దేవదత్తుని వృత్తాంతం
నాగనాథుని నిర్వేదన
దత్తస్వామి మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి భక్తుడైన నాగనాథునికి తాను చూస్తున్నదాంట్లో దత్తభక్తులుగా తమని తాము చెప్పుకుంటున్న కపట స్వాములను తలచుకొని ఎంతో నిర్వేదన కలిగింది. ఒకప్పుడు పరశురాముడికి కూడా ఇలాంటి నిర్వేదన భావం కలిగింది. సాక్షాత్తు దత్తస్వామి అవతారమైన శ్రీపాదులు భూమిమీదకు వచ్చి ఎంతోమంది ప్రజలను ఉద్ధరించ వెళ్లిపోయిన అనతి కాలంలోనే ఇలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ దత్తాతత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదేమిటి అని, శ్రీపాదుని పేరు చెప్పుకొనో లేదా నృసింహ సరస్వతి పేరు చెప్పుకొనో, షిరిడీ సా యిబాబా మహిమల గురించి పైకి చెప్పుకొనో అమాయక ప్రజల విశ్వాసాలను సొమ్ముచేసుకుంటున్నది చూసి చాలా మదన పడ్డాడు. అయితే అతనికి ఒక సారి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలావున్నాయి అని గమనించాలని సంకల్పం కలిగింది.
అతను తన సంకల్ప శక్తితో తత్ క్షణం స్వామివారు తపస్సు చేసుకున్న కురువపుర క్షేత్రానికి వెళ్లడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీపాదులు తపస్సు చేసుకున్న ప్రాతం ఎటువంటి సౌకర్యాలు లేకుండా పురతనంగా ఉండటం గమనించాడు. కానీ అక్కడ నియమింపబడ్డ బ్రహ్మణోత్తములు శ్రద్ధగా మడికట్టుకొని ఆ కృష్ణానది పాయ నుండి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలుచేస్తూ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.శ్రీవల్లభ స్వామివారు ఇచ్చిన ఆదేశాలప్రకారం ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబాన్ని కర్ణాటక రాష్ట్రంలోని ధార్వార్ నుండి తీసుకురావడం జరిగిందని ఆ వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారు అక్కడ పరిస్థితిని గమనించి నాలుగు వైపులా నీరువున్న ఆ ద్వీపాన్ని చూసి, మేము ఇక్కడ ఎలా జీవించగలం అని వాపోయారు.దత్త స్వామి ప్రియ శిష్యుడైన శ్రీ టెంబేస్వామి అక్కడి భక్తుల సహకారంతో శ్రీస్వామివారికి చిన్న ఆలయం కట్టించి, ఆ బ్రాహ్మణ కుటుంబాల అన్నదమ్ముల ఇద్దరికి నివాస యోగ్యమైన రెండు ఇళ్లను కట్టించి, వారి జీవనోపాదికై కొంత మంది భూస్వాముల సహాయంతో భూములను దానం చేయడం జరగడంతో వారు అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి వారు ఆ రెండు కుటుంబాలను తన సేవకు నియమించుకున్నారు.
ఇప్పటికి ఆ కుటుంబాలకు చెందిన తరాలవారే వంతుల వారీగా స్వామివారి సేవచేసుకుంటూ భక్తులు ఇచ్చే కానుకలతో తమ జీవనాన్ని గడుపుకుంటున్నారు.భక్తులు ఇచ్చే సంబారాలతో మడికట్టుకొని చేసిన పదార్థములతో అన్నదానాలు చేస్తువున్నారు.ఆ కుటుంబీకులను భట్టాక కుటుంబీకులు అంటారు. స్వామివారు ప్రతినిత్యం కృష్ణా నదిలో స్నానం ఆచరించి సూర్యనమస్కారాలు చేసిన తరువాత నీటిమీద నడుచుకుంటూ రుక్మిణి పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న పశువుల పాకలో రోజూ దర్బార్ చేస్తుండేవారు అని తెలిసి అటుగా వెళ్లి చూసి నాగనాథునికి చాలా మనస్తాపం కలిగింది.ఆలయం పర్యవేక్షణ లేక పడుబడి, పశువులకు నివాసమై వాటి విసర్జన పదార్థములతో, భరించరాని దుర్గంధంతో నిండిఉన్నది.ఆలయంలో పూజావిధులు లేక పాడుబడివున్నది, పాండురంగని ఆలయం చూసి చాలా కలత చెందాడు.దత్త జయంతి రోజున, పుణ్య తిధుల రోజులలో అక్కడికి వచ్చిన భక్తులు సరైన వసతులు లేక రుక్మిణి ఆలయం వెనుక ఉన్న కాలి నడక దారిలో వచ్చి తొట్టిలో కూచుని కృష్ణా పాయనిదాటి వచ్చి శ్రీపాద స్వామిని దర్శించుకోడం గమనించాడు.ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తృత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కులకర్ణి కుటుంబాన్ని తలుచుకొని బాధవేసింది.ఆప్రదేశాన్ని పంచదేవపహాడ్ అని పిలుస్తారని తెలుసుకున్నాడు, కాలచక్రం అతని కళ్ళముందు వేగంగా తిరిగింది.
ఆయనకు ఒక సాధువు దత్తస్వామి భక్తుడు ఒకరు తన అనుచరులతో భక్తుల సౌకర్యార్థం ఆ ఆలయం వద్ద మెట్లు కట్టించి వారు తొట్టిల్లో ఆవలి వడ్డుకు చేరడానికి అనుకూలం కల్పించాలి అని సంకల్పిచారు.స్థానికుల సహకారంతో ఆ జిల్లా అధికార యత్రాంగంతో సంప్రదించి ఆ ఆలయప్రాంగణాన్ని శుభ్రపరచి భక్తులద్వారా వచ్చిన విరాళాలు సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడం నాగనాథునికి సంతోషం కలిగించింది.మరియు శ్రీపీఠికాపురం సంస్థానం వారు ఈ ఆలయ ప్రగనంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.ఈ ప్రక్రియ వెనుక ఒక బెంగాలీ సాధువు యొక్క పట్టుదల శ్రమ ఉందని తెలిసి నాగనాథుడు సంతోషించాడు.కానీ నిధుల కొరత వల్ల ప్రతినిత్యం రుక్మిణీ పాండురంగని ఆలయం లో దీపారాధన కార్యక్రమం నిర్వహించడానికి సాధ్యపడలేదు.ఐతే పరిస్థితులు మెల్లగా మార్పులురావడం నాగనాథునికి సంతోషాన్ని ఇచ్చింది. స్వామి వారు తపస్సు చేసిన ప్రదేశంలోను, రుక్మిణీ ఆలయంలోను ధ్యానం చేసుకుంటూ సమయం గడపడం చేసాడు.
శ్రీవాసుదేవనంద సరస్వతి (శ్రీ టెంబే స్వామి) ఏవిధంగా అయితే ధ్యానంలో శ్రీపాదస్వామి జన్మస్థానాన్ని కనుగొన్నారో అదేవిధంగా స్వామివారి తపస్సుచేసుకున్న స్థలం వెతుకుతూ పాండురంగని ఆలయానికి రావడం, అది క్రీస్తు శకం 1238వ సంవత్సరంలోనే నిర్మింపబడటం, అక్కడ బసచేసి స్వామివారు ధ్యానం లో శ్రీపాద స్వామి తపస్థానం, దర్బార్ ప్రదేశం, కురువపురం కనుగొన్నారు అన్న విషయం నాగనాథుని మనోగతానికి అర్థం అయింది.
మిగిలిన విషయాలు తరువాయి భాగంలో.