నవయుగ నిర్మాణానికి నాంది !
నవయుగ నిర్మాణానికి స్వాగతం పలుకుదాం! ప్రియమైన పాఠకులారా ! మన అద్భుతమైనటువంటి,
శాస్త్రీయపరమైనటువంటి, సనాతన సాంప్రదాయాలు, సంస్కృతి ఒకప్పుడు
యావత్ప్రపంచానికే మార్గదర్శకత్వాన్ని చూపించాయి. విశ్వ మానవులందరు కూడా ఈ సనాతన
శాస్త్రీయపరమైన మన సంస్కృతి కి ఎంతో గౌరవాన్ని ఇచ్చాయి. విశ్వమానవులంతా ఒకటేనని మన
పురాతన, ప్రాచీన ఆర్య సంప్రదాయం, సంస్కృతి ప్రపంచానికి ప్రేమను చాటించింది.
ప్రేమను మాత్రమే పంచి ఇచ్చింది.
క్రమక్రమంగా క్రమక్రమంగా మన ప్రాచీన సాంప్రదాయాలు,
సంస్కృతి మన ధర్మాలను చాలా మార్పులు చేర్పులు కలిగినాయి. ఎవ్వరికి ఇష్టం
వచ్చినట్లు వాళ్ళు ఎన్నో అసత్యాలని వాళ్లకి అనుగుణంగా మార్చుకోవడం దాని వల్ల మన
ప్రాచీన సంస్కృతి అంతా కలుషితం కావడం జరిగింది. అందుకు పైగా విదేశీ దురాక్రమాలు
దాదాపు వేయి సంవత్సరాలు మన అద్భుతమైనటువంటి ఈ సంస్కృతి చాలా భాగం నాశనం చేయ
బడింది. ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే మన వాళ్ళే మన ధర్మానికి విరుద్ధంగా
ప్రవర్తించడం, మనం ప్రజలలో అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాలుగా చూపించడం
రకరకాలుగా ఎన్నో మార్పులు చేసి అసలు మన సంస్కృతిని చాలా భాగం నాశనం చేశాయి.
అసలు మన సంస్కృతి ఏమిటీ? మన మూలం ఏమిటీ? మన ఘనమైన ఈ చరిత్ర ఏమిటీ? అన్నది మనలో
మనకి చాలా మందికి అసలు తెలియనే తెలియదు. ఒక ధర్మం నిలబడాలంటే, ఒక జాతి ప్రాచీన
సంప్రదాయాలు, కళలు, ఆచారాలు - వ్యవహారాలూ అంటే శాస్త్రీయపరంగా ఉన్నవి మాత్రమే
నిలబడాలంటే ఆ దేశాన్ని పరిపాలించిన రాజులు ధర్మప్రభువులుగా ఉండి, వాళ్ళు కూడా సకల
ధర్మాల గొప్పతనాన్ని తెలుసుకున్నవాళ్లై ఉండాలి. అంతే కాకుండా రాజ్యం సుస్థిరంగా
ఉండాలి. ఏ ధర్మమన్నా ఆ రాజ్యం సురక్షితంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి ఎప్పుడైతే
రాజ్యం సురక్షితంగా, సుస్థిరంగా ఉండి సుఖ శాంతులతో ఉంటుందో అప్పుడే ధర్మం
నిలబడుతుంది. అంటే దీని అర్థం ఏమిటీ? ఒక ధర్మం నిలబడాలన్నా, ఒక సంస్కృతి కాపాడ
బడాలి అన్నాఆ రాజ్యం సుస్థిరం ఉండాలి.
ఒకవేళ ఆ రాజ్యం సుస్థిరంగా లేకుండా,
దురాక్రమణ దారుల చేతిలో పడితే అసలు మన సంస్కృతే ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి
మనమందరం ముందుగా ధర్మానికన్నా, మన సాంప్రదాయాలకన్నా మన అరుదైన, గొప్ప ఘనమైన
చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం పెద్దలకి, చిన్నలకి, రాబోయే ముందు తరాలవారికి
తెలిసి ఉండాలి.
సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 2017మొత్తం అంకెల్ని కూడితే కలిపితే ఒకటవ సంఖ్య
వస్తుంది. మీరు ప్రయాణం సాగించాలంటే కాలినడకన, ముందుగా ఒక పాదం ముందుకి వేయాలి.
