శ్రీ స్వామినారాయణ పావన చరిత్ర తెలుగు ఆడియో లో
ముందుగా Sreedatta.info పాఠకులందరికీ మా ధన్యవాదాలు. శ్రీ స్వామినారాయణ పావన చరిత్ర దాదాపు సంవత్సరంన్నర పైగా sridatta.info లో ధారావాహికంగా రావటం జరిగింది. 31st November 2016 కి అది సంపూర్ణం అయింది. విశేషంగా ఆదరించిన పాఠక మహాశయులందరికి కూడా మా కృతజ్ఞతలు. sridatta.info మరియు spdss.org పాఠకులందరికి ఒక శుభవార్త, శ్రీ స్వామినారాయణ పావన చరిత్ర పారాయణ గ్రంథం ఆడియో సీడి కూడా ప్రస్తుతం రికార్డింగ్ ప్రాసెసింగ్ లో వున్నది. ఈ సంవత్సరాంతం వరకు అంచెలంచెలుగా అది మీకు పూర్తిగా అందచేయబడటం జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని ఆడియో ఎపిసోడ్స్ మీ ముందు ఉంచాలని మేము భావిస్తున్నాము. త్వరలో ఈ ఆడియో CDని కూడా మీరు ఆదరిస్తారని విశ్వసిస్తున్నాము.
శ్రీ స్వామినారాయణ గారి భక్తులు ప్రపంచం అంతటా వున్నారు. వారందరికి కూడా శ్రీ స్వామినారాయణ గారి విశేషమైనటువంటి శుభాశీస్సులు వున్నాయి. కేవలం వారి మూల మంత్రం జపించినంత మాత్రానే అంటే ‘జై శ్రీ స్వామినారాయణ’ మంత్రం ప్రతి రోజు ఒక అరగంట జపం చేసిన వారికి ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. అలాగే ఈ శ్రీ స్వామినారాయణ చరిత్రని త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి కూడా స్వామి వారు ఎన్నో తమ లీలల్ని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ పావన చరిత్రను విని స్వామి వారి కరుణాకటాక్షాలని పొందాలని మేము కోరుకుంటున్నాము. శ్రీ స్వామినారాయణ అవతారంలో ఎన్నో విశేషాలు వున్నాయి, అన్నిటికన్నా గొప్ప విశేషము ఏమిటంటే, శ్రీ స్వామివారు భక్తులకి ఏమి వరం ఇచ్చారంటే తన అనుయాయులందరికి కూడా కలిగే ప్రారబ్ధ కర్మల మూలంగా వచ్చే ఎన్నో ఇబ్బందులను తానే భరిస్తానని, వారి భక్తుల ఇంట్లో ఎప్పుడూ లేమి అనేది ఉండదు అని చెప్పి వారు అభయం ఇచ్చారు. అదే విధంగా మీకు సంకల్పాలు, కోరికలు ఉంటే అవి కోరుకుని ఈ స్వామి వారి శ్రవణా గ్రంధాన్ని శ్రద్ధగా వినండి.