సాధారణ మానవుడి యొక్క మేథస్సు కూడా ఒక గొప్ప ఎన్సైక్లోపీడియా లాంటిది. ఒక సాధారణ యువకుడు వైద్య శాస్త్రంలో ఎటువంటి పరిచయం కూడా లేని అతడు ఎన్నో రోగాలకి చక్కటి మందులను చెపుతూ అద్భుతంగా రోగాలని నయం చేస్తూ ఉండేవాడు. అతను గొప్ప గొప్ప పేరు పొందిన వైద్యులు కూడా కనిపెట్టలేని రోగాన్ని క్షణాల్లో కనుక్కుని దానికి తగినటువంటి ఔషధాన్ని కూడా చెపుతూండేవాడు. అది వాడిన రోగులకి సత్వరమే నివారణ జరుగుతూ ఉండేది. ఇది విన్న గొప్ప గొప్ప వైద్య నిపుణులు కూడా ఆశ్చర్యపడిపోయేవారు.
అతడు రోగి తన దగ్గరకి రాగానే ఆ రోగి చూస్తూండగానే అతని యొక్క శరీరంలో ఏ అవయవాలకి సమస్య ఉన్నదో అది చెప్పటమే కాకుండా ఆ రోగి యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నది, ఆ రోగము మానసిక ఆలోచన వల్ల వచ్చినదా, భౌతికంగా వచ్చినదా కూడా చెప్పగలిగేవాడు. అంతేకాకుండా అతను ఒక ధ్యాన స్థితిలో ఆ రోగానికి సరిపడే మందులను కూడా కనుక్కుని ఆ రోగి యొక్క బంధువులకి చెప్తూండేవాడు. అతని యొక్క ఖ్యాతి నెమ్మది నెమ్మదిగా దేశ విదేశాలంతా మార్మోగిపోయింది. ఇది విన్న అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటుచేసి ఈ Edger Cayce ని గురించిన వివరాలన్నీ కనుక్కోమని, నిశితంగా పరిశీలించమని చెప్పి పంపించడం జరిగింది.
అతని శక్తిని పరీక్షించాలని అనుకున్నవాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అమెరికాలో ఒక పెద్ద ధనవంతుడికి అంతుచిక్కని ఒక వ్యాధి సంక్రమించింది.బాగా ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కాబట్టి ప్రపంచంలోని వైద్యులందరినీ సంప్రదించారు. కానీ ఏ వైద్యుడూ కూడా అతనికి ఏ రోగం వచ్చిందీ అన్నది కనిపెట్టలేకపోయారు. అటువంటి స్థితిలో ఉన్న ఆ రోగిని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కమిటీ వారు Edger
Cayce దగ్గరకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అతనిని పరిశీలించిన వైద్య నిపుణులందరూ కూడా ఈ రోగామేమిటో మాకసలు తెలియటంలేదు దీనికి అసలు నివారణే లేదు అని చెప్పి ఖచ్చితంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే Edger Cayce ది చాలా కరుణా హృదయం.అతడు ఆ రోగి తన దగ్గరకి రాగానే ఎటువంటి ప్రశ్నలూ వెయ్యకుండా వెంటనే ధ్యాన స్థితిలోనికి వెళ్లిపోయినాడు. అక్కడే ఉన్న అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వైద్య నిపుణులు అతనిని పరీక్ష చేసి అతను ఒక గాఢమైన నిద్రావస్థలో ఉన్నాడు, భౌతికంగా అతడి అవయవాలన్నీ కూడా సాధారణంగానే పనిచేస్తున్నాయి అని వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. Edger Cayce తన దీర్ఘ ధ్యాన స్థితి నుంచి కళ్ళు తెరిచి ఆ రోగి యొక్క భౌతిక పరిస్థితిని, అతి సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా తాను స్వయంగా అనుభవిస్తునట్టుగానే