జై గురుదత్త
కీర్తి శేషులు శ్రీమతి మంత్రిప్రగడ కనక దుర్గాంబ గారు శ్రీ సాయినాధుని అనుగ్రహంతో ఆమె పొందిన అనుభవాలను గీతాలుగా మలిచారు. భక్తి రస ప్రధానంగా ఉన్న ఈ గీతాలు అందరినీ అలరిస్తూ, సాయి తత్వాన్ని బోధపరుస్తూ, సాయి మార్గాన్ని అనుసరించేలా ఉన్నవి. నవవిధ భక్తి మార్గాలను అనుసరించిన వీరి గీతములు సాయి దేవుని నామ స్మరణకు ధీటుగా ఉండి సులభ సాయుజ్యము కలుగజేయు భక్తి మార్గముగా తోచును.

కీర్తి శేషులు దుర్గాంబ గారిపై కురిపించిన సాయి అనుగ్రహ సాహిత్యానికి ప్రాణం పోసిన వారు శ్రీమతి ఇవటూరి చెల్లాయి గారు. వీరు సంగీత కళాశాలలో లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయినారు. సాయినాధుని గీతాల భావాలను గ్రహించి, వాటికి తగిన స్థాయిలో బాణీలను సమకూర్చి, సాయి సందేశాన్ని భక్తులకి అందించడంలో వారు కృతకృత్యులయ్యారు అని చెప్పటం కంటే పునీతులైనారు అని చెప్పటం భావ్యం. 1996 వ సంవత్సరంలో మొదటి రెండు క్యాసెట్లు రికార్డు చేయటమైనది. ఎందరో సాయి భక్తులు ఈ గీతాలు విని, ఎన్నో అనుభూతులను పొందిన విషయం అతిశయోక్తి కాదు.
ప్రతీ ఒక్కరూ సాయినాధుని అనుగ్రహం పొందాలనే సదుద్దేశ్యంతో మీకు ఈ గీతాలను అందించాలన్న మా ప్రయత్నాన్ని హర్షిస్తారని తలుస్తాము.
జై గురుదత్త