దేవదత్తుని వృత్తాంతం - 13
ఇదంతా చూస్తున్న నాగనాథునికి ఈ కొత్త శిరిడి సాయి బాబా భక్తుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. వెంటనే అతను ఆయన్ను ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని సంకల్పించ గానే ఆయనకు మనోనేత్రము ముందు చాలా స్పష్టంగా ఆయనను గురించిన విషయాలు తెలిశాయి. అతని పేరు జగతాప్ అని భారత ప్రభుత్వం లో ఆర్మిలో కొంతకాలం పని చేసి రిటైర్ అయ్యారని పరమ శిరిడి బాబా భక్తుడని, ఆయనకు సాక్షాత్తు శిరిడీ సాయి బాబా సంస్థానం లో రాచ మర్యాదలతో అసలు సమాధి అంటే ప్రస్తుత సమాధి కింద ఉన్న మరొక సమాధి ఉంటుంది. అదే సాయి బాబా గారి అసలు సమాధి. ఆయనను అక్కడి దాకా ప్రవేశం నిరాటంకం గా ఉంటుంది అని తెలిసింది. అతను శిరిడీ కి ఎప్పుడు వెళ్లినా శ్రీ సాయిబాబాకు పెట్టిన పదార్థాలన్నింటిని ఆయనకు మరియు అతని అనుచరులకు వడ్డిస్తారని తెలిసింది. ఆయన చేతిలో అద్భుతమైన వ్యాధి నివారణ శక్తి ఉందని ప్రచారం జరిగింది. అనేకమంది ధనవంతులతో అతనికి పరిచయాలు ఉన్నాయని తెలిసింది. అయితే ఎవరైనా అతన్ని వారి గ్రామాలకు, పట్టణాలకు గాని పిలిపించుకోవాలంటే ఆయన విమానంలో రాను పోను ప్రయాణ ఖర్చులు భరించాలి. ఖరీదైన హోటల్లో ఆయనకు బస. 24 గంటలు ఆయన ఉన్నంత వరకు కారు కేటాయించబడాలి అని ఆయనకి తెలుస్తూ ఉన్నాయి. మరి ఆయన మహారాష్ట్ర వాసి అని గ్రహించారు. మరునాడు పెద్ద గుడారాలు వేయటం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి రుసుము స్వీకరించబడలేదు కానీ మన ఆచారం ప్రకారం అక్కడకి వచ్చిన రోగులందరు ఎంతో కొంత దక్షిణ, కొన్ని పలహారాలు ఇవి సమర్పించటానికి వచ్చారు. అంతక్రితం రోజు దత్త యజ్ఞం చేసిన ఒక వ్యక్తికి మెడ బాగం దగ్గర ఎముకలు అరిగి బాధ పడుతున్నాడని ముందుగా ఆయన్ని రమ్మని చెప్పి విభూతి తీసుకొని ఆయన నుదిటిపై పెట్టి ఆయన మెడ అంత రాస్తూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు ఆయనతో చెప్పించసాగారు.
ప్రతి రెండు నిమిషాలకు మీకు తగ్గిందా మీకు తగ్గిందా తగ్గిపోయిందా అని అనటంతో అంతకుముందే చాలా పెద్ద మొత్తంలో దక్షిణ సమర్పించటంతో చాలా మోహమాటనికి తగ్గింది అని చెప్పటం నాగనాథునికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క శ్రీమతి భర్త చెప్పింది నమ్మింది. ఆమె కూడా తనకి కింది భాగంలో చాలా బాధగా ఉందని చెప్పటంతో ఆయన ఒక్క క్షణం కూడా సందేహించకుండా వేల మంది చూస్తుండగా తన చేతిని ఆమె చీర లోపలి భాగం నుంచి పైకి వెళ్లి ఆమె తొడలను స్పర్శిస్థూ ఆమె నడుము నొక్కుతూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు చెప్తూ విభూతి రాస్తూ మీకు తగ్గిందా తగ్గిందా అని అనడంతో ఆమె నిర్గాంతపోయింది. అంతమంది జనం ముందు ఈ విధంగా సాహస కృత్యం చేస్తాడని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆమె గాబరా పడిపోయి తగ్గలేదు అంటే ఆ చేయిని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తాడో అని తగ్గింది తగ్గింది చెప్పటం, అతను మెల్లగా చేయి తీసేయటం జరిగే సరికి అక్కడ వల్లభదాసుకి, అతని అనుచరులకి భాద కలిగింది, కోపం కూడా వచ్చింది. ఇంకా అతన్ని లోతుగా పరిశీలిస్తే నాగనాథునికి అతను శిరిడి సాయిబాబా పరమ భక్తుడైన శివనేషన్ స్వామి ఒక తమిళుడు . శిరిడీ లో ఉన్న ఊరు స్థానం ఎదురుగా మెట్లదారికింద ఉన్న చిన్న గదిలో ఉంటూ బాబా గారిని గురించి కొన్ని ఏళ్లు ధ్యానము చేస్తున్న మహాత్ముడు. ఆయన పరమపదించాక శిరిడిలొనే ఒక చోట సమాధి చేసి అక్కడే ఒక ఆశ్రమం ఏర్పరచటం జరిగింది. అక్కడ శిరిడ సాయి బాబా తెలుగు చరిత్రను అనువదించి, ఎన్నో దత్త యజ్ఞాలు చేసిన సాధకుడు దత్త యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఆ బ్రాహ్మణుని భార్యతో ఇదే విదంగా ప్రవర్తించడం తో ఆమె సిగ్గుతో చితికిపోయింది.
