ఉల్ఫ్ మెస్సింగ్ – 4వ భాగం
అధికారులైతే
కళ్ళగంతలు విప్పి వదిలివేసి వెళ్ళారు కాని అతని కదలికలు అందరూ గమనిస్తూనే ఉన్నారు.
ఉల్ఫ్ మెస్సింగ్ ఏమీ తెలియనట్టుగా ఆ బ్రీఫ్ కేసు ని పట్టుకుని ఆ బ్యాంకు లోకి
వెళ్లి ఎవరైతే అతనికి డబ్బులు ఇచ్చాడో ఆ కాషియర్ దగ్గరకి వెళ్లి “అయ్యా ! మీరు ఒక
పొరబాటు చేశారు. మీరు ఈ 50 వేల రూగుల్స్ ని నాకిచ్చారు. వీటిని మళ్ళీ తిరిగి మీరు
వాపసు తీసుకోండి అని చెప్పగా ఆ బ్యాంకు ఉద్యోగి చాలా ఆశ్చర్య పోయాడు. తాను ఇచ్చిన
చెక్ ని ఒక సారి చూడండి అని ఉల్ఫ్ మెస్సింగ్ ఆ కాషియర్ కి చెప్పాడు. అప్పుడు ఆ
కాషియర్ ఉల్ఫ్ మెస్సింగ్ ఇచ్చిన కాగితాన్ని పరీక్షించగా అది మామూలు చిత్తు
కాగితం లాగానే ఉంది దాని మీద ఉల్ఫ్ మెస్సింగ్ సంతకం తో 50 వేల రూగుల్స్ with draw
చేస్తున్నట్టుగా ఉంటే ఆ కాషియర్ చాలా ఆశ్చర్య పోయాడు. అంత నిజాయతీగా అతను ఆ 50 వేల
రూగుల్స్ ని తిరిగి ఇచ్చినందుకు ఆ కాషియర్ అతనికి ధన్యవాదాలు చెప్పి ఆ డబ్బుని
తిరిగి తన కాష్ బాక్స్ (cash-box) లో పెట్టేశాడు. తర్వాత ఉల్ఫ్ మెస్సింగ్ తన
బ్రీఫ్ కేసు తో బ్యాంకు నుంచి బయటకి వచ్చేశాడు.
అక్కడే ఉల్ఫ్ మెస్సింగ్ ని గమనిస్తున్న అధికార్లు ఈ వర్తమానాన్ని స్టాలిన్ కి
అందజేశారు. స్టాలిన్ కి నిజంగా ఏం చేయాలో తెలియ లేదు. ఇదంతా ఎలా జరిగింది అన్నది
కొంచెం కూడా అర్థం కాలేదు. నిజంగా దైవిక శక్తులు ఉన్నాయా ? ఇదంతా యాంత్రికంగా
జరిగిందా?అని ఆలోచించ సాగాడు. మళ్ళీ ఉల్ఫ్ మెస్సింగ్ కోసం కబురు చేశాడు. మళ్ళీ
యథాప్రకారంగా ఉల్ఫ్ మెస్సింగ్ కళ్ళకి గంతలు కట్టి స్టాలిన్ ఉన్న ఇంకొక రహస్య
స్థావరానికి తీసుకుని వెళ్ళారు. స్టాలిన్ అతనితో “ నీవు నా మొదటి పరీక్షలో
నెగ్గావు. నేను నీకు ఇంకొక పరీక్ష పెట్టదలచు కున్నాను. అందులో కనుక నీవు నెగ్గుతే
నిన్ను నేను స్వేచ్చగా వదిలివేస్తాను. లేకపోతే నీకు మరణదండన విధించబడుతుంది” అని
చెప్పాడు. సరే అని స్టాలిన్ షరతుని ఉల్ఫ్ మెస్సింగ్ ఒప్పుకున్నాడు. నిజంగా
నీకు కనక దైవిక శక్తులు ఉంటే ఎల్లుండి ఫలానా రోజు, ఫలానా తేదీన అర్ధరాత్రి 12
గంటలకి నీవు నా ఎదురుగా నిలబడి నన్ను కలవాలి. దీనికి నీవు సిద్ధమేనా?” అని
ప్రశ్నించాడు. “ఓ ! తప్పకుండా నేను మిమ్మల్ని కలుస్తాను” అని ఉల్ఫ్ మెస్సింగ్
సమాధానం చెప్పాడు. అదే ప్రకారంగా అతని కళ్ళకు గంతలు కట్టి బయట వదిలివేశారు. ఇక్కడ
స్టాలిన్ ఉండే రహస్య స్థావరం ఒక కంచుకోట లాంటిది. అక్కడక్కడ తనిఖీలి ఉంటాయి. ఆ