చాలా విపులంగా వివరించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను రోగితో ఎటువంటి సంభాషణ చెయ్యలేదు, ఎటువంటి ప్రశ్నలు కూడా అడగలేదు, అతని మెడికల్ రిపోర్ట్స్ కూడా ఏమీ చూడలేదు. రోగి తన దగ్గరకు రాగానే వెంటనే కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి అతనికి ఉన్న జబ్బు లక్షణాలన్నీ కూడా అప్పట్లో అధునాతనమైన పరికరాలకి కూడా అందనటువంటి విషయాలని చాలా చక్కగా ఒక ప్రఖ్యాత వైద్య నిపుణుడు ఎలా చెబుతాడో అలాగ వివరించడం జరిగింది. దీనికి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా ఆశ్చర్యచకితులైనారు.ఆ రోగి చెప్పుకోలేనటువంటి కొన్ని రకాల బాధలని కూడా Edger
Cayce చెప్పటం జరిగింది. ఏ అవయవంలో ఎటువంటి మార్పు వస్తున్నది, అతని మానసిక పరిస్థితి ఎలా ఉన్నది కూడా చాలా చక్కగా చెప్పాడు. అంతేకాక Edger Cayce తన ధ్యాన స్థితిలో తనకి తెలిసినటువంటి ఒక ఔషధాన్ని ఆ రోగికి ఇవ్వమని సూచించాడు. కానీ ఆ పేరు గల ఔషధం ఆ కెంటకి (kentucky) నగరంలో ఎక్కడా లభించలేదు. అప్పుడు Edger Cayce ఆ మందులో ఉన్నటువంటి పదార్ధాల యొక్క మిశ్రమాన్ని వర్ణించి చెప్పాడు. కానీ అది ఎక్కడా దొరకలేదు. ఈ విషయాన్ని అప్పటి ప్రఖ్యాత వార్తాపత్రికలో ప్రస్తావించారు.ఈ ప్రపంచంలోని ప్రముఖ వార్తాపత్రికల్లో ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో దాన్ని చూసిన ఒక చిన్న వయస్కుడైన pharmacology శాస్త్రజ్ఞుడు వారికి ఒక ఉత్తరం వ్రాసాడు. ఇటువంటి ఔషధాన్ని కనుక్కోవడం జరిగిందని, దాన్ని చాలా రోజుల క్రితమే ఒక ప్రయోగశాలకు సమర్పించడం జరిగిందనీ చెబుతూ ఆ లాబరేటరీ వివరాలన్నీ ఆ ఉత్తరంలో వ్రాసి పంపించాడు. వాళ్ళు వెంటనే ఆ ప్రయోగాశాలని సంప్రదించగా వారు ఇటువంటి ఔషధం తమ వద్ద ఉందనీ అయితే ఇంకా సమగ్రమైన ప్రయొగాలవీ చెయ్యనందు వల్ల అది అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆ ఔషధాన్ని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్టలేదని దాని మీద ఇంకా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆ తరువాత అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వెంటనే స్పందించి అనుమతిని ఇవ్వటంతో, ఇతడు ఆ మందు యొక్క శాంపిల్ ని ఆ రోగి బంధువులకి పంపడం జరిగింది. ఆ ఔషధం రెండు మోతాదులు ఇవ్వగానే ఆ రోగికి వెంటనే స్వస్థత చేకూరింది. రెండు వారాల్లో అతడు పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. ఈ అద్భుతాన్ని చూసినటువంటి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇతని అద్భుత ప్రజ్ఞని గమనించి ఇతనికి వైద్య శాస్త్రజ్ఞుడుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్లిష్టమైన జబ్బులు వచ్చినప్పుడు వాటిని మరి వైద్య నిపుణులు కనుక్కోలేనప్పుడు ఇతనిని సలహాదారుడుగా నియమించడం జరిగింది.
