నవీన యుగ నిర్మాణ శక్తి -9
దత్తాత్రేయ తత్వ విచారణ
చాలా మంది యువకులు , పిల్లలు మన పురాణాలలో ఉన్నటువంటి చాలా విషయాలను తెలుసుకోవాలనే కుతూహలంతో చాలా ధైర్యంగా, చాలా ఆతృతగా అడుగుతుంటారు. వాళ్ళు పురాణాల్లో విన్నటువంటి ఈ దేవతలకి అరిషడ్వర్గాలు ఉండటం ఒకల మీద ఒకలకి ఈర్ష్య అసూయలు ఉండటం,ముఖ్యంగా ఇంద్రుణ్ణి ఎందుకు పనికిరాని వానిగా చిత్రీకరించడం, వెశ్యాలోలునిగా చెప్పటం, వాడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురు అప్సరసల తో గడుపుతుంటాడు.అతని భార్య శచీ దేవి మహా పతివ్రత. ఎవరు తపస్సు చేసినా గజ గజా వనికిపోతూ వాళ్ల తపస్సు భంగం చేయటానికి రక రకాలుగా ప్రయత్నిస్తుంటాడు.ఇటువంటి వాడు దేవుడు ఎందుకు అయ్యాడు అని ప్రశ్నిస్తుంటారు. మాములు మనుషుల లాగా మహత్ములలో అరిషడ్వర్గాలు లేవు కదా. మరి ఏ రకంగా ఇందుడు ఇంద్ర పదవి పొందాడు అని అడుగుతుంటారు. మరి దేవతలలో కూడా పార్వతి గాని వీళ్లందరిలో కూడా అసూయ ఎందుకు ఉంది అని అడుగుతుంటారు. ఈ రకంగా మన పురాణాలలో అర్థం పర్థం లేని పొంతనలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి మన పిల్లలు ఆసక్తితో అడుగుతుంటారు. మరి మనం ఏం సమాధానం చేబుతాం. ఇవన్నీ మనం ఆలోచించవల్సిందే కదా .
ఈ పెద్ద వాళ్ళు ఏం చేస్తారు ఎదో ఒక రకంగా అటుతిప్పి ఇటుతిప్పి గందరగోళం చేసి ఆ ప్రశ్నలకు సమాధానాలు చేప్పటానికి ప్రయతిస్తారు. దానివల్ల వాళ్ళ సందేహాలు మటుమాయం కాకపోగా ఇంకా కొత్త అనుమానాలు వస్తుంటాయి. పిల్లలు ఇటువంటి ప్రశ్నలు ఆడిగినప్పుడు మనకి సమాదానం గనక తెలిస్తే ఒక తార్కిక కోణం లో వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి లేకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. మనకు ఉన్న అహం మనతో అలా చెప్పిస్తూ ఉంటుంది. ఎంతో మంది పురాణ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలకు తార్కికంగా సమాదానాలు అసలు చెప్పనే చెప్పారు. మీకు అర్థం కాదు మీరు ఊరుకోండి అని చెప్తారు. వాళ్ళ కింద స్థాయికి వచ్చి వాళ్లకు అర్థం అయ్యేటట్టు చెప్పరు. ఈ రోజు మన పిల్లలకు మన హిందూమతం గురించి వాళ్లకు ఏమీ తెలియదు. జకీర్ నాయక్ అనేవాడు హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి మారి ఒకమాట చెప్పాడు. క్రైస్తవులను ఇస్లాం లోకి మార్చటం చాలా కష్టం. కానీ హిందువులను మతం మార్చటం చాలా తేలిక.ఎందుకంటే చాలా మంది హిందువులకు వాళ్ళ మతం యొక్క గొప్పతనం గురించి వారికి తెలియనే తెలియదు కాబట్టి వారందరిని ఇస్లాం లోకి గాని వేరే మతంలోకి గాని మార్చటం చాలా సులువు అని చెప్పాడు. ఇది నిజమే కదా మరి. నూతన యుగ నిర్మాణంలో మన రాబోయే పిల్లలు ఇటువంటి తర్కానికి అందని విషయాలను కొట్టి పారేస్తారు. ఆధ్యాత్మిక త అంటే ఏమిటి ? దానివల్ల వచ్చే లాభం ఏమిటి ? మొత్తం ప్రపంచంలోని ప్రజలందరినీ ప్రేమించే తత్వాన్ని కలిగి ఉండాలి. తోటివారికి సహాయపడే దృక్పథం కలిగి ఉండాలి.
ఆధ్యాత్మిక త అనేది మన మనస్సులో ప్రశాంత భావాన్ని కలిగించేతట్టు ఉండాలి. విశ్వ మానవ చైతన్యానికి తోడుగా ఉండే విధంగా ఈ ఆధ్యాత్మికత ఉండాలి. అంతేగాని ఆధ్యాత్మికత లో మూఢ విశ్వాసాలకు అందవిశ్వాసాలకు ఎటువంటి తావు ఉండకూడదు. అవి ఉన్నప్పుడు మన చైతన్యం విశ్వ మానవ చైతన్యానికి ఏ విధముగాను సహాయపడదు. ఈ రాబోయే కాలంలో ప్రజ్ఞావంతులుగా చెప్పబడే ఇండిగో పిల్లలు,రెయిన్బో పిల్లలు మరియు క్రిస్టల్ పిల్లలు వీళ్లందరు కూడా ప్రపంచాన్ని అద్భుతంగా మార్చే పనిలో ఉన్నారు. పెద్దలందరు ఏం చెప్తున్నారు. 2017 కల్లా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాము అని చెప్తుంటారు. ఇంతవరకు వస్తున్నటువంటి పాత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా వాటి ఉనికిని కోల్పోతాయి. శైవులు వైష్ణవులని తిట్టటం , వైష్ణవులు శివున్ని తిట్టటం ఇద్దరూ కలిసి హిందూమతం లోని ఇంకొక వర్గాన్ని తిట్టటం వల్ల మన భారతదేశానికి ఎంతో అనర్థం జరిగింది. అటువంటి వాటికి చోటు ఇవ్వకుండా రెయిన్బో పిల్లలు మరియు క్రిస్టల్ పిల్లలు ఈ సమాజాన్ని చాలా అద్భుతంగా మార్చివేస్తారు. ఇది తథ్యం తథ్యం తథ్యం.