అప్పుడే మీకు నడక సాగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే, మన
ప్రయాణం ఒక చిన్న అడుగుతో మొదలై లక్ష్యానికి చేరువగా వెళ్ళుతూ ఉంటాం. శ్రీపాద
శ్రీవల్లభ స్వామి వారు ఈ జగత్తంతటికి స్వామి. ఆయన ప్రస్తుతం విజ్రు౦భి౦చారు. ఇంత
కాలం నిద్రాణస్థితిలో ఉన్నటువంటి, ఈ అద్భుతమైనటువంటి ఈ నవయుగ నిర్మాణానికి శ్రీపాద
శ్రీవల్లభుల వారు తన శ్రీపాదాన్ని ఒక్క అడుగు ముందుకి వేశారు. ఈ శ్రీపాదుని యొక్క
పాదాల వెంట ఎవరైతే నడుస్తారో వాళ్లకి ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఉన్నత
స్థాయికి తీసుకుని వెళ్తారు. కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటీ మనం ఒక్కసారి
ఆలోచిద్దాం. మనకి 33 కోట్ల మంది దేవతలున్నారు. దానికి రెట్టింపు సంక్యలో
భారతదేశంలో గురువులున్నారు. మొత్తం ప్రపంచానికంతటికి స్వామి అయినటువంటి ఈ శ్రీపాద
శ్రీవల్లభ స్వామిని మరచి మనం కేవలం దేహధారులైనటువంటి మానవమాత్రులని స్వాములను చేసి
వారికి లేనిపోని మహిమలను ఆపాదిస్తున్నాం. ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి ఆలోచించండి.
స్వామి అనే పదానికి చాలా అర్థం ఉంది. మన ఇష్టం వచ్చిన రీతిలో ఇటువంటి
అద్భుతమైనటువంటి శబ్ద తరంగాలని సృష్టించే మాటలని సామాన్య మానవులకి
ఆపాదిస్తున్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం
వస్తుంది. ఇటువంటి అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాల్ని, అంధ విశ్వాసాలని తొలగించి
మళ్ళీ విశ్వ శాంతి నెలకొల్పడానికి ఒక శాస్త్రీయ పరిజ్ఞానాన్నిఅసలైన మానవత్వాన్ని
ముందుకి నడిపించడానికి శ్రీపాదుల వారు తన దర్బారు నుండి బయలు దేరారు. పదండి
! మనమంతా ఆయన వెనకే వెళ్దాం. అసలైన నాయకుడి వెంట, ప్రభువు వెంట, స్వామి వెంట
ప్రయాణం చేద్దాం. చిల్లర రాళ్ళను పట్టుకుని పూజిస్తే మనకు చివరకి మిగిలేది అశాంతి,
అజ్ఞానం, అక్కర లేని కోపాలు తాపాలు తప్ప అంటే అధోగతి తప్ప మనకి పురోగతి ఉండదు.
మనకి మన పెద్దలు భక్తి మార్గం, రాజయోగ మార్గం, జ్ఞాన మార్గం , విజ్ఞాన యాగాలు చేసే
విధి విధానం శాస్త్రీయ పరంగా అనేక మార్గాలని బోధించింది. తెలిసి తెలియని మిడిమిడి
జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? అన్నీ కలగాపులగం చేస్తున్నాం. దానివల్ల విపరీతమైనటువంటి పరిణామాలని మనకి తెలియకుండానే మనం సృష్టిస్తున్నాం. భక్తి మార్గాన్ని మిగతా ఇతర మార్గాలతో కలిపి చేస్తే ఒక్కడుగు ముందుకు వేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని అద్బుతంగా మార్చి ఒక నవయుగ నిర్మాణానికి పునాది రాళ్ళుగా ప్రవర్తించే ప్రజ్ఞాపుత్రులని ఆంగ్లంలో indigos, rainbows, crystals అని పిలుస్తుంటారు. పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు గారు వీళ్ళందర్నీ ప్రజ్ఞాపుత్రులుగా , ఇంద్రధనుస్సుకి చిహ్నంగా, చివరగా ఎంతో పై స్థాయిలో ఉన్నటువంటి స్ఫటిక పుత్రులుగా
ఆయన వర్ణించే వారు. రాబోయే కాలంలో జరగబోయే మార్పులకి ఇదే కారణం. వీళ్ళందరి గురించి
నూతన విజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం శ్రీపాద శ్రీ వల్లభుల ద్వారా మా వెబ్ సైట్
లో మీ అందరికీ తెలియజేస్తున్నాం.
రండి యువకులారా ! పాఠకులారా! మన
అసలుసిసలైన, విజ్ఞానపరమైన, శాస్త్రీయపరమైనటువంటి మన సనాతన ధర్మాన్నిమళ్ళీ మనం
నిలపెట్టుదాం ! శ్రీపాద శ్రీ వల్లభుల వారి వెంట అంటే దత్తాత్రేయల వెంట, మనం
గట్టిగా ఆయన్ని పట్టుకుని వదలకుండా మధ్యలో ఎటువంటి వ్యామోహాలు వచ్చినా, సందేహాలు
వచ్చినా వాటిని పట్టుకోకుండా ధైర్యంగా ఆయన శ్రీచరణాల్నిశ్రీపాదుకలని
పట్టుకుని ప్రయాణం చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి నూతన ప్రపంచాన్నిమనం
నిర్మించు కుందాం. రండి! మీ అందరికీ స్వాగతం! సుస్వాగతం! మా శ్రీపాదులవారి
ప్రణాళికలో మనమందరం భాగం పంచుకుందా౦. ఇదే మా ముందు ముందు మీరు చదవబోయే నూతన
విజ్ఞానానికి పరిచయ వాక్యాలు.