వచ్చినవారిని సోదా చేస్తారు. ఆ వచ్చేవాళ్ళు ఎవరో ము౦దే అప్పాయింట్మెంట్ తీసుకుని
వస్తారు కాబట్టి వారి కదలికలు అన్నీ కూడా వాళ్లకి తెలియకుండా రహస్యంగా
ఎప్పటికప్పుడు కనుక్కుంటారు. పైగా ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళని సోదా
చేస్తారు. ఎన్నో తలుపులు, ఎన్నో మలుపులు తిప్పుకుంటూ, తిప్పుకుంటూ ఆ స్టాలిన్
దగ్గరకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ స్టాలిన్ ఎక్కడ ఉంటాడు అన్నది పరమ రహస్యం కదా !
అలాంటి అతిరహస్యమైన ప్రదేశం కనుక్కోవడం బ్రహ్మతరం కూడా అవదు అనుకుంటా ! మరి అంతటి
రహస్యమైన ప్రదేశం ఈ ఉల్ఫ్ మెస్సింగ్ ఎలా కనుక్కోగలడు? అని ఆశ్చర్య పడుతూ అందరు
వెళ్ళిపోయారు.
ఉల్ఫ్ మెస్సింగ్
స్టాలిన్ చెప్పినట్టుగానే, అనుకున్న రోజునే అ స్టాలిన్ ముందే చెప్పినట్టుగా ఆ
ప్రదేశానికి ఎన్నో అడ్డంకులు తప్పించుకుని , తెలుసుకుని, ప్రతి వాళ్లకి తన
identity card చూపించుకుంటూ, తానూ ఫలానా, ఫలానా అని చెప్పుకుంటూ , స్టాలిన్
సంతకంతో అతనికి appointment ఉన్నట్టుగా ఒక కాగితం చూపించుకుంటూ ముందుకి ఆ అధికారుల
అనుమతితో వెళ్ళాడు. ఇలా వెళ్తూ, వెళ్తూ ప్రధాన ద్వారం దగ్గరకి వచ్చేసరికి
అక్కడ ఒక సీనియర్ intelligent ఆఫీసర్ అతన్ని ఆపాడు. ఉల్ఫ్ మెస్సింగ్ దగ్గర ఉన్న
appointment పత్రం మీద స్టాలిన్ సంతకం, ముఖాముఖి కలుసుకునే సమయం అన్నీ సరిగ్గా
చూసి, అతన్ని లోనికి ప్రవేశమిచ్చాడు.
లోపలకి వెళ్ళితే
అక్కడ స్టాలిన్ కూర్చుని కనిపించాడు. స్టాలిన్ ఆ ప్రదేశానికి చిట్టి చీమ కూడా
లోపలకి రాకుండా, గాలి కూడా దూరకుండా ఉండేటట్టుగా కట్టుదిట్టాలు చేసి, ఇక ఉల్ఫ్
మెస్సింగ్ ఇక్కడకి రాలేడు, అది అసంభవం అని అనుకుంటూ, హాయిగా నిశ్చింతగా కూర్చుని
ఉన్నాడు. సరిగ్గా పన్నెండు గంటలయ్యేసరికి తలుపు తెరుచుకుని ఉల్ఫ్ మెస్సింగ్
స్టాలిన్ ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి స్టాలిన్ అంతవాడు
విభ్రాంత పోయాడు. కళ్ళు పదేపదే నులుపుకుని చూశాడు. తానూ చూస్తున్నది కలా లేక
నిజమా? అని అయోమయంలో పడి ఆశ్చర్య చకితుడైపోయాడు. కొంత సేపటికి తేరుకుని మళ్ళీ చూసి
ఇది కల కాదు, నిజంగానే ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఉల్ఫ్ మెస్సింగ్ యేనని అర్థం
చేసుకున్నాడు. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆరా తీయగా ఉల్ఫ్ మెస్సింగ్ సమర్పించిన
గుర్తింపు కార్డు ( identity card) మీద తన సంతకం గమనించి మరింత ఆశ్చర్య పడిపోయాడు.