ఇలా జగతాప్ గారు చేసిన చికిత్స లో చాలా మందికి గుణం కనిపించలేదని , ఒక వేళ గుణం కనిపించకపోతే మీ ప్రారబ్ద కర్మ బలంగా ఉందని సాకుతో తప్పించుకొనేవాడు. ఇవన్నీ నాగనాథుని మనో నేత్రం ముందు ఒక చలన చిత్రం లాగా కన్పించసాగాయి. ఒకవేళ చిన్న చితక వ్యాధులు తగ్గే అవకాశం ఉన్న ఇదంతా ఆ జరిగిన అద్బుతాలని జగతాప్ గారికి ఆపాదించటం, బాబాని స్మరించకపోవటం చూసి కూడా ఆయన కొంతగా బాధ పడ్డాడు. ఈ ప్రారబ్ద కర్మ సిద్ధాంతం జనాలు ఎంతగా అపార్థం చేసుకుంటున్నారు. పండితులు కూడా విపరీతమైనటువంటి అసంబద్దమైనటువంటి తర్కానికి అందనంతగా దత్త బోధనలకు వ్యతిరేకంగా పలు భాష్యాలు చెప్పటం కూడా ఆయనకు కించిత్తు భాద కలిగించింది. జనులు ముఖ్యంగా పండితులు పామరులు కూడా ఎంతో అజ్ఞానంలో ఉన్నారు. సాక్షాత్తు దత్తుని నమ్ముకున్నవారు కూడా ఇటువంటి మధ్యవర్తుల ఛాయా చిత్రాలను పూజ మందిరంలో పెట్టుకోవటం వాళ్ళను ప్రార్థించటం, గది నిండా ఇటువంటి సాధువులు ఉండటం మధ్యలో శ్రీ పాద స్వామి మరియు దత్తాత్రేయుల వారి పటం ఉండటం చూసి ఆయన జనం ఎంతగా దత్తాత్రేయ తత్వానికి దూరంగా ఉన్నారా అని కూడా అనుకున్నారు. వల్లభ దాసు కూడా తన అనుచరులను ఆయన దగ్గరికి పంపటం, వారందరు వచ్చి జరుగుతున్న మోసాన్ని చెప్పటం ఈయన గ్రహించారు. అదే సమయంలో ఎంతో మంది మహిళలు వచ్చి జరుగుతున్న తతంగాన్ని ఫోటోల రూపంలో చిత్రీకరించడం అది ప్రతివాళ్ళు కూడా ఏదో మాములు విషయాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు.
ఈలోగా ఆ స్వామి వారు సుమతి తండ్రికి కబురు చేసి ఏమయ్యా ఐదు రోజులు అయిపోయింది మరి ఎప్పుడు పంపిస్తావు వ్యాధి ముదిరితే కష్టం కదా అని చెప్పటంతో స్వామి నేను ఈ రాత్రి తీసుకొస్తాను అని చెప్పటం జరిగింది. సుమతి తండ్రి ఇంటికి వచ్చి రాధమ్మకి, సుమతికి కూడా చెప్పి స్వామి వారు రాత్రి తీసుకురమ్మన్నారు కాబట్టి మనం వెళ్దాం తప్పకుండా మన సుమతికి తెలియనటువంటి అంతులేని వ్యాధి తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉందని పదే పదే చెప్పటం జరిగింది. అయితే రాధమ్మకి సుమతికి కూడా చాలా దైర్యం కలిగింది. శ్రీపాద స్వామి తమని తప్పకుండా కాపాడతాడానే ఒక గట్టి విశ్వాసం వారికి కలిగింది. ఆ ధైర్యంతోనే వారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వారి నివాస స్థానానికి వెళ్ళటం జరిగింది .