Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

15 November 2016

ఆఫ్రికా అద్భుత అనుభవాలు (Amazing African Experiences) - 01

ఆఫ్రికా అద్భుత అనుభవాలుఆఫ్రికా పిలుపు 

అక్టోబర్ 18,1991-


ఆ రోజు నా జీవితంలో మర్చి పోలేనట్టి రోజు. నేను ఆఫ్రికా నుంచి నాకు వచ్చిన ఆహ్వానాన్ని, అక్కడ వచ్చిన  ఉద్యోగ అవకాశాన్నివినియోగించు కోవడానికి ప్రయాణం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని బేగంపేట ఎయిర్ పోర్టు  చేరడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు చాలా మంది వచ్చారు . ఎయిర్  పోర్టు అంతా చాలా కోలాహలంగా గందరగోళంగా ఉంది . మొట్టమొదటి సారి విదేశీయానం కాబట్టి నాకు కొంచెం గుండె గాభరాగా ఉండాలి. పైకి మాత్రం గంభీరం గానే వున్నాను . కొన్ని విచిత్ర పరిస్థితుల మూలంగా నేను అనుకోకుండా అకస్మాత్తుగా ఈస్ట్ ఆఫ్రికా లోని కెన్యాకు  వెళ్ళడం జరిగింది . నేను ఆ దేశంగురించి అంతా నెగెటివ్ గానే విన్నాను . చాలా మంది నన్ను రకరకాలుగా భయపెట్టారు కూడా . కానీ నేను కొన్ని తప్పనిసరి పరిస్థితులలో అక్కడికి వెళ్లడం జరిగింది .
                       నా సుదీర్ఘమైన అనుభవాల సంపుటిలో నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే మనిషికి అవకాశాలు ఒకటికి పైన వున్నప్పుడు ఆ మనిషి జీవితంలో పైకి రావడం కష్టమే . అంటే జీవితం
సుఖమయంగా ఉంటుంది, కొన్ని పరిమితులకు లోబడి జీవించాల్సి ఉంటుంది . యాంత్రికంగా మన పనులు చేసుకుంటూ  పోతుంటాం తప్ప జీవితంలో ప్రత్యేకమైన సందర్భాలుగాని అవకాశాలుగాని,  సమస్యలుగాని , వాటిని ఎలా   పరిష్కరించాలో,ఎదుర్కోవాలో అనే అనుభవంగాని మనకి ఉండదు . జీవితం సామాన్యంగానే గడిచి పోతుంది . అవకాశాలేమి లేకుండా తప్పకుండా ఒకే దిశగా ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఆ దారి ఎలావుంటుందో తెలియదు ఏమౌతుందో తెలియదు. ఏమీ తెలియని స్థితిలో అక్కడికి వెళ్లి పరిస్థితులని అర్ధం చేసుకుని ఎన్నో క్లిష్టమైన సమస్యల్ని అప్పటికప్పుడు వచ్చిన ఒక తెగింపుధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని సాధించి జీవితంలో ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా ఆ జీవితం చాలా  అద్భుతం గా ఉంటుంది. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి అలాగే ఉంది.  ఎక్కడో దూరదేశం వెళ్తున్నాను అక్కడ పరిస్థితులెలా ఉంటాయి ,మనుషులెలా ఉంటారు,ఆచారాలెలా ఉంటాయి, నేను చేరబోయే ఉద్యోగం ఎలాంటిది? ఏమి తెలియకుండానే బయలుదేరాను . ఈవిధంగా నా మనసులో ఎన్నో భావతరంగాలు వస్తూ పోతూ వున్నాయి. నేను యాంత్రికంగా అందరితో మాట్లాడుతూఉన్నాను. అప్పటికే బాగా అలిసిపోయి వున్నాను . ఈలోపల సెక్యూరిటీ చెక్ కి పిలుపు రావడం నేను ఇమ్మెగ్రిషన్ ఫార్మ్ నింపేసి   అందరికి మెల్లగా వీడ్కోలు చెప్పి అక్కడే వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్నాను. నేను వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాగానే వాళ్ళు ఎనవున్సు చేస్తారు.  దాని ప్రకారంగా నేను వెళ్లి ఫ్లైట్ లో కూర్చోవాలి . అక్కడ ఎన్నో దేశాలకి వెళ్లే వాళ్ళు వుంటారు. ఎన్నో ఫ్లైట్స్ ఉంటాయి. నేను మొట్టమొదటి సారి విదేశానికి వెళ్తూండటంతో ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసుకుని వాళ్ళు నైరోబి వెళ్తున్న విషయం తెలుసుకుని  వాళ్ళ వెంటే వెళ్లడం జరిగింది . చేతిలో ఒక 500 డాలర్లు పెట్టుకుని బయల్దేరాను ఆ దేశానికి . ఎయిర్ ఇండియా ఫ్లైట్ రావడంతో నేనుకూడా మిగిలిన వాళ్ళతో కలసి విమానం లోకి వెళ్లి నా