Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

13 May 2017

ఉపనిషత్తులు-8:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

ఉపనిషత్తులు-8:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


                 మాయ యొక్క మరియొక లక్షణాన్ని పరిశీలిద్దాం. ఈ మాయ గాఢమైన నిద్రాస్వరూపం.  ఎందుకంటే ఈ మాయని మనం ఎప్పుడూ చూడలేం. ఈ కనిపించే జగత్తంతా కూడా మాయా స్వరూపమే. ఈ మనుష్యులు, గోడలు, ఈ సృష్టిలో కనిపించే పదార్థాలన్నీ కూడా మాయ యొక్క రూపాంతరాలే. మనం పొందే గాఢ నిద్ర కూడా మాయ యొక్క స్వరూపమే. నిద్రావస్థలో మనకి మాయ కనిపించదు. అంటే దీని మరి యొక లక్షణం ఏమిటంటే మాయ అంటే చీకటి, అంధకారం అన్న మాట . ఎందుకంటే మనం నిద్ర పోయినప్పుడు మనకి ఏమీ కనిపించదు కదా ! ఇంకొక లక్షణం ఏమిటంటే మోహం అని చెప్పుకొనవచ్చును. ఇక్కడ మోహం అంటే అవివేకం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఎడారిలో ఎన్నో ఇసుక రేణువులు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇసుక రేణువు తన ప్రక్కనే ఉన్న మరొక రేణువుని నాది అని చెప్తుందా? చెప్పదు. ఈ ఇసుక రేణువు ఆ ఇసుక రేణువుకి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటూ అన్నీ కలిసి సమిష్టిగా ఎడారి అని చెప్పుకుంటున్నాం. ఏ ఇసుక రేణువు కూడా తన ప్రక్కనే ఉన్న రేణువుని తనది అని చెప్పుకోదు. అలాగే సముద్రంలో ఉన్న ఏ నీటి బిందువైనా సరే తన ప్రక్కన ఉన్న మరి యొక నీటి బిందువుని తనది అని చెప్పుకోదు. ఏ బిందువుకి ఆ బిందువు స్వతంత్రంగా ఉంటూ సమిష్టిగా కలిసిన వాటిని, మనం నదిగా కాని, సముద్రంగా కాని చెప్పుకుంటున్నాం.

