నవీన యుగ నిర్మాణ శక్తి -5
శ్రీ దత్తాత్రేయతత్వ కధలు
మమకారము దుఖ హేతువు - మోక్ష సాధనకి ఆటంకం.
స్వామీ వివేకానంద జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం.
స్వామీ వివేకానంద ఎల్లప్పుడూ కూడా శ్రీ రామకృష్ణ పరమహంసని అంటిపెట్టుకుని ఉండేయివారు. ఎక్కువ సమయం ఆయనతోనే గడుపుతూ ఉండేయివారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడూ తన్మయత్వంలో ఉండి నృత్యం చేస్తూ ఎవరు కనపడితే వారిని ఆలింగనము చేసుకుంటూ ఉండేవారు. అందరూ ఆయనని పిచ్చి వాడు అని ఒక ముద్ర వేశారు. కానీ స్వామీ వివేకానంద ఎప్పుడూ వారిని పిచ్చివాడు అని అనుకునే వారు కాదు, వారిలో ఆయనకి ఒక దైవత్వం కనిపించేది. సామాన్య మానవులు అయిన మనందరికీ ఇటువంటి వారిని చూసినప్పుడు వారిని పిచ్చివారి వాలే వారిని అనుకుంటాం. కానీ మనకన్నా కొంచం పై స్థాయి లో వున్నవారికి వారు ఒక మంచి సాధకులుగా, భగవత్ దర్శనం అయితే ఎంత ఆనందం వస్తుందో అటువంటి ఆనందాన్ని వాళ్లు ఎల్లపుడూ పొందుతూ నృత్యం చేస్తూ ఆనందంగా ఉంటారని తెలుస్తుంది. సాక్షాతూ శ్రీ షిర్డీ సాయిబాబా గారి జీవితంలో కూడా అంతే, ఆయన దేహదారిగా ఉన్నంత కాలం చాలామంది ‘ఆ ఫకీరు పిచ్చి వాడు’ అని అంటూ ఉండేయివాళ్ళు. ఎప్పుడూ కూడా సమకాలిన పరిస్థితులలో తమ పక్కనే వున్న మహాత్ములని గమనించటం అరుదు. శ్రీ కృష్ణుని జీవిత చరిత్రలో కూడా అంతే కదా, సాక్షాతూ ఆయన భగవంతుడు అయినా కూడా ఆయన తత్వాన్ని గమనించలేని కంసుడు కానీ, జరాసంధుడు కానీ మిగతా ఎంతో మంది కూడా ఆయన్ని ఎంతో అవమానించారు, దూషించారు, సరిగా అర్ధం కూడా చేసుకోలేకపోయారు. ఎప్పుడయితే దేశము, కాలములలో కొంత ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు రాబోయే తరాల వాళ్ళు పిచ్చి వాడిగా ముద్రవేసుకున్న వారిని ఆ తరువాత ‘భగవంతుడు’ అని ముద్ర వేస్తూ వుంటారు.
ఈ విధంగా రోజులు గుడుస్తుంటే వివేకానందుడి ఇంట్లో ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆవిడ జబ్బు పడి తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. వివేకానందుడు ఇంటికి వెళ్ళాడు కానీ అతనికి ఏమి చెయ్యాలో తెలియలేదు. మందులు కూడా కొనటానికి అతని దగ్గర పైకం లేదు. కొంతమంది ‘నీ గురువుగారు చాలా మహిమాన్వితుడు కదా, ఆయన తలుచుకుంటే నీ తల్లికి తొందరగానే స్వస్థత చేకూర్చకలరు, ఆయనని అడుగు’ అని ప్రోత్సహించారు. సరే అని చెప్పి వివేకానందుడు సరాసరి గురువు గారి దగ్గరకి వెళ్లి ‘గురువు గారు! మీరు కాళీ మాత సాక్షాత్కారము పొందారు, మరి దేవతలు వుండి ఏమి లాభము? నా తల్లికి అసలు ఏమీ బాగోలేదు. ఆమెకు వెంటనే స్వస్థత కలగాలి, ఆరోగ్యం కుదరాలి, మరి మీరే సహాయం చెయ్యాలి ’ అని అనగా, అప్పుడు రామకృష్ణుడు ‘నాయనా, నేను ఎందుకు మధ్యవర్తిత్వం? నువ్వు గర్భగుడిలోకి వెళ్లి ఆమెను ధ్యానించు. ఆమెనే నువ్వు అడుగు’ అని చెప్పి పంపించారు.’ వెంటనే వివేకానందుడు గర్భగుడిలోకి వెళ్లి పద్మాసనంలో ధ్యానం చేసాడు. ఒక గంట అయినాక ఆయన బయటకి వచ్చాక రామకృష్ణుడు ‘నాయనా అడిగావా?’ అని అడగ్గా ‘లేదు గురువుగారు, నేను మర్చిపోయాను అని చేప్పాడు.’ రెండవ సారికూడా అలాగే ప్రోత్సహించి పంపారు. మళ్ళి రెండు గంటల తరువాత అదే సమాధానం వచ్చింది. ఈసారి మూడవసారి ఎనిమిది గంటలు ధ్యానము చేసి బయటకి రాగానే గురువు గారు ‘ఏమినాయన! తల్లిని అడిగావా?’ అని అడగ్గా ‘గురువుగారు! నేను అడగదల్చుకోలేదు’ అని జవాబు ఇచ్చాడు. దానికి రామకృష్ణుడు దానికి ఎంతో సంతోషించి ‘నాయనా! నువ్వు గనుక కాళికా తల్లిని ఈ వరం అడిగితే నీకు, నాకు ఇదే ఆఖరి కలయిక అయ్యేది’ అని ఆశీర్వదించారు.
ఈ కధ వల్ల తెలిసింది ఏమిటంటే - వివేకానందుకు ఆ కాళికా మాత అనుగ్రహం వుంది కాబట్టి, వివేకానందుడు అడిగితే కాళికా మాత తప్పకుండా ఆయన తల్లికి స్వస్థత చేకూర్చేది. కానీ వివేకానందుడికి ఏమి అర్ధం అయింది అంటే - పుట్టుకా, చావూ ఎవరికి అయినా తప్పదు. ఎంతో గొప్పవాళ్ళు అయినా, ఆఖరికి భగవంతుడు అయినా భూమి మీదకి వచ్చినప్పుడు అవతారం చాలించి మల్లి వెనక్కి వెళ్ళటం తప్పదు. ఇది సహజంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క సృష్టి రచన. అటువంటప్పుడు కాళికా మాత స్వస్థత చేకూర్చినా మళ్ళీ తల్లి గారు వెళ్లిపోయే సమయం వస్తుంది. కాబట్టి మమకారం వదిలినప్పుడే ఆయనకి పైకి వెళ్ళగలను అనే ఒక నమ్మకం కుదిరింది, కాబట్టి స్వామీ వివేకానంద కాళికా మాతని ఏమీ కోరనేలేదు. ఈ విధంగా దత్తాత్రేయుడు చెప్పిన విధానికి ఇటువంటి మహాయోగులు యొక్క అనుభవాలు అయన చెప్పినదాన్ని రుజువు చేస్తూ ఉంటాయి కదా!
నండూరి శ్రీసాయిరాం.