Edger Cayce ప్రతిరోజూ ఇద్దరు రోగుల్ని చూస్తూవుండేవాడు అయితే తాను చేసిన చికిత్సకి ఎటువంటి ఫీజు అడిగేవాడు కాదు. అంతా ఉచితంగానే చేస్తూ ఉండేవాడు. ఇటువంటి అధ్భుత చికిత్సని మీరు ఎలా చెయ్యగలుగుతున్నారు అని Edger Cayce ని అడిగినప్పుడు అతను నేను ధ్యాన స్థితిలోనికి వెళ్ళినప్పుడు నాలో తెలియని ఒక అధ్భుతమైనటువంటి మానవాతీతమైన శక్తి నాకు కలుగుతుంది అనే అనుభూతి ఉంటుంది. అటువంటి స్థాయిలో నేను ఉన్నప్పుడు నా మేథస్సు, నా ఎదురుగా ఉన్నటువంటి రోగి మేథస్సుతో అనుసంధానం జరుగుతుంది. రోగి యొక్క బాధలన్ని మరి మనసులోనే కదా ఉంటాయి కాబట్టి ఆ రోగి పడే బాధలన్నీ నాకు అనుభూతి కలిగి స్పష్టంగా తెలుస్తూంటాయి అని చెప్పారు. కాని నేను బాహ్య స్మృతిలో ఉన్నప్పుడు ఇటువంటి గాఢమైన ధ్యాన స్థితిలో ఉండను కాబట్టి నా మనస్సు రోగి మనస్సుతో అనుసంధానం జరగదు కాబట్టి నేను చెప్పలేను. అయితే నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రం నాలో ఉన్న ప్రతీ అణువులోని శక్తి అంతా కూడా ఒక్కటే లక్ష్యం వైపు వాడుకోబడుతుంది. ఈ ప్రక్రియలో నా శరీరంలో ఉన్న ప్రతీ అణువు కూడా ఆ రోగిని గురించే పూర్తిగా ఆలోచించే స్థాయికి వెళ్ళేటట్టుగా, అతని మనసుతో అనుసంధానం జరిగేటట్టుగా లగ్నం కుదురుతుంది. అంటే సర్వ శక్తులన్నీ కూడా నేను ఆ రోగి మనస్సు లేక మేథస్సు పైనే కేంద్రీకరించడం జరుగుతుంది. అప్పుడే ఆ రోగి యొక్క సమస్యలన్నీ, ఆలోచనలన్నీ నాకు వెంటనే తెలిసిపోతాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆ రోగి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆలోచనలు, ఆవేదనలు అన్నీ తెలిసిపోతూంటాయి. నిజం చెప్పాలంటే మానసిక శాస్త్రవేత్తలు కానీ వైద్యశాస్త్ర నిపుణులు కానీ మనిషి యొక్క మేథస్సు గురించి, అతని లోపల దాగి ఉన్న ఎంతో అద్భుతమైన శక్తిని గురించి కేవలం అయిదు లేక పది శాతం మాత్రమే కనుక్కోగలిగారు. దాదాపు 90% వరకు మన మానవ మేథస్సు యొక్క అద్భుతమైన శక్తిని ఇంకా వాళ్ళు కనుక్కోలేదు. నిజానికి ఖండాంతరంలో ఎక్కడ ఉన్నా సరే ఒక మనిషి యొక్క ఆలోచనలని మనం ఈ స్థితిలో వెళ్ళగలిగినప్పుడు క్షణాల మీద కనుక్కోగల శక్తి మనకి ఉన్నది. అందుకే దూరాన ఉన్నటువంటి రోగి యొక్క రోగాన్ని కూడా మరి మనం దూరం నుంచే నయం చెయ్యవచ్చు. ఈ television కన్నా ఇంటర్నెట్ నుంచి వచ్చే సమాచారం కన్నా వంద రెట్ల ఎక్కువ వేగంతో మనిషి యొక్క మెదడు ఇంకొక మనిషి యొక్క మెదడుతో అనుసంధానం ఒక దీర్ఘమైన సమాధి స్థితిలో జరగగలదు.నేను కేవలం కొద్ది శక్తిని మాత్రమే ఉపయోగించి ఈ విధమైన చికిత్సని చెయ్యగలుగుతున్నాను. కేవలం ఒక మనిషి తయారుచేసినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇంటర్నెట్ వ్యవస్థ కానీ అన్ని రంగాలలో ఎంతో అద్భుతమైన ఫలితాలని సాధిస్తున్నప్పుడు మరి మనిషి యొక్క మేథస్సు అంతకన్నా కొన్నివేల రెట్ల శక్తితో పనిచెయ్యగలదు. కాకపోతే ఆ ప్రక్రియని, ఆ విధానాన్ని మనం శ్రద్ధగా పాటించినప్పుడే ఎంత దూరంలో ఉన్నా, ప్రపంచానికి చివర ఉన్న స్థలం గురించి గానీ ఆ వ్యక్తుల్ని గురించి గానీ మనం క్షణంలో తెలుసుకోగలుగుతాము. భగవంతుడు మరి మనిషి జన్మ ఇచ్చి ఇటువంటి అద్భుతమైన శక్తిని మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచకుండా రకరకాల జబ్బులతో భౌతికంగా, మానసికంగా, క్రుంగి క్రుశించిపోవడం అనేది భావ్యం కాదు. మనం ఒక విధంగా పాపం చేస్తునట్టే లెక్కలోకి వస్తుంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని, మనకున్న అద్భుత శక్తుల్ని కూడా వినియోగించకపోగా సాక్షాత్తు మనకు ఈ శక్తులన్నీ ప్రసాదించిన భగవంతుడినే విమర్శిస్తూ ఉంటాం కదా!