Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

25 August 2016

CHEDU NIJALU- Introduction



               చేదు నిజాలు అనబడే శీర్షికలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి, నమ్మలేనటువంటి అసలుసిసలైన భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు పేర్కొనబడతాయి. మన భారతదేశానికి మరి స్వాతంత్య్రం వచ్చింది అని ప్రజలందరూ సంతోషపడుతున్నపుడు మహాత్మా గాంధీ ఆరోజు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు, కన్నీరు కార్చారు. కేవలం తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళకి అధికార బదలాయింపు జరిగింది కానీ మాన దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జవహర్ లాల్ నెహ్రు మొదటి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఉత్సవానికి కూడా మహాత్మా గాంధీ దూరంగానే ఉండిపోయారు. నవకాలి అనే చిన్న గ్రామం వెస్ట్ బెంగాల్ లో ఉన్నది ప్రస్తుతం ఆయన అక్కడ ఉంది ఉత్సవానికి ఆయన రాలేదు. అలాగే కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర స్వామి వారు కూడా భారతదేశానికి అసలైన స్వాతంత్య్రం రాలేదు అని వ్యాఖ్యానించారు.  



ఇద్దరు మహాత్ములు ఇంత గొప్పవారు మరి మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు అని అన్నప్పుడు మనందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అతి కఠోరమైనటువంటి నిజాలు, వాస్తవాలు వారికి తెలుసు కాబట్టి వారు అలా వ్యాఖ్యానించారు. నిజానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రు మహాత్మా గాంధీని బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టి కాంగ్రెస్ ని రెండు భాగాలుగా విభజిస్తాను, బ్రిటీష్ వాళ్ళు నా పక్షాన ఉన్నారు అని చెప్పి న్యాయపరంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని గాంధీ గారి చేత ఆయనని పదవి నుండి తప్పించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా పదవీ కాంక్షతో నెహ్రు ప్రధాని అవ్వడం జరిగింది. చాలామందికి వాస్తవాలు, వెనుక ఉన్నటువంటి రహస్యాలు తెలియడం లేదు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? అని మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే భారతదేశం మరియు పాకిస్థాన్ రెండూ కూడా కామన్ వెల్త్ కంట్రీస్ లో Domain of  the great Britain గానే రిజిస్టర్ అయ్యాయి తప్పించి రెండు ఇండిపెండెంట్ దేశాలుగా మాత్రం అవి ప్రవేశాన్ని పొందలేదు. శ్రీయుతులు రాజీవ్ దీక్షిత్ గారు బాల్యం నుంచే మహా దేశ భక్తుడుగా ఆయన ఉండేవారు. మన భారతదేశానికి జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాల్ని ఆయన చూస్తూ సహించలేకపోయేవారు. బ్రిటీష్ వాళ్ళు అంతకుముందు తురక వాళ్ళు చేసినటువంటి నీచమైన కృత్యాలు ఏవిధంగా సనాతన భారతదేశాన్ని ఒక క్రమబద్ధంగా సర్వనాశనం చేశారు, ఎలాగ భారతీయ సంస్కృతిని మట్టు పెట్టారు, భారతీయులందర్నీ కూడా ఒక ఆత్మన్యూన్యతా భావంలోకి తోసివేశారు ఇవన్నీ విన్నప్పుడు అయన ఎంతో చారిత్రాత్మకంగా చాలా పరిశోధనలు చెయ్యడం, దాదాపు పదివేల సాక్ష్యాధారాలు ఫోటో కాపీ రూపంలో ఆయన "ఇండియా హౌస్" అని ఒక గ్రంథాలయం UK లో ఉన్నది అక్కడి నుంచి ఆయన సంపాదించారు. ఆయన అనర్గళంగా ఎంతో ఆశక్తికరమైనటువంటి విషయాలు దాదాపు 90% ప్రజలకి తెలియనటువంటి విషయాలన్నీ కూడా హిందీ భాషలో చాలా చక్కగా చెప్పారు. ఒకప్పడు భారత స్వాతంత్య్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల యొక్క త్యాగాలు, వారి కుటుంబం ఎటువంటి దీనాతిదీన స్థితిలో ఉన్నది తెలిసినప్పుడు ప్రతీ భారతీయుడు కన్నీరు పెట్టక తప్పదు.  

మనకి 70 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిందనుకుంటున్నాం కానీ మనమందరం ఆలోచించాలి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా? పేద ప్రజలు, బడుగు వర్గాల వారికి, అట్టడుగున ఉన్నవారికి నిజంగా న్యాయం జరుగుతోందా? 24 గంటలు విద్యుత్శక్తి వస్తున్నదా? చదువు అందుబాటులో ఉన్నదా? స్వచ్ఛమైన మంచి నీరు మనకి అందుతున్నదా? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. నిజానికి 70 ఏళ్ల కాలంలో భారతీయ మనస్తత్వం తెలిసిన నాయకుడు మనల్ని పరిపాలించలేదు. కేవలం ముగ్గురు మాత్రమే నిజమైన భారతీయ ఆత్మతో చాలా చక్కగా పనిచేశారు.  

వారు లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారి వాజపేయి మరియు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు. చేదు నిజాలు కఠోర సత్యాలన్నీ మేము మీ అందరి ముందు పెడుతున్నాము. రాజీవ్ దీక్షిత్ గారి హిందీ ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించడం జరిగింది. భారతీయులారా! ముఖ్యంగా యువతీ యువకులారా! మన సనాతన ధర్మాన్ని, మన అసలుసిసలైన చరిత్రని తెలుసుకుందాం. భారతదేశంలో పుట్టినందుకు మనము ఎంతో గర్వపడదాం. మేము ప్రచురించబోయే వాస్తవాలన్నీ మీరు చదివి మీరు మరొక పదిమందికి వాస్తవాలని చెప్పి భారతీయ సనాతన ధర్మాన్ని దానిలో ఉన్న అనేక మంచి విషయాలని మళ్ళీ మనము బయటికి తీసుకొద్దాం వాటిని ఆచరిద్దాం. ఒక స్వర్ణ భారతదేశాన్ని స్థాపిద్దాం అలాగే ప్రపంచానికి ముందుగా మార్గదర్శకం చేస్తూ నడిపిద్దాం. భారతదేశం నుంచే ఒక నాయకుడు రావాలి అనే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దాం. భారత్ మాతాకీ జై
                                                                                                           ఇట్లు 
                                                                                             నండూరి శ్రీ సాయిరాం.