chapter -5
భారతదేశానికి రాక ముందే పాల్ బ్రంటన్ (Paul Brunton) సాధువులు, మహాత్ములు, మహర్షులు, సిద్ధ పురుషులు, అగ్గోరీల గురించి కూడా ఎంతో కొంత చదివి వచ్చాడు. అతడు తాను ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడే ఉంటున్న ఒక అగోరీ గురించి విని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకతన్ని “ఇక్కడ అగోరీ ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “అవును ఇక్కడ ఒక అగోరీ ఉన్నాడు . కాని అతను పిచ్చి వాడు, ఎవర్ని దగ్గరకు రానీయడు, రాళ్ళు పెట్టి కొడతాడు” అని చెప్పాడు. పాల్ బ్రంటన్ (Paul Brunton) “నన్ను అతని దగ్గరకు తీసుకుని వెళ్ళు. నీవు దూరంగా ఉండి అతన్ని నాకు చూపించి, నీవు వెళ్ళిపో” అని అతనికి ఎంతో నచ్చ చెప్పాడు. చివరకు అతను ఎంతో అయిష్టంగా ఒప్పుకుని పాల్ బ్రంటన్ (Paul Brunton) తో వెళ్ళడం జరిగింది. అక్కడ నదీ తీరంలో ఉన్న ఒక చిన్న గుట్టమీద కూర్చుని ఒక వ్యక్తి విచిత్ర ఆకారంలో వీళ్ళకి కనిపించాడు. అతను వీళ్ళని చూడగానే కఠినమైన పదజాలంతో తిడుతూ రాళ్ళని వాళ్ళవైపు విసర సాగాడు. ఒక పిచ్చివాని మాదిరిగా అతను ప్రవర్తించ సాగాడు. దీనికి పాల్ బ్రంటన్ (Paul Brunton) తో వచ్చినటువంటి వ్యక్తి గడగడా వణికిపోయి “అయ్యా! మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడం మంచిది. వాడు రాళ్ళతో కొట్టి మనల్ని గాయ పరుస్తాడు” అని చెప్పాడు.
“చూడూ ! అతను రాళ్ళని మనవైపు కావాలనే గురి తప్పెటట్టుగా విసురుతున్నాడు కాని మనల్ని కొట్టడం లేదు. కేవలం