               కాని  మాయలో ఉన్నటువంటి మనుష్యులు ఇలా అనుకోవడం లేదు కదా ! ఇది నాది , నాది అనే ఒక భావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఫలాన వస్తువు నాది లేక ఇంకొక వస్తువేదో నాది  ఈ స్థలం నాది, ఇతను నావాడు అని ఇలా నాది , నాది అని చెప్పుకునే లక్షణాన్నే మనం మోహంగా చెప్పుకున్నాం. అదే అవివేకం, అజ్ఞానం అనే ఈ లక్షణాలు కలిగి ఉన్నదే మాయ. ఎడారిలో ఉన్న ఇసుక రేణువులు ప్రక్కప్రక్కనే ఉంటూ ఏవిధంగా స్వతంత్రంగా ఉటున్నాయో అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న మాయని గురించి మనం అనుకోవడం లేదు. గాఢమైన సుషుప్తి, దట్టమైన చీకటి లేక అంధకారం, మోహము లేక అజ్ఞానం అవివేకం మాయ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మాయనే మనం ప్రకృతి అని కూడా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి పదార్థాన్ని ఒక చక్కటి ఆకృతిలో తయారు చేసింది కాబట్టి దీన్ని ప్రకృతి అని చెప్పుకున్నాం. కాని ఈ ప్రకృతిలో లయం కావడం అనే లక్షణం కూడా ఉంటుంది. ఇది లయం అయి పోయి నాక బ్రహ్మంలో కలిసిపోతుంది కాబట్టి దీన్ని ప్రళయం అని కూడా   చెప్పుకోవచ్చును. ఈ మాయని ఇంకొక ప్రకారంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ప్రకృతిలో తయారు చేయబడిన అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు కూడా మూలపదార్థమైన మాయనుంచి సృష్టించబడ్డాయి. ఇక్కడ కుమ్మరి వాడు మన్నుఅనే మూల పదార్ధం తీసుకుని కుండలని తయారు చేసినప్పుడు కుమ్మరివాడు, మూలపదార్ధం వేరు వేరుగా ఉన్నారు. ఇక్కడ ఈ మాయ యొక్క సృష్టి ఏదైతే ఉందో దాని యొక్క మూల పదార్థమంతా కూడా మాయ చేతే తయారుచేయబడి ఉంది. అందుకనే దీన్ని ప్రధానము  అని కూడా శాస్త్రాల్లో చెప్పుతూ ఉంటారు. సృష్టించేది తానే, పెంచేది తానే, నశింపజేసేది తానే, అంతా తానే అన్నమాట. ఇక్కడ ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే ఇక్కడకుమ్మరి వాడు కుండల్ని చేస్తున్నప్పుడు మట్టే ప్రధానంగా ఉంది. ఇల్లు కట్టేటప్పుడు మనం వాడే సిమెంట్ ప్రధానంగా ఉంటుంది. అలాగే నగలు చేయించుకున్నప్పుడు బంగారమే ప్రధానంగా ఉంది. కాని ఇక్కడ ప్రకృతి తాను తానే మూలపదార్థంగా ఈ జగత్తుని సృష్టించింది. కాబట్టి ఈ మాయను ప్రధానంగా చెప్పుతూ ఉంటారు.
మాయ యొక్క ఇంకొక లక్షణం అజ్ఞానం. బ్రహ్మమును జ్ఞానంగా చెప్పుకుంటాం మాయని అజ్ఞానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. బ్రహ్మము విద్య అయితే మాయ అవిద్య, గాఢ సుషుప్తి, మోహం. మోహమంటే నాది , నాది అనే ఒక భ్రాంతిని కలిగిస్తుంది కాబట్టి దీన్ని తపస్సుగా పిలుస్తూ ఉంటారు.వ్యవహరిస్తూ ఉంటారు. ఒకే సమయంలో మాయ రెండుగా కనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానులకి ఈ మాయ యొక్క ఉనికి లేదు. దాన్నే వాళ్ళు బ్రహ్మముగానే  భావిస్తూ ఉంటారు. మరి బ్రహ్మజ్ఞానం లేని రెండవ వ్యక్తికి ఇది జగత్తుగా ఆశిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరికీ మాయ రెండు విధాలుగా అర్థమవుతూ ఉంటుంది. ఈ మాయలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు, జంతువులూ, మనుష్యులు అంతా కూడా మాయ యొక్క స్వరూపమే. కనుక ప్రకృతిలో ఈ జగత్తు అంతా కూడా మాయలోని భాగమే. ప్రపంచంలో మనుష్యులందరినీ కలిపి మనం జనాభా అని అంటాం. ఈ సృష్టిలోని ఈ మనుష్యులలో ఉన్నటువంటి జీవులు వారి యొక్క వాసనలు,  ప్రారభ్ధ కర్మలు ఇవన్నీ కలిపి మనం మాయగా వ్యవహరిస్తున్నాం.