ఆ సంతకం తన సంతకం లాగానే ఉంది. దాన్ని తానే ఉల్ఫ్ మెస్సింగ్ వచ్చినప్పుడు
మొట్టమొదటిసారి ఇచ్చానేమో అనే మీమాంసలో కూడా పడిపోయాడు. ఈ అద్భుతం జరిగాక మరి
స్టాలిన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. స్టాలిన్ అప్పుడు ఉల్ఫ్ మెస్సింగ్ తో “నేను
నీకిచ్చిన వాగ్దానం ప్రకారమే నిన్ను స్వేచ్చగా వదిలివేస్తున్నాను. నీవు స్వేచ్చగా
ఇక్కడ్నుంచి వెళ్ళవచ్చు” అని చేప్పి మర్యాదగా తన అనుచరులతో అతన్ని బయటకి
పంపించివేశాడు.
స్టాలిన్ అంత
నియంతకే దైవిక శక్తులు ఉన్నాయని నమ్మక తప్పలేదు. కాని బయటకి చెప్పలేని
పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నీ బయటకి రాలేదు. రష్యాని (iron curtain) ఇనుప
కర్టెన్ అనే వారు. అంటే రష్యాదేశంలో ఏం జరుగుతుందో అది బయట ప్రపంచంలో ఎవ్వరికి
తెలిసేది కాదు. వాళ్లకి తెలిసిన విషయాలేవీ నిజాలు కావు. ఈ విధంగా అతీంద్రియ
శక్తులు ఉంటాయని మనకి నమ్మక తప్పదు. ఇంకొక విచిత్రమేమిటంటే సత్య సాయి బాబాగారి
సత్యం, శివం, సుందరం అనే మూడు పుస్తకాల్లో ఏ పుస్తకమో నాకు తెలియదు కాని ఈ ఉల్ఫ్
మెస్సింగ్ భారత దేశంలో మహాపురుషుడు పుట్టాడని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ
పుట్టపర్తికి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళాడు. సత్య సాయి బాబా గారు చిన్నప్పుడు
అంటే పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆయన్ని చూసి సాక్షాత్తు భగవంతుడే భూమ్మీదకి
వచ్చాడని చెప్పి వాళ్ళింటికి వెళ్లి తలుపులు కొట్టినప్పుడు వాళ్ళందరూ భయపడితే
వాళ్లకి నయాన భయానా ఈ బాలకుడు సామాన్య బాలకుడు కాదు మహాత్ముడు అవుతాడు. కొన్ని
లక్షలమందికి మార్గ దర్శనం చేస్తాడు” అని ఉల్ఫ్ మెస్సింగ్ చెప్పాడు. అయితే మనం చాలా
తక్కువ భూమికలో (dimension) ఉంటాం కాబట్టి ఈ పై భూమికలో అద్భుతమైన సన్నివేశాలు
విన్నప్పుడు మనకి ఏమీ అర్థ౦ కావు. కాబట్టి మనం రకరకాలుగా మనకు తోచినట్టి
వ్యాఖ్యానం చేస్తూ ఉంటాం. అతీంద్రియ శక్తులు ఉన్నాయని అనేక కథల వల్ల మనకు
తెలుస్తుంది.
(Wolf Messing
part concluded ...) (ఉల్ఫ్ మెస్సింగ్ శీర్షిక సమాప్తం)