Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

3 July 2016

జగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమం లో నా అనుభవాలు - Part2

ట్రెక్కింగ్ అనుభవం

ప్రతీరోజు వేరే వేరే కార్యక్రమాలు ఉండేవి ,జగ్గివాసుదేవ్ గారే స్వయంగా నిర్వహిస్తూ వుండేవారు .ఎన్నో అద్భుతమైన విషయాలగురించి సామాన్యులకు  కూడా అర్ధం అయ్యేలా  ఎంతో ప్రాక్టికల్గా  వివరించి చెప్తూ ఉండేవారు . ఎంతో క్రమశిక్షణ  నేను అక్కడ చూసాను . ఈ లోగా నా కాలి సమస్య ఇంకా ఎక్కువ అయిపోయింది . అక్కడ కూడా వాతావరణం  చాలా చల్లగా ఉండేది ,వర్షం పడుతూ ఉండేది . నేను చేతి రుమాలుతో మాటి మాటికి  జలుబుతో కారుతున్న ముక్కు తుడుచుకుంటూ ఆసనాలు వేయటం కష్టం అయిపోయింది . నా లాంటి వాళ్ళే మరికొంత మంది మిత్రులు కూడా ఇదే అవస్థలో  వుండటం నేను గమనించాను . అక్కడ రకరకాల వ్యక్తులతో కలవడం ,అభిప్రాయాలు పంచుకోవడం  చాలా మంది విదేశీయులతో కూడా మాట్లాడటం జరిగింది . వర్కుషాపు లో  లెబొనాన్ నించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . ముస్లిమ్స్ ,క్రిస్టియన్స్ కూడా ఉన్నారు . వాలంటీర్స్ లో లెబొనాన్ వాళ్ళు ఎక్కువమంది వున్నారు . యోగాసనాలు నేర్పే వారిలో ఒకతను భారతీయుడు వున్నాడు మరొకతను జర్మనీ దేశస్థుడు . నాకు శరీర ఉష్ణోగ్రత 103,104 వరకు వచ్చి ఐ ఇన్ఫెక్షన్ కూడా రావడం తో అక్కడే వున్న ఎలోపతి వైద్యుడు ఇచ్చిన మందులు వాడటం జరిగింది .ఇలా ఉండగా జగ్గివాసుదేవ్ గారు సాయంత్రం మీటింగ్ లో మనందరం వెలంగిరి పర్వతాల పైకి ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము ,అక్కడ మీరందరూ చాలా జాగ్రత్తగా ఎక్కాలి.
బహుశా రేపు వర్షం కూడా పడవచ్చు అంతా బురదగా ఉంటుంది. మీకు అలవాటు లేనందున ప్రయాణం కష్టంగానే ఉంటుంది . మీకందరికీ చేతికి ఒక ఊత కర్ర ఇస్తాం. అక్కడ ఏనుగులు చాలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ,దారిలో ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళవలసి ఉంటుంది .  అక్కడ మెట్లు లాంటివి వుండవు అంతా  ఎగుడు దిగుడు గా ఉంటుందంటూ ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు . నేను రూముకి వెళ్ళేసరికి నా రూమ్మేటు నా పరిస్థితి చూసాడు . రాత్రంతా దగ్గుతూ వుండటం ఆయాసపడటం  ,కళ్ళకలక ,జ్వరం ,కాలంతా వాచిపోయి పుండుపడి నడవ లేకపోవడం ఇవన్నీ చూసి అతనన్నాడు మీరెలా వస్తారు రేపు ట్రెక్కింగ్ కి  చాలా కష్టం కదా అని ,కాని నేను దానికి బదులుగా ఏమి మాట్లాడలేదు . ఇదేమిటి ఇంతదూరం వచ్చాను ,ఇంత మహాత్ముడి ఆశ్రమంలో వున్నాను ,ఆయన ఆశ్రయం లో ఉన్నాను ,అంతమంది ఆయనతో  కూడా వెళ్తున్నారు మరి నేను వెళ్లకపొతే ఎట్లా ?జీవితంలో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకూడదు కదా ! అని పరిపరివిధాలుగా ఆలోచించుకుని వెళ్ళాలనే చివరికి నిశ్చయించు కున్నాను .        