నవీన యుగ నిర్మాణ శక్తి -8
దత్తాత్రేయ తత్వ విచారణ
స్వామివారియొక్క అవదూత తత్వం
శ్రీ దత్తాత్రేయుల వారిని బాలోన్మత్త పిశాచ వేశాయ అని చెబుతూ ఉంటారు. అంటే శ్రీ దత్తాత్రేయుల వారు బాలుడు గాను, ఉన్మత్తుడు గాను,పిశాచ రూపంలో రకరకాల వేశాల్లో ఉంటాడని దీని తాత్పర్యం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ?
ఈ దత్తాత్రేయ భక్తులుగా చెప్పబడే వారు ఏం చేస్తున్నారు. సాక్షాత్తు దత్తుని అవతారమైన శిరిడి సాయిబాబా వారు చిలుము తాగేవారు అలాగే అవదూతలంతా చిలుము తాగేవాళ్లు కాబట్టి వాళ్ళు చిలుము తాగుతున్నారు. బీడీలు సిగరెట్లు కాలుస్తున్నారు. మూర్ఖమైన భక్తులు వారికి ఇంపోర్టెడ్ సిగరెట్లు సప్లై చేస్తున్నారు. దత్తస్వామి, సాయి బాబా భక్తులను తిడుతూ ఉండేవారువారు అని వీరు వినడం వల్ల ఈ తిట్టే కార్యక్రమం, ధూమపాన కార్యక్రమం పసందుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చే జనాల్ని తిట్టటం మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా కొంత మంది అవదూతలుగా చెప్పబడేవాళ్ళు దెబ్బలు కూడా కొడుతుంటారు. మూర్ఖమైన ప్రజలు ఆ దెబ్బలు తగిలినప్పుడల్లా అయ్యో స్వామి నా ప్రారబ్ద కర్మలు తీస్తున్నారని ఎంతో సంతోషపడిపోతారు. అయితే మనం చూసే ఈ కపట అవదూతలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. బూతులు తిడుతూ ఉంటారు. పిచ్చి పిచ్చి గా అంటే బాలుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. దగ్గరకి వచ్చిన వాళ్ళను రాళ్ళు పెట్టి కొడుతుంటారు.
కానీ శిరిడి సాయి బాబా గారు భక్తురాలైన కమ్మరి వనిత పనిలో ఉన్నప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడు మంటల్లో పడే సమయానికి ఎక్కడో ఉన్న ఆవిడ బిడ్డని మంటల్లో నుంచి లాగేసినప్పుడు దానికి చిహ్నంగా ఆయన చేయి కాలిపోయింది. మరి ఈ అవదూతలు నిజంగా అలాంటి పని చేయగలుగుతున్నారా మీరే ఆలోచించండి. ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకొనవసరం లేదు ఒక గుప్పెడు వేడి వేడిగా ఉన్న బొగ్గు కనికలను వారి చేతిలో వేయండి వారు ఎటువంటి బాద లేకుండా నిర్లిప్తంగా ఉండగలుగుతారా ? ఆశుద్ధంలో చేయి పెట్టి కెలికి ఏ మాత్రం చలించకుండా ఉండడగలుగుతారా ?
దీని అర్ధం ఏమిటంటే శిరిడీ సాయిబాబా గారు ఏవేవైతే కోన్ని పనులు సులభంగా చేశారో అవి వీళ్ళు చేస్తారు. కష్టసాధ్యమైన పనులు వీళ్ళు చేయలేరు. సాక్షాత్తు దత్త స్వామీ చేస్తున్న ఎన్నో గొప్ప పనులు వీళ్ళు చేయలేరు. కానీ ఆయన చేస్తున్న సులభమైన పనులను అనుకరించటం అవదూతలని వాళ్ళ శిష్యుల చేత చెప్పించుకోవటం, ప్రారబ్ద కర్మలను మేము తీసివేస్తామని చెప్పటం ఇదంతా చాలా అసందర్భంగా ఉంది కదా. ఇవన్నీ కూడా ఈ నూతన యుగ నిర్మాణంలో ఇటువంటి అంధ విశ్వాసాలు నాశనం కాక తప్పదు.
భవిష్యత్తు గురించి చేప్పినప్పుడు శ్రీ రాం శర్మ ఆచార్య గారు , స్వామి దయానంద సరస్వతి గారు గాని, వీర బ్రహ్మంగారు గారు గాని వీరందరు వీటిని ఖండించారు. మనం ఇటువంటి విషయాలు అడిగినపప్పుడు మన పెద్ద వాళ్లు గాని , గురువులుగా చెప్పే వాళ్ళు గాని మనల్ని చాలా కోప్పడతారు. నీకు ఈ విషయాలు తెలియవు నోరు మూసుకో అని చెప్తారు. కాని మన పిల్లలు మనల్ని ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ విధంగా మనం కేకలు వేయగలమా ? ఒకవేళ తాత్కాలికంగా మనం కోప్పడినప్పటికి వాళ్ళ మనసులో ఉన్న ఇటువంటి సందేహాలు పెను వృక్షాలుగా మారి వాళ్లు హిందూ మతానికి దూరంగా తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.