సీటులో కూర్చున్నాను . బాగా అలిసిపోయి ఉండడంతో గంటా రెండు గంటలపాటు నిద్రపోయాను . పడుకుని లేచిన తర్వాత కొంత స్థిమిత పడ్డాను . నా లోపల ఉన్న ఆదుర్దా , ఒకలాంటి దిగులు ఇవన్నీ మటుమాయం అయిపోయాయి . ప్రతి మనిషి యొక్క మనస్తత్వం లో కొన్ని విలక్షణమైన లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటాయి  అలాగే నాలో కుతూహలం అనే తత్వం ఎక్కువగా ఉంది . అంతవరకూ నేను పడ్డ ఆదుర్దా అంతా మాయం అయిపోయి అసలీ ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది మన పిల్లలికి చెప్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి ఎయిర్ హోస్టెస్ ని రిక్వెస్టు చేయగా ఆవిడ సాధారణంగా మేము పెసింజెర్స్ ని కాక్ పిట్ లోకి రానివ్వము. మీరు జర్నలిస్ట్ అని చెప్తున్నారు పిల్లల కోసం ఆర్టికల్ వ్రాయాలనుకుంటున్నారు. కాబట్టి  నేను మా కెప్టెన్ తో మాట్లాడి ఒకవేళ ఆయన కనుక అనుమతి ఇస్తే మిమ్మల్ని పిలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది . పది నిమిషాలలో ఆవిడ కాక్ పిట్ ద్వారం నించే నాపేరు పిలిచి సాదరంగా ఆహ్వానించింది. నేను కూడా మెల్లిగా నడిచి లోపలికి వెళ్ళాను . అక్కడ ఇద్దరు పైలెట్స్ విమానం నడుపుతున్నారు. వెనక చిన్న సీట్లో నన్ను కూర్చో పెట్టారు . వాళ్ళు నాకు కొన్ని సూచనలిచ్చారు . దయచేసి మీరు ఈ కుర్చీలోనే స్థిరంగా కూర్చోండి. అటు ఇటు కదిలినప్పుడు పొరపాటున మీ చెయ్యి ఏ ఇంస్ట్రుమెంట్ మీద పడినా ప్రోబ్లం అవుతుంది. కాబట్టి ఆదుర్దా పడకుండా,నెమ్మదిగా, కదలకుండా కూర్చోండి. మీరడిగే ప్రశ్నలకి మేము జవాబులు చెప్తూ ఉంటా౦. సడన్ గా లేవడం కాని  కదలడ౦ కాని  చేయవద్దని సూచించి కూర్చో పెట్టారు. నేను కూడా అలాగే కూర్చుని వాళ్ళు చెప్పినవి వినడం మొదలు పెట్టాను . మాటిమాటికి ఈ ఫ్లైట్ పైకి క్రిందకి వెళ్తుంటే  ఎంత ఆల్టిట్యుడ్ లో అది ప్రయాణం చేస్తుంది, ఏ దిశగా ప్రయాణం చేస్తోంది అన్ని వాళ్ళ ముందు ఉన్న స్క్రీన్ లో కనిపిస్తున్నాయి, వాళ్ళుకూడా చెప్తున్నారు. మధ్య మధ్యలో వాళ్ళకి ఏవో సూచనలు వస్తున్నాయి , మాట్లాడుతో ఉన్నారు వాళ్ళు . బహుశా వాళ్ళకి బేస్ టవర్స్ ఉంటాయి అక్కడి నించి కమాండ్స్ వస్తుంటాయనుకుంటాను . అయితే విమానం ఏ డిగ్రీ లో వెళ్తుంది, ఏటవాలు గా వెళ్తుందా అన్నది కూడా క్షణ క్షణానికి మారుతూ ఉంటుంది వాటి డయాగ్రమ్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి .
ఎంత  స్పీడు  లో  వెళ్తున్నా౦, ఎంత ఆల్టిట్యుడ్ లో వెళ్తున్నా౦, ఏ డైరెక్షన్ లో వెళ్ళుతున్నా౦ మొదలైన విషయాలు అన్ని నాకు చక్కగా వివరించారు . నాకది అద్భుతమైన అనుభవం అనుకుంటూ ఉంటాను . అంతా అయ్యాకా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ వచ్చి నా సీట్ లో కూర్చున్నాను . తరవాత వాళ్ళు చెప్పిన విశేషాలు విమానంలో చూసిన ఇతర విషయాలు అంటే మనం కూర్చున్న సీట్ లోనే ఎదురుగుండా ఉన్న టీవీ లో పాటలెలా వినవచ్చు, ఛానెల్స్ ఎలా మార్చు కోవాలి ఇవన్నీ కూడా వివరంగా నేను మా పిల్లల కోసం ఒక ఆర్టికల్ రాసి పంపించటం కూడా జరిగింది. మనిషి యొక్క మనస్తత్వం అంచనా వేయటం చాలా కష్టం . అంతవరకు ఎంతో దిగులుగా , విచారంగా, ఆదుర్దాగా వున్నాను, భవిష్యత్తు గురించి ఏవేవో రకరకాల ఆలోచనలు, జరిగిపోయిన గతాన్ని నెమరు వేసుకుంటూ ఏదో లోకంలో వున్న నేను విమానం ఎక్కి కూర్చున్న కాసేపటిలోనే నాలో ఉన్న ఆదుర్దా అంతా మాయమైపోయి నా లోని కుతూహలం అనే లక్షణం బయట పడి ఫ్లైట్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. తర్వాత చాలా సమయం ఖాళీగా ఉండటంతో నా మనసు గతంలోకి వెళ్ళింది .