            మాయ యొక్క మరియొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మాయ జడమైనది. బ్రహ్మము చైతన్యమైతే మాయ జడ ము అంటే కదలిక లేనిది. కాని ఈ జగత్తంతా ఒక చైతన్యరూపంలో కదులుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది  కదా ! జనులు కదులుతున్నారు, చెట్లు కదులుతున్నాయి, జంతువులూ కదులుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, మరి ఇవన్నీ ఒక చైతన్య రూపమే కదా ! మరి మాయ ఒక వైపు  జడము అని అంటున్నావు కాని కనిపించే ఈ మాయ యొక్క స్వరూపాలని చైతన్య స్థాయిలో ఉన్నాయి. మరి ఇదెలా సాధ్యం? దీన్ని నిరూపించడానికి మనం శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి. భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 10వ శ్లోకం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ మాయ ప్రకృతి అంతా జడమైనప్పటికీ నేను అధ్యక్ష స్థానం లో ఉన్నాను కనుక నావలెనే ఈ జడమైనటువంటి ఈ మాయ సమస్త ప్రకృతిని సృష్టిస్తూ ఉన్నది, పెంచుతూ ఉన్నది, దాన్ని లయ చేస్తూ ఉన్నది  అంటే ఈ మాయ లోని చైతన్య స్వరూపమే నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పుకున్నాడు. ఉదాహరణకి ఒక సూదిని తీసుకుందాం.  దానికి కదలిక లేదు, చైతన్యం లేదు. అలాగే పడి ఉంది. ఒక ఆయస్కాంతాన్ని ఆ సూదికి దగ్గరగా తెచ్చినప్పుడు ఆ సూదిలో చైతన్యం అంటే కదలిక కలుగుతుంది. ఇదే సూది జడంగా ఉండి ఒక అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిలో ఏవిధంగా చైతన్యం కలుగుతుందో, ఆ సూది మరలా ఇంకొక సూదిని కూడా ఆకర్షించగల శక్తి ఉంటుంది కదా ! అంటే మొదలు జడంగా ఉన్నప్పటికీ ఈ సూది అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ సూదిలో చైతన్యం కలిగి ఇంకొక జడమైన సూదిలో చైతన్యం కలిగిస్తుంది అంటే దీనికి మూల కారణమేమిటీ? అయస్కాంతమే మొదటి సూదిలో రెండవ సూదిని ఆకర్షించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అప్పుడు మనం ఈ అయస్కాంతాన్ని దూరంగా తీసుకుని వెళ్ళితే మొదటి సూదిలోని చైతన్యం పోయి మళ్ళీ యథాప్రకారంగా జడంగా మారుతుంది. దాని పరిణామ మేమంటే రెండవ సూదిని ఆకర్షించే గుణాన్నిమొదటి సూది కోల్పోతుంది. ఇదే విధంగా జడమైనటువంటి మాయ అయస్కాంతమనే బ్రహ్మమునకు దగ్గరగా వచ్చినప్పుడే అది సృష్టిచేయగలుగుతున్నది. ఈ జగత్తుని అంతా తయారు చేయ గలుగు తున్నది. జడంగా ఉన్నటువంటి ఈ జగత్తులో చైతన్యాన్ని కలిగించే శక్తిని కలిగి ఉంది. ఇదంతా మరి దేని మూలంగా వచ్చింది? బ్రహ్మము మూలంగానే ఈ మాయలో అటువంటి చైతన్య శక్తి కలిగింది అని చెప్పుకొనవచ్చును. క్లుప్తంగా చెప్పుకోవాలంటే బ్రహ్మము చైతన్యం, మాయ జడం. కేవలం బ్రహ్మము యొక్క సమక్షం లోనే ఈ మాయ అనే జడ పదార్ధం లో చైతన్యం కలిగి అది జగత్తు లోని జడాన్ని చైతన్యం చేసి సృష్టిస్తున్నది. ఇది మనకు లోగడ చెప్పిన ఉదాహరణ మూలంగా తెలుస్తుంది.