మరునాడు ఉదయం నా రూమ్మేటు నిద్రలేచి వెళ్లిపోయాడు . తర్వాత నేను ఆయింటుమెంటు రాసుకుని బాండేజీ  కట్టుకుని దానిమీద సాక్స్ వేసుకుని స్పోర్ట్స్ షూ వేసుకుని ఆశ్రమం మెయిన్ హాలు దాకా వెళ్లేసరికి అక్కడ నాకు ఒక పెద్ద కర్ర వాళ్ళు ఇచ్చారు . కర్ర తీసుకుని నేను మెల్లగా ప్రయాణం సాగించాను . అప్పటికే నాకు జ్వరం ,గొంతు నొప్పి ,ఇన్ఫెక్షన్ మూలంగా  కాలు వాచి పోయి  కుంటుతూ వెళ్ళుతుండటం వల్ల నేను చాలా మెల్లగా నడిచాను . ఎక్కువ ఆయాస పడటం కూడా జరిగింది . నాతో పాటు వున్న వారిలో నాకన్నా చాలా పెద్దవాళ్ళు కూడా నాకన్నా ముందు నడవటం చూసి నేను ఉత్సాహం తెచ్చుకుని వాళ్ళతో కలిసి నడవసాగాను .జగ్గివాసుదేవ్ గారు అందరికంటే ముందు వెళ్ళిపోయారు ,మళ్లీ మాలాగా వెనకపడిన వాళ్ళ కోసం వెనక్కి వచ్చారు . వచ్చి వాలంటీర్స్ కి తగిన సూచనలు ఇచ్చి వెళ్ళిపోయారు . అక్కడ వచ్చిన 165 మందితో పాటు ఆశ్రమం లో వున్న వాలంటీర్స్ తో కలిపి 200 మందికి భోజనాలు వండించి  ఆ వండిన పదార్థాలన్నింటిని పెద్ద పెద్ద కావిళ్ళవంటి వాటిలో పెట్టి మోసుకుని పైకి తీసికెళ్ళి పోయారు . అక్కడ గ్రామస్తులు కూడా కాళ్ళకి చెప్పులైనా లేకుండా తలమీద పెద్ద బరువులు పెట్టుకుని చక చకా వెలంగిరి పర్వతాన్ని ఎక్కుతున్నారు ,కొంతమంది దిగుతున్నారు . మేము చాలా ఆశ్చర్యపడ్డాం. ఈలోగా జగ్గివాసుదేవ్ గారు చెప్పినట్టే వర్షం మొదలైంది . దారి అంతా చాలా ఎగుడు దిగుడు గా వుంది . అంతా బురదగా ఉంది,మేమంతా జారి పడ్డాం.  వేసుకున్న బట్టలు ,బూట్లు అన్ని బురదమయం అయిపోయాయి .ఒళ్ళంతా బురద కొట్టుకు పోయింది . దాంతో మా ప్రయాణం చాలా కష్టతరం అయిపోయింది . ఈలోగా వాలంటీర్స్ వచ్చారు ,చిన్నపిల్లలైనా మాకెంతో సహాయం చేసారు ,చేతులు పట్టుకుని మమ్మల్ని పైకి లాగటం జరిగింది . మొత్తం మీద పైకి చేరాం . దాదాపు అందరి పరిస్థితి ఇలాగే ఉంది . అక్కడ చేరి కాసేపు కూర్చున్నామో లేదో వెంటనే మళ్లీ వర్షం మొదలైంది . భగవంతుడా ఇదేమిటి ,ఈ వరుణ దేవుడు నావెంటపడ్డాడు ,తిరుపతి నించి మొదలుపెట్టి ఆయన కరుణ నాపై కురిపించడం ఇంకా మానలేదు అని నేను మనసులోనే అనుకున్నాను . నన్ను చూసిన నా రూమ్మేటు చాలా ఆశ్చర్యపోయాడు . ఇదేమిటి నువ్వెలా వచ్చావు ?నువ్వు వున్న పరిస్థితిలో రాలేవనుకున్నాను అంటే సమాధానంగా నేను ,వచ్చింది జగ్గివాసుదేవ్ గారితో ,మీ అందరితో గడపడానికే కదా అందుకోసం కష్టపడి ఓపిక చేసుకుని వచ్చాను . మీరందరూ మూడు గంటల్లో ఎక్కితే నాకు ఐదు గంటలు పట్టింది  అన్నాను . అక్కడే కూచుని పాటలు పాడుకున్నాం. మాచేత ఆయన డాన్సు కూడా చేయించారు . ఆ వర్షం లోనే చెట్ల కింద కూచుని భోజనాలు చేశాం . మళ్లీ తిరుగు ప్రయాణం లో  నేను నా రూమ్మేటు కంటే ముందే కిందకి దిగిపోవటం ,అతను వచ్చేసరికి నేను శుభ్రంగా స్నానం చేసి ఉండటం చూసి  అతను ఆశ్చర్యపోయాడు . అంటే సామూహికంగా ప్రజలు అందరూ పాజిటివ్ ఆలోచనలతో వున్నప్పుడు అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని నాకు అనుభవంలోకి వచ్చింది . మేము చేరేసరికి సాయంత్రం అయ్యింది ,జగ్గి  వాసుదేవ్ గారు మళ్లా అందరూ సాయంత్రం యోగా క్లాసుకి రావాలని చెప్పటంతో అప్పటికే ఒళ్లు హూనమైపోయిన