సృష్టికి కర్త ఎవరు? మరి సాక్షి ఎవరు?
        ఇక్కడ అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు జడంగా ఉండే సూది అంటే మొదటి సూది చైతన్యవంతమై రెండవ సూదిలోని జడత్వాన్ని పోగొట్టి చైతన్య స్థితిలోని కి మారుస్తుంది కాబట్టి మొదటి సూదిని మనం కర్తగా చెప్పుకోవచ్చును. కాని ఇక్కడ ఒక వేళ మనం అయస్కాంతాన్ని తీసి వేస్తే మొదటి సూది ఈ పని చేయలేదు కాబట్టి ఇక్కడ మనం అయస్కాంతాన్ని సాక్షి అని  చెప్పుకోవాలి. అప్పుడు అయస్కాంతం సాక్షి, మొదటి సూది కర్తగా తెలుస్తుంది. ఇదే ఉదాహరణ మనం బ్రహ్మమునకు, మాయకు ఆపాదిస్తే ఇక్కడ బ్రహ్మము అనే అయస్కాంతం మూలంగానే మొదటి సూది మాదిరిగానే ఈ మాయ లేక ఈ ప్రకృతిలో  చైతన్యం కలిగి ఆ చైతన్య శక్తి ద్వారా సమస్త జగత్తుని సృష్టిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మాయని మనం సృష్టికర్తగా చెప్పవలసి వస్తుంది. అదేవిధంగా ఈ శక్తిని, ఈ చైతన్యాన్ని ప్రసాదించినటువంటి అయస్కాంత శక్తిగా భావించబడే ఈ బ్రహ్మమును మనం కేవలం సాక్షిగానే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్రహ్మము అక్కడ సృష్టించడం లేదు కదా ! మనం మరొక్కసారి  ఆ అయస్కాంతం, మొదటి సూది,రెండవ సూది  ఉదాహరణని విమర్శన చేసుకుంటే బ్రహ్మము,సాక్షి  మాయ లేక ప్రకృతి కర్త సృష్టికర్త అని తేటతెల్లం అవుతుంది. వేరొకచోట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరియూ ఉపనిషత్తులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. శాస్త్రాల్లో చెప్పినప్రకారంగా  ఈ బ్రహ్మము యొక్క శక్తియే మాయ. ఈ మాయే బ్రహ్మము యొక్క సృజనాత్మక శక్తి అని లోగడ చెప్పుకున్నాం. దీన్నే యోగమాయ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ మాయ ఎవరు? ఎలా నిర్వర్తించాలి? సృష్టి, స్థితి, లయకారక శక్తి కలిగినటువంటి ఈ మాయనే మనం దైవీ శక్తిగా అనుకుంటాం. ఏవిధంగా అయితే మనం లోగడ మంచుముక్క ఉదాహరణ చెప్పుకున్నామో అది రూపాంతరం చెంది ఒకసారి నిరాకారంగాను ఇంకొకసారి ఆకారంగాను, ఒకసారి గోచరంగా, మరొకసారి అగోచరంగా ఉండే ఈ స్వభావం, లక్షణాలుకలిగి వివిధ రూపాలని  వివిధ నామాలతో మనం పిలుస్తుంటాం శక్తి అంటాం, చండి అంటాం, కాళీ అని అంటాం ఇలా రకరకాల పేర్లతో మనం దైవీ శక్తిని పిలుస్తూ ఉంటాం.


          ఇంకొక సందేహం కలుగుతుంది. ఒక ప్రక్క మాయను జడం అని అంటున్నాం ఇంకొక చోట ఇది దైవీ శక్తి అని అంటున్నాం. సృష్టి, స్థితి, లయకారిణి అయినటువంటి, చైతన్యమైనటువంటి దైవీ శక్తి అని అంటున్నాం ఈ పరస్పర విరుద్ధ భావాలని ఎలా అంగీకరించడం అంటే ఈ దైవీ శక్తిని మనం జడము అని చెప్పుకుంటామా ? కాని అది జడంగా లేదు కదా ! దానిలో చైతన్యమున్నాది కదా ! అని అనుకున్నప్పుడు దానికి సమాధానం ఏమిటంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మము యొక్క సృజనాత్మక శక్తి, చైతన్య శక్తి ఈ మాయలో, ఈ ప్రకృతిలో ప్రవేశిస్తుందో ఈ దేవీ శక్తి అని చెప్పుకుంటున్న శక్తిలో ప్రవేశించినప్పుడుదో వాటిని మనం దేవీ శక్తిగా పిలుస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మము యొక్క  చైతన్య శక్తి ఈ దేవతా శక్తిలో నిద్రాణంగా, జడంగాఉన్న వాటిలో  చైతన్యాన్ని కలిగిస్తుందో అప్పుడే వీటిని దేవీ గా దేవతాశక్తిగా భావిస్తున్నామన్నమాట.